Showing posts with label గౌతమరాజు. Show all posts
Showing posts with label గౌతమరాజు. Show all posts

Friday, April 6, 2012

ఇంటికెళితే అమ్మనే ....


ఏ శాఖలో పనిచేస్తున్నా పూనం మాలకొండయ్య తన ప్రత్యేకత చాటుకుంటుంటారు. నికార్సయిన పనితనంతో సంచలనం రేపుతుంటారు. ప్రస్తుతం ఎపిపిఎస్సీ సెక్రటరీగా చేస్తున్న ఆమె ఎబీఎన్‌లో ఇల్లాలి ముచ్చట్లు కార్యక్రమంలో పాల్గొని ఇలా మాట్లాడారు...

మీరు చాలా కఠినమైన అధికారి అని పేరుంది. ఇంట్లో కూడా అంతే కఠినంగా ఉంటారా?
ఇంట్లో అధికారాలు ఉండవు. ఆత్మీయతలు ఉంటాయి. ఆఫీసుకు పూర్తిగా భిన్నమైన వాతావరణం అక్కడ ఉంటుంది. భర్త, పిల్లలు, వారితో ఉంటే వచ్చే ఆనందం అన్నీ ఉంటాయి. నేను ఇంట్లో పూర్తిగా అమ్మనే. ఒక అమ్మ పిల్లల్ని ఎలా చూసుకుంటుందో అలాగే నేనూ ఉంటాను. మాకు ఇద్దరు పిల్లలు. అమ్మాయి మెడిసన్ చదువుతోంది. అబ్బాయి లా చదువుతున్నాడు.

ఒక తల్లిగా పిల్లల్ని ఎలా పెంచాలంటారు?
పిల్లలు జీవితంలో స్థిరపడేలా తీర్చిదిద్దితే చాలని చాలామంది అనుకుంటారు. కాని వాళ్లు సమాజం గురించి ఆలోచించేలా కూడా ప్రోత్సహించడం అవసరమని నేను అంటాను. పిల్లల్ని అలాగే పెంచాలని కూడా చెబుతాను.

మీ బాల్యం ఎలా గడిచింది?
నాన్న కేంద్రప్రభుత్వ ఉద్యోగి. దాని వల్ల నా బాల్యం చాలా చోట్ల నా బాల్యం గడిచింది. అన్నిటికంటే తమిళనాడులోని కోయంబత్తూరులో ఎక్కువకాలం ఉన్నాము. నా పాఠశాల, కాలేజీ రోజులన్నీ కోయంబత్తూరులోనే.

గృహిణి పాత్రను ఎలా పోషిస్తారు?
నాకు వంటలంటే చాలా ఇష్టం. సెలవు రోజుల్లో రకరకాల వంటలు చేస్తాను.

ఉద్యోగంలో కీలకమైన బాధ్యతలు, ఇంట్లో గృహిణిగా ...రెండిటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తారు?
ఆఫీసును ఇంటికి తీసుకెళ్లను. ఇంట్లో అడుగుపెట్టగానే మారిపోతాను. నిజానికి బ్యాలెన్స్ చేయడమంటూ ఏమీ ఉండదు. ఆఫీసులో ప్రతి నిమిషం సద్వినియోగం చేస్తే బయటకొచ్చేటప్పుడు ప్రశాంతంగానే ఉంటాం. అప్పుడు ఇంట్లో కూడా హాయిగా ఉంటుంది.


ఇప్పుడు స్వేచ్ఛ, సమస్య రెండూ ఉంటున్నాయి. ఇది అభివృద్ధా? వెనకబాటు తనమా?
అమ్మాయిలకు ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. నా దృష్టిలో స్వేచ్ఛ అంటే బాధ్యత. ఇంట్లో, సమాజంలో మనకు చాలా బాధ్యతలు ఉంటాయి. వాటిని సక్రమంగా నిర్వర్తించాలి. లేదంటే రకరకాల సమస్యలు వస్తాయి. బాధ్యతాయుతంగా ఉండాలన్నది స్త్రీలకే కాదు ఎవరికైనా వర్తిస్తుంది.

స్త్రీలు తమకు ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి?
గతానికి ఇప్పటికి చాలా మార్పులొచ్చాయి. ఏ రంగంలో తీసుకున్నాసరే స్త్రీలు కనిపిస్తున్నారు. సాంకేతిక పరమైన స్కిల్స్ వారిలో ఉంటున్నాయి. అయినప్పటికీ సమస్యలు ఎదురవుతుంటాయి. వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి. సమస్యలు ఎదురైనపుడు ప్రతిభ ఒక్కటే సాయపడగలదు.

విదార్థినుల డ్రాపవుట్స్ తగ్గించడానికి ప్రభుత్వం ఏం చేయాలి?
కుటుంబానికి ఆర్థిక స్వేచ్చ ఉంటే సగం వరకు డ్రాపవుట్స్ తగ్గుతాయి. ఈ డ్రాపవుట్స్ కూడా ఒక్కో దశలో ఒక్కో రకంగా ఉంటున్నాయి. పాఠశాలలు అందుబాటులో ఉంటే చదవడానికి వెళుతున్నారు. అదే ఐదారు కిలోమీటర్ల దూరానికి నడిచివెళ్లాలంటే మాత్రం క్రమంగా చదువుకు దూరమవుతున్నారు. దీంతోపాటు పాఠశాలల్లో టాయిలెట్స్ లేకపోవడం, పరిశుభ్రత లోపించడం వంటి కారణాలు వలన కూడా డ్రాపవుట్స్ ఎక్కువవుతున్నాయి.

తరాలమధ్య ఎలాంటి తేడాలున్నాయి? నేటి తరంపై మీ అభిప్రాయం?
ఇప్పటి తరానికి ఆత్మవిశ్వాసం ఎక్కువ. తమను తాము రక్షించుకోగలరు. ప్రతిభ అపారం. గతంలో నేర్చుకోవడానికి ఇన్ని అవకాశాలు లేవు. ఇప్పటి తరానికి అవి పుష్కలం. వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు. నేనైతే ఈ తరానికి హ్యాట్సాఫ్ అంటా.

స్త్రీని నిర్వచించమంటే?
'ఆమె' ఒక క్రియేటర్. దేన్నయినా నిర్మించగలదు. కూలగొట్టనూ గలదు. కుటుంబంలోనూ, సమాజంలోనూ ఆమే కేంద్రబిందువు. ఏదైనా నాగరికతను నిర్వచించాల్సి వస్తే ఆ కాలంలో సమాజం స్త్రీని ఎలా చూసేది అన్న విషయాన్ని గమనిస్తే చాలు. స్త్రీ పాత్ర అలాంటిది.

మరి స్త్రీల ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి?
నేననుకోవడం అర్బన్ ప్రాంతంలోనే ఆత్మహత్యలు ఎక్కువని. చదువుకున్న వారు కూడా చిన్నవిషయాలకే ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశమే అందుక్కారణం. సమస్యలను విశ్లేషిస్తే ఎలాంటి చెడూ జరగదు. కాని చదువుకున్న వారు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువుకొని ఏమీ చేయలేకపోతున్నామే అనే బాధతో చనిపోయేవారు, చదువుకోకుండానే సమాజంలో నెట్టుకొస్తున్న చాలామందిని చూసి తెలుసుకోవాలి. అనాథ శరణాలయాల్లోనూ, వృద్ధాశ్రమాల్లోనూ ఎంతోమంది జీవిస్తుంటారు. వారి జీవితాలు గమనించి సహాయం చేయగలిగితే ఆనందంతోపాటు ఎలా జీవించాలో అర్థమవుతుంది.

ఎన్నో మంచి విషయాలు చెప్పగలిగే మీరు మీడియాకు దూరంగా ఉంటారెందుకు?
నా పని నేను చేసుకుపోతూ ఉంటాను. ముఖ్యమైన విషయాలైతే మీడియా ముందుకు వస్తాను. అంతే. అయినా మీడియాను ఎవరూ దూరంగా ఉంచలేరు. ఏదైనా విషయాన్ని కమ్యూనికేట్ చేయడానికి మీడియా అవసరం కదా. 

ఇంటర్వ్యూ : శ్వేత

Monday, March 14, 2011

రాష్ట్రం తాకట్టు ?

Takattuపరిశ్రమలు, సెజ్‌లు, ఓడ రేవులు, థర్మల్‌ ప్రాజెక్టుల పేరుతో పేద రైతులు, దళితలకు చెందిన లక్షలాది ఎకరాల భూము లను సర్కారు ప్రైవేట్‌కు ధారాదత్తం చేసింది. పచ్చని పంట పొలాలు, దళితులకిచ్చిన అసైన్డ్‌ భూములు, అటవీ భూములు, ఏజెన్సీ ప్రాం తంలోని అడవిబిడ్డల భూములు, తీరప్రాంత మత్య్సకారుల భూముల న్నింటిని పలు ప్రైవేటు సంస్థలకు అప్పగిం చింది. లక్షలాది ఎకరాల భూములను శ్రీకా కుళం నుంచి చిత్తూరు వరకు వ్యూహాత్మకం గానే కాంగ్రెస్‌ సర్కార్‌ పరిశ్రమల పేరుతో తన అనుయాయులైన ప్రైవేట్‌ యజమాను లకు నామమాత్రం ధరలకు దోచిపెటింది.

పేదల ప్రయోజనాలు ఏమాత్రం పట్టకుండా, మానవతాదృక్పథంతో వ్యవహరించకుండా అడుగడుగునా చట్టాలకు, నిబంధనలకు నీళ్ళు వదిలి ప్రైవేటు భూదాహాన్ని తీర్చింది. ఆరేళ్ళుగా సాగు తున్న భూసంతర్పణపై ఎన్ని విమర్శలు చెలరేగినా వాటన్నిం టికి ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. న్యాయవివాదాలు తలెత్తినా పెట్టుబడి వర్గాలకు సర్కారు దాసోహంగా వ్యవహరిస్తున్నారు. గొప్పలకు పోయి అనేక ప్రాజెక్టులకు భూములు కేటాయించి వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయనే భ్రమలు కల్పించిన ప్రభుత్వం ప్రాజెక్టుల పేరిట సామాన్యులను రోడ్డు పాలు చేసింది.

పేదల నుంచి తీసుకున్న భూములకు సైతం సరైన నష్టపరిహారం చెల్లిం చలేదని బాధితులు ఇప్పటికీ నెత్తినోరు బాదుకుంటు న్నారు.పేదలు, రైతుల కుటుంబాలను చిన్నా భిన్నం చేసి.. పచ్చని పొలాలను ప్రత్యేక ఆర్థిక మండళ్ళు(సెజ్‌), పారి శ్రామిక పార్కులకు కేటాయించి సంవత్సరాలు గడుస్తున్నా.. ఉపాధి కల్పించే ప్రాజెక్టు ఏదీ రాకపోవడంతో జనం బిత్తరపోతున్నారు. ఉపాధికి సంబంధించి స్థానిక ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో నిలదీసి ప్రశ్నిస్తున్నా సరైన సమాధానాలు చెప్పలేని పరిస్థితి. ఆరేళ్ళుగా కాంగ్రెస్‌ సర్కార్‌లో కొందరు పెద్దలు చేసిన ఏకపక్ష నిర్ణయాలకు తమను బాధ్యులను చేయడంపై స్థానిక ప్రజా ప్రతినిధులు కూడా మండిపడుతున్నారు.

సర్కారుకు వాన్‌పిక్‌ గండం

తాజాగా స్థానిక పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. ఓడ రేవులు, సెజ్‌లకు కేటాయించిన భూములు, విద్యుత్‌ థర్మల్‌ ప్రాజెక్టులకు కేటాయించిన భూమల వ్యవహారంపై అసెంబ్లీ, శాసన మండలి అట్టుడికిన విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లాల్లో వాన్‌పిక్‌కు కేటాయించిన భూములపై స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ అసెంబ్లీలోనే ప్రభుత్వ విధానాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు. వాన్‌పిక్‌ దోపిడికి వ్యతి రేకంగా ఆయన సభలో ఆడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి సైతం సంతృప్తికరంగా సమాధానం ఇవ్వ లేక నీళ్లు నమలడం తప్ప మరోదారి లేకుండాపోయింది.

చివరికి సభలో దీనిపై సీఎం స్పందిం చాల్సి వచ్చింది. పరిస్థితుల తీవ్రతను ఇప్పటికే గమనిస్తున్న సీఎం రాష్ట్రంలో సెజ్‌లు, ఇతర పరి శ్రమలకు కేటాయించిన భూములతోపాటు.. ఓడరేవులకు కేటాయించిన భూములనూ పునః సమీక్షిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ప్రభుత్వ భూసేకరణతో దెబ్బతిన్న నిర్వాసితులను సముచిత రీతిలో ఆదుకుంటామని కూడా చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పరిశ్రమలు, సెజ్‌లు పేరుతో సాగిన భూ కేటాయింపులపై నిజాలు నిగ్గు తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుచేస్తామని సీఎం తెలిపారు. ఆరేళ్ళ పాలనలో భూ కేటాయిం పులపై సీఎం స్పందనను కొన్ని రాజకీయపార్టీలు స్వాగతిం చాయి.

అసైన్డ్‌ భూములుసైతం ...
దళితులకు, భూములేని పేదలకు కేటాయించిన అసైన్డ్‌ భూములను కూడా ప్రభుత్వం పరిశ్రమల పేరుతో పారిశ్రామిక వేత్తలకు అప్పగించింది. రాష్ర్టంలోని సెజ్‌లు, ఓడరేవుల కోసం వేలాది అసైన్డ్‌ భూములను ప్రభుత్వం పేదల నుంచి బలవంతంగా గుంజుకున్నది. తీరా.. బాధిత పేదలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే... అసైన్డ్‌ భూములపై హక్కులు ప్రభుత్వా నికే ఉంటాయని, ఎవరికైనా అసైన్డ్‌ భూములను కేటాయిస్తే అది వారికి ఉపాధి కల్పించేందుకు మాత్రమే తప్ప, వారికి హక్కులుకల్పించినట్లు కాదని సర్కారు వాదిస్తున్నది.

అసైన్డ్‌ భూములను గతంలో ప్రభుత్వమే దళితులకు, భూమిలేని పేదలకు ఇచ్చింది. ప్రస్తుతం అవసరం వచ్చింది కాబట్టి ప్రభుత్వమే వాటిని వెనక్కి తీసుకుంటుం దని ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదు పాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఐఐసీ) అధినేతగా పనిచేసిన ఓ ఉన్నతాధికారి బాధిత నిరాశ్ర యులతో చాలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలోని కేవలం కాకినాడ సెజ్‌ పరిధిలో పరిశ్రమల పేరుతో అధికారికంగా 12 వేల ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. ఇందులో అసైన్డ్‌ భూములే 2,500 ఎకరాలు ఉండడం విశేషం. అంతేకాకుండా కాకినాడ సెజ్‌ యాజ మాన్యం స్థానికంగా ఉద్రికత్త పరిస్థితులు సృష్టించి.. పేద రైతులకు చెందిన పచ్చని పొలాలనుసైతం కారుచౌకగా తీసుకుందన్న విమర్శలు లేకపోలేదు. కాకినాడ సెజ్‌ భూములపై ఇప్పటికే పెద్ద ఎత్తున న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి.

అదే విధంగా చిత్తూరు జిల్లా సత్యవేడులోని శ్రీసిటీ సెజ్‌ కూడా పది వేల ఎకరాల వరకు పేదల నుంచి సేకరించింది. ఇక్కడ కూడా పేదల ఆధీ నంలో ఉన్న అసైన్డ్‌ భూములు పరిశ్రమల పేరుతో బలవతంగా లాక్కున్నట్లు విమర్శలు న్నాయి. ఇప్పటికే శ్రీసిటీ భూసేకరణపై కోర్టులలో ప్రైవేట్‌ కేసులు నడస్తున్నాయి. అంతే కాకుండా అత్యంత కీలకమైన తీర ప్రాంత భూములను కూడా చౌకగా కృష్ణపట్నం, వాన్‌పిక్‌ ఓడరేవు సంస్థ లకు ప్రభుత్వం ధారాదత్తం చేసింది. దీనిపై తీర ప్రాంత పేదలు, మత్స్యకారులు ప్రభుత్వం తీరుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా ప్రభుత్వ తీరులో ఏ మాత్రం చలనం లేకపోవడం విశేషం. తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి వీటిపై పునఃసమీక్షిస్తానని పైకి చెబు తున్నప్పటికీ.. బాధిత ప్రజానీకానికి సీఎం మాటలు అంతగా నమ్మకం కలిగించడం లేదు.

అందరి దృష్టి ఆ రెండింటిపైనే
ఇప్పటి వరకు ఎమ్మార్‌ , రహేజా అక్రమాల్లో సీఎం వ్యవహారిస్తున్న తీరుపై సొంత క్యాబినేట్‌ మంత్రులు, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులే పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర సర్కారు ఆర్థిక ప్రయోజనాలనే నిలువునా తాకట్టుపెట్టిన ఎమ్మార్‌, రహేజాల వ్యవహారంలో ఇప్పటిదాకా జరగాల్సిన రాద్దాంతం జరిగింది, ఇకపై చాలు అన్నట్లుగా ప్రభుత్వం వ్యవ హరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిజంగా సర్కారుకు చిత్తశుద్ధి ఉంటే ఆ రెండింటి విష యంలో నిగ్గుతేల్చి మిగతా వాటిపై చర్యలకు ఉపక్ర మించాలని సొంత పార్టీ నేతలు సవాల్‌ విసురు తున్నారు. అనంతపురం జిల్లాలో హిందూపురం సమీపంలో లేపాక్షీ హబ్‌ పేరుతో రాయలసీమకు చెందిన మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడికి వేల ఎకరాలను కట్టబెట్టింది.

లేపాక్షి హబ్‌ భూ కేటాయింపులన్నీ అప్పట్లో వ్యూహాత్మకంగా జరగ డం, ఈ కేటాయింపులపై నాడు ఎవ్వరూ నోరు మెదపని పరిస్థితి నెలకొని ఉండడంతో ప్రస్తుతం ఈ కేటాయింపుల లోగుట్టులన్నీ బహిర్గతం అవుతున్నాయి. సర్కారు పెద్దలు అనంతపురం జిల్లాలో సదరు సంస్థకు వేలాది ఎకరాలు నామ మాత్రపు రేటు సమర్పించారు. తాజాగా అక్కడ ప్రభుత్వ భూములు లేకపోవడంతో... లేపాక్షి హబ్‌కు కేటాయించిన భూముల్లోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిడిఎల్‌ మిసైల్‌ ప్రాజెక్టు రూ. 750 కోట్లతో చేపడుతుంది.

ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం బిడిఎస్‌ సంస్థ కనీసం 600 ఎకరాలు అవ సరమని కోరుతున్నది. అదే విధంగా ఇసిఐఎల్‌, బిహెచ్‌ఇఎల్‌ సంయుక్తంగా సుమారు 700 ఎకరాల్లో రూ. 500 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ సంస్థ ప్రఖ్యాత సైన్స్‌ పార్కును అనంతపురం లేపాక్షి హబ్‌లో ఏర్పాటు చేయడానికి ఆసక్తి కనబరుస్తో న్నది. దీనికోసం వెయ్యి ఎకరాలు కావాలని కోరుతున్నది. అదే విధంగా అమిత్ర యూనివర్సిటీ రూ. 150 కోట్ల ప్రతిపాదిత ప్రాజెక్టు కోసం 150 ఎకరాలు కోరుతున్నది. ఈరకంగా ప్రభుత్వ రంగ సంస్థలు పెద్ద ఎత్తున లేపాక్షీ హబ్‌లో వేలాది ఎకరాల భూములను కోరడం విశేషం.

భూముల జాతీయకరణ
రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ ఏపీఐఐసీ ద్వారా భూములు సేకరించి.. తదుపరి పియస్‌యూ, ఇతర సంస్థలకు భూములు కేటాయిస్తే.. మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడానికి వీలుపడుతోంది. తాజాగా రాష్ట్రంలోని కీలక ప్రాంతాల్లోని భూము లను పరిశ్రమలు, సెజ్‌లు, ఓడరేవుల పేరుతో ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించి ఆ తర్వాత ప్రభుత్వ పరం చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని కొందరు మంత్రులు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం దేశ ప్రయోజనాల రీత్యా ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసినట్లుగానే దేశంలో, రాష్ట్రంలోని ప్రైవేట్‌ పారిశ్రామిక పార్కులు,సెజ్‌ భూములను జాతీయం చేసే పరిస్థితి లేకపోలేదం టున్నారు. అది కూడా ఎంతోదూరంలో లేదని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ మంత్రి ఒకరు ఘాటుగా స్పందించారు. కోస్తా తీరప్రాంత భద్రతపై ఇప్పటికే ప్రభుత్వానికి తమ ఆందోళన తెలియ చేశామని, రాష్ర్ట ప్రభుత్వం దీనిపై తీవ్రంగా దృష్టిసారించక పోతే కేంద్రప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని సదరు మంత్రి స్పష్టం చేశారు.

భూములు అడుక్కుంటున్న పీఎస్‌యూలు

వ్యూహాత్మకంగా పలు జిల్లాల్లో విలువైన భూములను ప్రయివేటు గద్దలకు సర్కారు పెద్దలు దారాదత్తం చేయడంతో తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థ(పియస్‌యు)ల అవస రాలకు ప్రయివేటు సంస్థల నుంచి భూములు కోరాల్సిన దుస్థితి నెలకొంది. అంటే సర్కారు వద్ద ఉండాల్సిన ల్యాండ్‌ బ్యాంక్‌ను సైతం ప్రయివేటు సంస్థలకు దోచిపెట్టి ప్రభుత్వం జీరో ల్యాండ్‌ బ్యాంక్‌ స్థాయికి దిగజారిపోయింది. ఇప్పుడు పిఎస్‌యు భూముల కోసం ప్రభుత్వమే ప్రైవేటు సంస్థల దయాదాక్షిణ్యాలపై ఆధారపరడాల్సి రావడం విశేషం. మౌలిక సదుపాయాలు ఇతరత్రా అభివృద్ధికే పెద్ద ఎత్తున ప్రైవేట్‌ సెజ్‌లు, పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం పైకి చెబుతున్నప్పటికీ కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వేల ఎకరాలు వారుతన్నుకుపోతున్న విషయం మాత్రం ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే మరుగున పెడుతున్నది.

Sunday, January 9, 2011

మధ్యంతరమా? వస్తుందా?


ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఎంత కాలం ఉంటుం ది? రాష్ట్ర శాసనసభకు మధ్యంతర ఎన్నికలు తప్పవా? ఈ రెండు ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర ప్రజల మెదళ్లను తొలిచేస్తున్నాయి. పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో పరిపాలన దాదాపుగా అచేతనావస్థకు చేరుకుంది. దీనికి ప్రధాన కారణం, కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న గందరగోళంతోపాటు, తెలంగా ణ రాష్ట్ర ఏర్పాటుపై శ్రీకృష్ణ కమిటీ మరో అయిదారు రోజులలో నివేదిక ఇవ్వవలసి ఉండటం! ఈ రెండు పరిణామాల వల్ల ప్రభుత్వ మనుగడపై పలు సందేహాలు నెలకొన్నాయి.

వాస్తవానికి శాసనసభ కు మధ్యంతర ఎన్నికలు రావాలని ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు కోరుకోవడం లేదు. మధ్యంతర ఎన్నికలు రావాలని కోరుకుంటున్నది, కాంగ్రెస్ పార్టీపై తిరుగుబాటు చేసి న మాజీ ఎం.పి. జగన్మోహనరెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాత్రమే. ఎందుకంటే ఎన్నికలు వస్తే తెలంగాణలో టి.ఆర్.ఎస్. గరిష్ఠ స్థాయిలో లాభపడే అవకాశం ఉండగా, సీమాంధ్రలో జగన్ ఎంతో కొంత లాభపడతారు.

అందువల్లే పరిస్థితులు కుదుటపడి పార్టీపై పట్టు వచ్చేవరకు, ఎన్నికలు జరిగే పరిస్థితి తలెత్తకుండా అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేస్తోంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థి తి ఇటు తెలంగాణలో దిక్కుతోచని రీతిలో ఉండగా, సీమాంధ్రలో కూడా అంతంత మాత్రమే కనుక ఆ పార్టీ కూడా ఎన్నికలు కోరుకోవ డం లేదు.

'లక్ష్య' పేరిట విజయవాడలో జగన్ చేపట్టిన దీక్షకు ఎంతమంది ఎం.ఎల్.ఎ.లు సంఘీభావం ప్రకటించారన్న దాన్ని బట్టి మధ్యంతర ఎన్నికలు వస్తాయని అంచనా వేయలేని స్థితి! ఎందుకంటే ప్రస్తుతం కాంగ్రెస్ శాసనసభ్యులు ఎటూ తేల్చుకోలేని డోలాయమానంలో ఉన్నారు. జగన్‌కు సంఘీభావం ప్రకటించిన వారంతా చివరి వరకు ఆయనతోనే ఉంటారన్న నమ్మకం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీతోనే ఉంటామని చెబుతున్న వారి ప్రకటనలనూ విశ్వసించలేని స్థితి.

నిజానికి పలువురు కాంగ్రెస్ శాసనసభ్యులు ప్రస్తుతం రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు. ఉదయం జగన్‌తో మాట్లాడితే, సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని కలుస్తున్నారు. ఈ పరిణామం వారి మానసిక స్థితికి అద్దం పడుతోంది. భారీ ఖర్చుతో విజయవాడ లో చేపట్టిన 48 గంటల లక్ష్య దీక్షకు ఆశించినస్థాయిలో జనం రాలేద న్న వార్తలు వచ్చాయి. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లాలో రెండవసారి జగన్ చేసిన పర్యటనకూ జనం పలుచబడినట్టు వార్తలు వచ్చాయి.

ఈ పరిస్థితి జగన్ వర్గాన్ని సహజంగానే ఎంతో కొంత నిరాశకు గురిచేసింది. కాలం గడిచే కొద్దీ జగన్ ప్రభావం బలహీన పడుతుందన్నది కాంగ్రెస్ ప్రముఖుల అంచనా. అదే జరిగితే, ప్రస్తు తం జగన్‌కు సంఘీభావం ప్రకటించినవారు కూడా మనస్సు మార్చుకునే అవకాశం ఉంది. మీడియా ప్రచారం ద్వారా జగన్ గురించి ఎంతో ఊహించుకున్న జనానికి ఆయన ప్రసంగాలు నిరాశ నే మిగిల్చాయి.

ఈ నేపథ్యంలో మున్ముందు జగన్ ఎటువంటి వ్యూహంతో కదులుతారు? ఆయనకు ప్రస్తుతం కనిపిస్తున్న జనాదర ణ చివరి వరకు మిగులుతుందా? అనే అంశాలు స్పష్టం అయితే గానీ మధ్యంతర ఎన్నికలు జరుగుతాయా? లేదా? అన్నది చెప్పలేం. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని పడగొట్టి మధ్యంతర ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలన్నది జగన్ లక్ష్యం. ఈ కారణంగానే విజయవాడ సభలో ప్రసంగించిన ఆయన వర్గీయులు, రైతుల సంక్షే మం కన్నా, రాజకీయ విమర్శలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోయడానికి ప్రాధాన్యత ఇచ్చారు.

కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతానికి మైనారిటీలో పడిన విషయం వాస్తవం. అయితే జగన్‌కు సంఘీభావం తెలుపుతున్న వారంతా రాజీనామాల కు సిద్ధపడతారా? అన్నదీ సందేహమే. వీలైతే మరో రెండు మూడు నెలల్లో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచనతో జగన్ వర్గం ఉంది. అందుకు అవసరమైన బల సమీకరణకు చాప కింద నీరులా ప్రయత్నాలు చేస్తోంది. 50 నుంచి 60 మంది వరకు శాసన సభ్యులను కూడగట్టగల సత్తా ప్రస్తుతానికి జగన్‌కు ఉంది.

పరిస్థితి జగన్‌కు అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే ఈ సంఖ్య పెరగవచ్చు కూడా. కానీ ప్రస్తుతానికి 50 నుంచి 60 మంది శాసన సభ్యులు తమ సభ్యత్వాలను వదులుకొంటారా? అన్నది ప్రశ్నార్థకమే! రాజీనామా లు చేసి, జగన్ వెంట నడిస్తే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న ధీమా ఏర్పడితే తప్ప, వారెవ్వరూ ఆ పని చేయడానికి సిద్ధపడ రు. ఈ క్రమంలో సర్వే సంస్థలపై పలువురు ఆధారపడుతున్నారు.

జగన్ బలం ఎంత? అనే విషయం అలా ఉంచితే, రాజకీయంగా జగన్ బలపడే పరిస్థితి ఏర్పడకుండా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ సహజంగానే కృషి చేస్తుంది. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో దాదాపు 40 మంది శాసనసభ్యులు ఉన్నారు. ప్రస్తుతానికి తెలంగాణలో పార్టీ పరిస్థితి బాగాలేనందున వారెవ్వరూ మధ్యంతర ఎన్నికలను కోరుకోరు. అలాగని నేరుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్ద తు ఇచ్చే పరిస్థితి కూడా తెలుగుదేశం పార్టీకి ఉండదు.

జగన్ బలం 60కి పరిమితమయ్యే పక్షంలో (ఇది ప్రస్తుతానికి గరిష్ఠం), ప్రజారాజ్యం-మజ్లిస్ శాసనసభ్యుల సంఖ్య ను కలుపుకొన్నా, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి ఇంకా దాదాపు 35 మంది శాసన సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. మధ్యంతర ఎన్నికలు తెచ్చుకుని ప్రధాన రాజకీయ పక్షాలైన తాము నష్టపోవడానికి కాంగ్రెస్ - తెలుగుదేశం పార్టీలు సిద్ధంగా ఉండవు కనుక ఏదో ఒక ఫార్ములా రూపొందే అవకాశం ఉంది.

తాము కనుమరుగై చంద్రశేఖరరావు, జగన్మోహనరెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు లాభపడటాన్ని ఆ రెండు పార్టీ లు సహజంగానే జీర్ణించుకోలేవు. మధ్యంతర ఎన్నికలు వస్తే తెలంగాణలో 100 స్థానాలను కైవసం చేసుకోవాలని టి.ఆర్.ఎస్. అధినేత చంద్రశేఖరరావు అప్పుడే లెక్కలు వేస్తున్నారు. తెలంగాణ సమస్య పరిష్కారం కాకుండా ఇప్పటికిప్పు డు ఎన్నికలు వస్తే, కె.సి.ఆర్ అంచనా వేస్తున్నట్లు, 100 స్థానాలకు కొంచెం కుడిఎడమగా టి.ఆర్.ఎస్. బలం పెరిగే అవకాశం కచ్చితం గా ఉంది. సీమాంధ్రలో పరిస్థితిని ప్రస్తుతానికి అంచనా వేయలేం.

ఈ నేపథ్యంలో ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లు, జగన్మోహన్‌రెడ్డి వ్యవహారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాన అడ్డంకిగా మారినా ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే తెలంగాణ ఇవ్వాలా? లేదా? అన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ స్థానంలో మరే ఇతర పార్టీ ఉన్నా అదే పని చేస్తుంది. అటు సీమాంధ్రలో జగన్‌కు, ఇటు తెలంగాణలో కె.సి.ఆర్.కు లాభించే పని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎందుకు చేస్తుంది? జగన్ ఇదివరకే సమైక్యాంధ్ర నినాదాన్ని చేపట్టినందున, రాష్ట్ర విభజ న జరిగితే సీమాంధ్రలో ఆయనకే లాభం చేకూరే అవకాశాలు మెండుగా ఉంటాయి.

ఫలితంగా తెలంగాణ అంశం మరోమారు పీటముడి పడే అవకాశం ఉంది. సీమాంధ్రలో జగన్ ప్రభావం నామమాత్రమన్న నిర్ణయానికి వచ్చే వరకూ తెలంగాణ అంశాన్ని ఎటూ తేల్చకుండా కాంగ్రెస్ పార్టీ నాన్చే అవకాశం ఉంది. శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఏ సిఫారసులు చేస్తుందన్న విషయం అటుంచితే, అది ఇచ్చే నివేదికను పరిశీలించడానికి మంత్రుల కమిటీని నియమిం చి కాలయాపన చేయవచ్చు.

టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ఇటీవలి కాలంలో చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇటువంటి అనుమానాలకు ఊతం ఇస్తున్నాయి. ఉద్యమాల గురించి మాట్లాడకుండా ఆయన, ఎన్నికల గురించి, ఆ ఎన్నికల్లో సాధించవలసిన సీట్ల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ఈ ధోరణితో తెలంగాణ ఇప్పట్లో రాదన్న అనుమానాలు తెలంగాణవాదుల్లో కలుగుతున్నాయి. తెలంగాణకు చెందిన కాంగ్రెస్‌వాదులతో పాటు, కరడుగట్టిన తెలంగాణవాదులు కూడా, ప్రైవేటు సంభాషణల్లో, ఇటువంటి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చి రెండు ప్రాంతాలలో నష్టపోవడానికి కాంగ్రెస్ మాత్రం ఎందుకు సిద్ధపడుతుంది? జగన్ వ్యవహారం ఉండి ఉండకపోతే పరిస్థితి మరోలా ఉండేది.

ఈ విషయం అలా ఉంచితే, కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యత లు చేపట్టి నెల రోజులు గడిచాయి. కానీ ఇంతవరకు ఆయన అంతరంగం ఏమి టో ఆవిష్కృతం కాలేదు. తాను మొండి మనిషినని రుజువు చేసుకోవడానికి అనుక్షణం ఆయన ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా, తాను మెతకగా ఉంటే పని చేయనివ్వరని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఆ కారణంగానే ప్రతి విషయంలోనూ ముఖ్యమంత్రిమొండితనాన్ని ప్రదర్శిస్తున్నారు.

ప్రభుత్వపరమైన అంశాల విషయంలోనే కాకుండా, పార్టీ పరమైన విషయాలలో కూడా ఆయన తనకంటూ ఒక టీంను ఇంకా ఏర్పాటు చేసుకోలేదు. మంత్రులను విశ్వాసంలోకి తీసుకుని వారికి బాధ్యతలు అప్పగించిన దాఖలాలు లేవు. దీనితో పలువురు సీనియర్ మంత్రు లు ఆయన పట్ల కినుకగా ఉన్నారు. అయినా, ఎవరు ఏమనుకుంటా రు అన్న దానితో నిమిత్తం లేకుండా, కిరణ్‌కుమార్‌రెడ్డి తనదైన శైలి లో వ్యవహరిస్తున్నారు.

రైతులకు మరింత మెరుగైన ప్యాకేజీ ఇవ్వాల ని కోరుతూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు ఏడురోజుల పాటు నిరాహారదీక్ష చేసినా, కనీసం ఒక్క డిమాండ్‌ను తీర్చడానికి కూడా ముఖ్యమంత్రి అంగీకరించలేదు. వాస్తవానికి అసెంబ్లీలో తాను ప్రకటించిన ప్యాకేజీ కన్నా మెరుగైన ప్యాకేజీ ఇవ్వడానికి ప్రభుత్వపరంగా కృషి జరుగుతోంది. అయితే చంద్రబాబు దీక్ష చేపట్టినందునే ప్రభుత్వం సాయం పెంచిందన్న అభిప్రాయం రైతుల్లో కలగకుండా ఉండటానికే, అఖిలపక్ష సమావేశంలో ఎవరు ఎంత గొంతు చించుకున్నా, ముఖ్యమంత్రి మొండికేశారు.

ఒకటిరెండు రోజులలో ప్రభుత్వం కొత్త ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయంలో కేంద్రం కూడా ఉదారంగా సహాయం చేయడానికి సుముఖత చూపినట్లు తెలుస్తున్నది. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూరరాదన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి అంత మొండిగా ఉన్నారు. చంద్రబాబుతో దీక్ష విరమింపచేయడానికి కనీసం మంత్రు ల బృందాన్ని అయినా పంపారు. విజయవాడలో ఆర్భాటంగా జగన్ చేపట్టిన 48 గంటల దీక్షను ముఖ్యమంత్రి కనీసం గుర్తించలేదు.

జగన్‌కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకూడదన్నది కిరణ్ ఆలోచనగా చెబుతున్నారు. తొలిదశలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించి, మలి దశలో రాజశేఖరరెడ్డి ప్రభావాన్ని తగ్గించి, కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్న రెండంచెల వ్యూహంతో ఆయన ఉన్నారు. ప్రజల్లో రాజశేఖరరెడ్డి ప్రభావం తొలగించగలిగితే, జగన్ పరిస్థితి 'నీటిలో నుంచి ఒడ్డున పడ్డ చేప'లా తయారవుతుందని ముఖ్యమంత్రి వర్గీయులు అంచనా వేస్తున్నారు.

వాస్తవం కూడా అదే! రాజశేఖరరెడ్డి పేరు చెప్పుకొనే జగన్ ప్రస్తుతానికి రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను చూసి, తాను కంగారు పడి ఇతరులను కంగారు పెట్టే బదులు, ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్లాలన్నది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ క్రమం లో కాంగ్రెస్ అధిష్ఠానం సలహాలు, సూచనలతో రూపొందించుకున్న రెండంచెల వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయగలిగితే, 2014లో జరిగే ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయవచ్చునన్నది కిరణ్ అంతరంగంగా చెబుతున్నారు.

రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్లు దీక్షలు చేసినా, మరొకటి చేసినా, రాజకీయ ప్రయోజనాలు అంతర్లీనంగా అందులో ఇమిడి ఉంటాయి. చంద్రబాబు చేపట్టిన దీక్ష వెనుక గానీ, జగన్ ముగించుకున్న లక్ష్య దీక్ష వెనుకగానీ రాజకీయ ప్రయోజనాలు లేకుండా ఎలా ఉంటాయి?! అయితే ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీలన్నీ, రాజకీయ ప్రయోజనాలను కాసేపు పక్కనబెటి,్ట రైతుల లో ఆత్మ విశ్వాసం పాదుకొల్పడానికి ఏకోన్ముఖంగా ముందుకు కదలవలసిన అవసరం ఉంది.

ప్రతిరోజూ 20 మందికి తగ్గకుండా రైతు లు, ఆత్మహత్య లేదా గుండెపోటుతో చనిపోతున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి 48 గంటల లక్ష్య దీక్ష చేపట్టిన జగన్ ఆ వెంటనే క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి పులివెందుల వెళ్లిపోయారు. రాజకీ య బల ప్రదర్శనకు ప్రాధాన్యత ఇచ్చిన ఇటువంటి దీక్షల వల్ల రైతులకు వొనగూరే ప్రయోజనం ఏమీ ఉండదు. రైతులకు ఇప్పుడు కావలసింది పార్ట్ టైం రాజకీయ నాయకులు కాదు. 'మీ వెనుక మేము న్నాం' అని ధైర్యం చెప్పి, ఆదుకునే ఆపన్న హస్తం కావాలి.

ఏడురోజులపాటు నిరాహారదీక్ష చేపట్టి, ప్రస్తుతం నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చంద్రబాబునాయుడు, ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి న తర్వాత ఏమి చేయనున్నారో వేచి చూడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడకుండా, రైతులకు సహాయం అందించడానికి చొరవ తీసుకోవలసిన బాధ్యత, ఒక ప్రతిపక్ష నేతగా, తొమ్మిది సంవత్సరాలపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుపై ఎక్కువగా ఉంది. చంద్రబాబుకు ఎక్కడ లబ్ధి చేకూరుతుందోనని ఆలోచించకుం డా, రైతులకు వీలైనంత మేర సహాయం అందించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కార్యోన్ముఖులు కావాలి.

'సర్వరోగ నివారి ణి జిందా తిలిస్మాత్' అన్నట్లు, అన్ని సమస్యలకు తెలంగాణ ఏర్పాటే పరిష్కారం అని కబుర్లు చెబుతూ కాలక్షేపం చేసే బదులు, తెలంగాణ జిల్లాలలో గిట్టుబాటు ధర లభించక అల్లాడుతున్న రైతాంగానికి భరోసా ఇవ్వడానికి టి.ఆర్.ఎస్. అధినేత కె.సి.ఆర్. ముందుకు రావలసిన అవసరం ఉంది. తనకు ఎంతమంది శాసనసభ్యులు మద్ద తు ఇస్తారన్న లెక్కలకు కాసేపు స్వస్తి చెప్పి, రైతులను ఆదుకునే విషయంలో ప్రభుత్వానికి సహకరించవలసిన బాధ్యత జగన్‌పై ఉంది. మరి వీళ్లంతా కలసి కదులుతారా? 

-ఆదిత్య


Wednesday, January 5, 2011

తేల్చేద్దాం! * 'తెలంగాణ'పై అనిశ్చితి అంతానికే కేంద్రం మొగ్గు * శ్రీకృష్ణ నివేదికలో స్పష్టమైన రోడ్ మ్యాప్ * పార్టీలు తేల్చుకోవాలి పరిష్కారం వాటి చేతుల్లోనే

 
ప్రాధాన్య క్రమంలో ఆరు సిఫారసులు
అదే విధానంలో పరిష్కారానికి యత్నాలు
గురువారం ఉదయం 11 గంటలకే పార్టీలతో భేటీ
స్పందించేందుకు 10 రోజుల సమయం
స్పష్టత ఇవ్వకుంటే తుది నిర్ణయం కేంద్రానిదే
రాష్ట్ర విభజనపై తేల్చేద్దాం... అనిశ్చితిని అంతం చేద్దాం... సాగదీతకు ఫుల్‌స్టాప్ పెట్టి, సాధ్యమైనంత త్వరలో తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేద్దాం..!! ఇవీ కేంద్రం మదిలో తాజా ఆలోచనలు. రాష్ట్రంలో సామాజిక ఆందోళనలు.. విభజన అంశంపై కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణం ఎక్కువకాలం కొనసాగితే మంచిది కాదన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం భావిస్తోందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.

శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కార మార్గాలు చెప్పిందని, స్పష్టమైన ఆ రోడ్‌మ్యాప్‌ను ఆధారం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమాయత్తమవుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల ఆరున ఉదయం 11 గంటలకు రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం యథాతథంగా జరుగుతుందని, ఆ సమావేశంలో నివేదికను అందజేయడంతో పాటు.. నివేదిక సారాంశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని సమాచారం. ఆ వెంటనే నివేదికను మధ్యాహ్నం రెండు గంటలకల్లా వెబ్‌సైట్‌లో పెట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ప్రతి స్పందించేందుకు రాజకీయ పార్టీలకు పది రోజుల పాటు సమయం ఇస్తారని తెలుస్తోంది.

నివేదికపై రాజకీయ పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఇక నిర్ణయం కేంద్రమే తీసుకుంటుందని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన ఆరు పరిష్కార మార్గాల్లో ఒక్కోదానికి ఒక్కో గ్రేడ్ ఇచ్చారని తెలిసింది. ఈ ఆరింటిలో మొదటి పరిష్కారమే ఉత్తమ మార్గమని కమిటీ అభిప్రాయపడుతోందని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఒక వేళ మొదటి పరిష్కారం సాధ్యం కాదని రాజకీయ వర్గాలు భావించిన పక్షంలో రెండవ పరిష్కారంవైపు దృష్టి పెడతారు.

దీన్నీ తిరస్కరిస్తే మూడోది.. అలాగే ఇతర పరిష్కార మార్గాలపైనా చర్చ జరుగుతుందని హోం శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇదే విధంగా కొనసాగించడమా? లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమా? సమైక్యాంధ్రలో తెలంగాణకు రాజ్యాంగ రక్షణ కల్పించడమా? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు సూచించడమా, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడమా? లేక రెండు ప్రాంతాల రాజధానిగా కొనసాగించడమా, మూడు రాష్ట్రాలుగా విభజించడమా, లేక రాయలసీమను తెలంగాణలో విలీనం చేయడమా? ఇలా అనేక అంశాలను కమిటీ చర్చించిందని తెలిసింది. ఇందులో ఏ పరిష్కార మార్గానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందో ఇప్పుడే చెప్పడానికి హోంశాఖ వర్గాలు నిరాకరించాయి.

రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారమే రాష్ట్రం విషయంపై కేంద్రం ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుందని ఈ వర్గాలు చెప్పాయి. వారి అభిప్రాయానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని, ఒక వేళ విభజనకే నిర్ణయించిన పక్షంలో తాత్కాలికంగా ఉభయ ప్రాంతాలకు హైదరాబాద్‌ను రాజధానిగా అంగీకరించడమో, విజయవాడ, గుంటూరులను నూతన రాష్ట్రానికి రాజధానిగా ప్రతిపాదించడమో జరుగుతుందని ఆ వర్గాలు వివరించాయి.

తాము అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నామని పేర్కొన్నాయి. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు గతంలో ఒక అభిప్రాయం చెప్పి, తాము ప్రకటన చేసిన తర్వాత కేంద్రంపై నింద వేశాయని, ఇప్పుడు ఆ ఆవకాశం లేకుండా ఆ పార్టీలు స్పష్టత ఏర్పర్చుకోవాల్సి ఉన్నదని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.

శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను స్పష్టంగా, పరిస్థితిని యథాతథంగా నివేదించిందని, ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోలేకపోతే ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేమని, రాజకీయ పార్టీలు కూడా ఈ నివేదికను తమ నిర్ణయానికి ఆధారంగా స్వీకరించాలని ఈ వర్గాలు సూచిస్తున్నాయి. కాగా అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర హోంమంత్రి చిదంబరం సంప్రదిస్తున్నారని, వారు ఢిల్లీకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపాయి. వారు రాకపోతే నివేదికను వారికి చేరేలా చేస్తామని ఈ వర్గాలు చెప్పాయి.
Click Here!

పార్టీలు తేల్చుకోవాలి
పరిష్కారం వాటి చేతుల్లోనే
అవి కోరినంత కాలం చర్చలు

అనిశ్చితి ఎంత కాలమో నాకూ తెలియదు
6న అర్థమవుతుంది
ఇద్దరేసి చొప్పున రమ్మనడం భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించడం కాదు
ఎంత మందిని పంపాలో పార్టీల ఇష్టం
చిదంబరం వ్యాఖ్యలు
 అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో ఆరో తేదీ దాకా నాకూ తెలియదు.. తెలంగాణకు పరిష్కారం రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంది..! కోరుకున్నంత కాలం చర్చలు జరపడానికి సిద్ధం! ఇవీ కేంద్ర హోం మంత్రి నోట వెలువడిన మాటలు!! శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేసేందుకు ఈ నెల ఆరున ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో చిదంబరం చేసిన వ్యాఖ్యలు! ఆహ్వానించిన అన్ని పార్టీలూ తాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతాయన్న ధీమా వ్యక్తం చేసిన చిదంబరం.. ఈ భేటీలో ఏ పార్టీ ఏం చెబుతుందో వేచి చూడాలని అన్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఎంతకాలం చర్చలు కొనసాగించాలన్న విషయం రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉన్నదని చెప్పారు. దాని గురించి ఆ పార్టీలే తేల్చుకోవాలని, కాలపరిమితి గురించి తాను చెప్పలేనని చిదంబరం స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు చర్చలు కొనసాగించాలని కోరుకున్నంత కాలం తాను చర్చలు జరుపుతానని తెలిపారు. సమస్యను నాన్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన వ్యాఖ్యానాల్ని ఆయన ఖండించారు. "నాకు ఉద్దేశాలు అంటకట్టకండి.'' అంటూ తీవ్రంగా ప్రతిస్పందించారు.

జవవరి 6న మీరు విస్తృత చర్చలు జరుపుతారా, లేక కేవలం నివేదిక ఇచ్చి ఊరుకుంటారా? అని అడిగినప్పుడు రాజకీయ పార్టీలు సమావేశంలో స్పందించే తీరును బట్టి చర్చలు సాగుతాయని తెలిపారు. ఈ నెల 6న కమిటీ నివేదికపై చర్చించేందుకు ఒక పార్టీ నుంచి ఇద్దర్ని ఆహ్వానించినంత మాత్రాన ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తున్నామని కాదని ఆయన వివరణ ఇచ్చారు.

గత జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి గురించి చర్చించేందుకు 8 పార్టీల నుంచి ఇద్దర్ని ఆహ్వానించామని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించామని ఆయన చెప్పారు. ఇద్దర్ని మాత్రమే పంపాలన్న నిబంధన ఏమీ లేదని, పార్టీ ఒక్కర్ని కూడా సమావేశానికి పంపించవచ్చునని చిదంబరం స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఇద్దరు వచ్చినంత మాత్రాన వేర్వేరు అభిప్రాయాలు చెబుతారని కూడా చెప్పలేమని అన్నారు.

గత సమావేశంలో కూడా సీపీఎం, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని చిదంబరం గుర్తు చేశారు. జనవరి 6 సమావేశాన్ని టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు బహిష్కరిస్తున్న సంగతిని ప్రస్తావించగా.. "చూద్దాం..'' అన్నారు. నివేదిక అధ్యయనం చేసేందుకు టీఆర్ఎస్, సీపీఐలు సమయం కోరుతున్నాయని చెప్పినప్పుడు "వారు జనవరి 6న ఏం చెబుతారో చూడాల్సి ఉంది..'' అని స్పందించారు.

టీఆర్ఎస్ ఈ సమావేశంలో పాల్గొంటుందనే ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. జనవరి 6న ఏం జరుగుతుందో, పార్టీలు ఏమి చెబుతాయో చూడకుండా ఇప్పుడే తాను మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని పార్టీలూ ప్రజాస్వామ్య క్రమం కొనసాగేలా చూడడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
Click Here!
భయం వద్దు !
pc-chindambram తెలంగాణపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతాపార్టీ ప్రకటించినా, ఆరో తేదీన జరిగే చర్చలకు ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది రాజకీయ పార్టీలూ హాజరవుతాయన్న విశ్వాసాన్ని ప్రభుత్వం వ్యక్తం చేసింది. ‘అఖిలపక్ష సమావేశానికి ఎనిమిది పార్టీల్నీ ఆహ్వా నించాం. మొత్తం ఎనిమిది పార్టీలూ సమావేశానికి హాజరవుతాయన్న నమ్మకం నాకుంది’ అని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం మంగళవారం విలేకరులకు తెలి పారు. తెలంగాణపై అభిప్రాయ సేకరణ జరిపి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత చిదంబరం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఒక్కో పార్టీ నుంచీ ఇద్దరు ప్రతినిధుల్ని ఆహ్వానించి, కేంద్రం భిన్నాభిప్రాయాల్ని కోరుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన ఆరోపణలను గురించి అడగ్గా చిదంబరం -‘అలా అనడం సరికాదు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు కేంద్రం 2010 జనవరి 5నప్రతి పార్టీనుంచి ఇద్దరేసి ప్రతినిధుల్ని ఆహ్వానించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించాం’ అన్నారు. అ యితే, ఏ పార్టీ అయినా ఒక ప్రతినిధిని కూడా పంపవచ్చ న్నారు. ‘గత ఏడాది అనుభవాన్ని బట్టి చూస్తే, ఫలానా పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వస్తే, వారు రెండు అభి ప్రాయాల్ని వ్యక్తం చేస్తారని అనుకోకూడదని తెలిసింది. 2010 జనవరి 5న జరిగిన సమావేశానికి సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీఆర్‌ఎస్‌, ఎంఐఎం నుంచి ఇద్దరేసి ప్రతినిధులు హాజరైనా, ఒక్కో పార్టీ తరఫున ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.

అయినా, ఇదో సమస్య కాదు. ఆరున జరిగే సమావే శంలో టీఆర్‌ఎస్‌ పాల్గొంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వారు ఒకరిని లేదా ఇద్దరిని పంపవచ్చు. అది వారిష్టం’ అని చిదంబరం పేర్కొన్నారు. ‘గురువారం సమావేశంలో తాము పాల్గొనడం లేదని ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలు ప్రకటించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందా?’ అని విలేకరులు అడగ్గా - ‘ఆరున ఏం జరుగుతుందో చూద్దాం’ అని చిదంబరం సమాధానమిచ్చారు. నివేదిక వెల్లడి అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అల్లర్లు జరగవని, అల్లర్లు జరుగుతాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని చిదంబరం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలకు లక్ష్మణరేఖ
telangana-mps
కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఎంపీలను ఆ పార్టీ అధిష్ఠానం హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. తెలంగాణ ప్రాంత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరు కూడా బుధవారం మధ్యాహ్నం హస్తినలో అందుబాటులో ఉండాలని ఆదే శించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ మంగళవారం ఎంపీలకు ఫోన్‌ చేసి బుధవారం ఒంటిగంట వరకు ఢిల్లీకి చేరు కోవాలని సూచించారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడు, సీనియర్‌ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ, మరో కేంద్ర మంత్రి గులాం నబీఆజాద్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్‌ ఎం.వీరప్ప మొయిలీ తదితరులు తెలంగాణ ఎంపీలతో భేటి కానున్నారు.

పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్‌ పటేల్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్ప టికే కొందరు ఎంపీలు ఢిల్లీ చేరుకోగా, మరి కొందరుబుధవారం ఉదయం బయలుదేరి వెళ్ళనున్నారు. సమావేశం ఎజెండా ఏమిటో ఇప్పటి వరకు ఎంపీలకు సైతం తెలియరానప్పటికీ, గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎంపీల వైఖరి, ఈ నెల 6న అఖిలపక్ష సమావేశం తరువాత శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం వెల్లడించనున్న నేపధ్యంలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తగు సూచనలు చేసే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

మందలింపులా?
ఇటీవలి కాలంగా పార్టీ తెలంగాణ ఎంపీల వ్యవహార శైలీపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు వినిపిస్తోంది. డిసెంబర్‌ 22 నుంచి తెలంగాణ ఎంపీలు గట్టిగా వ్యవహరించడం, విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలంటూ సీనియర్‌నేత, స్టీరింగ్‌ కమిటీ సభ్యుడు డాక్టర్‌ కె.కేశవరావుతో సహా 10 మంది ఎంపీలు న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష ప్రారంభించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మల్యేలు వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఇద్దరు మంత్రులు సైతం దీక్షా శిబిరానికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. తెలంగాణ కోసం అవసరమైతే మాతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైకమాండ్‌ను ధిక్కరించే స్థాయిలో వీరు వ్యవహరించారని సీమాంధ్ర నేతలు ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వీరి వ్యవహారం పార్టీ హైకమాండ్‌కు ఇబ్బంది కరంగా పరిణమించింది.

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే అన్నింటికి సిద్ధమని, అవసరమైతే పదవులను సైతం వదులుకుంటామని కేకేతో సహా పలువురు నేతలు హైకమాండ్‌కు హెచ్చరించినంత పనిచేశారు. ఈ నెల 7వ తేదీ మరో సారి భేటి అయి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై భవిష్యత్‌ కార్యచరణ రూపొందించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ నేతల సమావేశాల్లో పలువురు నేతలు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా హైకమాండ్‌ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. దీంతో సీరియస్‌గా ఉన్న అధిష్ఠానం కంట్రోల్‌ చేయక పోతే మళ్ళి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని భావించే తెలంగాణ ఎంపీలను ఢిల్లీకి పిలిపించినట్లు ఎఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎంపీల తీరుపై అధిష్ఠానం నేతలు మందలించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, గీత దాటితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడమే కాకుండా ఎంపీలకు లక్ష్మణరేఖ విధించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

బుజ్జగింపులా?

తెలంగాణ ఎంపీలను బుజ్జగించేందుకే అధిష్ఠానం వారిని ఢిల్లీకి పిలిపించినట్లు పార్టీలో మరో వాదన వినిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎస్‌.జైపాల్‌రెడ్డి, ఎంపి అంజన్‌కుమార్‌ యాదవ్‌, రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, ఎం.ఎ.ఖాన్‌లు మినహాయించి మిగతా 10 మంది ఎంపీలు తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి సైతం వెనుకాడబోమని ఇటీవలే స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్ధులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలంటీ గత వారం ఎంపీలు చేపట్టిన దీక్షకు పై నలుగురు ఎంపీలు దూరంగా ఉన్నారు.

pranabaమరో ఎంపి విహెచ్‌ ఎంపీల దీక్షలో పాల్గొనక పోయినా సంఘీభావం తెలియజేశారు. పది మంది ఎంపీలు రాజీనామాలు చేస్తే దాని ప్రభావం తీవ్రంగా ఉంటుందని, పైగా తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా వారి బాటను అనుసరిస్తే పార్టీకి లేని పోని సమస్యలు రావడంతో పాటు రాష్ట్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితి వస్తుందనే ఆందోళనతో అధిష్ఠానం ఉన్నట్లు తెలుస్తోంది. పది మంది ఎంపీలు ఒక్క తాటిపై ఉండి తెలంగాణ విషయంలో ఇక వెనుకడుగు వేసేది లేదని తేల్చి చెప్పడం, విద్యార్ధులపై కేసుల ఎత్తివేత విషయంలో దీక్షకు దిగన సమయంలో , హైకమాండ్‌ పలు మార్లు సంప్రదించి, దీక్ష విరమించుకోవాలని విజ్ఞప్తి చేసినా వినిపించుకోకుండా అలాగే కొనసాగించారు.

తెలంగాణ పేరుతో ఎంపిలు తిరుగుబాటు చేస్తే ఆ ప్రాంతంలో కాంగ్రెస్‌ పరిస్థితి దారుణంగా తయారవుతుందని పార్టీ నాయకత్వానికి భయం వెంటాడుతున్నట్లు వినిపిస్తోంది. మరో వైపు కేంద్రం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడే కాకుండా కొంత కాలం తరువాత తెలంగాణ ఇవ్వాలనే ఆలోచనతో హైకమాండ్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికను చూసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ ఎంపీలకు హైకమాండ్‌ నచ్చజెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టిఆర్‌ఎస్‌కు లాభం చేకూరకుండా, అది కాంగ్రెస్‌ వల్లే వచ్చిందనే భావం ప్రజల్లో ఏర్పడే విధంగా చూడాల్సిన వసరం ఉందని, అందుకే కాస్త జాప్యం జరిగినా మీరు ఓపికపట్టాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి అనంతరం మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడకుండా సంయమనం పాటించాలని పార్టీ ఎంపీలను అధిష్ఠానం నచ్చజెప్పే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలో వినిపిస్తోంది.

నేడు ఢిల్లీకి డిఎస్‌, సిఎం
పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉదయం వేర్వేరుగా ఢిల్లీకి బయలు దేరి వెళ్ళనున్నారు. రెండు రోజుల పాటు వీరు అక్కడే ఉంటారు. 6వ తేదీన నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంశాఖ శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెల్లడించనున్నందున వీరు హస్తినకు వెళుతున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని అధిష్ఠానం ఆదేశించడంతోనే పీసీసీ చీఫ్‌ డిఎస్‌ హస్తిన పర్యటనకు వెళుతున్నారు. ఇక అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి కూడా హాజరు కావాల్సి ఉండటంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక రోజు ముందుగానే ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణ ఎంపీలతో అధిష్ఠానం ఏర్పాటు చేసిన సమావేశంలో వీలును బట్టి కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా పాల్గొనే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు.

మాకేనా హద్దులు ?
 మాకే నా హద్దులు. సీమాంధ్ర ఎంపీలకు వర్తించవా? పార్టీ నుంచి బయటికి వెళ్ళిన జగన్‌కు మద్దతు పలుకుతూ, అతని సభలకు జనసమీకరణ చేస్తూ, చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేస్తామంటూ బెదిరిస్తున్న ఎంపీల విష యం పట్టదా? మేము పార్టీని బతికించుకోవడానికి నానా పాట్లు పడుతుంటే, వాళ్ళు పార్టీకి నష్టం కలి గించే విధంగా వ్యవహరిస్తున్నారు అని కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీలు అధిష్ఠానం తీరుపై తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం హస్తినలో హైక మాండ్‌ ఏర్పాటు చేసిన సమావేశం తెలంగాణ ఎంపీలను కట్టడి చేయడానికేనని ప్రధానంగా ప్రచా రం జరుగుతుండడంతో ఆ ప్రాంత ఎంపీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ప్రజల కోసం, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు తాము దీక్షలు చేపడితే అదేదో పెద్ద నేరంగా, పార్టీకి చేసినద్రోహంగా చిత్రీకరించి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించడం, కొందరి మాటలు విని హైకమాండ్‌ తమతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇటూ పార్టీలో, అటు ప్రజల్లో తాము చులకనయ్యే అవకాశాలుంటాయని ఎంపీలు మండిపడుతున్నారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో తాము మౌనంగా ఉంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించరని, తెలంగాణకు అంగీకరించి కమిటీ వేసి ఇప్పుడేమో తెలంగాణ ఇచ్చేది లేదంటే జనం కాంగ్రెస్‌ను ఎన్నడు నమ్మె పరిస్థితి ఉండదని తెలంగాణ ఎంపీలు అంటున్నారు. పైగా తాము ఇటీవల దీక్షలు చేపట్టింది కూడా విద్యార్ధులపై కేసుల ఎత్తివేత కోసమే తప్ప, మరొకటి కాదన్నారు. గత ఏడాది డిసెంబర్‌ 9న చిదంబరం చేసిన ప్రకటనను, పార్లమెంట్‌లో ఇచ్చిన హమీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందుకే తాము దీక్షలు చేపట్టాల్సి వచ్చిందని వారంటున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు పనిచేయక పోతే తెలంగాణలో పార్టీకి పుట్టగతులు ఉండని పరిస్థితులు వస్తాయని ఒక ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాము ఉద్యమించక పోతే రేపటి రోజు తెలంగాణలో జనం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ఉండదని, తెలంగాణలో కాంగ్రెస్‌ బతికి ఉండాలంటే తాము నడుస్తున్న దారి సరైనదని మరో ఎంపీ వ్యాఖ్యానించారు.

తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తున్నదని ప్రజల్లో భావం ఏర్పడుతున్నదని, అలాంటి పరిస్థితులు రాకుండా తాము ప్రయత్నిస్తున్నామని ఒక ఎంపీ అన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన జగన్‌కు మద్దతుగా నిలుస్తూ, అతని సభలకు జనసమీకరణ చేస్తూ, ఓదార్పు యాత్ర కోసం కార్యాలయాలను నెలకొల్పుతూ, సోనియాకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జగన్‌ మాట్లాడినా అతని వెంటే ఉంటూ అతనికి జై కొట్టడమే కాకుండా, చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్న సబ్బం హరి లాంటి ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీనియర్‌ ఎంపి ఒకరు ప్రశ్నించారు.

వాళ్ళు పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నా అధిష్ఠానం మౌనంగా ఉంటున్నదని, తాము పార్టీని పటిష్టం చేయడానికి దీక్షలు, తెలంగాణకు మధ్దతుగా మాట్లాడితే ఏదో నష్టం జరిగిపోయినట్లు స్పందించిన తీరు బాగులేదని ఆ ఎంిపీ అధిష్ఠానం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల కోసం చూసుకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మరో ఎంపి వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అయినా ఓట్లు వేసే జనం పక్షాన నిలబడక పోతే, వారి సానుభూతి, సహకారం లేక పోతే గెలువగలమా? అధిష్ఠాం గెలిపిస్తుందా? అని ఆ ఎంపి ప్రశ్నించారు. తాము తెలంగాణ ప్రజల అభిష్ఠాల మేరకే వ్యవహరిస్తున్నామని, ఎక్కడ కూడా పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించడం లేదని ఎంపీలు పేర్కొన్నారు. బుధవారం హైకమాండ్‌తో జరిగే భేటిలో ప్రణబ్‌, ఆజాద్‌, మొయిలీలకు తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ ఎంపీలు సిద్ధమవుతున్నారు.

చేతులెత్తేసిన కిరణ్‌, డీఎస్‌
krian-sirr 
శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వివరాల వెల్ల డికి సమయం సమీపిస్తోన్న నేప థ్యంలో తమ పార్టీకి చెందిన పార్ల మెంటు సభ్యులను కట్టడి చేసే బాధ్య తను అధిష్ఠానమే స్వయంగా భుజం మీద వేసుకుంది. అయితే, ఆ అం శంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌ తమ వల్ల కాదంటూ చేతులెత్తేయడ ంతో నేరుగా అధిష్ఠానమే రంగంలో దిగడం అనివార్యమయింది. విశ్వస నీయ సమాచారం ప్రకారం... శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అను కూలంగా రాకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తాను ఎన్నిసార్లు స్వయంగా వెళ్లి నచ్చచెబుతున్నా మాట వినడం లేదని పీసీసీ అధ్యక్షుడు డిఎస్‌ అధిష్ఠానానికి మొరపెట్టుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వైఖరి వల్ల టీఆర్‌ఎస్‌ లాభపడటమే కాకుండా, తెలంగాణవాదం బలపడి అది ప్రత్యక్షంగా శాంతిభద్రతల సమస్యగా మారి, పరోక్షంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తోందని సీఎం కూడాఫిర్యాదు చేశారు. ఇటీవల చేపట్టిన దీక్ష వల్ల సొంత పార్టీ ఎంపీలే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న భావన ప్రజల్లో నెలకొందని సీఎం నాయకత్వానికి వివరించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉండాలన్న తమ మాటను ఎవరూ లెక్కచేయకుండా, తెలంగాణపై గట్టిగా మాట్లాడకపోతే ఎక్కడ వెనుకబడి పోతామోనన్న భయంతో కాంగ్రెస్‌ ఎంపీలు సొంత అజెండాతో వెళ్లి ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారని కిరణ్‌ నాయకత్వానికి వివరించారు.

dss తాను కూడా వారికి ఇటీవలి కాలంలో నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ మాటవినడం లేదన్నారు. దానికితోడు.. వెంకట స్వామి, కేశవరావు, హన్మంతరావు, మధుయాష్కీ, సర్యే సత్యనారా యణ, వివేక్‌ వంటి నాయకులంతా సీనియర్లయినందున తన స్థాయి కూడా సరిపోవడం లేదని, వారికి తాను చెప్పినా వినే పరిస్థితి లేదని కిరణ్‌ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా కేశవరావు మీదే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేకేనే దీనిని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ ప్రభుత్వానికి అందిన నివేదికలను కిరణ్‌ తన వాదనలకు మద్దతుగా పంపించారు. అయితే నిజానికి.. రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం, జగన్‌ తిరుగు బాటు వ్యవహారాన్ని తాను సమర్థవంతంగా అణచివేస్తానన్న భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న కిరణ్‌, తీరా అధిష్ఠానానికి తానిచ్చిన హామీలలోనే వైఫల్యం చెందడ ం ప్రస్తావనార్హం.

వైఎస్‌ మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జగన్‌ వ్యవహారంపై స్పీకర్‌ హోదాలో ఎప్పటికప్పుడు నివేదికలు పంపించడంతో పాటు, అనేకసార్లు స్వయంగా అధిష్ఠానం వద్ద పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చి, ఢిల్లీకి దగ్గర య్యారు. ఆ తర్వాత కీలకమైన ఆ రెండు అంశాలపై నిర్దిష్ట హామీ ఇచ్చి సీఎం పదవి పొందిన కిరణ్‌, ఇప్పుడు తెలంగాణ అంశాన్ని నియంత్రించడం తన వల్ల కాదంటూ చేతులెత్తేడయం చర్చనీయాంశమయింది. జగన్‌ వైపు రెడ్డి వర్గం వెళ్లకుండా ఉండేందుకే మంత్రివర్గంలో ఆ వర్గానికి ఎక్కువ స్థానాలు, కీలక హోదాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన కిరణ్‌, తెలంగాణ అంశంలో తానిచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయి, చివరకు ప్రణబ్‌ను ఆశ్రయించవలసి వచ్చింది.

తాము చెప్పినా వినే పరిస్థితి లేకపోవడం, తన స్థాయి, అనుభవం, వయసుకు మించి నాయకులు ఉండటంతో.. మీరు జోక్యం చేసుకోకుంటేనే జనవరి 6 తర్వాత పరిస్థితులు ప్రభుత్వం చేతులో ఉంటాయని ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పిన తర్వాతే ప్రణబ్‌ ముఖర్జీ రంగప్రవేశం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీ కావాలని తెలంగాణ ఎంపీలందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఆ భేటీకి బహుశా ముఖ్యమంత్రితో పాటు, పీసీసీ అధ్యక్షుడు డీఎస్‌ కూడా హాజరుకావచ్చంటు న్నారు. తాజా పరిస్థితి, పరిణామాలు పరిశీలిస్తే.. రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి చేతులు దాటినట్లు స్పష్టమవుతోంది. వారిద్దరికీ ఎవరూ మాట వినడం లేదన్న వాస్తవం రుజువయిపోయింది.

అంతా ఢిల్లీ స్థాయి నేతలు కావడం, వారికి అధిష్ఠానంలో ఏదో ఒక స్థాయిలో పలుకుబడి ఉండటంతో సీఎం, డీఎస్‌ చేతులెత్తేయవలసి రావడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ ప్రస్తుత తెలంగాణ సీనియర్ల అనుభవం-వయసుతో పోలిస్తే చిన్నవాడు కావడం కూడా ఇబ్బందికలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలోనూ దాదాపు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే భవిష్యత్తులో కూడా సీఎం, పీసీసీ అధ్యక్షుడిని పక్కకుపెట్టి.. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఇక నేరుగా అధిష్ఠానమే చూసేలా ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణులలో ఏర్పడుతోంది.

Saturday, January 1, 2011

అభివృద్ధే .... అందరి ఆకాంక్ష !

telangana ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అభి వృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నారని శ్రీకృష్ణ కమిటీ ప్రక టించింది. అన్ని ప్రాంతాలు. నగరాలు, పట్టణాలు అభివృద్ది బాటలో కొనసాగితేనే మంచిదన్నది మెజారిటీ జనాభిప్రాయమని శ్రీకృష్ణ కమిటీ వెల్లడించింది. శుక్రవారం ఆ కమిటి ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది. రాష్ట్రంలో ప్రజలు కేవలం అభివృద్ధికి మాత్రమే పెద్దపీట వేస్తున్నారని, అణగారిన వర్గాలకు అభయ హస్తం అందించే వారి కోసమే ఎదురు చూస్తున్నారని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తమకు ప్రధానంగా విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలన్న డిమాండ్‌ అధికంగా వినవచ్చిందని వెల్లడించారు.

ఆర్థికంగా పరిపుష్ఠి అయితేనే కుటుంబం, గ్రామం, రాష్ర్టం అన్ని విధాలా ముందుకు వెళతాయని క్షేత్ర స్థాయిలో జరిపిన అధ్యయనంలో వెల్లడయినట్లు పేర్కొన్నారు. కమిటీ సభ్యుడు రణబీర్‌ సింగ్‌ మాట్లాడుతూ రాజ్యాంగం పరిధిలో అభివృద్ధి కాంక్షించడం ప్రజలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు అంటూ వారు మరే విధమైన కోర్కెలు కోరడం లేదనిస్సష్టం చేశారు. మరో సభ్యురాలు రవీందర్‌ కౌర్‌ మాట్లాడుతూ ఇప్పుడు పట్టణాలలో కేవలం మౌలిక వసతులతోనే సరిపెట్టడం సరికాదని, నగరాలకే పరిమితమైన ఆధునిక సౌకర్యాలు పట్టణాలకు కూడా విస్తరించి, సాంకేతికంగా ప్రజలను చైతన్య వంతులుగా చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం కృషి చేయాలని ప్రజలు కోరారని, కమ్యూనికేషన్లు, ఆధునిక విద్య, సాంకేతిక పరిజ్ఞాన బోధన, రవాణ సౌకర్యాలు అందుబాటులోకి రావాలని కోరుతున్నట్లు వెల్లడించారు.

మహిళలు కూడా అభివృద్ధితోనే కొన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారని పేర్కొన్నారు. మైనారిటీలు, క్ట్రిస్టియన్లు, వెనుకబడిన తరగతులు, షెడ్యూలు తెగలు, షెడ్యూల్‌ కులాల వారు తమ సామాజిక అభివృద్ధి ఆకాంక్షిస్తున్నారని మరో సభ్యుడు అబుసలె షరీఫ్‌ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కమిటీ సభ్యులు ఈ అభిప్రాయాలు వ్యక్తం చేసిన ఏ సందర్భంలోనూ వారు తెలంగాణ అని గాని, సమైక్యాంధ్ర అని గాని ఉచ్ఛరించకపోవడం గమనార్హం. మహిళలతో సహా అన్ని వర్గాల ప్రజలు తమ తమ అభివృద్ధినే కాంక్షిస్తున్నట్లు వారు చెప్పారు. రాష్ట్ర మహిళలైతే, తాము అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని, అలాగే తమ బిడ్డలకూ మంచి భవిష్యత్తు కోరుకుంటున్నారని వివరించారు.

కాంగ్రెస్‌ మెడపై తెలంగాణ కత్తి
katti-copy రాష్ట్ర విభజన ఉద్యమంలో విద్యార్ధులపై పెట్టిన కేసుల ఎత్తివేత క్రెడిట్‌ తమకే దక్కాలన్న వ్యూహంతో ముందుకెళ్లిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు కొత్త సమస్య తప్పన్న ట్లు కనిపిస్తోంది. తెలంగాణ ప్రాంతంలో సొంత ప్రాబల్యంకోసం కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన దీక్షా వ్యూహం తిరిగి వారి మెడకే చుట్టుకోనున్నట్లు కనిపి స్తోంది. విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై ప్రదర్శించిన చిత్తశుద్ధినే ప్రత్యేక రాష్ట్ర సాధనలోనూ చూపాలని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలపై ప్రతిపక్షపార్టీలతో పాటు కాంగ్రెస్‌ శ్రేణులు ఒత్తిడి పెంచాలని యోచిస్తున్నాయి. అవసరమైతే తెలం గాణ సాధన కోసం తాము రాజీనామాలకు కూడా సిద్దపడతామని దీక్ష శిబిరంలో కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టంచేశారు. మరోవైపు శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి వ్యాఖ్యనాలకు దిగకూడదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలకు ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటికే హుకుం జారీ చేసింది. ఈ నియంత్రణ రేఖ తెలం గాణ కాంగ్రెస్‌ ఎంపీ, ఎమ్మెల్యే, నేతలకు ఇబ్బందిక రంగా మారనున్నట్లు కనిపిస్తోంది.
నివేదిక ప్రతికూలంగా వస్తే?
విద్యార్ధులపై కేసుల ఎత్తివేత కోసం తెలం గాణ కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగడంతో వారికి క్రెడిట్‌ దక్కింది. అసెంబ్లీ సమావేశాల సంద ర్భంగా అధికార పక్షంతోపాటు ప్రతిపక్షపార్టీలన్నీ కలసినా ఈ కేసులను మాత్రం ఎత్తివేయడానికి ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ అంశంపైనే రెండు రోజుల పాటు అసెంబ్లీలోని ఉభయ సభలో స్థబిం చిపోయాయి. కానీ ఆ తరువాత కేవలం కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగడంతోనే ప్రభుత్వం దిగొచ్చి కేసులను రద్దుచేసింది. ఈ నేపథ్యంలో క్రెడిట్‌ను దక్కించుకోవడంతోపాటు తాము తల్చుకొంటే ప్రత్యేక రాష్ట్రానైనా సాధిస్తామన్న సంకేతం తెలం గాణ కాంగ్రెస్‌ నేతలు ఇచ్చారు. ఈ అంశాన్ని ఆధా రంగా చేసుకొన్ని ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యే, నేతలను ఇరకాటంలోకి నెట్టేందుకు ప్రతిపక్షపార్టీలు సిద్దమ వుతున్నాయి.

కేసుల ఎత్తివేతతో కాంగ్రెస్‌ ఎంపీలపై నమ్మకం పెంచుకొన్న తెలంగాణ కాంగ్రెస్‌ శ్రేణులు సైతం తమ ప్రాంత పార్టీ అగ్రనేతలపై ఒత్తిడి పెంచేందుకు సిద్దమవుతున్నారు. అవసరమైతే ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేయిం చాలని భావిస్తున్నారు. తెలంగాణ సాధన విషయం లో కాంగ్రెస్‌ నేతలపైనే ఈ ప్రాంత ప్రజలు కూడా బాధ్యతను మోపుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణలోని ఇతర పార్టీల కంటే కాంగ్రెస్‌ పార్టీకే ఉద్యమ విషయంలో ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గెలిచి ఓడినట్లు అవుతుందా?
తెలంగాణ సాధన విషయంలో ఈ ప్రాంత కాంగ్రెస్‌ నేతలలో కూడా ఆందోళన నెలకొంది. ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకంగా నివేదిక వస్తే తమ పరిస్థితి ఏమిటీ అని వారిలో మీమాంస మొదలైంది. విద్యార్థులపై కేసుల ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణ యించుకొంది కాబట్టే వాటిని రద్దుచేసింది. కాకపో తే కాంగ్రెస్‌కే ఆ క్రెడిట్‌ దక్కాలన్న ఉద్దేశం తోనే తెలంగాణకు చెందిన ఆ పార్టీ ఎంపీల దీక్షతో వాటిని రద్దుచేశారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వా నికి, తెలంగాణ ఎంపీలకు ఇరువురికి తెలిసిందే. ప్రభు త్వం కేసులను ఎత్తివేయాలని భావించింది కాబట్టే ఈ కేసులు రద్దు అయ్యాయి. కానీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ హైకమాండ్‌ భావిస్తే తెలం గాణ లో ఆ పార్టీ నేతలకు ఇబ్బంది ఉండదు. ఒక వేళ ఇవ్వకూడదని భావిస్తే అధిష్ఠానాన్ని తాము ఏమేర ప్రభావితం చేయగలమన్న ఆందోళన కాంగ్రెస్‌ ఎం పీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతోపాటు నేతలలో మొద లైంది. దీక్షలే కాదు రాజీనామాల అస్త్రం ప్రయోగిం చినా తమ అధిష్ఠానం దిగివస్తుందా అని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు ఆందోళన కలిగిస్తోంది. 
ఇక మధ్యంతరమే !
Sri-Krishరాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు ఖాయం కానున్నాయన్న చర్చలు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. జనవరి 6న ఢిల్లీలో కృష్ణ కమిటీ నివేదిక వివరాలను కేంద్ర హోంమంత్రి చిదంబరం విడుదల చేయనున్న నేపథ్యంలో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న వచ్చన్న అంచనా అన్ని పార్టీలు, వర్గాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తి, ఇతర ప్రాంతాల వారిపై దాడులు జరిగితే దాని ప్రభావం సీమాంధ్రలో చూపే క్రమంలో రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉందన్న అంచనా వ్యక్తమవుతోంది. అప్పుడు రాష్ట్రంలో రాష్ర్టపతిపాలన అనివార్యమవు తుందని రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, టీఆర్‌ఎస్‌ చర్చల్లో కూడా మధ్యంతర ఎన్నికలు వస్తాయన్న భావన అంతర్గతంగా వ్యక్తమవుతోంది.

ఫిబ్రవరిలో శాసనసభా సమావేశాలు జరగనుండటం, అదే సమ యంలో జగన్‌ కూడా పార్టీని స్థాపిస్తుండటంతో అందరి దృష్టి ఫిబ్రవరిపైనే కేంద్రీకృతమయింది. జగన్‌ అప్పటికి పార్టీ పెట్టడం ఖాయమయినందున, ప్రస్తుతం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్న ఆయన వర్గీయులయిన ఎమ్మెల్యేలు జగన్‌ పార్టీలోకి వెళ్లడం ఖాయ మంటున్నారు. సరిగ్గా సమావేశాలు ప్రారంభమయిన రోజు నుంచే కిరణ్‌ సర్కారుకు జగన్‌ షాక్‌ మొదలుకావచ్చని తెలుస్తోంది. జగన్‌కు మద్దతునిచ్చే ఎమ్మెల్యేలంతా సమావేశాల ప్రారంభం నుంచి ముగింపులోగా ఒక్కొక్కరుగా రాజీనామా అస్త్రాలు ప్రయోగించ వచ్చంటున్నారు. దానితో కాంగ్రెస్‌ సర్కారు సంక్షోభంలో పడటం ఖాయమన్న అంచనా వ్యక్తమవుతోంది.

జనవరి 6న వెల్లడయ్యే శ్రీ కృష్ణ కమిటీ నివేదిక అంశాల ప్రభావం అప్పటికి తీవ్రంగా ఉండ వచ్చన్న అంచనా కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణలోఈనెల ప్రారంభం నుంచి మొదలయ్యే ఉద్యమాలు ఫిబ్రవరి నాటికి మరీ ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని పార్టీలలో చర్చ జరుగుతోంది. ఆ పరిణా మాలు అధికార కాంగ్రెస్‌కు మరీ నష్టం కలిగించే అవకాశం ఉంది. ఆ క్రమం లో రాష్ట్రంలో శాంతిభద్రతలు, రాజకీయ సంక్షోభాన్ని నివారించేందుకు, రాష్ట్రం లో నష్టనివారణకు కేంద్రప్రభుత్వం కూడా అనివార్యంగా రాష్టప్రతి పాలన విధిస్తుందని విశ్లేషిస్తున్నారు.

కాగా.. రాష్ట్రంలో రాష్టప్రతిపాలన విధించే అవకా శాలను ప్రజాప్రతినిధులు కూడా త్రోసిపుచ్చడం లేదు. వారు కూడా ఆ మేరకు మానసికంగా సిద్ధంగానే ఉన్నట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలోనే ఇలాంటి భావన కనిపించడం విశేషం. మనం సక్రమంగా పరిపాలించకపోతే మన స్థానంలో మరొకరు వస్తారంటూ ధర్మాన నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు ప్రజాప్రతినిధుల అంతరంగం, ఆందోళనను ఆవిష్కరిస్తోంది.

ఢిల్లీ రాజకీయ వాతావరణపై అవగాహన, అంతర్గత రాజకీయాలపై అనుభవం ఉన్న మంత్రులు కూడా దాదాపు ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారు. కాంగ్రెస్‌ సీనియర్ల అంతరంగ సంభాషణల్లో కూడా ఇదే భావన ధ్వనిస్తోంది. జగన్‌ వల్ల తమ ప్రభుత్వానికి ముప్పు తప్పదన్న భావన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల్లోనూ దాదాపు ఇలాంటి చర్చలే జరుగుతున్నాయి. ఫిబ్రవరి తర్వాత, జనవరి మొదటి వారం నుంచి రాష్ట్రంలో నెలకొనే రాజకీయ పరిస్థితులను ఇప్పటినుంచే ఎలా ఎదుర్కోవాలి? ఆలోగా ఏయే అంశాలతో ప్రజల ముందుకు వెళ్లాలన్న దానిపై అన్ని పార్టీల్లో సీరియస్‌గానే చర్చ జరుగుతోంది. తమకు లాభించే అంశాలతో పాటు ప్రత్యర్థులను ఇరకున పెట్టే వాటిపై కసరత్తు మొదలుపెట్టారు.

ఎన్ని ‘కల’లో ...
kcr-annaగత కొంతకాలం వరకూ తెలంగాణ ఉద్యమాన్ని వేడెక్కిం చిన టీఆర్‌ ఎస్‌ ఇటీవలి కాలం నుంచీ బాణీ మార్చింది. ఉద్యమాల కన్నా ఎన్నికల మాటే ఎక్కువగా వినిపిస్తోంది. తెలంగాణ ఇవ్వకపోతే ఆకాశాన్ని బద్దలు కొడతామని, భూకంపం, ప్రళయం సృష్టిస్తామని గతంలో హెచ్చరికలు జారీ చేసిన కేసీఆర్‌.. వచ్చే పార్లమెంటు,అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం పెట్టాలని గడువు విధించడం పార్టీ వర్గాలకు విస్మయం కలిగిస్తోంది. కేసీఆర్‌ ఇచ్చిన గడువు ఒకరకంగా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఊరట కలిగించడ మేనని, దీనివల్ల తమ పార్టీ కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగ్‌ ఉందన్న ఆరోపణలను నిజం చేసినట్టవుతుందని వాదిస్తు న్నారు.

డిసెంబర్‌ 31 తర్వాత ప్రళయం సృష్టిస్తా మని గతంలో చెప్పిన తమ నాయకుడే మళ్లీ ఇప్పుడుమార్చి వరకూ గడువు ఇవ్వడంపై సొంత పార్టీ సీనియర్లే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జనవరి నుంచి తమ పార్టీ తెలంగాణ కోసం ఉధృతంగా ఉద్యమాలు చేస్తుందని ఒకవైపు ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే, తమ అధ్యక్షుడు మాత్రం ప్రభుత్వానికి పరోక్షంగా గడువు ఇవ్వడంపై వేరే సంకేతాలు వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో కొంతకాలం వరకూ ఉద్యమాల పేరుతో హోరెత్తించిన కేసీఆర్‌.. గత కొద్దిరోజుల నుంచి మధ్యంతర ఎన్నికల గురించి తరచూ మాట్లాడటంపై సీనియర్లు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన, ఉద్యమం గురించి మాట్లాడకుండా కేవలం ఎన్నికల గురించే ప్రస్తావిస్తుండటం, పార్టీ శ్రేణులంతా ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునివ్వడం వల్ల వ్యతిరేక సంకేతాలు వెళతాయన్న ఆందోళన సీనియర్లలో వ్యక్తమవుతోంది.

ఇలాంటి తొందరపాటు తనం వల్ల తమ పార్టీకి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధన కంటే ఎన్నికలే ముఖ్యమన్న భావన ప్రజల్లో నెలకొనే ప్రమాదం ఉందని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక సమర్పణ తర్వాత, తమ పార్టీ కేవలం తెలంగాణ రాష్ట్రం గురించే మాట్లాడటం, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేయాలే తప్ప, ఎన్నికల గురించి మాట్లాడితే తమకు ప్రత్యేక రాష్ట్రంపై కన్నా ఎన్నికల పైనే ఎక్కువ ఆసక్తి ఉందని ప్రజలు అనుమానించే ప్రమాదం ఉందని విశ్లేషిస్తున్నారు.

నిజానికి.. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నికలకు ఏమాత్రం సిద్ధంగా లేరని సీనియర్లు చెబుతున్నారు.తరచూ రాజీనామాలు చేయటం, మళ్లీ పోటీ చేయడం వల్ల ఆర్థికంగా చాలా చితికిపోతున్నామన్న ఆవేదన ఎమ్మెల్యేలలో ఉందని అంగీకరిస్తున్నారు. పట్టుమని ఏడాది కూడా కాకముందే ఎన్నికలకు సిద్ధం కావాలంటే, గత ఎన్నికల్లో చేసిన అప్పులే ఇప్పటికీ తీర్చలేదని కొందరు ఎమ్మెల్యేలు బాహాటంగానే చెబుతున్నారు. తినగ తినగ తీపి కూడా చేదుగా ఉంటుందన్నట్లు ప్రజలు కూడా ఇలాంటి నిర్ణయాలను హర్షించరంటున్నారు.

‘ఇంతవరకూ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక్క కొబ్బరికాయ కొట్టలేదు. సంపాదించుకోవడం దేవుడికెరుక. పాత అప్పులు తీర్చలేక పరేషానవుతున్నా’మని కొందరు ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధుల వద్ద జరిగే అంతరగత సంభాషణల్లో వాపోతున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ ఎన్నికల ప్రస్తావన తీసుకురావడం ద్వారా తమను హడలెత్తిస్తున్నారని, అటు ప్రజల్లో కూడా టీఆర్‌ఎస్‌కు ఎన్నికలే తప్ప తెలంగాణ రాష్ట్ర సాధన ముఖ్యం కాదన్న భావన కల్పిస్తున్నారని ప్రజాప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.
 

Wednesday, December 29, 2010

కాంగ్రెస్సే గెలిచింది !

kk-come
విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలన్న డిమాండ్‌తో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వ్యూహం ఫలించింది. రెండు రోజులుగా ఈ ఎంపీలు చేస్తున్న దీక్ష కార్యక్రమం అందరూ ఊహించినట్లుగానే సుఖాంతమైంది. ఇన్నాళ్ల పాటు మొత్తం కేసుల ఎత్తివేతకు న్యాయ పరమైన చిక్కులను సాకుగా చూపిన ప్రభుత్వమే నేడు వాటిని స్వయంగా తొలగించేందుకు సిద్దమైంది. ఈ కేసుల ఎత్తివేత క్రెడిట్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కాలన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరును పరిశీలిస్తే స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ సైతం అంగీకరిస్తోంది. తెలంగాణలో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకే అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ రకమైన పాచికలు వేసిందని తెలుస్తోంది. తెలంగాణ పేరుపై జరిగే ప్రతి కార్యక్రమంలోనే క్రెడిట్‌తనకే దక్కేలా కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది.

న్యాయపర చిక్కులు ఇప్పుడెలా వీడుతాయి?
రాష్ట్ర విభజన ఉద్యమంలో విద్యార్ధులపై నమోదుచేసిన కేసులను ఎత్తి వేయాలన్న డిమాండ్‌ న్యాయపరమైనది అని అన్ని రాజకీయ పార్టీలు భావిం చాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ఉభయ సభలలో ఈ అంశంపై అన్ని పార్టీలు ముక్త కంఠంతో కేసుల ఎత్తివేతకు డిమాం డ్‌ చేశాయి. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటూ మొత్తం కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. కొన్ని చిన్న చిన్న కేసులు మినహా సీరి యర్‌, వెరి సీరియస్‌ కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం వొక్కానించింది.

ఈ కేసులు ఎత్తివేతకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. ఈ కారణం చేత మొత్తం కేసులను ఎత్తివేయలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం కేసులు ఎత్తివేయాల్సిందేనని ప్రతిపక్షపార్టీలతోపాటు అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులంతా సభలో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై రెండున్నర రోజుల పాటు సభ కూడా స్థంబించింది. ఇంత చేసిన న్యాయపరమైన చిక్కులున్నాయని, మొత్తం కేసుల ఎత్తివేత సాధ్యంకాదని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కానీ ఈ సమావేశాలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగడంతో మొత్తం కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

న్యాయపరమైన సమస్యలను తెరపైకి తీసుకురాకుండానే అన్ని ఎత్తివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వెనక అసలు వ్యూహం ఏమిటో ఇట్టే తెలుస్తోంది. మొత్తం కేసుల ఎత్తివేతకు అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో కోరినా స్పందించని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వాటిపట్ల సానుకూలంగా స్పం దించడం వెనక వ్యూహం దాగివుందని ఇట్టే తెలుస్తోంది. నాడు ప్రభుత్వం ఈ వ్యవహారంలో స్పందించివుంటే అధికార కాంగ్రెస్‌కే కాకుండా క్రెడిట్‌ ప్రతి పక్షపార్టీలకు దక్కేది. ఈ కారణం చేతను అసెంబ్లీ సమావేశాలలో స్పందిం చకుండా సాగదీసి కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షలు చేశాక స్పందించడం క్రెడిట్‌ కోస మేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు ఎత్తివేస్తున్నప్పుడు క్రెడిట్‌ తమకు దక్కకపోతే ఎలా అని ఓ కాంగ్రెస్‌నేత వ్యాఖ్యనించడం గమనార్హం.

సొంత అజెండాతోనే?
తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలతో కలసి ఒకే అజెండాతో ముందుకెళ్తామని మొన్నటి వరకు చెప్పిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక అజెండాతో కదనరంగంలోకి దూకుతున్నారు. విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై స్వతంత్రంగానే దీక్షలోకి దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం భవిష్యత్తులోకూడా ఇదే ధోరణీతో వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ కేసులను మేమే ఎత్తివేయించామని చెప్పుకోవడంతోపాటు తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే అని చెప్పుకోనే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది, తెచ్చేది తాము అని చెప్పినందున ఈ విషయంలో తమపై బాధ్య మరింత పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారం ద్వారా తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్రను పోషించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం సిద్దమవుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌కు చెక్‌పెట్టి క్రెడిట్‌ను దక్కించుకొనే యత్నం సాగిస్తోంది. 

కాంగ్రెస్‌ ఎంపీల దీక్ష రాజకీయ డ్రామా : ఎర్రబెల్లి కేసులు ఎత్తివేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష అంతా రాజకీయ డ్రామా అని టీడీపీ నేత ఎర్రబెల్లి ఎద్దేవ చేశారు. కాంగ్రెస్‌తో కేసీఆర్‌ సైతం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని ఆయన విమర్శించారు. అక్రమ కేసులు పెట్టింది వాళ్లే, ఎత్తేసింది వాళ్లే... దీంట్లో కొత్త ఏముందని ప్రశ్నించారు. అసెంబ్లీని ఏడు రోజులు స్థంభింపజేశాం... పార్లమెంటును ఏనాడైనా స్థంభింపజేశారా? అని కాంగ్రెస్‌ ఎంపీలను ఆయన నిలదీశారు. చిత్తశుద్ది ఉంటే ఆమరణ దీక్ష చేయండని సవాల్‌ విసిరారు.

Friday, December 17, 2010

ఆకాశం బద్దలుకొట్టయినా... తెలంగాణ సాధిస్తాం

గర్జించిన తెలంగాణ * ధక్కా పక్కాగా కొట్టాలె .. తెలంగాణ తేవాలె
భూకంపం పుట్టించైనా.. ఆకాశం బద్దలుకొట్టైనా తెలంగాణ సాధిద్దాం
రాజకీయ సంక్షోం సృష్టిద్దామంటే కాంగ్రెస్, టీడీపీలు నాటకాలాడాయి
ఆంధ్రా సీఎంలను చూస్తే వారికి లాగులు తడుస్తాయి
బ్రేకులు బద్దలు కొట్టేదే వరంగల్ సభ
కేసీఆర్ వ్యాఖ్యలు
బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలి
మహాగర్జన సభ తీర్మానం
 రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహాగర్జన సభ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఈ సభలో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు.. గతేడాది డిసెంబర్‌లో ప్రకటన చేసినట్లుగా తెలంగాణ ఇవ్వకపోతే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మలివిడత ఉద్యమాన్ని వచ్చే జనవరి నుంచి గాంధేయ మార్గంలో సత్యాగ్రహంతో మొదలుపెడతామన్నారు.

కేంద్రం దిగిరాకపోతే అది పెను ఆగ్రహంగా, మహోగ్రంగా మారుతుందని ప్రకటించారు. ఇందుకు వరంగల్ గర్జన సభే సంకేతమన్నారు. తెలంగాణకు బ్రేకులు బద్దలు కొట్టేదే వరంగల్ సభని చెప్పారు. వరంగల్ నగరంలోని ప్రకాశ్‌రెరెడ్డిపేటలో గురువారం జరిగిన మహాగర్జనలో కేసీఆర్ మరోసారి కేంద్ర, రాష్ట్ర పాలకులపై తీవ్రస్థాయిలో గర్జించారు. సభకు విచ్చేసిన జనసంద్రాన్ని చూసైనా యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టడానికి వెనుకాడవద్దన్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకోకుంటే వారి ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందన్నారు. గత పదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఘనత ప్రజలదేనని కేసీఆర్ ఉద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణలోని ఊర్లన్నీ ఉద్యమాలుగా మారాయని, విద్యాసంస్థలు యుద్ధ భూములయ్యాయని చెప్పారు.

దీంతో దిగివచ్చిన ఢిల్లీ.. తెలంగాణ ఇస్తానని ప్రకటించిందని అన్నారు. తెలంగాణ రాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డంకులు సృష్టించారని కేసీఆర్ మండిపడ్డారు.ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణను ఒక్కటి చేయడానికి 54ఏళ్లు పడితే, దీన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు గంటలో ఒకటయ్యారని అన్నారు. చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి.. ఆంధ్రా జీవులు ఒక్కటై డబ్బులిచ్చి ఆందోళనలు చేయించారని ఆరోపించారు.

వాళ్లు దద్దమ్మలే

కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. జేఏసీలో చేరిన కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు.. తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి, తర్వాత వెనక్కి తగ్గితే దద్దమ్మలు అనక ఏమనాలి? అని ప్రశ్నించారు. "వీరిలో కనీసం 25 మంది రాజీనామా చేసినా ఈ పాటికి ప్రత్యేక తెలంగాణ వచ్చేది. వెన్నెముకలేని, ఈ దద్దమ్మల వల్లనే రాకుండా పోయింది.

1956లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ఊడగొట్టింది ఈ కాంగ్రెస్ దద్దమ్మలే. ఇప్పుడు ఉద్యమాన్ని పోగొట్టిందీ వీరే. ఆంధ్రా సీఎంలను చూస్తే వీరికి లాగులు తడుస్తాయి'' అని కేసీఆర్ ధ్వజమెత్తారు. "హైదరాబాద్‌ను ఫ్రీజోన్ అంటే పట్టించుకోరు. ఆంధ్ర ప్రాంతంలో అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే గుడ్లప్పగించి చూస్తారు. విద్యార్థులపై కేసులు పెడితే పట్టించుకోరు'' అని మండిపడ్డారు.

కేసులు ఎత్తివేయమని తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుబడితే వారినే బయటకు ఎత్తేశారని చెప్పారు. "ఆంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి హైకమాండ్‌ను ధిక్కరించి ఇటు కాంగ్రెస్‌లో ఉంటూనే అటు జగన్ వెంట నడుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి భయపడుతున్నారు. వారికిలేని హైకమాండ్ వీరికెందుకు?'' అని కేసీఆర్ నిలదీశారు.

గవర్నర్‌కు అంత వెటకారం తగదు
శ్రీకృష్ణకమిటీ నివేదిక నేపథ్యంగా డిసెంబర్ 31 తర్వాత ఏం జరుగుతుందంటే 'జనవరి 1 వస్తుంది' అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అపహాస్యం చేయడాన్ని కేసీఆర్ ఖండించారు. వెటకారంగా మాట్లాడటం గవర్నర్ హోదాకు తగదన్నారు. మరోవైపు డీజీపీ అరవిందరావు డిసెంబర్ 31 తర్వాత అదనపు బలగాలు వస్తున్నాయని ప్రకటిస్తున్నారని చెప్పారు.

నిజానికి రావలసింది అదనపు బలగాలు కాదు తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను ఇట్లాంటి సభల ద్వారా వ్యక్తం చేసినప్పుడు ఢిల్లీ పెద్దలకు వాస్తవిక నివేదికలు ఫోటోలతో సహా పంపితే తప్పనిసరిగా తెలంగాణ వస్తుందని చెప్పారు. అటువంటి ప్రయత్నాలు వదలిపెట్టి, లాఠీలకు, తూటాలకు డీజీపీ పని చెప్పారని అన్నారు. తూటాలకు, లాఠీలకు భయపడే స్థితిలో కేసీఆర్‌గానీ, తెలంగాణ ప్రజలు గానీ లేరని స్పష్టం చేశారు.

వాళ్లు బిచ్చగాళ్లు
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తేకుండా మంత్రి పదవుల కోసం చిప్పలు పట్టుకొని బిచ్చగాళ్లలా తిరుగుతున్నారని చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చే విషయంలో ఈ ప్రాంత ప్రజల ఓపికను, సహనాన్ని ప్రధాని ఇంకా పరీక్షించవద్దన్నారు.

"జరుగుతున్న పరిణామాలను చూసి తెలంగాణ వాదులు కూడా గాలిగాబరా కాకుండా ఔరేక్ ధక్కాను పక్కాగా కొట్టాలే. తెలంగాణ తెచ్చుకోవాలె'' అని పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గర్జన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేయడం ద్వారా కేంద్రానికి కేసీఆర్ మార్చి వరకూ గడువు ఇచ్చినట్లయింది. అంటే.. డిసెంబర్ 31 తర్వాత అనూహ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సభ విజయవంతం
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తున్న తరుణంలో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో ఓరుగల్లు వేదికగా టీఆర్ఎస్ బల ప్రదర్శన చేసింది. టీఆర్ఎస్ 2003లో ఇక్కడ పెద్ద ఎత్తున సభ జరిపింది. 2004 ఎన్నికలకు ముందు రాజకీయంగా తన సత్తా చాటింది. అనంతరమే టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వచ్చింది.

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు లేనప్పటికీ 2జీ స్పెక్ట్రం కుంభకోణంతో యూపీఏ సర్కారు సతమతమవుతుండడం.. రాష్ట్రంలో జగన్ రగడ వ్యవహారం.. వెరసి మధ్యంతర ఎన్నికలు తప్పవనే ప్రచారం మధ్య టీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్ తెలంగాణ మహాగర్జన సభ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మహాగర్జన సభలోనూ గాంధీ మార్గంవైపే కేసీఆర్ మొగ్గు చూపారు.

అంతే కాకుండా పార్టీ తరపున ప్రత్యేకంగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించలేదు. ఈ సభకు ఆహ్వానించిన ప్రజా సంఘాలు భాగస్వాములుగా ఉన్న తెలంగాణ జేఏసీ.. ఇకపై చేపట్టబోయే ఉద్యమాన్ని నిర్దేశిస్తుందని చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇటీవలి కాలంలో వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ద్వంద్వ విధనాలు అవలంభిస్తున్నారంటూ నిప్పులు చెరిగిన కేసీఆర్.. వరంగల్ సభలో మాత్రం చంద్రబాబు ప్రస్తావన ఎక్కువగా తీసుకురాలేదు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలపై చవటలు, దద్దమ్మలు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘హోరు’ గల్లు గర్జన
వరంగల్‌ శ్రీకాంతాచారి ప్రాంగణంలో గురువారం జరిగిన మహాగర్జనలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు దాదాపు అరగంట సేపు మాట్లాడారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది... దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగనంతటి అతిపెద్ద సభ ఇది. ఒక సభకు ఇంతమంది జనం రావడాన్ని తన జీవితంలోనే చూడలేదని, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సభ అని స్వామి అగ్నివేశ్‌ చెప్పారు. ఈ జనాన్ని చూస్తే సమ్మక్క -సారలక్క శౌర్యమా, వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి సాహసమా అనిపిస్తోంది. ఇంటికొకరు రావాలని నేనిచ్చిన పిలుపునకు స్పందించి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీకందరికీ నా అభివందనాలు.

wgl
ఇక ఉద్యమం విషయానికి వస్తే 2001 జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ రోజులు ఎలాంటివంటే... హైదరా బాద్‌లో బస్సెక్కితే ఇంటికి చేరేలోగా మనిషి మాయమైపోతున్న రోజులు. అలాంటి పాలకుల పాలన కాలంలో ఈ ఉద్యమం పుట్టింది. కేవలం పిడికెడు మందితో ఈ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ పది సంవత్సరాల కాలంలో ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను, అటంకాల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొంది. ఉద్యమాన్ని అడ్డుకోడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.

కానీ ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, అడ్డుకున్నా కేసీఆర్‌ భయపడలేదు. వెనకడుగు వేయలేదు. మందుకు సాగాడు. ఇది నా గొప్ప కాదు. ఇదంతా మీ ఘనత. నేను నిరాహార దీక్ష చేస్తే మా వాళ్లు - ‘అన్నా! మాకు నీ ప్రాణాలు ముఖ్యం. జాగ్రత్తన్నా’ అని ఆప్యాయంగా భుజం తట్టారు. వద్దని వారించారు. కానీ నేనాడు చెప్పాను...తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ చచ్చుడో అన్నాను.
కిందటి ఏడాది నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 23 వరకు జరిగిందంతా చాలా కీలకం. తెలంగాణపై ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు గురించి పరిశీలిస్తామని పార్లమెంటులో ప్రకటించింది. కేంద్రహోంమంత్రి చిదంబరం తెలంగాణ గురించి ప్రకటన చేశారు. 54 ఏళ్ల తెలంగాణ పోరాట చరిత్రలో ఆ ప్రకటన ముఖ్యమైంది. నిరాహార దీక్షతో సాధించిన విజయమది.

wgl-sabaతెలంగాణా వాళ్లను, నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ వాళ్లను ఒక్కటిగా చేయడానికి ఇక్కడ 54 ఏళ్లు పట్టింది. అదే ఆంధ్రా నాయకులు షేక్‌హ్యాండు లిచ్చుకొని గంటలో ఒక్కటయ్యారు. చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి, ఆంధ్రా జీవులందరూ డబ్బు సంచులతో వచ్చి ఒక్కటై పోయారు. ఆంధ్ర నాయకులు ఒక్కటై పోయినా, ఆంధ్ర ఉద్యమానికి ఒక్క పాట లేదు. తెలంగాణ ఉద్యమానికి ఎన్ని పాటలొచ్చాయో అందరికీ తెలుసు. కానీ ఆంధ్రావాళ్ల ఉద్యమానికి పాటలేక, సినిమాపాటలేసుకున్నారు. ఇప్పుడు ఈ వరం గల్‌ సభతో తెలంగాణ ఉద్యమానికి ఒక బ్రేక్‌ వచ్చింది.

నిరాహార దీక్ష వల్ల కిందటి సంవత్సరం డిసెంబర్‌ 23 వరకు నా ఆరోగ్యం కుదుట పడలేదు. అయినా సరే అం దరం రాజీనామాలు చేద్దామనుకొని కాంగ్రెస్‌ నాయకుల చేత కూడా చేయిద్దామని వాళ్ల దగ్గరికి వెళ్లాం. కాంగ్రెస్‌ నాయకులకు తెలంగాణ అవసరం గురించి చెప్పాం. టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలం రాజీనామాలు చేశామన్నాం. రాజ కీయ సంక్షోభం పుట్టించాం.

kcr-vijaya తెలంగాణకోసం పదవులకు రాజీనామాలు చేయమన్నాం. మొదట 25 మంది రాజీనామా చేస్తామన్నారు. కానీ 12 మందే రాజీనామా చేశారు. రాజీనామా చేయని కాంగ్రెస్‌ చవట దద్దమ్మల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. 1956లో విడిగా ఉన్న తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే శారు. ఆనాడు ఈ చవట దద్దమ్మలే ఊడగొట్టిండ్రు. ఇప్పుడు తెచ్చుకున్నదాన్ని పొగొట్టారు. ఇది సభ కాదు, సముద్రం. తెలంగాణ కోసం ఇప్పుడు ఊళ్లన్నీ ఉద్యమ వేదికలయ్యాయి. ప్రతి ఊళ్లో తెలంగాణ రావడానికి ఉద్యమిస్తున్నారు.

ఊళ్లో వాళ్లందరూ కథానాయకులవుతున్నారు. వారంతా కలిసి తుపాను తెస్తే తప్ప కాంగ్రెస్‌ వాళ్లు మాట్లాడరు.తెలంగాణకోసం ఉద్యమం చేస్తే విద్యార్థులపై కేసులు పెట్టిండ్రు. ఒకటా, రెండా....ఒక్కొక్క విద్యార్థి మీదా 100 -150 కేసులు పెట్టారు. కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెడితే గుద్దులు గుద్ది బయటికి నెట్టేశారు. తెలంగాణ వాళ్లు ఏకం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అదే కాంగ్రెస్‌ వాళ్లంతా గంటలో ఏకమయ్యారు. అసలు, ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకులకు లేని హైకమాండ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు ఉంటుందా?

olddతెలంగాణ గురించి రాష్ట్ర గవర్నర్‌ వెటకారం చేస్తూ మాట్లాడారు. డిసెంబర్‌ 31న ఏం కాదు. 31 తర్వాత జనవరి 1 వస్తుంది అని గవర్నర్‌ ఎగతాళి చేశా రు. ఆయన మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఈ సభపై, తెలంగాణ ఉద్యమంపై ప్రయోగించడానికి అదనపు పారామిలిటరీ దళాల్ని తెప్పిస్తామన్నారు. ఈ సభకు ఎంత భారీగా జనంవచ్చారో ఢిల్లీకి రిపోర్టిచ్చి తెలంగాణ తేవాలి కానీ, అదనపు బలగాలు ఎందుకు? తూటాలకు, తుపాకులకు, లాఠీలకు భయపడేవారు ఇక్కడ లేరు. ఈ సభను, ఇంత బ్రహ్మాండంగా జరిగిన సభను చూసైనా కాంగ్రెస్‌ నాయకులు రాజీనామాలు చేస్తారా? చేయరు. మంత్రి పదవులకోసం బిచ్చగాళ్లలా తిరుగుతున్నారు.

danoraమా సహనానికీ ఒక హద్దుంది. లిమిట్‌ ఉంది. దాన్ని దాటనివ్వద్దు. దాటితే బాగుండదు. తెలంగాణాలో అన్ని సంఘాలవారూ ఈ సమావేశానికి హాజర య్యారు. అన్ని సంఘాలూ వేదికమీద ఉన్నాయి. తెలంగాణకోసం పిడికిలెత్తి ఉన్నారు. వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి. పార్లమెంటులో తెలంగాణ బిల్లు తెచ్చేవరకూ ముందుకే వెళ్లాలి. మొండిగా ఉండాలి. భయపడొద్దు. నామీద ఎన్ని చేశారు? ఎంతగా బెదిరించారు. ఎంతగా భయపెట్టారు? అడ్డుకున్నారు? అయినా నేను భయపడ్డానా? రాజీపడ్డానా? అట్ల ఉండబట్టే ఉద్యమాన్ని నడిపాం. ఉద్యమాన్ని కాపాడుకున్నాం. కీలెరిగి వాత బెట్టాలె. డక్క కొడితే పక్కాగా కొట్టాలి.

పోరుఘల్లు.. !
crowdd

'గులాబీల హోరు'గల్లు
జనసంద్రమైన మహాగర్జన

లక్షలాదిమంది హాజరు

కిక్కిరిసిన వెయ్యి ఎకరాల ప్రాంగణం
సగం మంది రోడ్లమీదే
20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
వరంగల్ నగరం జనసంద్రమైంది. తెలంగాణ మహా గర్జనకు తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలతో హోరెత్తిపోయింది. టీఆర్ఎస్ నేతలు, తెలంగాణవాదులతో లాడ్జీలు, హోటళ్లు కిటకిటలాడాయి. అర్ధరాత్రి వరకు నగరంలో సందడి కనిపించింది. మహాగర్జన బ్యానర్లు, నేతల కటౌట్లతో ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ జంక్షన్, కాళోజీ జంక్షన్, అమరవీరుల స్థూపం జంక్షన్, ఫాతిమానగర్ జంక్షన్‌లు గులాబీమయమయ్యాయి.

మహాగర్జన ప్రాంగణం జనంతో పోటెత్తింది. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. కళాకారుల ఆట, పాటతో కదం తొక్కింది. ట్రాఫిక్ రద్దీ కారణం ఆ సభాస్థలికి చేరుకోలేక సగంమంది రోడ్లపైనే నిలిచిపోయారు. జిల్లా నలుదిక్కుల నుంచి డప్పు చప్పుళ్లు, ర్యాలీలు, ఊరేగింపులతో వస్తున్న జనంతో నగరం కిక్కిరిసిపోయింది. ప్రధాన రహదారులన్నీ జన ప్రవాహాలయ్యాయి. ఎటుచూసినా జనమే.

మధ్యాహ్నం 12 గంటల నుంచే జనం చేరుకోవడం ప్రారంభమైంది. సుమారు వెయ్యి ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన గర్జన సభా ప్రాంగణం నిండిపోయింది. ఒకపక్క సభ జరుగుతున్నా జనం ఇంకా వస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా హైదరాబాద్-వరంగల్, వరంగల్- ఖమ్మం, వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారులపై వాహనాలన్నీ 20 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయాయి.

దీంతో, ప్రజలు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు. గర్జన సభకు దాదాపు 25 లక్షలమంది హాజరయ్యారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కళాకారుల పాటలు సభికులను ఊపేశాయి. ఉద్వేగానికి లోనుచేశాయి. సభ వరకు వెళ్లినా అక్కడ నిలబడేందుకు స్థలం లేకపోవడంతో వేలాదిగా వెనుదిరిగారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం
మహా గర్జన సభలో ఓ యువకుడు నిప్పంటించుకొని జనంలోంచి పరుగులు తీసిన దృశ్యం కలకలం సృష్టించింది. కేసీఆర్ ప్రసంగం ప్రారంభం కావడానికి కొద్దిసేపటికి ముందు.. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం మదనగిరిగూడెం గ్రామానికి చెందిన నందిగామ అంజయ్య (30) తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని జనం వైపు పరుగులు తీశాడు. చుట్టుపక్కలవారు దుప్పట్లు కప్పి మంటలను చల్లార్చారు. ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి ఆవేదన చెంది తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అంజయ్య చెబుతున్నాడు.
click here
వరంగల్‌ మహా గర్జన ముగిసింది. ఓరుగల్లు జనంతో హోరు మంది. 
తెలంగాణ కళాకారుల ఆట పాటతో ఘల్లు ఘల్లు మంది. మొత్తంగా హోరుఘల్లే అయింది. లక్షలాది తెలంగాణ అభిమానులతో వరంగల్లు పట్టణం కిటకిటలాడింది. వరంగల్లు నుంచి హైదరాబాదు, కరీంనగర్‌ వెళ్లే రోడ్లు, వరంగల్లు-కరీంనగర్‌ రోడ్డు, ఖమ్మం రోడ్డు 15 కిమీ మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. డిసెంబరు 31 లోగా శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో కేసీఆర్‌ తెలంగాణా శ్రేణులను సమాయత్తపరిచే వ్యూహంలో భాగంగా ఈ భారీ బహిరంగ సభకు రూపకల్పన చేశారు.

ఆ వ్యూహంలో కేసీఆర్‌ సఫలీకృతులయ్యారు. భారీగా హాజరైన జన సందోహం నుంచి అంతే భారీ స్దాయిలో స్పందనను ఆయన రాబట్టగలిగారు. స్వామి అగ్నివేష్‌ ఈ సభకు ఒక ప్రత్యేక ఆకర్షణ కాగా కేసీఆర్‌ కుమార్తె కవిత వేదిక మీద ప్రత్యక్షం కావడం మరో విశేషం. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణా బిల్లు పెట్టాల్సిందిగా కోరుతూ ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా కేంద్రానికి తుది అల్టిమేటం ఇచ్చారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వచ్చీరాగానే..దాని రూపు రేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా ఉద్యమ బాటలో ఎటు ఎలా నడవాలో పాలుపోని స్ధితిలో పడకుండా కొంత సమయం తీసుకుని నింపాదిగా ఆలోచించుకునేందుకు కేసీఆర్‌కు, ఆయన పార్టీకి ఈ తీర్మానం వెసులుబాటు కల్పిస్తుంది.

telagnaaf కేసీఆర్‌ ఈ కీలక తరుణంలో ఉద్వేగపూరిత ఉద్యమ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణా వాదులు భావించారు. ఒక వంక డిసెంబరు 31 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని అందరూ భావిస్తున్న తరుణంలో కేసీఆర్‌ అలాంటి ఉద్వేగభరిత వ్యూహాలకు పోకుండా తెలంగాణా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి అందరికీ ఊరట నిచ్చారు. అలాగని నివేదిక ఎలా ఉన్నా ఆయన కిమ్మని ఊరుకుంటారని అనుకోనక్కర్లేదు. నివేదిక తెలంగాణాకు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఉద్యమాన్ని ఉధృతం చేసే సదవకాశం ఆయనకు ఎప్పుడూ ఉంది.

అందుకే జేఏసీ నాయకుడు కోదండరామ్‌ కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తారని కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. తెలంగాణా కాంగ్రెస్‌ వాదులను, తెలుగుదేశం తెలంగాణా నేతలను తెలంగాణా ద్రోహులుగా జనంలో మరింతగా పాతుకుపోయేలా చేసే ప్రయత్నాన్ని అటు కేసీఆర్‌, ఇటు జయ శంకర్‌ తమ ప్రసంగాల ద్వారా చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం కన్నా తెలంగాణా కాంగ్రెస్‌ వాదుల మీద, తెలంగాణా తెలుగుదేశం నేతలపైనే వారు వాగ్బాణాలు సంధించారు. కేసీఆర్‌ అటు గవర్నరుని, ఇటు డీజీపీని కూడా వదల్లేదు. చంద్రబాబు రాజకీయాన్ని నిశితంగా విమర్శించారు. కేసీఆర్‌ ప్రసంగంలో సహజంగా ఉండే వాడి, వేడి, వ్యంగ్యం, చమత్కారం ఈసారి కొద్దిగా లోపించాయి.

దేశపతి శ్రీనివాస్‌ పాటలు మధ్యలో రసరంజకంగా ప్రేక్షకులను అలరించాయి. జై బోలో తెలంగాణా సినిమాకు కేసీఆర్‌ ఒక పాట రాశారన్న విషయం దేశపతి ద్వారా జనానికి తెలిసింది. ఆ పాటను కూడా ఆయన పాడి వినిపించారు. వేదిక మీద కేసీఆర్‌ పక్కనే విజయశాంతికి చోటు దొరికినా, మాట్లాడేందుకు ఆమెకు అవకాశం లభించలేదు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రసంగంతో మొదలైన మహా గర్జన రెండున్నర గంటల పాటు సాగింది. ఉదయం నుంచే ఆ ప్రాంతమంతా తెలంగాణా ఆటపాటలతో హోరెత్తింది. ప్రసంగాలు కొనసాగినంతసేపు జనం తెలంగాణా కేరింతలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

శ్రీకాకుళంలో పుట్టినా .. తెలంగాణకు మద్దతు ఇస్తున్నా
wgl-ssnమహాగర్జనకు ఆకర్షణగా నిలిచిన ప్రపంచ ఆర్య సమాజ్‌ వాది, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌ ప్రసంగం కూడా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ఆలోచింపజేసే విధంగా సాగింది. తానుపుట్టింది శ్రీకా కుళం అని, అయినా న్యాయమైన డిమాండ్‌ కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డానని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు చీకటి రాత్రులు అంతమయ్యే రోజు లు దగ్గరపడ్డాయని, విజయానికి చేరువగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపి అధినేతలపై దుమ్మెత్తిపోయడమే కాకుండా, అవినీతి అంతమయ్యేలా తెలంగాణ ఏర్పడిన వెంటనే లోకాయుక్తను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. చాకలివాడి గాడిద కథను ఉదహరిస్తూ ద్వంద విధానాలను అవలంభిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ ప్రజలది.. న్యాయ పోరాటం
సీమాంద్రుడినైనా న్యాయం పక్షాన నిలిచా..

శ్రీకృష్ణ నివేదికతో సంబంధం లేదు..
స్వామి అగ్నివేశ్ ఉద్ఘాటన
 యాభై ఏళ్లుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలది న్యాయమైన పోరాటమని ప్రపంచ ఆర్యసమాజం అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ స్పష్టం చేశారు. తాను న్యాయం వైపు నిలిచి పోరాడతానని చెప్పారు. గురువారం వరంగల్‌లో టీఆర్ఎస్ మహాగర్జనకు హాజరయ్యేందుకు ఆయన జేఎన్ స్టేడియంలో హెలికాప్టర్‌లో దిగారు.

అక్కడే విలేకరులతోనూ, తరువాత బహిరంగసభలోనూ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు గత ఏడాది డిసెంబర్ 9నే జరిగిపోయిందన్నారు. ప్రకటించిన తెలంగాణను పరిరక్షించుకోవడమే తక్షణ కర్తవ్యమని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ మహాగర్జన ద్వారా 25 లక్షల మంది గొంతెత్తి ఢిల్లీకి చాటేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ మావోయిస్టులు చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వడం సరైంది కాదని చెప్పారు.

తాను మావోయిస్టులతో మాట్లాడానని, ప్రభుత్వ వైఖరి వల్లే తుపాకులు పట్టామని చెప్పారన్నారు. గిరిజనులను ఇబ్బందులు పెట్టకుండా, వారి హక్కులకు భంగం కలిగించకుండా అటవీ ప్రాంతాలను ప్రభుత్వం కాపాడితే సమస్య ఉండదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గనులు, మద్యం మాఫియాల భయముండదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక న్యాయమైన డిమాండ్ అని.. అందుకే తాను సీమాంధ్రుడినైనా న్యాయం పక్షాన నిలిచానని వెల్లడించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేదని, తెలంగాణ సాధనే లక్ష్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల నీతి చెల్లబోదన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అర్ధరాత్రి పెట్టుబడిదారులు రంగంలోకి దిగి తెలంగాణ ప్రజల కలలను కల్లలు చేశారన్నారు. ఇందులో బాబు ముఖ్య పాత్ర పోషించారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మైనింగ్, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందని, ఈ శక్తులకు తెలంగాణలో చోటివ్వకూడదని సూచించారు. కేంద్ర పాలన పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలు బిచ్చగాళ్లు: జయశంకర్

తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే వెనక్కు తగ్గిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల కోసం బిచ్చగాళ్లయ్యారని ప్రొఫెసర్ జయశంకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే మీరే రాజ్యమేలవచ్చని కాంగ్రెస్ నేతలకు ఎంత చెప్పినా పదవులపై వ్యామోహంతో ఉద్యమానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. పాలకులుగా ఉండమంటే బానిసలుగా ఉంటామంటున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ టీడీపీ నేతలు కూడా బిచ్చగాళ్లే అయ్యారన్నారు.

వారు బతికున్న శవాలే: కోదండరాం
డిసెంబర్ తర్వాత చేపట్టే ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు కలిసి రాకుంటే బతికున్న శవాలుగానే ప్రజలు పరిగణిస్తారని ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీతో సంబంధం లేదని, జనవరి తొలి వారంలో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

కురుక్షేత్రం తప్పదు : పిడమర్తి రవి
డిసెంబర్ 31లోగా తెలంగాణ ప్రకటించకుంటే ఇప్పటి వరకు అనుసరిస్తున్న గాంధీ మార్గాన్ని వీడి, గాడ్సే మార్గాన్ని ఎంచుకుంటామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి స్పష్టం చేశారు. కేసీఆర్‌ది ప్రజాస్వామిక రాజకీయ పోరాటమైతే, విద్యార్థులు రాళ్లతో పోరాడతారన్నారు.

తెలంగాణ బాటలోనే ముస్లింలు: మైనార్టీ నేతలు
ముస్లింలు తెలంగాణకు వ్యతిరేకమని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమ బాటలోనే ముస్లింలు సాగుతారని మైనార్టీ నాయకులు మొహసీన్‌ఖాన్, మహబూబ్ అలం ఖాన్, మౌలానా యూసుఫ్ జాహీద్ స్పష్టం చేశారు.

సహాయ నిరాకరణ : స్వామిగౌడ్

తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయకుంటే డిసెంబర్ తర్వాత తెలంగాణలోని 2.5 లక్షల ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్ హెచ్చరించారు. ఇందుకు ఉద్యోగులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
click here యాచకుల్లా వ్యవహరిస్తున్న తెలంగాణ మంత్రులు
personపదవుల కోసం ప్రాకులాడకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై శాసకులుగా బ్రతకాలని తెలంగాణ ప్రాంత మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌లో నిర్వహించిన మహాగర్జన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత ఆంధ్ర కాంగ్రెస్‌, టిడిపి పార్టీ నాయకుల లాబియింగ్‌ వల్ల ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనకకు తీసుకొని శ్రీకృష్ణ కమిటీ వేసింది. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్‌, టిడిపి ప్రజా ప్రతినిధులు అధిష్టానం దగ్గర మంత్రి పదవుల కోసం యాచించకుండా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పర్చుకొని శాసకులుగా బ్రతకాలని పేర్కొన్నారు.

జనవరి నుంచి సహాయ నిరాకరణ
Kodandaramతెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని గాంధేయ మార్గం ద్వారా సాధించుకుంటామని తెలంగాణ జేఏసీ నాయకులు ప్రోఫెసర్‌ కోదండరాం అన్నారు. గురువారం వరంగల్‌ జిల్లా ప్రకాష్‌రెడ్డి పేటలో మహాగర్జన సభ జరిగింది. అందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలకుల నుండి గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చారని ఆయన గుర్తు చేశారు. డిసెంబర్‌ 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోతే జనవరి 1 నుండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ మార్గం ద్వారా చేపడుతామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళికలను అన్ని పార్టీల నాయకులు, విద్యార్థులు, ఉద్యమకారులతో ప్రణాళికలను రూపొదిందిస్తున్నామన్నారు.

పెన్‌డౌన్‌ సమ్మెకు సమ్మెకు ఉద్యోగులు సిద్ధం
మహాగర్జన సభతో కేంద్ర ప్రభుత్వం సత్వరమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని లేనిచో తెలంగాణాలోని రెండు లక్షల 50వేల మంది ఉద్యోగులందరు పెన్‌డౌన్‌ చేయడానికి సిద్ధమేనని తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ స్వామి గౌడ్‌ అన్నారు. సభలో స్వామి గౌడ్‌ హాజరైనారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ విముక్తి కోసం కెసిఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడంతో కేంద్రం దిగివచ్చి గత డిసెంబర్‌ 9న అనుకల ప్రకటన చేయడంతో తెలంగాణ ప్రజల్లో అమృతం కురిసిందని, అమృతం కొద్దిరోజులకే విషం చిమ్మిందని సీమాంధ్రులు కుట్రలను ప్రస్తావిస్తూ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

Thursday, December 16, 2010

సంక్షోభం ముందంజ, విభజన వెనుకంజ? * 'నల్లారి' నడక కాదు! * గురివింద సుభాషితాలు

దటీజ్ హైకమాండ్!

రాష్ట్ర ప్రజానీకాన్ని ఆశ్చర్య చకితులను చేస్తూ, బుధ, గురువారా ల్లో, రెండు రోజుల పాటు, గంటకో మార్పుగా, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. మామూలుగా చూస్తే ఇవి హఠాత్ పరిణామాలుగా కనిపించినప్పటికీ, నిజానికి నెల రోజుల క్రితమే వీటికి సమగ్రమైన స్కెచ్ తయారైంది. సరైన సమయం కోసం వేచి చూస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం అదను చూసి ఆ స్కెచ్‌ను అమలు పరచడమే ఇప్పుడు చేసిన పని.

రాజకీయంగా తమకు అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో, రెండో కంటికి తెలియకుండా, 24 గంటల్లో 'ఆపరేషన్ సీఎం ఛేంజ్' పూర్తి చేసిన హైకమాండ్, అసలు తానేమిటో, వ్యవహారశైలి ఎలా ఉంటుం దో పార్టీ శ్రేణులకు తేల్చిచెప్పింది. సాక్షాత్తు 'ముఖ్యమంత్రి రోశయ్య' కు కూడా, చివరి నిముషం దాకా తనను మారుస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలియనివ్వకపోవడం చూస్తే, కాంగ్రెస్ నాయకత్వం ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. 'హైకమాండ్ లో సగం'గా భావించే ముఖ్య నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోనీ స్వయంగా, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రావడం, చిన్నపాటి నిరసన ధ్వనికి కూడా ఆస్కారం ఇవ్వకుండా గంటల్లోనే సాఫీ గా పని పూర్తి చేయడం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పట్ల అధిష్ఠానం ఎంత దృఢ చిత్తంతో ఉందో తెలియజెప్పింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం కురువృద్ధుడైన రోశయ్యకు కష్టం, నష్టం కలిగించి ఉంటే ఉండవచ్చు గానీ, ఇందుకు ఆయన ఎవరినో నిందించి ప్రయోజనం లేదు. అయాచితం గా లభించిన అధికార పీఠం నుంచి, ఆకస్మికంగా నిష్క్రమించాల్సి రావడం రోశయ్య స్వయంకృతం. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత, ఆయన స్థానంలో, రోశయ్య నియామకం ఆపద్ధర్మ (స్టాప్ గ్యాప్) ఏర్పాటేనని అందరికీ తెలుసు.

ఒకరకంగా చూస్తే ఆయన అంచనా కన్నా ఎక్కువ కాలం (14 నెలల 22 రోజులు) పదవిలో ఉన్నారనుకోవచ్చు. నిజానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచీ రోశయ్యకు అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ప్రతిపక్షాలే కాదు; సొంత పార్టీ నేతలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, చివరికి ప్రకృతి కూడా ఆయనకు సహకరించలేదు. సామాజిక బలహీనత, వయోభారం, పార్టీలో సొంత గ్రూపు లేకపోవడం వంటి ఇతరత్రా సమస్య లు కూడా ఉండనే ఉన్నాయి. అధిష్ఠానం ఆశీస్సులే ఆయన ఏకైక బలం.

దీన్ని ఆసరాగా చేసుకుని, తనకున్న అపార అనుభవాన్ని రంగరించి, క్రియాశీలకంగా వ్యవహరించి ఉంటే రోశయ్య మరికొంత కాలం పదవిలో కొనసాగి ఉండేవారు. అయితే 'అబ్బే. ఈ వయసు లో కత్తి పట్టుకుని యుద్ధం ఏం చేస్తాం' అని బేలతనం ప్రదర్శించడం ద్వారా పదవిలో నిలదొక్కుకునే అవకాశాన్ని ఆయన చేజేతులా చెడగొట్టుకున్నారు.

చరిత్ర సృష్టించే సందర్భాన్ని సద్వినియోగం చేసుకోకుండా, బలహీన ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకుని తెరమరుగయ్యారు. "రోశయ్య వ్యవహార శైలి కారణంగా రాష్ట్రంలో మున్ముందు మరే వైశ్యుడికీ, ప్రాధాన్యమున్న కీలక పదవి దక్కే అవకాశం ఉండకపోవచ్చు'' అని వైశ్య ప్రముఖుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో పి.వి.నరసింహారావు విషయంలో జరిగినట్టే ఇప్పుడు రోశ య్య విషయంలో కూడా, రెడ్డి సామాజిక వర్గం కత్తిగట్టి ఆయనను పదవి నుంచి దించే వరకు విశ్రమించలేదు.

ఇక కొత్త ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా గుంభనం గా పావులు కదిపారు. అధిష్ఠానం కూడా ఆయనకు యథోచితంగా సహకరించింది. శాసనసభ స్పీకర్‌గా ఉన్న కిరణ్, గత కొన్ని మాసాలుగా తరచూ ఢిల్లీకి పర్యటనలు పెట్టుకున్నారు. అధిష్ఠానం పెద్దల తో, మరీ ముఖ్యంగా హోంమంత్రి చిదంబరంతో సంబంధాలు పెంచుకున్నారు. స్పీకర్ పోస్టులో ఉన్న వారికి ఢిల్లీతో పెద్దగా పని ఉండదు.

అయినా కిరణ్ తరచూ ఢిల్లీ వెళ్లడంపై ఎవరికీ అనుమానం రాకపోవడం విశేషం. ముఖ్యమంత్రి పదవికి అధిష్ఠానం కిరణ్‌ను ఎంపిక చేస్తున్నట్టు నెలక్రితమే చూచాయగా తెలియడంతో, అప్పటిదాకా ఆయనను ప్రోత్సహిస్తూ వస్తున్న సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఒకింత విస్మయానికి గురయ్యారు. రాష్ట్ర రాజకీయాలలో జగన్‌కు నిరోధక శక్తిగా, తనకు సహాయకుడిగా కిరణ్ ఉపయోగపడతారని జైపాల్ భావించారే తప్ప, ఏకంగా తనకే పోటీ వస్తాడని ఊహించలేదు. ఏకాభిప్రాయ అభ్యర్థిగా ముఖ్యమంత్రి పదవిని పరోక్షంగా ఆశిస్తూ వచ్చిన జైపాల్ అందుకే, తెలంగాణ కార్డును ప్రయోగిస్తూ, కిరణ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు.

అదే తెలంగాణ కార్డును కె.సి.ఆర్. ప్రయోగించడం వల్లే తనకు సి.ఎం. పదవి దక్కలేదని జైపాల్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడే అధిష్ఠానం తనదైన శైలిలో వ్యవహరించింది. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే, కీలకమైన 'తెలంగాణ- జగన్' విషయాల్లో హైకమాండ్ పూర్తి స్పష్టత ఇవ్వాల ని జైపాల్ కోరడంతో, దీన్ని అడ్డుపెట్టుకుని అధిష్ఠానం, కిరణ్‌ను ఎంపిక చేసుకుంది. ఆయా అంశాలపై దృఢ వైఖరి చూపించే విషయంలో జైపాల్, కిరణ్‌తో సరితూగలేకపోయారు.

యువకుడు కావ డం, దూకుడుతనం ఉండడం, ఏది ఎలా వచ్చినా ఎదుర్కొంటానని కిరణ్ భరోసా ఇవ్వడం వల్ల అధిష్ఠానం ఆయనవైపే మొగ్గు చూపిం ది. రోశయ్య రాజీనామా రోజు కూడా ముఖ్యమంత్రి పదవికి జైపాల్ పేరు వినిపించడం, ఆయన చివరి ప్రయత్నాల్లో భాగం కాగా, ప్రణబ్ ముఖర్జీ ఆయన ను పిలిపించుకుని మాట్లాడడం, జైపాల్ మనోభావాలను తాము నిర్లక్ష్యం చేయ డం లేదని తెలంగాణ వాదులకు సూచించే చిన్న డ్రామా మాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెల క్రితమే నిర్ణయం జరగడంతో కాంగ్రెస్ పెద్దల్లో ఎలాంటి టెన్షన్లూ లేవు.

ఉంటే గింటే అసలు సంగతి తెలియని పార్టీ నేతలు, ప్రజలు, మీడియాకే ఆ టెన్షన్! రోశయ్య రాజీనామా, కిరణ్ ఎంపిక విషయంలో సరైన సమాచారాన్ని ముందే పసిగట్టలేకపోయినందుకు తెలుగు మీడియా సిగ్గుపడాలి. చివరికి కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుకు, అధిష్ఠానం ఆకస్మికంగా- అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసినా, అందులోని అంతరార్థాన్ని అవి పట్టుకోలేకపోయాయి.

ఎం.పి. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డిపై చర్య కోసమైతే సి.ఎల్.పి. భేటీ ఎందుకు? అన్న ప్రశ్న ఎవరికీ తట్టలేదు. రాష్ట్రంలో డజనుకు పైగా ఉన్న 'సీరియస్ న్యూస్ చానెళ్లు', అర డజ ను తెలుగు దిన పత్రికల్లో ఏ ఒక్కటీ సి.ఎల్.పి. భేటీకి సరైన భాష్యా న్ని ముందే చెప్పలేకపోవడం, సమాచార సాధనాల్లో లోపిస్తున్న వృత్తి పరమైన పరిణతిని పట్టిచ్చింది.

ఇక కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విషయానికి వస్తే, ఆయనకు పరిపాలన అనుభవం లేదనే చెప్పాలి. మంత్రిగా పనిచేయకుండా, నేరుగా ముఖ్యమంత్రి అయిన రెండో నాయకుడు (ఎన్టీఆర్ తర్వాత) కిరణ్‌కుమార్ రెడ్డే. చంద్రబాబు తర్వాత చిన్న వయసులో (సెకండ్ యంగెస్ట్) ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తి ఆయనే. చంద్రబాబు 45 ఏళ్లకు సీఎం కాగా, ప్రస్తుతం కిరణ్ వయసు 50 ఏళ్లు! దాదాపు రిటైర్‌మెంట్ వయసు వ్యక్తి యువ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందడం రాజకీయాల్లో కనిపించే వైచిత్రి! ఎవరికైనా తప్పని రోజువారీ పరిపాలనా సమస్యలను పక్కనబెడితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కిరణ్ ముందున్న ప్రధాన సమస్యలు రెండు.

ఒకటి తెలంగాణ, మరోటి జగన్! ఈ రెండింటినీ పరిష్కరించాల్సింది కాంగ్రెస్ అధినాయకత్వమే అయినా, రాష్ట్ర స్థాయిలో వాటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సింది మాత్రం కిరణే. ముఖ్యమంత్రి పదవిని రాయలసీమకు ఇవ్వడం తెలంగాణ ఏర్పాటుకు సంకేతమనే ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ, అందులో ఎంతమాత్రం నిజం లేదనే ఎదురు వాదన కూడా బలంగానే ఉంది. "కిరణ్‌కు తెలంగాణ వ్యతిరేకి అన్న ఇమేజ్ ఉంది. ఎంత అవసరమైతే అంత కఠినంగా వ్యవహరించగలడని గట్టిగా నమ్మడం వల్లే ఉద్యమాల ముంగిట్లో అధిష్ఠానం కిరణ్‌ను ఎంచుకుంది.

41 ఎంపీ సీట్లను గెలుచుకుంటామంటూ 2014 ఎన్నికల గురించి మాట్లాడడం, పెట్టుబడుల మజిలీగా మారుస్తామంటూ రాజధాని హైదరాబాద్ గురించి ప్రస్తావించడం, శాంతి భద్రతలపై కఠిన వైఖరి ప్రకటిస్తూ కేంద్ర బలగాలను రప్పిస్తాననడం... ఇవన్నీ కిరణ్ ఎంపిక ఎందుకో చెప్పకనే చెబుతున్నాయి'' అని ఢిల్లీలోని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. వ్యక్తిత్వం దృష్ట్యా కిరణ్ కొంత అహంభావి. ఒకసారి తేడా వస్తే స్నేహపూర్వకంగా ఉండడం కష్టం.

అయితే పట్టినపట్టు వీడని మొండితనం, అనుకున్నది సాధించడానికి ఏ దశకైనా వెళ్లగల తెగువ ఉన్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో కిరణ్ దశాబ్దాల కుటుం బ వైరాన్ని కొనసాగిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. అందువల్ల అధిష్ఠానం ఇతరత్రా కొన్ని ప్రయోజనాలను ఆశించే, అటు ఆంధ్రకు, ఇటు తెలంగాణకు కాకుండా రాయలసీమకు చెందిన కిరణ్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించిందని భావించవచ్చు.

వై.ఎస్. కోటరీలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన కిరణ్, వై.ఎస్. కుమారుడైన జగన్‌తో ఏ మేరకు వైరం పెట్టుకోగలరనే విషయంలో పార్టీలో ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. కిరణ్ వై.ఎస్. కు సన్నిహితుడన్న దానిలో ఎలాంటి అనుమానం లేనప్పటికీ, అదే స్థాయిలో జగన్‌తో సంబంధాలున్నాయని మాత్రం చెప్పలేం. వై.ఎస్. రెండోసారి అధికారంలోకి వచ్చాక, తనకు మంత్రి పదవి రాకపోవడానికి జగనే కారణమన్న అభిప్రాయం కిరణ్‌లో ఉంది.

చిత్తూరు జిల్లా కే చెందిన కిరణ్ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, జగన్‌కు వ్యాపార భాగస్వామి. పెద్దిరెడ్డికి జగనే మంత్రి పదవి ఇప్పించారని, తనను ఎన్నికల్లో ఓడించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయ ని కిరణ్ అనుమానిస్తూ ఉంటారు. కుమారుడి ఒత్తిళ్లకు తలొగ్గి వై.ఎస్. తనకు అన్యాయం చేశారన్న అభిప్రాయం కూడా ఆయనకు ఉంది. మంత్రి పదవి ఇవ్వకుండా, స్పీకర్ పదవి చేపట్టాలని వై.ఎస్. బలవంతపెట్టినపుడు కిరణ్ ఒకింత బాధపడ్డారు.

అయితే కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్టు, ఆ స్పీకర్ పదవే ఇప్పు డు ముఖ్యమంత్రి సీటు అధిరోహించడానికి సోపానమైంది. గత డిసెంబరు సంక్షోభ సమయంలో ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల వ్యవహారాన్ని సమర్థంగా పరిష్కరించడం, టి.ఆర్.ఎస్. నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై దీటుగా నిర్ణయం తీసుకోవడం కిరణ్‌పై అధిష్ఠానం నమ్మకం పెంచుకోవడానికి ప్రధాన ప్రాతిపదికలు. ఎవరి అదృష్ట రేఖను ఎవరు చెరపగలరు?! అయినా కిరణ్ వ్యవహార శైలి 'తమ్ముడు తమ్ముడే - పేకాట పేకాటే' అన్నట్టు గా ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు.

కిరణ్ స్పీకర్ అయ్యాక, వై.ఎస్. ఆయనను పిలిచి, ప్రజా పద్దుల కమిటీ (పి.ఎ.సి.) చైర్మన్ పోస్టును, తెలుగుదేశం నేత నాగం జనార్దన్‌రెడ్డి చేపట్టకుండా చూడాలని ఆదేశించారట. అయితే అది ప్రధాన ప్రతిపక్షానికి దక్కే పోస్టు అనీ, ఎవరికి ఇచ్చుకోవాలో ఆ పార్టీ ఇష్టమనీ, తానేం చేయలేనని కిరణ్ బదులిచ్చారట. ఈ విషయం ఇరువురి మధ్య వాదులాట కు దారితీసింది. అందువల్లే పావురాలగుట్ట వద్ద ప్రమాదం జరిగిన రోజు వై.ఎస్.తోపాటు హెలికాప్టర్‌లో వెళ్లాల్సిన కిరణ్ తన ప్రయాణా న్ని విరమించుకున్నారట! ఈ నేపథ్యాన్ని గమనిస్తే జగన్‌ను అదుపు చేసే విషయంలో కిరణ్‌కు పెద్దగా అభ్యంతరాలు ఉంటాయనుకోలేం.

ఎవరి రాజకీయ భవిష్యత్తు వారిదే కదా! అధిష్ఠానం ఆదేశా న్ని ధిక్కరించి, జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, తదితరులను కిరణ్ తన కేబినెట్‌లోకి తీసుకుంటారా? మంత్రివర్గ కూర్పులో జగన్ వర్గీయులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు? అన్న వాటి ఆధారంగా జగన్ పట్ల కిరణ్, అధిష్ఠానం వైఖరిని అంచనా వేయవచ్చు. బాలినేని, చంద్రబోస్‌లకు మంత్రి మండలిలో మళ్లీ చోటు కల్పిస్తే, జగన్‌తో రాజీకి అధిష్ఠానం సుముఖంగా ఉందనే సంకేతం వెలువడినట్టే! అయితే, హైకమాండ్ ఆదేశానికి కట్టుబడి ఓదార్పుకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తడం ఖాయం.

ప్రస్తుతానికైతే అధిష్ఠానం జగన్ ను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. సరికదా, పార్టీ శ్రేణులను క్రమంగా ఆయనకు దూరం చేస్తూ, వర్గాన్ని బలహీన పరుస్తున్నది. జగన్ ప్రాంతానికే చెందిన, ఆయన సామాజిక వర్గానికే చెందిన, వై.ఎస్. సన్నిహితుడైన కిరణ్‌ను 'పవర్ సెంటర్'గా మార్చడమే ఇందుకు నిదర్శనం. హైకమాండ్ ఆశించినట్టుగానే ఒకప్పటి వై.ఎస్. వర్గంలోని ముఖ్యులంతా క్రమంగా కిరణ్ పక్కన చేరుతున్నారు.

జగన్ రాజకీయంగా తనంతతాను నిర్వీర్యమయ్యే పరిస్థితిని కల్పిస్తుంది తప్ప, ఆయనకు లాభం కలిగించే రీతిలో, పార్టీ నుంచి బయటకు పంపడం వంటి ఏ చర్యనూ అధిష్ఠానం తీసుకునే అవకాశాలు ఎంతమాత్రం లేవు. దీంతో ఇక ఇప్పుడు జగన్ వైఖరి ఎలా ఉండబోతోంది? తనకు పక్కలో బల్లెంలా మారుతున్న కిరణ్‌ను జగన్ ఏమేర కు సహిస్తాడు? అన్నది ఆసక్తికరం. మారిన సమీకరణాల దృష్ట్యా జగ న్ అప్పుడే తొందరపడకపోవచ్చు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎమ్మెల్యేల్లో ఏర్పడే అసంతృప్తిని, లేదా శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత చోటుచేసుకునే పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి జగన్ పావులు కదపవచ్చు. జగన్ ముందున్నవి రెండే రెండు మార్గాలు.

ఒకటి- గత వైభవాన్ని, ముఖ్యమంత్రి పదవిని మరచిపో యి, అవమానాలను దిగమింగుకుని, గుంపులో గోవిందయ్యలా రాజీపడి కాంగ్రెస్‌లోనే ఉండిపోవడం. రెండు-పార్టీపై తిరుగుబాటు చేసి తన భవిష్యత్తు తాను చూసుకోవడం. కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా జగన్ ఎత్తుకు అధిష్ఠానం మలి ఎత్తు వేసింది. జగన్ వంటి వ్యక్తులకు ఇతరులెవ్వరూ నష్టం చేయలేరు. ఎందుకంటే వారిని వారే దెబ్బతీసుకుంటారు!  - ఆదిత్య 

'నల్లారి' నడక కాదు!

కాంగ్రెస్ ప్రభుత్వానికి కెప్టెన్‌గా నియమితులైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సవాళ్లను అధిగమించగలరా? ఇందుకు సీనియర్ల సహకారం లభిస్తుందా? అన్నది కాంగ్రెస్ శ్రేణులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న! జగన్‌ను కట్టడి చేయాలంటే పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించవలసిన బాధ్యత కిరణ్‌పై ఉంది. ముఖ్యమంత్రి పదవి సంపాదించుకునే వరకు గోప్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించిన కిరణ్, ఇప్పుడు కూడా అదే బాటలో పయనించడం వల్ల మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగీ జరగక ముందే అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి.

2010 సంవత్సరం వెళుతూ వెళుతూ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, రెండు కీలక ఘట్టాలకు నాంది పలికింది. రాష్ట్ర కాంగ్రె స్ రాజకీయాలలో, కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు, అనూహ్యమైనవి కాకపోయినప్పటికీ, ఇంత త్వరగా చోటు చేసుకుంటాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇందులో మొదటిది కడప ఎం.పి. వై.ఎస్.జగన్మోహనరెడ్డి, తన తల్లి ఎం.ఎల్.ఎ. విజయమ్మతో సహా కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి, సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం.

రెండవది కొణిజేటి రోశ య్య స్థానంలో ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రావడం. జగన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి సొంత పార్టీ పెట్టుకుంటారని అంద రూ భావించినదే అయినప్పటికీ, తనపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్య తీసుకునే వరకు వేచి ఉండి, ఆ తర్వాత మాత్రమే తిరుగుబాటు జెండా ఎగురవేస్తారని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే ఓర్పుగా వేచి ఉండటం అంటే తెలియని జగన్, కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం శ్రమ కూడా లేకుండా చేశారు. కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన ఎం.పి, ఎం.ఎల్.ఎ. పదవులకు జగన్ - విజయమ్మలు రాజీనా మా చేశారు. మరో రెండు మూడు నెలల్లో సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ తన సహచరులకు స్పష్టం చేశారు కూడా! వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి ముఖ్యమంత్రి పీఠం పై ఆశలు పెంచుకున్న జగన్, అది తనకు అందనంత దూరంలో ఉందని గ్రహించారు.

పార్టీలోనే ఉంటూ, తన తండ్రిలాగా 25 సంవత్సరాలపాటు నిరీక్షించి, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే ఓర్పు-నేర్పు లేని జగన్, కాంగ్రెస్‌లో ఎంతోకాలం ఉండరని ఊహించిందే! తాను ఆశించిన పదవిలోకి రోశయ్య వచ్చిన నాటి నుంచి, జగ న్ కాంగ్రెస్‌తో అంటీముట్టినట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. నెలల తరబడి ఓదార్పు యాత్ర చేసినా, ఎక్కడా కాంగ్రెస్ గురించి గానీ, సోనియాగాంధీ గురించి గానీ జగన్ ప్రస్తావించిన పాపాన పోలేదు. అంటే సొంత పార్టీ పెట్టుకోవడం ద్వారానే తాను కలలుగంటున్న ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆయన గట్టిగా నమ్ముతూ వచ్చారన్న మాట.

తాను కాంగ్రెస్‌కు నష్టం చేయలేదని జగన్ చెప్పినా, కాంగ్రెస్‌ను వీడి జగన్ సొంత పార్టీ పెట్టుకుంటారని వస్తున్న వార్తలు అభూత కల్పనలని ఆయన అనుచరులు ఎంతగా చెప్పినా, జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఆయన అంతరంగం ఇట్టే తెలిసిపోతుంది. నాలుగు పదుల వయస్సు కూడా లేని జగన్‌కే ఇన్ని తెలివితేటలు ఉంటే, కాకలు తీరిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు ఆ మాత్రం పసిగట్టలేరా? ఈ కారణంగానే జగన్‌ను దీటుగా ఎదుర్కొనే మొండితనం ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. సోనియాను విమర్శించిన వారంతా తన శత్రువులేనని ప్రకటించడం ద్వారా జగన్ విషయంలో తన వైఖరి ఎలా ఉండబోతున్నదో ముఖ్యమంత్రి పరోక్షంగా స్పష్టం చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఎటు దారి తీయనున్నాయి? సొంత పార్టీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న జగన్, మూడున్నర ఏళ్ల పాటు నిరీక్షించి, సార్వత్రిక ఎన్నికలలో మాత్రమే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? అంతకాలం వేచి ఉండే సహ నం ఆయనకు ఉందా? ఇప్పటికే పది మందికి పైగా ఎం.ఎల్.ఎ.లు జగన్‌తో చేతులు కలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ సుస్థిర ప్రభుత్వాన్ని అందివ్వగలరా? అసలు ఆయన ప్రభుత్వ మనుగడ ఎంతకాలం? వచ్చే ఎన్నికలలో జగన్ లక్ష్యం నెరవేరుతుందా? జగన్ ఫ్యాక్టర్‌ను అధిగమించి కాంగ్రెస్ పార్టీని విజయతీరాల వైపు నడిపించగల సత్తా కిరణ్‌కు ఉందా? వంటి ప్రశ్నలు సామాన్యుల నుంచి మాన్యుల వరకు అందరిలో తలెత్తుతున్నాయి.

ముందుగా జగన్ విషయం తీసుకుంటే ఆయనది 'వాపా - బలుపా' అన్నది తేలవలసి ఉంది. ఇందుకు మరికొంత కాలం పడుతుంది. స్వతహాగా దుందుడుకు స్వభావం కలిగిన జగన్, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని చెప్పలేం. ఎందుకంటే ఆయన కేవలం తన తండ్రి రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఉన్న పేరునే నమ్ముకుని సొంత పార్టీ పెట్టుకోవాలన్న సాహ సానికి ఒడిగట్టారు. ఈ కారణంగానే తనతో ఎవరు ఉన్నారు? ఏయే జిల్లాలలో ఎవరెవరిని ఆకర్షించాలి? వంటి ఆలోచనలు చేయకుండా, తనతో ఎవరూ రాకపోయినా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నా రు. అందువల్లే తన చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డితో కూడా సఖ్యత నెలకొల్పుకోలేకపోయారు.

వాస్తవానికి వివేకానందరెడ్డి తన విధేయతను కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రకటించి, మంత్రివర్గం లో చేరడం జగన్‌కు తొలి దెబ్బ! అయినా ఇవేవీ పట్టించుకునే స్థితిలో జగన్‌లేరు. నిజానికి వివేకాకు పులివెందులలో మంచి పేరే ఉంది. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్, సహజంగానే పులివెందుల నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావిస్తారు. దశాబ్దాలుగా తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నుంచి గెలవడం, మామూలుగా అయితే ఆయనకు నల్లేరు మీద నడకే! కానీ, వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు, పులివెందులలో జగన్‌పై పోటీకి వివేకాను దించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే జరిగితే జగన్ ఓడిపోతారని చెప్పలేం గానీ, గెలుపుకోసం శ్రమించవలసి ఉంటుంది.

ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తమకు లేదని జగన్ వర్గీయులు ప్రస్తుతం చెబుతున్నప్పటికీ, మూడున్నరేళ్లపాటు కొనసాగడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బలపడటానికి జగన్ అవకా శం ఇస్తారన్నది నమ్మ శక్యం కాని విషయం. ఇప్పటికే తాను ఆదేశిస్తే 10 మందికి పైగా ఎం.ఎల్.ఎ.లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం ఆయనకు తెలు సు. అయితే ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి దాదాపు 25 మంది బలం ప్రజారాజ్యం- మజ్లిస్ పార్టీలు సిద్ధంగా ఉన్నందున, అంతే సంఖ్యలో కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లను తన వైపు తిప్పుకోవడానికి జగన్ కచ్చితంగా ప్రయత్నిస్తారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నా యి. అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అన్నది వేరే విష యం.

ఆ దిశగా అడుగులు పడాలంటే, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం జగన్ుకు కచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చీలికను ప్రోత్సహించడం ద్వారా అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తే, రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధింపజేయడం ద్వారా ఎన్నికలను కొంతకాలం పాటు వాయిదా వేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిం చే విషయం ఆయనకు తెలుసు. రాష్ట్రపతి పాలన పేరిట ఏడాది పాటు ఎన్నికలు వాయిదా వేయవచ్చు. ఈ కారణంగానే 'రెండేళ్లలో అధికారం మనదే' అని జగన్ రెండురోజుల క్రితం ప్రకటించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన బలాన్ని సమీకరించుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న మీదటే, 2014 బదులు 2013లోనే ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలను జగన్ ఇస్తున్నారు. అయితే తెలంగాణలో కనీస స్థాయిలో కూడా బలం లేని జగన్ లక్ష్యం నెరవేరుతుం దా? అంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటే సాధ్యం కాదు. చర్యకు ప్రతి చర్య ఉన్నట్టుగానే, జగన్ అంచనాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియనివి కావు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర విభజన అంశంలోగానీ, మరేఇతర విషయంలోగానీ వారి వ్యూహాలు వారికి ఉంటాయి.

ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు కొంతమంది ఎం.ఎల్. ఎ.లు, ప్రజల్లో అంతగా ఆదరణ లేని ద్వితీయ శ్రేణి నాయకులు తన తో ఉన్నంత మాత్రాన, అధికారంలోకి వచ్చేస్తానని జగన్ కలలు కంటే అమాయకత్వమే అవుతుంది. ఇతరుల అభిప్రాయాలకు విలు వ ఇవ్వని జగన్, అన్నీ తనకు తెలుసుననీ, అన్నీ తాను అనుకున్నట్లుగానే జరుగుతాయని గట్టిగా నమ్ముతున్నారు. వాస్తవానికి జగన్ వ్యవహారం కాంగ్రెస్ నాయకులను సంఘటిత పరచడానికి పరోక్షం గా ఉపయోగపడుతున్నది. మంత్రిత్వ శాఖల కేటాయింపుపై అంత లా అసంతృప్తి చెలరేగినా, సాయంత్రానికల్లా చల్లబడిపోవడానికి జగన్ వ్యవహారమే ప్రధాన కారణం. తమ చర్యలు జగన్‌కు లాభించే ప్రమాదం ఉందని గుర్తించి మంత్రులు, ముఖ్యంగా తెలంగాణకు చెందినవారు కొన్ని గంటల్లోనే స్వరం మార్చారు. అసాధారణ రీతి లో సంక్షోభం తలెత్తినా, అది తనకు ఉపయోగపడని విషయాన్ని జగన్ గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.

అంతేకాదు; రాబోయే రోజుల్లో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఢీకొంటూ, ఒకదాన్ని ఒకటి బలహీనపరచుకోవడానికి తీవ్రస్థాయిలో పోరాడుతాయి. ఇప్పటి వరకు తమతో ఉన్న కారణంగా జగన్ వ్యవహారాలను అంత బాహాటంగా వెల్లడించని కార గ్రెస్ నేతలు, ఇకపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆయననే టార్గెట్ చేస్తారు. జగన్ తన మీడియా ద్వారా ఇప్పటికే కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. ఎందుకంటే తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే, కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే జగన్ ఆధారపడవలసి ఉంటుంది. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల ఓట్లు జగన్‌కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. ఒకే ఓటు బ్యాంకు కోసం అటు జగన్, ఇటు కాంగ్రెస్ పార్టీ పోరాడవలసి ఉంటుం ది. ఈ క్రమంలో జగన్‌పై ముప్పేట దాడికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. రెడ్లు, మైనారిటీలు, దళితులు, క్రైస్తవుల ఓట్లపై జగన్ ఆధారపడి ఉన్నారు. ఈ వర్గాలన్నీ ఆది నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నాయి. తమ ఓటు బ్యాంకును జగన్ కొల్లగొట్టకుండా కాంగ్రె స్ శ్రేణులు ఏ మేరకు అడ్డుకుంటాయో వేచి చూడాలి.

అటు కేంద్రం లో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున, రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ సాగించిన వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు బజారుకీడ్చడం ద్వారా, ప్రజల్లో ఆయనను పలచన చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తాయి. అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే జగన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆషామాషీగా వదలిపెట్టదు. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బాగోతాలన్నీ కాంగ్రెస్ పెద్దలకు తెలియనివి కావు. ఇప్పుడు వాటినే అస్త్రాలుగా ప్రయోగిస్తా రు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రి గా ఉన్నపుడు, రాజ్‌భవన్‌లో ఆగస్టు 15వతేదీ సాయంత్రం గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. ఆ విందుకు రాజశేఖరరెడ్డి దంపతులతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు, పుర ప్రముఖు లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్. సతీమణి విజయ మ్మ తన మనస్సులోని ఆవేదనను ఒక సీనియర్ మంత్రితో పంచుకున్నారు. "తండ్రి, కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. బెంగళూరుకు మాత్రమే పరిమితం కావాలని కొడుకు (జగన్)ను ఆయన (వై.ఎస్) ఆదేశించారు. అయినా మా వాడు చీటికీమాటికీ ఇక్కడకు వస్తున్నాడు. వాడిని చూసిన ప్రతిసారీ ఎందుకు రానిస్తున్నావు? అంటూ ఆయన నాపై మండిపడుతున్నారు. కొడుకు ఇంటికి వస్తే రావద్దని తల్లిగా ఎలా చెప్పగలను?''అని విజయమ్మ సదరు మంత్రి వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సంఘటనను గుర్తుచేస్తూ, "జగన్ తత్వం ఏమిటో, తను ఎలాంటి వాడో, ఏమేమి చేశాడో, మాకు తెలుసు, మా అధికారానికి సవాల్‌గా నిలిచినపుడు మేం ఊరి కే ఉంటామా? అన్నీ బయటపెడతాం'' అని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మున్ముందు పోరు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కెప్టెన్‌గా నియమితులైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సవాళ్లను అధిగమించగలరా? ఇందుకు సీనియర్ల సహకారం లభిస్తుందా? అన్నది కాంగ్రెస్ శ్రేణులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న! జగన్ ను కట్టడి చేయాలంటే పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించవలసిన బాధ్యత కిరణ్‌పై ఉంది. ముఖ్యమంత్రి పదవి సంపాదించుకునే వర కు గోప్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించిన కిరణ్, ఇప్పుడు కూడా అదే బాటలో పయనించడం వల్ల మంత్రిత్వ శాఖల కేటాయిం పు జరిగీ జరగక ముందే అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. తాను నాయకత్వం వహిస్తున్నది 'మైనారిటీ ప్రభుత్వానికి' అన్న వాస్తవాన్ని కిరణ్ గుర్తించినట్లు లేదు. జగన్ మనుషులు రాజీనామా చేస్తే మైనారిటీ ప్రభుత్వమే అవుతుంది. ఆ పరిస్థితులలో ప్రజారాజ్యం, మజ్లిస్ పార్టీలపై ఆధారపడి, వారి ఒత్తిళ్లకు తలొగ్గుతూ, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కిరణ్‌కు కత్తి మీద సాము అవుతుంది.

తెలివిగలవాడైతే ఆ పరిస్థితి రాకుండా, కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లు చేజారిపోకుండా చూసుకోవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నైజంగానీ, ఆయన వ్యవహారశైలిగానీ సామాన్య ప్రజలెవ్వరికీ తెలియదు. అయితే ఆలోచనతో చేశారో, అనాలోచితంగా చేశారో తెలియదుగానీ, కీలక శాఖలన్నింటినీ ఒకే వర్గానికి కట్టబెట్టడం ద్వారా, రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించారన్న అపకీర్తిని ఆయన మూటగట్టుకున్నారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కిర ణ్ నైజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆయనలో కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్, కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి.

మొండితనం, నిజాయితీ, ఒత్తిళ్లకు లొంగకపోవడం వంటి వి ఆయనలోని స్ట్రాంగ్ పాయింట్స్. అదే సమయంలో రెడ్ల పట్ల ప్రత్యేక అభిమా నం చూపడం, ఎవరినీ సంప్రదించకపోవడం, అహంకారి అని భావించేలా కనిపించడం ఆయనలోని వీక్ పాయింట్స్. నాలుగు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైనా, ఇప్పటిదాకా ఆయన నిర్వహించిన పదవులు ప్రభుత్వ చీఫ్ విప్ -శాసనసభ స్పీకర్ మాత్రమే. ఈ పదవులు వేరు, ముఖ్యమంత్రి పదవి వేరు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి నాయకుడు, కొందరివాడుగా కాకుండా, అందరివాడు అనిపించుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌పై ఉంది.

జగన్‌వైపు ఆకర్షితులవుతున్న రెడ్లను, తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చేసే ప్రయత్నం లో భాగంగా, ఆ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించి ఉండవచ్చు. లేదా, తనకు న్న కులాభిమానం వల్ల అలా చేసి ఉండవచ్చు. అయితే మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుని తిరుగరు కదా! తన చర్యల వల్ల ఇతర వర్గాల వారు మనస్సు కష్టపెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది. అదే సమయంలో అన్ని విషయాలను కాకపోయినా, కనీ సం కొన్ని విషయాలలోనైనా పార్టీలోని ముఖ్యులను భాగస్వాముల ను చేయవలసిన అవసరం ఉంది. ఇందుకు భిన్నంగా ఒంటెత్తు పోకడలు పోతే, ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది.

జగన్‌ను కట్టడి చేసే విషయం అటుంచి, ఆయనకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందని కాంగ్రెస్ ముఖ్యులే వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని సందర్భాలలో ఒకే ఫార్ములా పని చేయదన్న వాస్తవాన్ని కిరణ్ తెలుసుకోవడం అవసరం. శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేయడం అర్థం లేనిదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఏ శాఖలు కేటాయించారన్నది కాదు, తమలో కొందరినైనా కనీసం సంప్రదించకుండా ఒక్కడే కూర్చుని శాఖలు కేటాయించిన తీరు పట్ల పలువురు మంత్రులు మనస్సు కష్టపెట్టుకున్నారు. దీన్ని మరో రూపంలో వెల్లడించారు. శాఖల కేటాయింపుపై తలెత్తి సమసిపోయి న సంక్షోభాన్ని ఒక అనుభవంగా ముఖ్యమంత్రి స్వీకరించి, భవిష్యత్తులో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తే నాలుక కరుచుకునే పరిస్థితి రాకపోవచ్చు.        - ఆదిత్య 

గురివింద సుభాషితాలు

ఎట్టకేలకు స్వంత పార్టీ పెట్టుకుంటున్నట్లు కడప మాజీ ఎం.పి. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ప్రకటనతో పాటు ఆయన తన లక్ష్యాలను, ఏ కారణంగా స్వంత పార్టీ పెట్టుకుంటున్న దీ వివరించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశాలు అయ్యాయి. ఇందులో మొదటిది ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం.

ప్రస్తుత రాజకీయాలలో విలువలు లేవనీ, తాను ఏర్పాటు చేసే పార్టీ 2014లో అధికారంలోకి వచ్చి 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని మిగతా లక్ష్యాలుగా చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల నుంచి అప్పుడే ప్రతిస్పందన కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవనీ, కుట్రలు, కుయుక్తులు రాజ్యమేలుతున్నాయని చెబుతున్న జగన్, ముందుగా ఆ విషయాన్ని ఎప్పు డు గుర్తించారో స్పష్టం చేయవలసి ఉంది.

తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ప్రతిపక్షాలకు చెందిన శాసన సభ్యులను ప్రలోభపెట్టి ఆయా పార్టీలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించినపుడు, ఈ విలువలు జగన్‌కు ఎందుకు గుర్తుకు రాలే దో తెలియవలసి ఉంది. తన కుటుంబాన్ని చీల్చే నీచత్వానికి కాంగ్రె స్ అధినేత్రి సోనియాగాంధీ పాల్పడ్డారని విమర్శించిన జగన్‌కు, రాజకీయాలలో ఇలాంటివి సర్వసాధారణం అన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.... కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన ఎన్.టి.రామారావు కుటుంబాన్ని చీల్చి పురందేశ్వరిని తమవైపు తిప్పుకోవడం, ఇతర పార్టీలను చీల్చడం తప్పు కానప్పుడు, కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చడం తప్పు ఎలా అవుతుందో జగనే వివరించాలి. తన ఇంటిపైన, తన మీడియా కార్యాలయాలపైనా దాడులు చేశారని విమర్శిస్తున్న జగ న్, ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకోవడం అవసరం.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 'ఆంధ్రజ్యోతి'పై దాడులను పరోక్షంగా ప్రోత్సహించిన విషయం మరచిపోయారా? మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని 'ఈనాడు' గ్రూపు అధినేత రామోజీరావు కార్యాలయాలపై దాడులు చేయించిన విషయం గుర్తుకు రాలే దా? ఆనాడు తన తండ్రి చేసిన చర్యలను ఖండించని జగన్‌కు, ఇపు డు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టే నైతికత ఉందా? ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత ఉండనే ఉంది.

తాను, తన తండ్రి కలిసి ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడానికి అనుసరించిన వినూ త్న పోకడల్నే, ఇప్పుడు తన విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నద ని గుర్తించకపోతే ఎలా? నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అని కాంగ్రె స్ ప్రభుత్వం జగన్ విషయంలో మున్ముందు వ్యవహరించనుంది. ఈ విషయంలో ధర్మాధర్మాల గురించి వాపోయే అర్హత జగన్‌కు ఉందా? జగన్ వ్యాఖ్యలలో అన్నింటికంటే కీలకమైనది 'ఆత్మ గౌరవం'! ఆత్మ గౌరవం నినాదంతోనే ఆయన భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీని ఢీకొనబోతున్నారని దీనితో స్పష్టం అవుతున్నది.

అయితే ఈ ఆత్మ గౌరవ నినాదాన్ని ఇచ్చే అర్హత జగన్‌కు ఉందా? అన్నది ప్రశ్న! రాష్ట్ర రాజకీయాలలో, ఆత్మ గౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు ఎన్.టి.రామారావు. ఆనాటి పరిస్థితులలో ఎన్.టి.ఆర్. ఇచ్చిన ఈ నినాదానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆనాడు ఇందుకు దారితీసిన పరిస్థితులను ఒకసారి మన నం చేసుకుందాం. 1978-83 మధ్య కాలంలో, ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌పార్టీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చీటికి మాటి కి మారుస్తూ వచ్చింది.

అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలతో తమ ఆత్మ గౌరవానికి భంగం కలుగుతున్నదని తెలుగు ప్రజలు భావించారు. ఆరణాల కూలీగా జీవితాన్ని ప్రారంభించిన అంజయ్య విషయంలో ప్రజల్లో సానుభూతి ఉండేది. ఆనా డు ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌గాంధీ, బేగంపేట విమానాశ్రయంలో తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన ముఖ్యమంత్రి అంజయ్యను ఈసడించుకున్నారు. ఈ సంఘటన తెలుగు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది.

అంజయ్యకు బోలెడు సానుభూతి లభించింది. ఆ తర్వాత ఎ.ఐ.సి.సి పరిశీలకుడు జి.కె.మూపనార్ రాష్ట్రానికి వచ్చి, అధికారం నుంచి తప్పుకోవలసిందిగా తనను ఆదేశించడంతో అంజయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు. మూపనార్ రాష్ట్రాలకు వెళుతున్నారంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు మూడినట్టేనన్న భావన అప్పట్లో ఉండేది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్.టి.ఆర్ 'ఆం«ద్రుల ఆత్మ గౌరవం' నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ఏమి భంగం కలిగిందని ఆ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నారో జగన్ చెప్పవలసి ఉంది.

తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, రాష్ట్రంలో ప్రారంభించిన పతి పథకానికి, కార్యక్రమానికి రాజీవ్‌గాంధీ-ఇందిరాగాంధీ పేర్లు పెట్టినపుడు ఆంధ్రుల ఆత్మ గౌరవం జగన్‌కు ఎందుకు గుర్తుకురాలేదో! విమానాశ్రయానికి అప్పటికే ఉన్న ఎన్.టి.ఆర్ పేరును తొలగించి, రాజీవ్‌గాంధీ పేరు పెట్టినపుడు జగన్ ఎందుకు అభ్యంతరపెట్టలేదో తెలియవలసి ఉంది.

పొరుగున ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర తమ విమానాశ్రయాలకు తమ తమ రాష్ట్రాలకు చెందిన మహనీయుల పేర్లనే పెట్టుకున్నాయి. పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇదేవిధంగా వ్యవహరించా యి. ఒక్క మన రాష్ట్రంలోనే రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌గాంధీ నామ స్మరణ మారుమోగింది. బడుగు వర్గాలకు చెందిన అంజయ్యను అవమానించిన రాజీవ్‌గాంధీ పేరును ప్రతి దానికి పెట్టడం వల్ల ఆం«ద్రుల ఆత్మ గౌరవం దెబ్బతింటుందని జగన్ ఎందుకు గుర్తించలేక పోయారో స్పష్టంచేయవలసి ఉంది.

తాను టార్గెట్‌గా పెట్టుకున్న ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం ఇవ్వకపోవడం వల్ల తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి కలిగిన నష్టం ఏమిటో తెలియడం లేదు. నిండా ఒకటిన్నర సంవత్సరం రాజకీయ అనుభవం కూడా లేని జగన్‌కే అన్ని ఆశలు ఉంటే, కాంగ్రెస్ పార్టీనే ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులకు ఎన్ని ఆశలు ఉండాలి! అయినా తాము ఆశించిన పదవులు దక్కని సందర్భాల లో, ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లిందని చెప్పడానికి సాహసించలేదు.

రాచరికపు వాసన లు నిండా ముప్పరిగొని ఉన్న జగన్ మాత్రమే తండ్రి వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి దక్కాలని కోరుకోగలరు! ఆశించినది దక్కకపోవడంతో ఆయన ఆశాభంగం చెందడంలో తప్పులేదు. కానీ తన తరఫున, రాష్ట్ర ప్రజలందరూ తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగిందం టూ శోకించాలని కోరుకోవడం మాత్రం అత్యాశే అవుతుంది.

ఆయన అత్యాశాపరుడు కనుక అలాగే ఆలోచిస్తారు మరి! మూడేళ్లపాటు కష్టాలు తప్పవనీ, 2014లో అధికారం తమదేనని చేసిన వ్యాఖ్యలోని అంతరార్థం ఏమిటో తెలుసుకోవలసి ఉంది. అధికారం కోసం 2014 వరకు వేచి చూసే ఓపిక ఉండే పక్షంలో కాంగ్రెస్‌లోనే కొనసాగి, అధిష్ఠానానికి విధేయుడుగా ఉండి ఉంటే ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉంది కదా? అని సామాన్యులకు సందే హం కలుగుతున్నది.

వాస్తవానికి 2014 వరకు వేచి ఉండే ఓపిక జగన్‌కు లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా రోశయ్యను తప్పించి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించడంతోనే జగన్‌లో అసహ నం కట్టలు తెంచుకుంది. ఆ కారణంగానే కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి సూచన మేరకు, ముఖ్యమంత్రి కిరణ్ ఫోన్ చేసినా జగన్ కట్ చేశారు. తనకు దక్కాల్సిన పదవిని కిరణ్ తన్నుకుపోయారన్నది ఆయన కోపానికి కారణం.

తనను తప్ప మరో వ్యక్తిని ముఖ్యమంత్రి గా అంగీకరించడానికే ఇష్టపడని జగన్, మూడేళ్ళపాటు ఓర్పుగా వేచి ఉంటారంటే నమ్మడం కష్టమే! అయినా ఆ ప్రకటన ఎందుకు చేశారో, దాని వెనుక మర్మం ఏమిటో శోధించవలసి ఉంది. నిజానికి ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా కూల్చివేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠాంచాలన్న ఆత్రుత జగన్‌కు ఉంది. అయితే ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైనంత బలం తనకు ఉందా? అన్న విషయం లో ఆయనకే సందేహాలు ఉన్నాయి.

తాను ఆదేశిస్తే ఎంతమంది ఎం.ఎల్.ఎ.లు రాజీనామాలు చేస్తారో ఆయనకే తెలియదు. రాజకీయాల్లో విశ్వాసానికి తావు ఉండదు. తన విషయంలో, తన తండ్రి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు విశ్వాసం చూపించడం లేదని వాపోయే జగన్, అదే ఫార్ములా కాంగ్రెస్ పార్టీ విషయంలో తనకు కూడా వర్తిస్తుందని గుర్తించకపోవడమే విడ్డూరం. కాంగ్రెస్ పార్టీ కారణంగానే తన తండ్రి గానీ, తాను గానీ ఈ స్థానానికి వచ్చామ న్న విషయాన్ని విస్మరించి, తమ వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానానికి వచ్చిందని భావించడం ఆయనలోని అహంకారానికి నిదర్శనం.

పైకి 2014 వరకు వేచి ఉంటానని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన బలం సమకూరినపుడు జగన్ కచ్చితంగా ఆ పని చేస్తారు. అటువంటి ఆలోచనే లేకపోతే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉండవచ్చు. అలా చేసి ఉంటే ఇవ్వాళ కాకపోయినా, రేపు అయినా ముఖ్యమంత్రి పదవి దక్కేది. అయినా ముఖ్యమంత్రి కావడానికి తనకున్న అర్హతలు ఏమిటో ఆయనే చెబితే మంచిది.

తండ్రి దుర్మరణం చెందిన ప్రమాద స్థలికి వెళ్ళి, భౌతిక కాయాన్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నించకుండా, తదుపరి ముఖ్యమంత్రి కావడానికి ఎం.ఎల్.ఎ.ల సంతకాల సేకరణకు ప్రేరేపించిన జగన్‌ను, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారో లేదో కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం బాగా అర్థం చేసుకుంది. శ్రీమతి ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిగా నియమించలేదా? అని ప్రశ్నిస్తున్న జగన్ వర్గం ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి.

రాజీవ్‌గాంధీ అప్పటికే ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా నాలుగైదు ఏళ్లపాటు పార్టీలో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో రాజీవ్‌గాంధీ హత్యానంతరం సోనియాగాంధీ గానీ, పిన్న వయస్కులైన ప్రియాంక, రాహుల్‌గాంధీలు గానీ ప్రధానమంత్రి కాలేదే! జగన్ అనుచరులలో ఇంత వివేచన ఉంటుందనుకోవడం అత్యాశే అవుతుం ది. 2014లో అధికారంలోకి వచ్చినట్లే అని భావిస్తున్న జగన్, ఆ తర్వాత 30 సంవత్సరాలపాటు రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి పాలన అందిస్తాననీ, వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తానని చెప్పుకొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా, విజన్ 2020 అంటూ తానే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రినని కలలుగన్నారు. కానీ 2004లో ఏమైంది? ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన, ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. ఈ దేశంలో సుదీర్ఘకాలం (23 ఏళ్ల) పాటు ముఖ్యమంత్రిగా ఒక్క జ్యోతిబసు (పశ్చిమ బెంగాల్) మాత్ర మే ఉండగలిగారు. కలలు కనడంలో తప్పు లేదు. ప్రజలు ఆదరిస్తే 30 ఏళ్ళు కాదు, నాలుగైదు దశాబ్దాల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉండవచ్చు.

ఎవరు మాత్రం కాదనగలరు? 2014 నాటికి జగన్‌కు 40 ఏళ్ళు దాటుతాయి. అంటే తాను 70 సంవత్సరాల వరకు జీవిస్తానని భావించి 30ఏళ్ళపాటు అధికారంలో ఉంటానని ఆయన చెప్పుకొని ఉండవచ్చు. అంటే జీవిత కాలం ముఖ్యమంత్రిగా ఆయన తన ను తాను ఊహించుకుంటున్నారన్న మాట! రాజకీయాలలో ఉండే వాళ్లు, అనుచరులను, కార్యకర్తలను ఉత్తేజ పరచడానికి కొంత అతిశయోక్తిగా మాట్లాడడం సహజం.

జగన్ వ్యాఖ్యలను కూడా అలాగే అర్థం చేసుకోవలసి ఉంటుంది. కాకపోతే ఆయన మాటల్లో అతిశయోక్తితో పాటు అత్యాశ కనపడుతూ ఉంటుంది. ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ఇప్పటి వరకు రాజశేఖరరెడ్డి కుమారుడుగా గుర్తింపు పొందుతూ వచ్చిన జగన్, ఇకపై ఒక పార్టీ అధినేతగా ఆయా అంశాలపై తన వైఖరి స్పష్టం చేయవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, మాల- మాదిగల వర్గీకరణ వంటి అంశాలపై ఆయన తన పార్టీ వైఖరి స్పష్టం చేయవలసి ఉంటుంది.

ఇలాంటి సందర్భాలలోనే ఒకరికి మోదం కలిగితే మరొకరికి ఖేదం కలుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురయ్యే విమర్శనాస్త్రాలకు దీటుగా స్పందించవలసి ఉంటుంది. జగన్‌ను అత్యంత అవినీతిపరుడుగా, దురాశాపరుడుగా చిత్రించడానికి కాంగ్రెస్ పార్టీ, అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను ప్రయోగిస్తుంది. తాను అవినీతిపరుడిని కాదంటే, కేవలం అయిదేళ్లలో తనకు అంత సంపద చట్టబద్ధంగా ఎలా సమకూరిందో ప్రజలకు వివరించవలసిన బాధ్యత జగన్‌పై ఉంటుంది.

తనను ఆత్మ రక్షణలోకి నెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు కనుక, దాని నుంచి బయటపడటానికి జగన్ ప్రయత్నించవలసి వస్తుంది. తన తల్లి విజయమ్మను వెంటబెట్టుకుని తిరుగుతూ, వైఎస్ పేరును మరువకుండా చూసుకుంటూ, ప్రజల సానుభూతి సంపాదించడానికి ఆయన కచ్చితంగా ప్రయత్నిస్తారు.

అయితే కాంగ్రెస్ నుంచి ఎదురయ్యే దాడి ఏ రూపంలో ఉండనుంది? దానిని ఎలా అధిగమిస్తాడు? అన్న దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది... కడప ఎం.పి. స్థానానికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ఫలితాలు జగన్ విషయంలో కీలకం కానున్నాయి. కడప వంటి ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాలలో, ఓటర్లు కచ్చితమైన విభజనతో ఉంటారు. రిగ్గిం గ్ వంటి అక్రమాల వల్ల మెజారిటీలు తగ్గడం-పెరగడం జరుగుతూ ఉంటాయి.

పోలీసుల సహకారం లేకపోతే ఈ జిల్లాలో ఉప ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక కాదు. 1996లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, కడప ఎం.పి. స్థానానికి పోటీ చేసిన రాజశేఖరరెడ్డిని, అప్పటి ఎస్.పి. ఉమేష్‌చంద్ర అష్ట దిగ్బంధనం చేయడంతో, అతి కష్టం మీద అయిదు వేల పైచిలుకు మెజారిటీతో గెలిచాననిపించుకున్నారు. దీన్నిబట్టి జగన్ భవిష్యత్‌ను ముందుగా ఈ రెండు ఎన్నికలే నిర్దేశించనున్నాయి.       - ఆదిత్య