ప్రాధాన్య క్రమంలో ఆరు సిఫారసులు
అదే విధానంలో పరిష్కారానికి యత్నాలు
గురువారం ఉదయం 11 గంటలకే పార్టీలతో భేటీ
స్పందించేందుకు 10 రోజుల సమయం
స్పష్టత ఇవ్వకుంటే తుది నిర్ణయం కేంద్రానిదే
అదే విధానంలో పరిష్కారానికి యత్నాలు
గురువారం ఉదయం 11 గంటలకే పార్టీలతో భేటీ
స్పందించేందుకు 10 రోజుల సమయం
స్పష్టత ఇవ్వకుంటే తుది నిర్ణయం కేంద్రానిదే
రాష్ట్ర విభజనపై తేల్చేద్దాం... అనిశ్చితిని అంతం చేద్దాం... సాగదీతకు ఫుల్‌స్టాప్ పెట్టి, సాధ్యమైనంత త్వరలో తెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేద్దాం..!! ఇవీ కేంద్రం మదిలో తాజా ఆలోచనలు. రాష్ట్రంలో సామాజిక ఆందోళనలు.. విభజన అంశంపై కొనసాగుతున్న అనిశ్చిత వాతావరణం ఎక్కువకాలం కొనసాగితే మంచిది కాదన్న అభిప్రాయంలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే సాధ్యమైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చేయాలని కేంద్రం భావిస్తోందని హోం శాఖ వర్గాలు చెబుతున్నాయి.
శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఆరు పరిష్కార మార్గాలు చెప్పిందని, స్పష్టమైన ఆ రోడ్‌మ్యాప్‌ను ఆధారం చేసుకుని సమస్యను పరిష్కరించేందుకు కేంద్రం సమాయత్తమవుతోందని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల ఆరున ఉదయం 11 గంటలకు రాష్ట్రానికి చెందిన 8 రాజకీయ పార్టీలతో సమావేశం యథాతథంగా జరుగుతుందని, ఆ సమావేశంలో నివేదికను అందజేయడంతో పాటు.. నివేదిక సారాంశాన్ని కూడా ఇవ్వడం జరుగుతుందని సమాచారం. ఆ వెంటనే నివేదికను మధ్యాహ్నం రెండు గంటలకల్లా వెబ్‌సైట్‌లో పెట్టేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై ప్రతి స్పందించేందుకు రాజకీయ పార్టీలకు పది రోజుల పాటు సమయం ఇస్తారని తెలుస్తోంది.
నివేదికపై రాజకీయ పార్టీలు తమ తమ అభిప్రాయాలు చెప్పిన తర్వాత ఇక నిర్ణయం కేంద్రమే తీసుకుంటుందని ఈ వర్గాలు స్పష్టం చేశాయి. కాగా శ్రీకృష్ణ కమిటీ నివేదికలో సూచించిన ఆరు పరిష్కార మార్గాల్లో ఒక్కోదానికి ఒక్కో గ్రేడ్ ఇచ్చారని తెలిసింది. ఈ ఆరింటిలో మొదటి పరిష్కారమే ఉత్తమ మార్గమని కమిటీ అభిప్రాయపడుతోందని హోంశాఖ వర్గాలు చెప్పాయి. ఒక వేళ మొదటి పరిష్కారం సాధ్యం కాదని రాజకీయ వర్గాలు భావించిన పక్షంలో రెండవ పరిష్కారంవైపు దృష్టి పెడతారు.
దీన్నీ తిరస్కరిస్తే మూడోది.. అలాగే ఇతర పరిష్కార మార్గాలపైనా చర్చ జరుగుతుందని హోం శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇదే విధంగా కొనసాగించడమా? లేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడమా? సమైక్యాంధ్రలో తెలంగాణకు రాజ్యాంగ రక్షణ కల్పించడమా? వెనుకబడిన వర్గాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు సూచించడమా, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడమా? లేక రెండు ప్రాంతాల రాజధానిగా కొనసాగించడమా, మూడు రాష్ట్రాలుగా విభజించడమా, లేక రాయలసీమను తెలంగాణలో విలీనం చేయడమా? ఇలా అనేక అంశాలను కమిటీ చర్చించిందని తెలిసింది. ఇందులో ఏ పరిష్కార మార్గానికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందో ఇప్పుడే చెప్పడానికి హోంశాఖ వర్గాలు నిరాకరించాయి.
రాజకీయ పార్టీలు వెలిబుచ్చిన అభిప్రాయాల ప్రకారమే రాష్ట్రం విషయంపై కేంద్రం ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుందని ఈ వర్గాలు చెప్పాయి. వారి అభిప్రాయానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని, ఒక వేళ విభజనకే నిర్ణయించిన పక్షంలో తాత్కాలికంగా ఉభయ ప్రాంతాలకు హైదరాబాద్‌ను రాజధానిగా అంగీకరించడమో, విజయవాడ, గుంటూరులను నూతన రాష్ట్రానికి రాజధానిగా ప్రతిపాదించడమో జరుగుతుందని ఆ వర్గాలు వివరించాయి.
తాము అన్ని రకాలుగా సిద్ధమై ఉన్నామని పేర్కొన్నాయి. రాష్ట్రానికి చెందిన రాజకీయ పార్టీలు గతంలో ఒక అభిప్రాయం చెప్పి, తాము ప్రకటన చేసిన తర్వాత కేంద్రంపై నింద వేశాయని, ఇప్పుడు ఆ ఆవకాశం లేకుండా ఆ పార్టీలు స్పష్టత ఏర్పర్చుకోవాల్సి ఉన్నదని హోంశాఖ వర్గాలు భావిస్తున్నాయి.
శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను స్పష్టంగా, పరిస్థితిని యథాతథంగా నివేదించిందని, ఈ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకోలేకపోతే ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేమని, రాజకీయ పార్టీలు కూడా ఈ నివేదికను తమ నిర్ణయానికి ఆధారంగా స్వీకరించాలని ఈ వర్గాలు సూచిస్తున్నాయి. కాగా అన్ని రాజకీయ పార్టీలను కేంద్ర హోంమంత్రి చిదంబరం సంప్రదిస్తున్నారని, వారు ఢిల్లీకి వచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపాయి. వారు రాకపోతే నివేదికను వారికి చేరేలా చేస్తామని ఈ వర్గాలు చెప్పాయి.

పార్టీలు తేల్చుకోవాలి
పరిష్కారం వాటి చేతుల్లోనే
అవి కోరినంత కాలం చర్చలు
అనిశ్చితి ఎంత కాలమో నాకూ తెలియదు
6న అర్థమవుతుంది
ఇద్దరేసి చొప్పున రమ్మనడం భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించడం కాదు
ఎంత మందిని పంపాలో పార్టీల ఇష్టం
చిదంబరం వ్యాఖ్యలు
6న అర్థమవుతుంది
ఇద్దరేసి చొప్పున రమ్మనడం భిన్నాభిప్రాయాలను ప్రోత్సహించడం కాదు
ఎంత మందిని పంపాలో పార్టీల ఇష్టం
చిదంబరం వ్యాఖ్యలు
అనిశ్చితి ఎప్పుడు తొలగిపోతుందో ఆరో తేదీ దాకా నాకూ తెలియదు.. తెలంగాణకు పరిష్కారం రాజకీయ పార్టీల చేతుల్లోనే ఉంది..! కోరుకున్నంత కాలం చర్చలు జరపడానికి సిద్ధం! ఇవీ కేంద్ర హోం మంత్రి నోట వెలువడిన మాటలు!! శ్రీకృష్ణ కమిటీ నివేదిక అందజేసేందుకు ఈ నెల ఆరున ఢిల్లీలో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో చిదంబరం చేసిన వ్యాఖ్యలు! ఆహ్వానించిన అన్ని పార్టీలూ తాను ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతాయన్న ధీమా వ్యక్తం చేసిన చిదంబరం.. ఈ భేటీలో ఏ పార్టీ ఏం చెబుతుందో వేచి చూడాలని అన్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఎంతకాలం చర్చలు కొనసాగించాలన్న విషయం రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉన్నదని చెప్పారు. దాని గురించి ఆ పార్టీలే తేల్చుకోవాలని, కాలపరిమితి గురించి తాను చెప్పలేనని చిదంబరం స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు చర్చలు కొనసాగించాలని కోరుకున్నంత కాలం తాను చర్చలు జరుపుతానని తెలిపారు. సమస్యను నాన్చడానికి తాను ప్రయత్నాలు చేస్తున్నట్లు వచ్చిన వ్యాఖ్యానాల్ని ఆయన ఖండించారు. "నాకు ఉద్దేశాలు అంటకట్టకండి.'' అంటూ తీవ్రంగా ప్రతిస్పందించారు.
జవవరి 6న మీరు విస్తృత చర్చలు జరుపుతారా, లేక కేవలం నివేదిక ఇచ్చి ఊరుకుంటారా? అని అడిగినప్పుడు రాజకీయ పార్టీలు సమావేశంలో స్పందించే తీరును బట్టి చర్చలు సాగుతాయని తెలిపారు. ఈ నెల 6న కమిటీ నివేదికపై చర్చించేందుకు ఒక పార్టీ నుంచి ఇద్దర్ని ఆహ్వానించినంత మాత్రాన ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలను ప్రోత్సహిస్తున్నామని కాదని ఆయన వివరణ ఇచ్చారు.
గత జనవరి 5న ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి గురించి చర్చించేందుకు 8 పార్టీల నుంచి ఇద్దర్ని ఆహ్వానించామని, ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించామని ఆయన చెప్పారు. ఇద్దర్ని మాత్రమే పంపాలన్న నిబంధన ఏమీ లేదని, పార్టీ ఒక్కర్ని కూడా సమావేశానికి పంపించవచ్చునని చిదంబరం స్పష్టం చేశారు. పార్టీ నుంచి ఇద్దరు వచ్చినంత మాత్రాన వేర్వేరు అభిప్రాయాలు చెబుతారని కూడా చెప్పలేమని అన్నారు.
గత సమావేశంలో కూడా సీపీఎం, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎంలు ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయని చిదంబరం గుర్తు చేశారు. జనవరి 6 సమావేశాన్ని టీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీలు బహిష్కరిస్తున్న సంగతిని ప్రస్తావించగా.. "చూద్దాం..'' అన్నారు. నివేదిక అధ్యయనం చేసేందుకు టీఆర్ఎస్, సీపీఐలు సమయం కోరుతున్నాయని చెప్పినప్పుడు "వారు జనవరి 6న ఏం చెబుతారో చూడాల్సి ఉంది..'' అని స్పందించారు.
టీఆర్ఎస్ ఈ సమావేశంలో పాల్గొంటుందనే ఆశాభావాన్ని చిదంబరం వ్యక్తం చేశారు. జనవరి 6న ఏం జరుగుతుందో, పార్టీలు ఏమి చెబుతాయో చూడకుండా ఇప్పుడే తాను మాట్లాడలేనని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే అన్ని పార్టీలూ ప్రజాస్వామ్య క్రమం కొనసాగేలా చూడడం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

భయం వద్దు !

ఒక్కో పార్టీ నుంచీ ఇద్దరు ప్రతినిధుల్ని ఆహ్వానించి, కేంద్రం భిన్నాభిప్రాయాల్ని కోరుతోందని తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన ఆరోపణలను గురించి అడగ్గా చిదంబరం -‘అలా అనడం సరికాదు. తెలంగాణ అంశంపై చర్చించేందుకు కేంద్రం 2010 జనవరి 5నప్రతి పార్టీనుంచి ఇద్దరేసి ప్రతినిధుల్ని ఆహ్వానించింది. ఇప్పుడు కూడా అదే పద్ధతిని అనుసరించాం’ అన్నారు. అ యితే, ఏ పార్టీ అయినా ఒక ప్రతినిధిని కూడా పంపవచ్చ న్నారు. ‘గత ఏడాది అనుభవాన్ని బట్టి చూస్తే, ఫలానా పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులు వస్తే, వారు రెండు అభి ప్రాయాల్ని వ్యక్తం చేస్తారని అనుకోకూడదని తెలిసింది. 2010 జనవరి 5న జరిగిన సమావేశానికి సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీఆర్‌ఎస్, ఎంఐఎం నుంచి ఇద్దరేసి ప్రతినిధులు హాజరైనా, ఒక్కో పార్టీ తరఫున ఒకే అభిప్రాయం వ్యక్తమైంది.
అయినా, ఇదో సమస్య కాదు. ఆరున జరిగే సమావే శంలో టీఆర్‌ఎస్ పాల్గొంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. వారు ఒకరిని లేదా ఇద్దరిని పంపవచ్చు. అది వారిష్టం’ అని చిదంబరం పేర్కొన్నారు. ‘గురువారం సమావేశంలో తాము పాల్గొనడం లేదని ఆంధ్రప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలు ప్రకటించడం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందా?’ అని విలేకరులు అడగ్గా - ‘ఆరున ఏం జరుగుతుందో చూద్దాం’ అని చిదంబరం సమాధానమిచ్చారు. నివేదిక వెల్లడి అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి అల్లర్లు జరగవని, అల్లర్లు జరుగుతాయంటూ వస్తున్న వదంతులను నమ్మవద్దని చిదంబరం రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు లక్ష్మణరేఖ

కాంగ్రెస్‌కు చెందిన తెలంగాణ ఎంపీలను ఆ పార్టీ అధిష్ఠానం హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. తెలంగాణ ప్రాంత లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరు కూడా బుధవారం మధ్యాహ్నం హస్తినలో అందుబాటులో ఉండాలని ఆదే శించింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంగళవారం ఎంపీలకు ఫోన్ చేసి బుధవారం ఒంటిగంట వరకు ఢిల్లీకి చేరు కోవాలని సూచించారు. మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పార్టీ కోర్ కమిటీ సభ్యుడు, సీనియర్ నేత, కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ, మరో కేంద్ర మంత్రి గులాం నబీఆజాద్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్‌చార్జీ డాక్టర్ ఎం.వీరప్ప మొయిలీ తదితరులు తెలంగాణ ఎంపీలతో భేటి కానున్నారు.
పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు లేకపోలేదని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్ప టికే కొందరు ఎంపీలు ఢిల్లీ చేరుకోగా, మరి కొందరుబుధవారం ఉదయం బయలుదేరి వెళ్ళనున్నారు. సమావేశం ఎజెండా ఏమిటో ఇప్పటి వరకు ఎంపీలకు సైతం తెలియరానప్పటికీ, గత కొన్ని రోజులుగా తెలంగాణ ఎంపీల వైఖరి, ఈ నెల 6న అఖిలపక్ష సమావేశం తరువాత శ్రీకృష్ణ కమిటీ నివేదికను కేంద్రం వెల్లడించనున్న నేపధ్యంలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరుపై తగు సూచనలు చేసే అవకాశాలుంటాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
మందలింపులా?
ఇటీవలి కాలంగా పార్టీ తెలంగాణ ఎంపీల వ్యవహార శైలీపై అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు వినిపిస్తోంది. డిసెంబర్ 22 నుంచి తెలంగాణ ఎంపీలు గట్టిగా వ్యవహరించడం, విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలంటూ సీనియర్‌నేత, స్టీరింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావుతో సహా 10 మంది ఎంపీలు న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్ష ప్రారంభించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మల్యేలు వారితో పాటు దీక్షలో పాల్గొన్నారు. అంతే కాకుండా ఇద్దరు మంత్రులు సైతం దీక్షా శిబిరానికి వెళ్ళి సంఘీభావం తెలిపారు. తెలంగాణ కోసం అవసరమైతే మాతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సైతం రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఎంపీలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా హైకమాండ్‌ను ధిక్కరించే స్థాయిలో వీరు వ్యవహరించారని సీమాంధ్ర నేతలు ఇప్పటికే హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వీరి వ్యవహారం పార్టీ హైకమాండ్‌కు ఇబ్బంది కరంగా పరిణమించింది.
జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే అన్నింటికి సిద్ధమని, అవసరమైతే పదవులను సైతం వదులుకుంటామని కేకేతో సహా పలువురు నేతలు హైకమాండ్‌కు హెచ్చరించినంత పనిచేశారు. ఈ నెల 7వ తేదీ మరో సారి భేటి అయి శ్రీకృష్ణ కమిటీ నివేదికపై భవిష్యత్ కార్యచరణ రూపొందించాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ నేతల సమావేశాల్లో పలువురు నేతలు చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. దీంతో సీరియస్‌గా ఉన్న అధిష్ఠానం కంట్రోల్ చేయక పోతే మళ్ళి కొత్త సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని భావించే తెలంగాణ ఎంపీలను ఢిల్లీకి పిలిపించినట్లు ఎఐసీసీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఎంపీల తీరుపై అధిష్ఠానం నేతలు మందలించే అవకాశాలున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని, గీత దాటితే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించడమే కాకుండా ఎంపీలకు లక్ష్మణరేఖ విధించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
బుజ్జగింపులా?
తెలంగాణ ఎంపీలను బుజ్జగించేందుకే అధిష్ఠానం వారిని ఢిల్లీకి పిలిపించినట్లు పార్టీలో మరో వాదన వినిపిస్తోంది. కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి, ఎంపి అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యులు నంది ఎల్లయ్య, ఎం.ఎ.ఖాన్‌లు మినహాయించి మిగతా 10 మంది ఎంపీలు తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి సైతం వెనుకాడబోమని ఇటీవలే స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా విద్యార్ధులపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలంటీ గత వారం ఎంపీలు చేపట్టిన దీక్షకు పై నలుగురు ఎంపీలు దూరంగా ఉన్నారు.

తెలంగాణ పేరుతో ఎంపిలు తిరుగుబాటు చేస్తే ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా తయారవుతుందని పార్టీ నాయకత్వానికి భయం వెంటాడుతున్నట్లు వినిపిస్తోంది. మరో వైపు కేంద్రం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో సానుకూలంగా ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఇప్పుడే కాకుండా కొంత కాలం తరువాత తెలంగాణ ఇవ్వాలనే ఆలోచనతో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదికను చూసి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని పార్టీ ఎంపీలకు హైకమాండ్ నచ్చజెప్పే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే టిఆర్‌ఎస్‌కు లాభం చేకూరకుండా, అది కాంగ్రెస్ వల్లే వచ్చిందనే భావం ప్రజల్లో ఏర్పడే విధంగా చూడాల్సిన వసరం ఉందని, అందుకే కాస్త జాప్యం జరిగినా మీరు ఓపికపట్టాలని, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెల్లడి అనంతరం మీడియాలో ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడకుండా సంయమనం పాటించాలని పార్టీ ఎంపీలను అధిష్ఠానం నచ్చజెప్పే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలో వినిపిస్తోంది.
నేడు ఢిల్లీకి డిఎస్, సిఎం
పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉదయం వేర్వేరుగా ఢిల్లీకి బయలు దేరి వెళ్ళనున్నారు. రెండు రోజుల పాటు వీరు అక్కడే ఉంటారు. 6వ తేదీన నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశంలో కేంద్ర హోంశాఖ శ్రీకృష్ణ కమిటీ నివేదికను వెల్లడించనున్నందున వీరు హస్తినకు వెళుతున్నారు. ఢిల్లీలో అందుబాటులో ఉండాలని అధిష్ఠానం ఆదేశించడంతోనే పీసీసీ చీఫ్ డిఎస్ హస్తిన పర్యటనకు వెళుతున్నారు. ఇక అఖిలపక్ష సమావేశానికి ముఖ్యమంత్రి కూడా హాజరు కావాల్సి ఉండటంతో కిరణ్‌కుమార్‌రెడ్డి ఒక రోజు ముందుగానే ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇదిలా ఉండగా బుధవారం తెలంగాణ ఎంపీలతో అధిష్ఠానం ఏర్పాటు చేసిన సమావేశంలో వీలును బట్టి కిరణ్‌కుమార్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నారు.
మాకేనా హద్దులు ?
మాకే నా హద్దులు. సీమాంధ్ర ఎంపీలకు వర్తించవా? పార్టీ నుంచి బయటికి వెళ్ళిన జగన్‌కు మద్దతు పలుకుతూ, అతని సభలకు జనసమీకరణ చేస్తూ, చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేస్తామంటూ బెదిరిస్తున్న ఎంపీల విష యం పట్టదా? మేము పార్టీని బతికించుకోవడానికి నానా పాట్లు పడుతుంటే, వాళ్ళు పార్టీకి నష్టం కలి గించే విధంగా వ్యవహరిస్తున్నారు అని కాంగ్రెస్ తెలంగాణ ఎంపీలు అధిష్ఠానం తీరుపై తీవ్ర అసం తృప్తి వ్యక్తం చేస్తున్నారు. బుధవారం హస్తినలో హైక మాండ్ ఏర్పాటు చేసిన సమావేశం తెలంగాణ ఎంపీలను కట్టడి చేయడానికేనని ప్రధానంగా ప్రచా రం జరుగుతుండడంతో ఆ ప్రాంత ఎంపీల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ప్రజల కోసం, పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు తాము దీక్షలు చేపడితే అదేదో పెద్ద నేరంగా, పార్టీకి చేసినద్రోహంగా చిత్రీకరించి అధిష్ఠానాన్ని తప్పుదోవ పట్టించడం, కొందరి మాటలు విని హైకమాండ్ తమతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఇటూ పార్టీలో, అటు ప్రజల్లో తాము చులకనయ్యే అవకాశాలుంటాయని ఎంపీలు మండిపడుతున్నారు.
శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చిన పక్షంలో తాము మౌనంగా ఉంటే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను క్షమించరని, తెలంగాణకు అంగీకరించి కమిటీ వేసి ఇప్పుడేమో తెలంగాణ ఇచ్చేది లేదంటే జనం కాంగ్రెస్‌ను ఎన్నడు నమ్మె పరిస్థితి ఉండదని తెలంగాణ ఎంపీలు అంటున్నారు. పైగా తాము ఇటీవల దీక్షలు చేపట్టింది కూడా విద్యార్ధులపై కేసుల ఎత్తివేత కోసమే తప్ప, మరొకటి కాదన్నారు. గత ఏడాది డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటనను, పార్లమెంట్‌లో ఇచ్చిన హమీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనందుకే తాము దీక్షలు చేపట్టాల్సి వచ్చిందని వారంటున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాల మేరకు పనిచేయక పోతే తెలంగాణలో పార్టీకి పుట్టగతులు ఉండని పరిస్థితులు వస్తాయని ఒక ఎంపీ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాము ఉద్యమించక పోతే రేపటి రోజు తెలంగాణలో జనం కాంగ్రెస్‌ను నమ్మే పరిస్థితి ఉండదని, తెలంగాణలో కాంగ్రెస్ బతికి ఉండాలంటే తాము నడుస్తున్న దారి సరైనదని మరో ఎంపీ వ్యాఖ్యానించారు.
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ మోసం చేస్తున్నదని ప్రజల్లో భావం ఏర్పడుతున్నదని, అలాంటి పరిస్థితులు రాకుండా తాము ప్రయత్నిస్తున్నామని ఒక ఎంపీ అన్నారు. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన జగన్‌కు మద్దతుగా నిలుస్తూ, అతని సభలకు జనసమీకరణ చేస్తూ, ఓదార్పు యాత్ర కోసం కార్యాలయాలను నెలకొల్పుతూ, సోనియాకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జగన్ మాట్లాడినా అతని వెంటే ఉంటూ అతనికి జై కొట్టడమే కాకుండా, చర్యలు తీసుకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరిస్తున్న సబ్బం హరి లాంటి ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సీనియర్ ఎంపి ఒకరు ప్రశ్నించారు.
వాళ్ళు పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరిస్తున్నా అధిష్ఠానం మౌనంగా ఉంటున్నదని, తాము పార్టీని పటిష్టం చేయడానికి దీక్షలు, తెలంగాణకు మధ్దతుగా మాట్లాడితే ఏదో నష్టం జరిగిపోయినట్లు స్పందించిన తీరు బాగులేదని ఆ ఎంిపీ అధిష్ఠానం వైఖరి పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టికెట్ల కోసం చూసుకుంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదని మరో ఎంపి వ్యాఖ్యానించారు. రేపు ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది అధిష్ఠానమే అయినా ఓట్లు వేసే జనం పక్షాన నిలబడక పోతే, వారి సానుభూతి, సహకారం లేక పోతే గెలువగలమా? అధిష్ఠాం గెలిపిస్తుందా? అని ఆ ఎంపి ప్రశ్నించారు. తాము తెలంగాణ ప్రజల అభిష్ఠాల మేరకే వ్యవహరిస్తున్నామని, ఎక్కడ కూడా పార్టీకి నష్టం కలిగించే రీతిలో వ్యవహరించడం లేదని ఎంపీలు పేర్కొన్నారు. బుధవారం హైకమాండ్‌తో జరిగే భేటిలో ప్రణబ్, ఆజాద్, మొయిలీలకు తమ వాదనలు వినిపించేందుకు తెలంగాణ ఎంపీలు సిద్ధమవుతున్నారు.
చేతులెత్తేసిన కిరణ్, డీఎస్

శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వివరాల వెల్ల డికి సమయం సమీపిస్తోన్న నేప థ్యంలో తమ పార్టీకి చెందిన పార్ల మెంటు సభ్యులను కట్టడి చేసే బాధ్య తను అధిష్ఠానమే స్వయంగా భుజం మీద వేసుకుంది. అయితే, ఆ అం శంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ తమ వల్ల కాదంటూ చేతులెత్తేయడ ంతో నేరుగా అధిష్ఠానమే రంగంలో దిగడం అనివార్యమయింది. విశ్వస నీయ సమాచారం ప్రకారం... శ్రీ కృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు అను కూలంగా రాకపోతే రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ప్రభుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, తాను ఎన్నిసార్లు స్వయంగా వెళ్లి నచ్చచెబుతున్నా మాట వినడం లేదని పీసీసీ అధ్యక్షుడు డిఎస్ అధిష్ఠానానికి మొరపెట్టుకున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వైఖరి వల్ల టీఆర్‌ఎస్ లాభపడటమే కాకుండా, తెలంగాణవాదం బలపడి అది ప్రత్యక్షంగా శాంతిభద్రతల సమస్యగా మారి, పరోక్షంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తోందని సీఎం కూడాఫిర్యాదు చేశారు. ఇటీవల చేపట్టిన దీక్ష వల్ల సొంత పార్టీ ఎంపీలే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న భావన ప్రజల్లో నెలకొందని సీఎం నాయకత్వానికి వివరించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉండాలన్న తమ మాటను ఎవరూ లెక్కచేయకుండా, తెలంగాణపై గట్టిగా మాట్లాడకపోతే ఎక్కడ వెనుకబడి పోతామోనన్న భయంతో కాంగ్రెస్ ఎంపీలు సొంత అజెండాతో వెళ్లి ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారని కిరణ్ నాయకత్వానికి వివరించారు.
తాను కూడా వారికి ఇటీవలి కాలంలో నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ఎవరూ మాటవినడం లేదన్నారు. దానికితోడు.. వెంకట స్వామి, కేశవరావు, హన్మంతరావు, మధుయాష్కీ, సర్యే సత్యనారా యణ, వివేక్ వంటి నాయకులంతా సీనియర్లయినందున తన స్థాయి కూడా సరిపోవడం లేదని, వారికి తాను చెప్పినా వినే పరిస్థితి లేదని కిరణ్ తన నిస్సహాయత వ్యక్తం చేశారు. ఆయన ప్రధానంగా కేశవరావు మీదే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కేకేనే దీనిని తెర వెనుక ఉండి నడిపిస్తున్నారంటూ ప్రభుత్వానికి అందిన నివేదికలను కిరణ్ తన వాదనలకు మద్దతుగా పంపించారు. అయితే నిజానికి.. రాష్ట్రంలో నెలకొన్న తెలంగాణ వేర్పాటువాద ఉద్యమం, జగన్ తిరుగు బాటు వ్యవహారాన్ని తాను సమర్థవంతంగా అణచివేస్తానన్న భరోసా ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తీసుకున్న కిరణ్, తీరా అధిష్ఠానానికి తానిచ్చిన హామీలలోనే వైఫల్యం చెందడ ం ప్రస్తావనార్హం.
వైఎస్ మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జగన్ వ్యవహారంపై స్పీకర్ హోదాలో ఎప్పటికప్పుడు నివేదికలు పంపించడంతో పాటు, అనేకసార్లు స్వయంగా అధిష్ఠానం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఢిల్లీకి దగ్గర య్యారు. ఆ తర్వాత కీలకమైన ఆ రెండు అంశాలపై నిర్దిష్ట హామీ ఇచ్చి సీఎం పదవి పొందిన కిరణ్, ఇప్పుడు తెలంగాణ అంశాన్ని నియంత్రించడం తన వల్ల కాదంటూ చేతులెత్తేడయం చర్చనీయాంశమయింది. జగన్ వైపు రెడ్డి వర్గం వెళ్లకుండా ఉండేందుకే మంత్రివర్గంలో ఆ వర్గానికి ఎక్కువ స్థానాలు, కీలక హోదాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన కిరణ్, తెలంగాణ అంశంలో తానిచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయి, చివరకు ప్రణబ్‌ను ఆశ్రయించవలసి వచ్చింది.
తాము చెప్పినా వినే పరిస్థితి లేకపోవడం, తన స్థాయి, అనుభవం, వయసుకు మించి నాయకులు ఉండటంతో.. మీరు జోక్యం చేసుకోకుంటేనే జనవరి 6 తర్వాత పరిస్థితులు ప్రభుత్వం చేతులో ఉంటాయని ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పిన తర్వాతే ప్రణబ్ ముఖర్జీ రంగప్రవేశం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీ కావాలని తెలంగాణ ఎంపీలందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఆ భేటీకి బహుశా ముఖ్యమంత్రితో పాటు, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ కూడా హాజరుకావచ్చంటు న్నారు. తాజా పరిస్థితి, పరిణామాలు పరిశీలిస్తే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి చేతులు దాటినట్లు స్పష్టమవుతోంది. వారిద్దరికీ ఎవరూ మాట వినడం లేదన్న వాస్తవం రుజువయిపోయింది.
అంతా ఢిల్లీ స్థాయి నేతలు కావడం, వారికి అధిష్ఠానంలో ఏదో ఒక స్థాయిలో పలుకుబడి ఉండటంతో సీఎం, డీఎస్ చేతులెత్తేయవలసి రావడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ప్రస్తుత తెలంగాణ సీనియర్ల అనుభవం-వయసుతో పోలిస్తే చిన్నవాడు కావడం కూడా ఇబ్బందికలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలోనూ దాదాపు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే భవిష్యత్తులో కూడా సీఎం, పీసీసీ అధ్యక్షుడిని పక్కకుపెట్టి.. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఇక నేరుగా అధిష్ఠానమే చూసేలా ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణులలో ఏర్పడుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల వైఖరి వల్ల టీఆర్‌ఎస్ లాభపడటమే కాకుండా, తెలంగాణవాదం బలపడి అది ప్రత్యక్షంగా శాంతిభద్రతల సమస్యగా మారి, పరోక్షంగా ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తోందని సీఎం కూడాఫిర్యాదు చేశారు. ఇటీవల చేపట్టిన దీక్ష వల్ల సొంత పార్టీ ఎంపీలే సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారన్న భావన ప్రజల్లో నెలకొందని సీఎం నాయకత్వానికి వివరించారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదికకు కట్టుబడి ఉండాలన్న తమ మాటను ఎవరూ లెక్కచేయకుండా, తెలంగాణపై గట్టిగా మాట్లాడకపోతే ఎక్కడ వెనుకబడి పోతామోనన్న భయంతో కాంగ్రెస్ ఎంపీలు సొంత అజెండాతో వెళ్లి ప్రభుత్వానికి సమస్యలు సృష్టిస్తున్నారని కిరణ్ నాయకత్వానికి వివరించారు.

వైఎస్ మృతి చెందిన తర్వాత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, జగన్ వ్యవహారంపై స్పీకర్ హోదాలో ఎప్పటికప్పుడు నివేదికలు పంపించడంతో పాటు, అనేకసార్లు స్వయంగా అధిష్ఠానం వద్ద పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి, ఢిల్లీకి దగ్గర య్యారు. ఆ తర్వాత కీలకమైన ఆ రెండు అంశాలపై నిర్దిష్ట హామీ ఇచ్చి సీఎం పదవి పొందిన కిరణ్, ఇప్పుడు తెలంగాణ అంశాన్ని నియంత్రించడం తన వల్ల కాదంటూ చేతులెత్తేడయం చర్చనీయాంశమయింది. జగన్ వైపు రెడ్డి వర్గం వెళ్లకుండా ఉండేందుకే మంత్రివర్గంలో ఆ వర్గానికి ఎక్కువ స్థానాలు, కీలక హోదాలు ఇవ్వాలని పట్టుపట్టి విజయం సాధించిన కిరణ్, తెలంగాణ అంశంలో తానిచ్చిన హామీని నెరవేర్చడంలో విఫలమయి, చివరకు ప్రణబ్‌ను ఆశ్రయించవలసి వచ్చింది.
తాము చెప్పినా వినే పరిస్థితి లేకపోవడం, తన స్థాయి, అనుభవం, వయసుకు మించి నాయకులు ఉండటంతో.. మీరు జోక్యం చేసుకోకుంటేనే జనవరి 6 తర్వాత పరిస్థితులు ప్రభుత్వం చేతులో ఉంటాయని ముఖ్యమంత్రి విస్పష్టంగా చెప్పిన తర్వాతే ప్రణబ్ ముఖర్జీ రంగప్రవేశం చేశారు. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు భేటీ కావాలని తెలంగాణ ఎంపీలందరికీ ఆదేశాలు జారీ చేశారు. ఆ భేటీకి బహుశా ముఖ్యమంత్రితో పాటు, పీసీసీ అధ్యక్షుడు డీఎస్ కూడా హాజరుకావచ్చంటు న్నారు. తాజా పరిస్థితి, పరిణామాలు పరిశీలిస్తే.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి చేతులు దాటినట్లు స్పష్టమవుతోంది. వారిద్దరికీ ఎవరూ మాట వినడం లేదన్న వాస్తవం రుజువయిపోయింది.
అంతా ఢిల్లీ స్థాయి నేతలు కావడం, వారికి అధిష్ఠానంలో ఏదో ఒక స్థాయిలో పలుకుబడి ఉండటంతో సీఎం, డీఎస్ చేతులెత్తేయవలసి రావడం చర్చనీయాంశమయింది. ప్రధానంగా.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ ప్రస్తుత తెలంగాణ సీనియర్ల అనుభవం-వయసుతో పోలిస్తే చిన్నవాడు కావడం కూడా ఇబ్బందికలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన మంత్రివర్గంలోనూ దాదాపు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుత పరిణామాలు చూస్తే భవిష్యత్తులో కూడా సీఎం, పీసీసీ అధ్యక్షుడిని పక్కకుపెట్టి.. ఇక రాష్ట్ర పార్టీ వ్యవహారాలను ఇక నేరుగా అధిష్ఠానమే చూసేలా ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణులలో ఏర్పడుతోంది.
No comments:
Post a Comment