Friday, December 31, 2010

శ్రీకృష్ణ కమిటీ నివేదిక

6 దాకా ఆగాలి
తెలంగాణ, సమక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీ గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి చిదరంబరానికి తన నివేదికను సమర్పిం చింది. నిర్దేశించిన గడువుకు ఒకరోజు ముందే భారీ నివేదికను అందించింది. రెండు సంపుటాలుగా ఉన్న ఈ నివేదికలో తొలి భాగంలోనే కీలకాంశాలు చేర్చినట్లు శ్రీకృష్ణ తెలిపారు. జనవరి 6న రాష్ట్రానికి చెందిన 8 పార్టీలకు నివేదికను అందించి ఆయా పార్టీలతో చర్చించిన అనంతరమే నివేదికను మీడియాకు వెల్లడిస్తామని చిదంబరం ఒక ప్రకటనలో తెలిపారు.

SKC-Report 
రాష్ట్రంలో 2009 డిసెంబర్‌ 9 అనంతరం జరిగిన పరిణామాలపై అధ్యయనం చేసేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటి గురువారం మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరంతో ఆయన కార్యాలయం నార్త్‌ బ్లాక్‌లో భేటీ అయి నివేదిక సమర్పించింది. నివేదిక సమర్పించేందుకు ముందు కమిటీ తమ కార్యాలయం విజ్ఞాన్‌ భవన్‌లో సుమారు రెండు గంటలపాటు సమావేశమయింది. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అక్కడి నుంచి బయలు దేరి నార్త్‌ బ్లాక్‌ చేరుకుని సుమారు 2.30 నిమిషాల ప్రాంతంలో హోంశాఖ మంత్రి చిదం బరంకు నివేదిక సమర్పించింది.కూలంకుశంగా రాష్ట్రంలోని అన్నిశ్రేణుల ప్రజల, రాజకీయ పార్టీల, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించిన సమాచారాన్ని, సూచనలను పొందు పరుస్తూ కమిటీ రెండు సంపుటాలుగా విభజించి నిర్ధేసించుకున్న గడువులోగానే నివేదిక సమర్పించింది.

krishaa 
నివేదిక సమర్పించిన పిదప జస్టిస్‌ శ్రీకృష్ణ హోంమంత్రి కార్యాలయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. రాష్ర్టంలో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల, మేథావుల, రాజకీయ పార్టీల నుంచి సేక రించిన వినతి పత్రాలను, అభిప్రాయాలను క్రోడీక రించామని, అందుబాటులో ఉన్నమేరకు సేకరించిన సమాచారాన్ని విపులంగా ప్రభుత్వానికి సమర్పించా మన్నారు. నివేదికలోని మొదటి సంపుటిలో నీటి పారుదల, హైదరాబాదు అంశం, ఉపాది, ఉద్యోగం, వనరుల పంపిణీలపై సూచనలను పొందుపరిచి నట్లు అన్నారు. రెండవ అనుబంధ సంపుటిలో సమాచార సేకరణకు వినియోగించిన గ్రంథాలు, దత్తాంశం తదితర వివరాలను నిక్షిప్తం చేసినట్లు జస్టిస్‌ శ్రీకృష్ణ పేర్కొన్నారు. నివేదిక సమర్పిం చేందుకు ఆ కమిటి ఛైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ, సభ్య కార్యదర్శి దుగ్గల్‌, సభ్యులు రవీందర్‌కౌర్‌, అబుసలీ షరీఫ్‌ హాజరయ్యారు.

రాజకీయ పార్టీలకు హోంశాఖ ఆహ్వానం

శ్రీకృష్ణ కమిటి సమర్పించిన నివేదికపై అభిప్రా య సేకరణకు రాష్ట్రంలోని 8 గుర్తింపు పొందిన రాజ కీయ పార్టీలను 2011 జనవరి 6 ఢిల్లీకి ఆహ్వాని స్తున్నట్లు హోంశాఖ మంత్రి చిదంబరం పేర్కొ న్నారు. నివేదిక స్వీకరించిన అనంతరం హోంశాఖ పత్రికలకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. 2010 ప్రశాంత వాతా వరణంలో గడిచిందని రాష్ట్రంలోని ప్రజలు ఎంతో సంయమనం పాటించారని హోంశాఖ ప్రజలకు కితాబిచ్చింది. ఇప్పటికే అన్నిరాజకీయ పార్టీలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించే ఎలాంటి భాషణలు చేయమని హామీ ఇచ్చాయని, నాయకులందరూ ఇచ్చిన హామీ నిలుపుకుంటారని ఆశిస్తున్నామన్నారు.

రాష్ట్రంలో మొహరించిన పోలీ సు అదనపు బలగాలు కేవలం ముందుజాగ్రత్త చర్య గా అభివర్ణించింది. దీనిపై ప్రజలు ఆందోళన చెందే అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపై కూడా అన్ని రాజకీయ పార్టీలు ప్రజలు తమ మద్దతును ప్రభు త్వానికి అందించాలని విజ్ఞప్తి చేసింది. రాజకీయ పార్టీలతో సమావేశం అనంతరం నివేదికపై ప్రభు త్వం ఓ నిర్ణయానికొస్తుందని హోంశాఖ వెల్లడిం చింది. జనవరి 6 సాయంత్రం శ్రీకృష్ణ కమిటి నివేది కను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ఇంటర్‌నెట్‌ ద్వారా ప్రజ లకు అందుబాటులో వుంటుందని ప్రకటించారు.

రాజకీయ పార్టీల పెదవివిరుపు....
శ్రీకృష్ణ కమిటీ గురువారం నివేదిక సమర్పించిన అనంతరం హోంశాఖ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో జనవరి 6 న సమావేశమై పార్టీ ప్రతినిధుల అభిప్రాయ సేకరణ చేస్తామని ప్రకటిం చింది. హడావుడిగా రెండు సంపుటాలకు సంబం ధించిన నివేదికలోని ముఖ్యాంశాలను రాజకీయ పార్టీల ముందుంచి వారి నుంచి అభిప్రాయ సేకరణ చేయడం ఏమాత్రం సమంజసంగా వుంటుందని కొందరు రాజకీయ నాయకులు పెదవి విరుస్తు న్నారు. నివేదికలోని కీలకాంశాలు మాత్రమే తమ దృష్టికి తీసుకుని వచ్చి అభిప్రాయ సేకరణ జరిపితే ఒనగూరే ప్రయోజనమేమిటని తమ అసంతృప్తిని వెల్లడించే అవకాశాలు వున్నాయి.

ఈ సమావేశం సుమారు నాలుగు గంటల వ్యవధి వుండే అవకాశం వున్నట్లు ఇప్పటికే రాజకీయ పార్టీలకు పంపిన ఆహ్వానంలో హోంశాఖ వెల్లడించినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని రాజకీయ పార్టీలు ఈ సమావేశం కేవలం నామమాత్రంగా వుండబోతోందని, నివేదిక ప్రతులను తమకు అందించకుండా కేవలం క్లుప్తంగా వివరించి అభిప్రాయ సేకరణ చేయడంలో హోంశాఖ ఆంతర్యం ఏమిటని ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.నీసం నాలుగురోజులు ముందయినా నివేదిక ప్రతులను రాజకీయ పార్టీలకు అందించి అభి ప్రాయ సేకరణ కోరడం తమకు అనుకూలంగా వుంటుందని రాజకీయ పార్టీలనుంచి అభిప్రా యాలు వినవస్తున్నాయి.

Wednesday, December 29, 2010

ఆంధ్రప్రదేశ్‌పై మేమిచ్చే నివేదికతో శాశ్వత పరిష్కారం

ఒక రోజు ముందే నివేదిక సమర్పణ! 

AP-Map

అత్యధికులకు అత్యధిక సంతోషం
నిర్ణయం ఇక కేంద్రం చేతుల్లోనే
శాంతి భద్రతలకు ప్రమాదం లేదు
నివేదిక అమలు ఎప్పుడు? ఎలా? అన్నది మాత్రం లక్ష వరహాల ప్రశ్న
ముందు జాగ్రత్త కోసమే బలగాలు
విలేకరుల సమావేశంలో శ్రీకృష్ణ
నివేదిక రెండు సంపుటాల్లో
మార్గాంతరాలు చెప్పాం: దుగ్గల్
"నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దాన్ని అధికారికంగా బయటపెడుతుందా? అనధికారికంగా వెల్లడిస్తుందా? అన్నది చెప్పలేం. మీ ఊపిరి బిగబట్టుకోండి.. నాలుగైదు రోజులు ఆగండి.. ప్రభుత్వం మా నివేదికను అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వండి...'' - శ్రీకృష్ణ

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వనున్న తమ నివేదిక రాష్ట్ర విభజన సమస్యకు శాశ్వత పరిష్కారం సూచిస్తుందని భావిస్తున్నట్టు శ్రీకృష్ణ కమిటీ చైర్మన్, సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీఎన్ శ్రీకృష్ణ చెప్పారు. గడువు ప్రకారం తమ నివేదికను ఈ నెల 31లోపు కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని స్పష్టం చేశారు. నివేదికలో అన్ని అంశాల గురించి చర్చించామన్నారు. వాటిని వెల్లడించేందుకు ఆయన తిరస్కరించారు.

అయితే.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా పరిశోధించి తయారు చేసిన నివేదిక ఇదని చెప్పారు. తమ సిఫారసులపై ఇక ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని చెప్పారు. కమిటీ సభ్యులతో కలిసి ఆయన మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ముంబై అల్లర్లపై తన నివేదికను అమలు చేయలేదన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ అది నిజమేనని, ఈ కమిటీ నివేదికను కూడా ప్రభుత్వం ఎప్పుడు, ఎలా అమలు చేస్తుందనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న చెప్పారు.

60 ఏళ్లుగా పరిష్కారంకాని సమస్యను మీ నివేదిక పరిష్కరిస్తుందని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు.. దీర్ఘకాలికంగా పరిష్కారం కావల్సిన సమస్యలు కొంత కాలంలోనే పరిష్కారమైన దాఖలాలున్నాయని ఆయన సోదాహరణంగా చెప్పారు. 25 సంవత్సరాలుగా పిల్లలు పుట్టలేదని బాధపడుతున్న దంపతులకు 9 నెలల్లో పిల్లలు కలిగిన సందర్భాలు తనకు తెలుసునని ఆయన అన్నారు. తమ నివేదిక అత్యధికమంది ప్రజలకు అత్యధిక సంతోషాన్ని కలిగిస్తుందని జస్టిస్ శ్రీకృష్ణ చెప్పారు.

తమ నివేదిక తర్వాత ఎలాంటి శాంతి భద్రతల సమస్యలూ తలెత్తవని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ బలగాలు రాష్ట్రానికి తరలించడం సాధారణ భద్రతా ఏర్పాట్లలో భాగమని, ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇలాంటి చర్యలు తీసుకుంటారని, అది ప్రభుత్వ బాధ్యత అని ఆయన చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత దేశానికి వచ్చినప్పుడు, కామన్‌వెల్త్ క్రీడలు జరిగినప్పుడు ముందు జాగ్రత్త చర్యలుగా భద్రతా దళాలను నియమించారని, అయినప్పటికీ ఒక్క సంఘటన కూడా జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.

భద్రతా దళాలను నియమించడం ద్వారా ప్రభుత్వం సమస్యకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవాలని అన్నారు. నివేదిక ఎలా ఉన్నా, శాంతిని కాపాడేందుకు అన్ని వర్గాలు సహకరించాలని ఆయన పదే పదే పిలుపునిచ్చారు. రాజకీయ పార్టీలన్నీ తమకు శాంతిని కొనసాగించేందుకు సహకరించాయని, వారు చెప్పేదాన్ని నమ్మాలని ఆయన అన్నారు. ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు అంతా శాంతియుతంగా జరిగిందని, ఇక ముందు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

డిసెంబర్ 31లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ నివేదిక సమర్పిస్తామని, తానెన్నడూ తనకిచ్చిన గడువును దాటలేదని అన్నారు. అయితే.. 30న ఈ నివేదికను చిదంబరానికి అందజేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 31న చిదంబరం ఒక కార్యక్రమం నిమిత్తం అరుణాచల్ ప్రదేశ్ వెళుతున్నారని సమాచారం. ఈ రీత్యా 30వ తేదీనే నివేదికను శ్రీకృష్ణ కమిటీ ఆయనకు సమర్పించే అవకాశం ఉందని హోం శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

కాగా.. నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన తర్వాత దాన్ని అధికారికంగా బయటపెడుతుందా, అనధికారికంగా వెల్లడిస్తుందా చెప్పలేమని శ్రీకృష్ణ అన్నారు. నివేదిక సమర్పించడంతో తమ పని పూర్తవుతుందని తెలిపారు. కేంద్ర హోంమంత్రి చిదంబరం నక్సలైట్ సమస్యను సమీక్షించేందుకు గడ్చిరోలీలో ఉన్నారని, ఆయన వచ్చిన వెంటనే నివేదికను సమర్పిస్తామని చెప్పారు. నివేదికపై ఎందుకింత ఆసక్తి నెలకొన్నదో తనకు అర్థం కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శిశువు జన్మించేముందు కూడా అది మగా, ఆడా తెలుసుకునే ఆసక్తి ఉంటుందని, కానీ లింగ నిర్థారణ పరీక్షలను నిషేధించినందువల్ల అలా ముందుగా తెలుసుకునే వీలు లేదని అన్నారు. అలాంటి నిషేధం నివేదికల విషయంలో కూడా ఉండాలని ఆయన అన్నారు. "మీ ఊపిరి బిగపట్టుకోండి.. నాలుగైదు రోజులు ఆగండి.. ప్రభుత్వం మా నివేదికను అధ్యయనం చేసేందుకు సమయం ఇవ్వండి..'' అని ఆయన అన్నారు. నివేదిక ఎన్ని పేజీలున్నదీ, ఎంత పెద్దదీ, చిన్నదీ అన్నది ప్రధానం కాదని, అందులో ఏం చెప్పారో ప్రధానమని అన్నారు.

మార్గాంతరాలూ.. పర్యవసానాలు.. : దుగ్గల్
తమ నివేదిక రెండు సంపుటాల్లో ఉంటుందని కమిటీ సభ్య కార్యదర్శి వీకే దుగ్గల్ చెప్పారు. తమకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సానుకూల ప్రతిస్పందన లభించిందని, అన్ని వర్గాలతో సవివరంగా మాట్లాడామని తెలిపారు. నివేదిక రూపకల్పనకు కొన్ని సంస్థల మద్దతు కూడా తీసుకున్నామన్నారు. తమ నివేదిక మొదటి సంపుటంలో సమస్యకు సంబంధించిన అన్ని అంశాలకు అధ్యాయాల వారీగా కేటాయించామని, పలు మార్గాంతరాలను, పర్యవసానాలను సూచించామని దుగ్గల్ వెల్లడించారు.

విధి విధానాల్లో ప్రస్తావించిన ప్రతి అంశాన్నీ వివరణాత్మకంగా పరిశీలించామని, ప్రస్తుత సమస్య (తెలంగాణ) వెలుగు నీడలన్నింటినీ విశ్లేషించామని ఆయన చెప్పారు. రెండవ సంపుటిలో అనుబంధాలు ఉన్నాయని చెప్పారు. ముద్రణలో ఉన్నందున ఎన్ని పేజీలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేనని, తమ నివేదిక భారీగానే ఉంటుందని అన్నారు. మార్గదర్శకాల్లో మొదటి అంశం ప్రధానమైనదని, దానిపై పూర్తి దృష్టి కేంద్రీకరించామన్నారు.

బాగా పరిశోధన చేసిన, నిష్పాక్షికమైన, వృత్తి నైపుణ్యంతో కూడిన నివేదిక తమదని ప్రతి రాజకీయ నాయకుడూ అంగీకరిస్తారని ఆయన చెప్పుకున్నారు. శాంతి భద్రతలను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అని, 1969, 1972, 2009లోనూ, ఇటీవలి కాలంలోనూ ప్రభుత్వం ఏ విధంగా శాంతిభద్రతలను కాపాడిందో అదే విధంగా చర్యలు తీసుకోవడం సహజమని దుగ్గల్ అన్నారు. పార్టీలు, నాయకులందరూ నివేదిక ఎలా ఉన్నా శాంతి భద్రతలు కాపాడతామని తమకు హామీ ఇచ్చారని , ప్రజలతో మాట్లాడి శాంతికి భగ్నం కాకుండా చూస్తామని చెప్పారని కమిటీ సభ్యురాలు రవీందర్ కౌర్ తెలిపారు.

అందరికీ న్యాయం జరగాలన్న ఉద్దేశంతోనే తామీ నివేదికను రూపొందించామని, తమ సిఫారసులను అన్ని వర్గాల ప్రజలు ఆమోదిస్తారనే అభిప్రాయంతో ఉన్నామని కమిటీ సభ్యుడు అబూసలే షరీఫ్ చెప్పారు. తాము రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలూ తిరిగి ప్రజలను కలుసుకోవడంలో, సమస్యలను చర్చించడంలో ఎంతో ఆనందాన్ని పొందామని, నివేదిక రూపకల్పనలో జస్టిస్ శ్రీకృష్ణ నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉన్నదని మరో సభ్యుడు రణబీర్ సింగ్ చెప్పారు.

జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ నివేదిక ..... * పగ్గాలకోసం పరుగులు .....

రేపు నివేదిక ?
AP-Mapగడువు ముగిసేందుకు ఒక రోజు ముందే ప్రత్యేక తెలంగాణ ఏర్పా టుపై అభిప్రాయ సేకరణ జరిపిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించనున్నది. ఈ నెల 31న కేంద్ర హోంమంత్రి చిదంబరం అరుణా చల్‌ ప్రదేశ్‌ పర్యటనకు వెళ్లబోతున్నారు కనుక, 30నే శ్రీకృష్ణ కమిటీ తన నివేదికను సమ ర్పించబోతున్నట్టు తెలిసింది. కమిటీకి సారథ్యం వహిస్తున్న జస్టిస్‌ శ్రీకృష్ణ, సభ్య కార్యదర్శి దుగ్గల్‌, మరో సభ్యుడు చిదంబరాన్ని కలిసి నివేదిక సమర్పిస్తారు. కాగా, శ్రీకృష్ణ కమిటీ సభ్యులు మంగళవారంనాడు ఢిల్లీలో మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రసంగించారు

తొలుత కమిటీ చైర్మన్‌ జస్టిస్‌ శ్రీకృష్ణ మాట్లా డుతూ, ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ఇప్పటివరకు కమిటీ చేసిన పర్యటనలు, సమావేశాల వివ రాలు తెలియజేశారు. తెలంగాణ, సమైక్యాంధ్ర డిమాండ్‌లకు సంబంధించి పెద్ద మొత్తంలో వినతిపత్రాలు అందాయని తెలిపారు. వీటి ద్వారా తమకు అమూల్యమైన సూచనలు, వివిధ వర్గాల ప్రజల నుంచి సమాచారం అందిందని పేర్కొన్నారు.

srikrishana 

ఈ అధ్యయనంలో ఎన్నో సాంకేతికాంశాలు పరిగణలోకి తీసుకున్నామని,అందులో ముఖ్యంగా నీటి పారుదల, విద్యుత్‌, ఉపాధి, హైదరాబాదు అనే ముఖ్యమైన నాలుగు అంశాలపై నిపుణులతో గోష్ఠి నిర్వహించమన్నారు. కమిటీ నిర్వహించిన అధ్యయనాలలో ఎక్కువ భాగం హైదరాబాదులో చేశామన్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన వందకు పై చిలుకు రాజకీయ పార్టీలు, ఇతర మేధావులు, ప్రతినిధులతో చర్చలు నిర్వహించామని, రాష్ట్రంలోని 23 జిల్లాలలోని పలు గ్రామాలను సైతం సందర్శించి స్థానిక వర్గాలతో కూడా చర్చించి ప్రాథమిక స్థాయి సమాచారాన్ని సేకరించమన్నారు.

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు....
తమ నివేదిక రెండు సంపుటాలుగా ఉండబోతుందని, ఈ నివేదిక మెజారిటీ ప్రజలను సంతృప్తి పరిచే విధంగా వుంటుందని, కమిటీ సభ్య కార్యదర్శి దుగ్గల్‌ వెల్లడించారు. ఇరు ప్రాంతాలకు సంబంధించిన పలు విషయాలను కూలంకశంగా విశదీకరించామని, నిర్ణయించిన కాలపరిమితి లోగానే నివేదికను హోంశాఖ మంత్రి చిదంబరానికి అందజేస్తామని పేర్కొన్నారు. అయోధ్య తరహాలో ఈ నివేదిక పై కూడా అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు సంయమనం పాటించి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రభుత్వానికి సహకారం అందించాలని పిలుపునిచ్చారు. విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ తమ నివేదిక లోని ఏ ఒక్క అంశానికి సంబంధించిన ఏ విధమైన వివరాలను, వ్యక్తుల పేర్లను వెల్లడించలేమన్నారు.

సమస్య ఎంత పురాతనమైనదైనా పరిష్కారం ఉంటుందని తమ నివేదికలో పలు పరిష్కార మార్గాలను సూచించామని, అన్ని ముఖ్యమైన అంశాలను, అతి సున్నితమైన అంశాలను నివేదికలో పొందుపరిచామని వెల్లడించారు. సమస్యకు పూర్వ పరిస్థితులను పరిగణలోకి తీసుకుని అదనపు బలగాలను రాష్ట్రానికి తరలించారని రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యతని ఓ ప్రశ్న కు సమాధానంగా చెప్పారు. ఈ సమావేశంలో కమిటి లోని ఇతర సభ్యులు ప్రొ. రబీందర్‌ కౌర్‌, రణబీర్‌ సింగ్‌, డా. అబ్ధుల్‌ షరీఫ్‌, ఇతర ఉన్నతాధికారుల పాల్గొన్నారు. 

పగ్గాలకోసం పరుగులు
Narasimhan-Governor 
రాష్ట్రంలో పరి స్థితిని అధ్యయనం చేసిన జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తన నివేదిక సమర్పించిన మరుసటి రోజే గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఢిల్లీ పర్యటన జరపనున్నారు. మూడు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. రాష్టప్రతి పాలన విధిస్తారన్న ఊహాగానాలు జోరందుకుంటున్న నేపథ్యంలో గవర్నర్‌ పర్యటనకు విపరీతమైన ప్రాధాన్యం లభిస్తున్నది. తన పర్యటనలో భాగంగా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కేంద్ర హోం మంత్రి చిదం బరం, ఇతర కీలక మంత్రులను కలుసు కుంటారని తెలిసింది. కమిటీ నివేదిక వెలు వడిన మరుసటిరోజే గవర్నర్‌ హుటాహుటిన ఢిల్లీకి పరుగులు పెట్టటం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. గవ ర్నర్‌ అక్క డికి వెళ్ళి రాష్ట్రంలో నివేదిక అనంతర పరిస్థితి ఎలా ఉంటుందో చెబుతారా లేక మరేదైనా నివేదిక ఇస్తారా అనే దానిపైవిస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.

విభజన వద్దంటారా?
విశ్వసనీయ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం గవర్నర్‌కు రాష్ట్రాన్ని విడగొట్టటం సుతరామూ ఇష్టం లేదు. అలా చేయటం ద్వారా ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రాంతాలలో శాంతి భద్రతలకు చేజేతులా విఘాతం కలి గించినట్టే అవుతుందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. అసలు ఒక దశలో డిసెం బర్‌ 31 తర్వాత రాష్ట్రంలో పరిణామాలు ఏమీ మారవన్న అభిప్రాయంతో ఉన్న ఆయన ఇప్పుడు నివేదిక వచ్చీ రాగానే ఢిల్లీకి ఎందుకు పరుగులు పెడతారన్నది ప్రశ్నగా మిగులుతోంది. డిసెంబర్‌ 31 తర్వాత ఏమవుతుందని గత డిల్లీ పర్య టన సందర్భంగా అడిగితే జనవరి ఒకటి వస్తుంది అని తేలిగ్గా కొట్టి పారేశారు. ఇప్పుడేమో పరిస్థితిని మదింపు వేసుకున్న సూచనలు కనిపిస్తున్నాయి.

పగ్గాలు చేజిక్కించుకునేందుకే?...
శ్రీకృష్ణ నివేదిక స్వరూప స్వభావాల ఎలా ఉన్నా, దానిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే దాకా రాష్టప్రతి పాలన విధిస్తే సరిపోతుందని కేంద్రానికి నివే దిక సమర్పించి, వారి అంగీకారం మేరకు రాష్ట్రంలో పగ్గాలు చేజిక్కిం చుకునేందుకే గవర్నర్‌ ఢిల్లీ పర్యటన ఆంతర్యం అని రాజకీయ వర్గాలు అను మానాలు వ్యక్తం చేస్తున్నాయి. స్వతహాగా ఐపీఎస్‌ అధికారి అయిన తనకు పగ్గా లు అప్పగిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూస్తానని, ఉద్యమించే శక్తులు ఏవైనా ఉక్కు పాదంతో అణచివేస్తానని కేంద్రానికి గట్టి నమ్మకం కలిగించే ప్రయత్నాన్ని గవర్నర్‌ చేస్తారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

కిరణ్‌పై అనాసక్తి?...
నిజానికి గవర్నర్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌ పాలనా దక్షతపై పెద్దగా విశ్వాసం లేదన్న మాటలూ వినిపిస్తున్నాయి. తెలంగాణలో కానీ, సీమాంధ్రలో కానీ శ్రీకృష్ణ నివేదిక దరిమిలా పరిణామాలు హింసాత్మకమై శాంతి భద్రతల సమస్య తలెత్తితే కిరణ్‌ సర్కార్‌ నియంత్రించలేదన్న అభిప్రాయంతో గవర్నర్‌ ఉన్నట్టు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి తీసుకు వస్తే కిరణ్‌ సులభంగా లొంగిపోతారన్న అభిప్రాయం గవర్నర్‌కు ఉందని, దీనికి ఉదాహరణ ఉద్యమాల సందర్భంగా నమోదైన కేసుల నుంచి విద్యార్థులను విముక్తులను చేయాలన్న డిమాండ్‌తో తెలంగాణ ప్రాంత ఎంపీలు ఒకటిన్నర రోజులు నిరశన పాటించగానే ఆ డిమాండ్‌కు అనుకూలంగా కిరణ్‌ నిర్ణయం తీసుకోవటం గవర్నర్‌కు నచ్చలేదని విశ్వసనీయంగా తెలిసింది.

అలాగే రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా ఫ్రీ జోన్‌ అంశం తేలేదాకా ఎసై్స నియామకాలు చేపట్టరాదని రాజకీయ పార్టీలు, జేఏసీలు తీసుకు వచ్చిన ఒత్తిడికి సైతం ప్రభుత్వం లొంగిపోవటం పట్ల గవర్నర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో మున్ముందు శాంతి భద్రతల సమస్య తలెత్తితే పోలీసు హృదయంతో అణచి వేయటమే తప్ప లొంగుబాటుకు వెళ్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందని, ఈ ధైర్యం రాజకీయ పార్టీలకు ఉండదు కాబట్టి తన చేతికి పగ్గాలు ఇస్తే కేంద్రానికి ఎలాంటి తలనొప్పీ రాకుండా చూస్తానని గవర్నర్‌ తన పైరవీ తానే చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇప్పటికే జోక్యాలు...
వాస్తవానికి రాష్ట్ర గవర్నర్‌గా పగ్గాలు చేపట్టిన కొద్ది రోజులకే గవర్నర్‌ ప్రభుత్వ వ్యవహారాలను నిశితంగా పరిశీలించటం ప్రారంభించారు. తాను అందరి లాంటి గవర్నర్‌ను కాదని పదే పదే చెప్పుకున్నారు. అనేక సందర్భాలలో ముఖ్య మంత్రులు సహా సీనియర్‌ ఐఎఎస్‌, ఐపీఎస్‌, ఇంటిలిజెన్స్‌ అధికారులను పిలి పించి పరిస్థితులు తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు కేంద్రానికి నివేదికలు సమ ర్పించారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి, ఆయన మర ణం తర్వాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కె.రోశయ్య తమ రాజకీయ అనుభవం, చాతుర్యాన్నంతా ఉపయోగిస్తూ గవర్నర్‌ను మెప్పిస్తూ వచ్చారు. అనే క సందర్భాలలో రోశయ్య లౌక్యాన్ని ప్రదర్శించి గవర్నర్‌కు అవసరమైనంత మే రకే సమాచారం అందిస్తూ వచ్చారు. ప్రస్తుత సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డితో గవర్నర్‌ ఇంత వరకూ పాలనాపరమైన అంశాలపై చర్చించిన సందర్భం లేదు.

సిఫారసుల మేరకే?...
అసలు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో ఏముందో ఎవరికీ తెలియకుండానే రాష్ట్రానికి భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను రప్పించటం, ఉస్మానియా వర్సిటీలో భారీగా మోహరించి వరుసగా కవాతులు నిర్వహింపజేయటం వంటి నిర్ణయాలను డీజీపీ తీసుకోవటం వెనుక సైతం గవర్నర్‌ జోక్యం ఉందని చెబుతున్నారు. ఈ విషయంలో శ్రీకృష్ణ కమిటీతో సైతం ఆయన మాట్లాడినట్టు చెబుతున్నారు. నివేదిక సమర్పించటం వరకే తప్ప శాంతి భద్రతల విషయంలో తమకే సంబంధం లేదని మంగళవారం ఢిల్లీలో మీడియాకు చెప్పిన జస్టిస్‌ శ్రీకృష్ణ అదే సందర్భంలో శాంతి భద్రతలను పరిరక్షించటానికే అదనపు బలగాలు వెళ్ళాయని, దానివల్ల సాధారణ ప్రజానీకానికి ఇబ్బందేమీ కలగదని చెప్పటం గమనార్హం.

కాంగ్రెస్సే గెలిచింది !

kk-come
విద్యార్ధులపై కేసులు ఎత్తివేయాలన్న డిమాండ్‌తో దీక్షకు దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల వ్యూహం ఫలించింది. రెండు రోజులుగా ఈ ఎంపీలు చేస్తున్న దీక్ష కార్యక్రమం అందరూ ఊహించినట్లుగానే సుఖాంతమైంది. ఇన్నాళ్ల పాటు మొత్తం కేసుల ఎత్తివేతకు న్యాయ పరమైన చిక్కులను సాకుగా చూపిన ప్రభుత్వమే నేడు వాటిని స్వయంగా తొలగించేందుకు సిద్దమైంది. ఈ కేసుల ఎత్తివేత క్రెడిట్‌ కాంగ్రెస్‌ పార్టీకే దక్కాలన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం తీరును పరిశీలిస్తే స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయాన్ని అధికార కాంగ్రెస్‌ పార్టీ సైతం అంగీకరిస్తోంది. తెలంగాణలో తన ప్రాబల్యాన్ని పెంచుకొనేందుకే అధికార కాంగ్రెస్‌ పార్టీ ఈ రకమైన పాచికలు వేసిందని తెలుస్తోంది. తెలంగాణ పేరుపై జరిగే ప్రతి కార్యక్రమంలోనే క్రెడిట్‌తనకే దక్కేలా కాంగ్రెస్‌ నాయకత్వం వ్యూహ రచన చేస్తోంది.

న్యాయపర చిక్కులు ఇప్పుడెలా వీడుతాయి?
రాష్ట్ర విభజన ఉద్యమంలో విద్యార్ధులపై నమోదుచేసిన కేసులను ఎత్తి వేయాలన్న డిమాండ్‌ న్యాయపరమైనది అని అన్ని రాజకీయ పార్టీలు భావిం చాయి. ఈ నేపథ్యంలోనే మొన్నటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో ఉభయ సభలలో ఈ అంశంపై అన్ని పార్టీలు ముక్త కంఠంతో కేసుల ఎత్తివేతకు డిమాం డ్‌ చేశాయి. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటూ మొత్తం కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదని స్పష్టంచేసింది. కొన్ని చిన్న చిన్న కేసులు మినహా సీరి యర్‌, వెరి సీరియస్‌ కేసులను ఎత్తివేసే ప్రసక్తే లేదని ప్రభుత్వం వొక్కానించింది.

ఈ కేసులు ఎత్తివేతకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని కూడా స్పష్టం చేసింది. ఈ కారణం చేత మొత్తం కేసులను ఎత్తివేయలేమని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం కేసులు ఎత్తివేయాల్సిందేనని ప్రతిపక్షపార్టీలతోపాటు అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన తెలంగాణ ప్రజాప్రతినిధులంతా సభలో ఆందోళన వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంపై రెండున్నర రోజుల పాటు సభ కూడా స్థంబించింది. ఇంత చేసిన న్యాయపరమైన చిక్కులున్నాయని, మొత్తం కేసుల ఎత్తివేత సాధ్యంకాదని అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. కానీ ఈ సమావేశాలు ముగిసి నెల రోజులు కూడా కాకముందే కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షకు దిగడంతో మొత్తం కేసులను ఎత్తివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

న్యాయపరమైన సమస్యలను తెరపైకి తీసుకురాకుండానే అన్ని ఎత్తివేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం వెనక అసలు వ్యూహం ఏమిటో ఇట్టే తెలుస్తోంది. మొత్తం కేసుల ఎత్తివేతకు అసెంబ్లీలో ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో కోరినా స్పందించని ప్రభుత్వం ఇప్పుడు మాత్రం వాటిపట్ల సానుకూలంగా స్పం దించడం వెనక వ్యూహం దాగివుందని ఇట్టే తెలుస్తోంది. నాడు ప్రభుత్వం ఈ వ్యవహారంలో స్పందించివుంటే అధికార కాంగ్రెస్‌కే కాకుండా క్రెడిట్‌ ప్రతి పక్షపార్టీలకు దక్కేది. ఈ కారణం చేతను అసెంబ్లీ సమావేశాలలో స్పందిం చకుండా సాగదీసి కాంగ్రెస్‌ ఎంపీలు దీక్షలు చేశాక స్పందించడం క్రెడిట్‌ కోస మేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసులు ఎత్తివేస్తున్నప్పుడు క్రెడిట్‌ తమకు దక్కకపోతే ఎలా అని ఓ కాంగ్రెస్‌నేత వ్యాఖ్యనించడం గమనార్హం.

సొంత అజెండాతోనే?
తెలంగాణ సాధనకోసం అన్ని పార్టీలతో కలసి ఒకే అజెండాతో ముందుకెళ్తామని మొన్నటి వరకు చెప్పిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ప్రత్యేక అజెండాతో కదనరంగంలోకి దూకుతున్నారు. విద్యార్ధుల కేసుల ఎత్తివేతపై స్వతంత్రంగానే దీక్షలోకి దిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నాయకత్వం భవిష్యత్తులోకూడా ఇదే ధోరణీతో వెళ్లాలని యోచిస్తున్నారు. ఈ కేసులను మేమే ఎత్తివేయించామని చెప్పుకోవడంతోపాటు తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది తామే అని చెప్పుకోనే ప్రయత్నం ఇప్పటికే ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చేది, తెచ్చేది తాము అని చెప్పినందున ఈ విషయంలో తమపై బాధ్య మరింత పెరిగిందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ఈ రకమైన ప్రచారం ద్వారా తెలంగాణ ఉద్యమంలో పెద్దన్న పాత్రను పోషించేందుకు కాంగ్రెస్‌ నాయకత్వం సిద్దమవుతుంది. తద్వారా ఈ ప్రాంతంలో టిఆర్‌ఎస్‌కు చెక్‌పెట్టి క్రెడిట్‌ను దక్కించుకొనే యత్నం సాగిస్తోంది. 

కాంగ్రెస్‌ ఎంపీల దీక్ష రాజకీయ డ్రామా : ఎర్రబెల్లి కేసులు ఎత్తివేయాలంటూ కాంగ్రెస్‌ ఎంపీలు చేపట్టిన నిరాహార దీక్ష అంతా రాజకీయ డ్రామా అని టీడీపీ నేత ఎర్రబెల్లి ఎద్దేవ చేశారు. కాంగ్రెస్‌తో కేసీఆర్‌ సైతం మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నారని ఆయన విమర్శించారు. అక్రమ కేసులు పెట్టింది వాళ్లే, ఎత్తేసింది వాళ్లే... దీంట్లో కొత్త ఏముందని ప్రశ్నించారు. అసెంబ్లీని ఏడు రోజులు స్థంభింపజేశాం... పార్లమెంటును ఏనాడైనా స్థంభింపజేశారా? అని కాంగ్రెస్‌ ఎంపీలను ఆయన నిలదీశారు. చిత్తశుద్ది ఉంటే ఆమరణ దీక్ష చేయండని సవాల్‌ విసిరారు.

Tuesday, December 28, 2010

దీక్ష ఆగదు ! రాజకీయ కాంగిరేస్! * హస్తాగ్రహం * కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల సత్యాగ్రహ దీక్ష

sabitareddy

హస్తాగ్రహం
కేసుల ఎత్తివేతకు కాంగ్రెస్ తెలంగాణ ఎంపీల సత్యాగ్రహ దీక్ష
మరో 135 కేసులు రద్దు చేసిన సర్కార్ 

రాజకీయ కాంగిరేస్!
టీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టడం..
టీడీపీని ఇరుకున పెట్టడం..

జగన్ నుంచి దృష్టి మళ్లించడం!
అనేక లక్ష్యాలతోనే ఎంపీల దీక్ష?
లాభ నష్టాలపై భిన్నాభిప్రాయాలు
అధికార పార్టీ నేతలే రోడ్ల మీదికి వచ్చారు. సొంత పార్టీ ప్రభుత్వం మీదికే సమరానికి దిగారు. అధిష్ఠానాన్ని కూడా ధిక్కరిస్తామంటున్నారు. ఏమిటిది? ఇది దేనికి సంకేతం?

కేసుల ఎత్తివేతపై తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు చేపట్టిన దీక్షపై పలు రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉంటూ .. డిమాండ్ల సాధనకు దీక్షకు దిగడం చర్చనీయాంశంగా మారింది. ఈ దీక్ష ద్వారా అనేక ఫలితాలు సాధించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో పార్టీకి నష్టం జరుగుతుందని కొందరు వాదిస్తుండగా... మరికొందరు దీనిని తోసిపుచ్చుతున్నారు.

తెలంగాణ ప్రాంతంలో కొంత స్తబ్దతతో ఉన్న కాంగ్రెస్ శ్రేణుల్లో ఈ దీక్ష కదలిక తెచ్చిందని... ఇక్కడ టీఆర్ఎస్, తెలుగుదేశం పార్టీలను కట్టడి చేయడంతో పాటు.. తమ మాటకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రాధాన్యం ఇచ్చేందుకు ఉపయోగపడుతోందని అంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందు వరుసలో ఉన్న టీఆర్ఎస్‌ను వెనక్కి నెట్టేందుకు, రైతు సమస్యల అజెండాతో ముందుకు దూసుకెళ్తున్న టీడీపీని పట్టి లాగేందుకు వ్యూహాత్మకంగానే పోరుబాట పట్టినట్లు పార్టీలోని ఒక కీలక నేత ఒకరు చెప్పారు.

"ఇటీవల తెలంగాణ విషయంలో తెలుగుదేశం పార్టీ మౌనంగా ఉంది. ఎక్కడా ఇబ్బంది లేకుండా, రైతుల అజెండాతో వెళ్తోంది. కాంగ్రెస్ ఎంపీల దీక్షతో ఆ పార్టీకీ సెగ తగులుతుంది. మరోవైపు... మొన్నటిదాకా టీడీపీని మాత్రమే విమర్శించిన కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్‌పైనా ధ్వజమెత్తుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక వస్తున్న నేపథ్యంలో... ఇప్పటికిప్పుడు తెలంగాణలో గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి మారాలంటే పోరాడక తప్పదు'' అని విశ్లేషిస్తున్నారు. అలాగే... ఒకపక్క టీఆర్ఎస్, మరో పక్క జగన్ అంశాలతో తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల్లో నైరాశ్యం, అయోమయం నెలకొన్నాయి.


ఈ రెండు అంశాలను అధిగమించి కార్యకర్తల్లో ఆత్మ స్థైర్యం పెంచాలంటే ఇలాంటి దూకుడుతో కూడిన పోరాటం అవసరమని కొందరు ఎంపీలు ఈ నిరాహారదీక్షను సమర్థిస్తున్నారు. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో కొందరు నేతలు జగన్‌వైపు అడుగులు వేయడాన్ని గుర్తు చేస్తున్నారు. "తెలంగాణవాదం ఇంత బలంగా ఉన్నప్పటికీ షాద్‌నగర్‌లో ద్వితీయ శ్రేణి నేతలు జగన్ వైపు చూడటాన్ని తేలిగ్గా తీసుకోలేం. అధికార పార్టీలో ఉంటూ దీక్షలు చేయడంతో ప్రజల దృష్టి ఇటుగా మళ్లింది'' అని చెబుతున్నారు.

తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లోనూ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ దీక్షలు చేపడుతున్నాయని... వారిలో ఆత్మ స్థైర్యం పెరిగిందనేందుకు ఇదే నిదర్శనమని చెబుతున్నారు. కేసుల ఎత్తివేతపై అంతగా స్పందించని ప్రభుత్వం... ఎంపీలు దీక్ష చేపట్టిన మొదటి రోజే 135 కేసులను ఎత్తివేసిందని నేతలు గుర్తు చేస్తున్నారు. మున్ముందు మొత్తం కేసుల ఎత్తివేతకు అంగీకరిస్తే... ఆ క్రెడిట్ తమ ఖాతాలో పడుతుందని చెబుతున్నారు.

భవిష్యత్తులో కష్టమే

పార్టీ అజెండాకు, ఆదేశాలకు కట్టుబడాల్సిన ప్రజా ప్రతినిధులు అందుకు భిన్నంగా వ్యవహరించడంవల్ల భవిష్యత్తులో నష్టం తప్పదనే వారూ ఉన్నారు. పదే పదే రాజీనామాలు చేస్తామనడం, అవసరమైతే పార్టీనీ వీడతామనడం తగదంటున్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెలంగాణకు 0.01 శాతం వ్యతిరేకంగా ఉన్నా రాజీనామాలు చేస్తామని సర్వే సత్యనారాయణ వంటి నేతలు పదే పదే చెప్పడం వల్ల సమస్యలు ఎదురవుతాయని అంటున్నారు.

అదే విధంగా రోశయ్య తర్వాత సీఎంగా జైపాల్ రెడ్డికి బాధ్యతలు అప్పగించి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి తలెత్తేది కాదంటూ సర్వే పేర్కొనడం పార్టీలో చర్చనీయాంశమైంది. నిజానికి... 25వ తేదీలోపు కేసులు ఎత్తివేయకపోతే ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని ఈనెల 20నే ముఖ్యమంత్రికి తెలంగాణ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.

సీడబ్ల్యుసీ సభ్యుని స్థాయిలో... కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, మమతా బెనర్జీలు ఉన్న పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వహిస్తున్న కేశవరావుకు ఏ క్షణంలోనైనా అధిష్ఠానంతో మాట్లాడే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఆయన చెబితే ప్రణబ్ ముఖర్జీ స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి కేసులు ఎత్తివేయించలేరా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పలుమార్లు సోనియాగాంధీ, చిదంబరంలతో చర్చించినందున అక్కడి నుంచే ఒత్తిడి తెచ్చి ఉంటే బాగుండేదని కూడా అంటున్నారు.
click here
రోజంతా హైడ్రామా.. రాయబారాలు
మంత్రులతో సీఎం కిరణ్ సమీక్ష
దశలవారీగా ఎత్తివేతకు ప్రతిపాదన
జానా, సబిత, దుద్దిళ్ల రాయబారం
అన్నీ ఎత్తేయాల్సిందేనని ఎంపీల డిమాండ్
మంగళవారం నాడు కోర్టులు, విద్యాసంస్థల బంద్: దామోదర్
రంగంలోని డీఎస్.. అధిష్ఠానంతో చర్చలు
మంగళవారం కీలక ప్రకటన.. అన్ని కేసులపై సమీక్ష!
 'డిసెంబర్ 31'.. డెడ్‌లైన్ సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ కాక అధికార కాంగ్రెస్‌కూ తగిలింది. సాక్షాత్తూ కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ఎంపీలే నేరుగా రంగంలోకి దిగారు. సొంత సర్కారుపైనే యుద్ధం ప్రకటించారు. విద్యార్థులపై నమోదు చేసిన కేసులన్నిటినీ ఎత్తివేయాలంటూ సత్యాగ్రహ దీక్షకు దిగారు. ముందుగా విజ్ఞప్తి చేశామని.. ఈనెల 26 వరకు గడువు ఇచ్చి కేసులను ఎత్తివేయాలని కోరామని.. అయినా, సర్కారు స్పందించకపోవడంతో దీక్షకు దిగక తప్పలేదని స్పష్టం చేశారు. దీంతో, అందుబాటులో ఉన్న మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ సమీక్షించారు.

ఆ తర్వాత, 135 కేసులను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో 900 మందికి విముక్తి కలగనున్నట్లు వివరించింది. మిగిలిన కేసులను కూడా దశలవారీగా ఎత్తివేస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి జానారెడ్డి ప్రకటించారు. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులతో కలిసి ఆయన ఎంపీలతో చర్చలు జరిపారు. ఇప్పటికే 2341 మందిపై ఉన్న 565 కేసులను ఎత్తేశామని, 900 మందిపై ఉన్న 135 కేసులు ఎత్తివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నామని ..మరిన్ని కేసులను తొలగిస్తూ దశలవారీగా ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేశారు.

అయితే.. మంత్రుల రాయబారం విఫలమైంది. వారి హామీని ఎంపీలు తిరస్కరించారు. విద్యార్థులపై పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేసే వరకూ దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు. కేసులన్నిటినీ ఎత్తివేస్తున్నట్లు రేపే వస్తారో.. ఐదు రోజుల తర్వాత వస్తారో.. తెలంగాణ వచ్చాకే వస్తారో.. అప్పటి వరకూ దీక్ష కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసులన్నిటినీ ఎత్తివేస్తామని కేంద్ర హోం మంత్రి చిదంబరం హామీ ఇచ్చి ఏడాదైనా కేసులు ఎందుకు ఎత్తివేయలేదంటూ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరోవైపు, ఎంపీల దీక్షకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విద్యార్థి, న్యాయవాద, వైద్య, ఉద్యోగ వర్గాలతోపాటు పలు ప్రజా సంఘాల నేతలు సంఘీభావం ప్రకటించారు. వారికి మద్దతుగా మంగళవారం నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా దీక్ష చేసేందుకు సన్నద్ధమయ్యారు. అదే సమయంలో, మంగళవారం న్యాయస్థానాలు, విద్యా సంస్థలను బహిష్కరించాలని మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఎట్టకేలకు, ఇరు వర్గాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ సోమవారం రాత్రి రంగంలోకి దిగారు. అటు అధిష్ఠానంతోనూ ఇటు ముఖ్యమంత్రి, ఎంపీలతోనూ చర్చలు జరిపారు. తక్షణమే ఒక నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత పెరిగే అవకాశం ఉందని, ప్రజా ప్రతినిధులకూ పరపతి పెరుగుతుందని ఆయన సీఎంకు వివరించారు.

డీఎస్ సూచన పట్ల సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి... కేసుల ఎత్తివేతపై మంగళవారం కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, అన్ని కేసులనూ ఎత్తివేయడం కుదరదని, న్యాయపరమైన అంశాలెన్నో మిళితమై ఉన్నాయని సీఎం కార్యాలయ వర్గాలు పునరుద్ఘాటించాయి. అన్ని కేసులనూ మంగళవారం సమీక్షించి.. దశలవారీగా ఎత్తివేతకు నిర్ణయం తీసుకోనున్నట్లు వివరించాయి.

దీక్షకు దిగిందిలా...

తెలంగాణ ప్రాంత ఎంపీలు సోమవారం ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని కాంగ్రెస్ శాసన సభాపక్ష కార్యాలయంలో భేటీ అయ్యారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. ఆ తర్వాత, లిబర్టీ రోడ్‌లోని అంబేద్కర్ విగ్రహానికి, నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి, బాబూ జగజ్జీవన్‌రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. తర్వాత గన్‌పార్కులోని అమర వీరుల స్థూపం వద్ద ప్రతిజ్ఞ చేసి కాంగ్రెస్ ఎంపీలు కె.కేశవరావు, పొన్నం ప్రభాకర్, రాజయ్య, బలరాం నాయక్, మందా జగన్నాథం, సర్వే సత్యనారాయణ, గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జి.వివేక్ సత్యాగ్రహ దీక్షను ప్రారంభించారు.

మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్యలు ఇక్కడ ఎంపీలను కలిశారు. గంటపాటు మాత్రమే అక్కడ ఉండేందుకు ఎంపీలకు అనుమతి ఉంది. దీంతో, ఇదే విషయాన్ని పలుమార్లు పోలీసులు ఎంపీలకు స్పష్టం చేశారు. చివరికి, మధ్యాహ్నం 2.15 గంటలకు ఎంపీలంతా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పాదయాత్రగా వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద దీక్ష కొనసాగించారు. దీక్షలో పాల్గొనేందుకు అమెరికా నుంచి బయలుదేరిన ఎంపీ మధుయాష్కీ గౌడ్ విమానం మంచు కారణంగా రద్దవడంతో ఆయన న్యూజెర్సీ విమానాశ్రయంలో చిక్కుకుపోయారు.

సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు దీక్షకు దూరంగా ఉన్నారు. ఎంపీ సురేశ్ షేట్కర్ గన్‌పార్కు వద్దకు వచ్చినా న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రాలేదు. దీక్ష చేపట్టిన ఎంపీలకు ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, శ్రీధర్, ఆరేపల్లి మోహన్, ప్రవీణ్‌రెడ్డి, రాజయ్య, ప్రసాద్‌కుమార్, ఆర్.దామోదర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఇంద్రసేన్‌రెడ్డి, కేఆర్ ఆమోస్, మోహన్‌రెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, రాజలింగం తదితరులు సంఘీభావం ప్రకటించారు.

కాంగ్రెస్ సీనియర్ నేతలు కమలాకర్‌రావు, వినోద్, షబ్బీర్ అలీతోపాటు న్యాయవాదులు, వైద్యులు, ఇంజనీర్లు, విద్యార్థి తదితర సంఘాల నేతలు అభినందనలు తెలిపారు. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, శ్రీనివాస్‌గౌడ్‌లు ఎంపీలకు సంఘీభావం చెప్పారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో విద్యార్థులు, ఉద్యమకారులపై పెట్టిన కేసులను నేరంగా చూడకుండా ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని తాము మొదటి నుంచీ కోరుతున్నామని, సీమాంధ్రకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నందునే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు.

అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీలు నిరాహార దీక్షకు దిగారంటేనే పరిస్థితి అర్థమవుతోందని, కేసులన్నిటినీ ఎత్తివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఎలా ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేద్దామని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. కేసులన్నింటినీ ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ఫలితం లేనందునే గాంధేయ మార్గంలో సత్యాగ్రహ దీక్షకు దిగామని ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ తెలిపారు. కేసులన్నింటినీ బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఎంపీ రాజయ్య డిమాండ్ చేశారు.

ఈ అంశంపై ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నామని, ప్రభుత్వంపై యుద్ధం తప్పదని సర్వే సత్యనారాయణ హెచ్చరించారు. "ఇక్కడ షుగర్ పేషెంట్లు ఉన్నారు. ఎండ వేడిమికి తాళ లేకుండా ఉన్నాం. ఇప్పటికీ ప్రభుత్వానికి మాపై దయ రాలేదా? ఎండలోనే చంపేయాలని చూస్తోందా? పోనీ.. తెలంగాణ కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం ప్రాణాలు వదిలేస్తాం'' అని సర్వే వ్యాఖ్యానించారు.

ప్రభుత్వంతో కేసులను ఎత్తివేయించాలంటూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ డిమాండ్ చేశారు. ఇందుకు దీక్ష చేస్తే చాలదని, పదవులకు రాజీనామా చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌పై ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పెడితే ఎంపీల మద్దతు అవసరమని విస్మరిస్తే ఎలా? అని నిలదీశారు.

తాము ఎంపీ పదవుల కోసం పాకులాడడం లేదని.. తెలంగాణ కోసమే ఈ పదవుల్లో కొనసాగుతున్నామని స్పష్టం చేశారు. కాగా.. అమర వీరుల స్థూపం వద్ద దీక్ష చేస్తున్న ఎంపీలకు సీడబ్ల్యూసీ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నేత జి.వెంకటస్వామి (కాకా), ఎమ్మెల్సీలు పాలడుగు వెంకటరావు, చుక్కా రామయ్య సంఘీభావం ప్రకటించారు. కేసులు ఎత్తి వేయాలంటూ ప్రభుత్వంలో ఉన్న ఎంపీలే దీక్ష చేయడాన్ని చుక్కా రామయ్య అభినందించారు.

తెలంగాణ మంత్రులతో సీఎం సమీక్ష

తెలంగాణ ఎంపీల దీక్ష నేపథ్యంలో.. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, జానారెడ్డి, బస్వరాజు సారయ్య, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, శంకర్‌రావులతో సమీక్ష నిర్వహించారు. కేసుల ఎత్తివేతకు తాను ఏమాత్రం వ్యతిరేకం కాదని, అయితే, అన్ని కేసులనూ ఎత్తివేస్తే న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగులుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.

ఎంపీలు దీక్షకు దిగినందున మరిన్ని కేసుల ఎత్తివేతపై నిర్ణయం తీసుకోవాలని మంత్రులు సూచించారు. అందుకు అనువైన కేసులు ఉంటే పరిశీలించాలని జానారెడ్డి, సబితలకు సీఎం సూచించారు. దీంతో, కేసులను సమీక్షించిన తర్వాత 900 మందిపై ఉన్న 135 కేసులను ఎత్తి వేయవచ్చని వారు వివరించారు. మిగిలిన కేసులను అంచెలంచెలుగా ఎత్తివేద్దామని సూచించారు.

ఇందుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఇదే విషయాన్ని విలేకరులకు... తర్వాత న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో దీక్షలో ఉన్న ఎంపీలకు మంత్రులు వివరించారు. దశలవారీగా కేసుల ఎత్తివేతకు ప్రభుత్వం సన్నద్ధంగా ఉన్నందున దీక్షను విరమించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఎంపీలు దీనికి సమ్మతించలేదు. కేసులన్నీ ఎత్తేసే వరకూ దీక్షను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
click here
విద్యార్థులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలన్న డిమాండ్‌తో దీక్షలు చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు.. తమ ఆందోళన అధిష్ఠానంపై తిరుగుబాటు సంకేతాలుగా పరిణ మించే ప్రమాదం ఉందని పసిగట్టి ఆ మేరకు నష్టనివారణ కోసం సోమవారం రాత్రి పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాము ఏ పరిస్థితిలో దీక్ష ప్రారంభించామో సోనియాకు తమ లేఖలో వివరించారు. తమను అపార్ధం చేసుకోవద్దని, ఇదంతా పార్టీ పటిష్టత కోసమే చేస్తున్నందున, తమ దీక్షను అర్థం చేసుకోవాలని తమ లేఖలో అభ్యర్ధించారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష ప్రారంభించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల్లో తిరుగుబాటు మొదలయిందని, వారంతా రాజీనామాలకు సైతం సిద్ధపడుతున్నారన్న వార్తలు మీడియాలో ప్రముఖంగా రావడం చర్చనీయాంశమయింది.

దానికితోడు కొందరు సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ ఎంపీల దీక్ష వల్ల పార్టీకి నష్టంవస్తోందంటూ అధిష్ఠానానికి ఫిర్యాదులు పంపారు. ఈ విషయం తెలిసిన తెలంగాణ ఎంపీలు పరిస్థితి చేయిదాట కుండా, అధిష్ఠానం ఆగ్రహానికి గురికాకుండా యుద్ధప్రాతి పదికన చర్యలు మొదలుపెట్టారు. అందులో భాగంగానే తమ అధినేత్రికి లేఖ రాశారు. తమ దీక్ష వల్ల తెలంగాణలో కాంగ్రెస్‌ బలపడుతుందని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ మహాసభల ద్వారా తెలం గాణలో బలపడుతున్నందున, దాన్ని అడ్డుకోవాలంటే తాము కూడా తెలంగాణ సమ స్యలపై దీక్ష చేయక తప్పడం లేదని వివరణ ఇచ్చారు. దీన్ని అపార్ధం చేసుకో వద్దని, తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకుని టీఆర్‌ఎస్‌ రాజ కీయంగా ఎదుగు తోందని, అది చివరకు కాంగ్రెస్‌ పార్టీకే ప్రమాదంగా మారే పరిస్థితి ఉంది కాబట్టే తాము దీక్షకు దిగామని వివరణ ఇచ్చారు.

దానితో పాటు కేసుల ఎత్తి వేతపై తాము గతంలోనే సీఎంని కలసి అభ్యర్థించామని, ఆయన స్పందన పేల వంగా, నిర్లక్ష్యంగా ఉందని ఫిర్యాదు చేశారు. అదే సమ యంలో డిసెంబర్‌ 31 నేపథ్యంలో విద్యార్ధులపై కేసులను అడ్డుపెట్టుకుని, టీఆర్‌ఎస్‌ కొత్త ఉద్యమాన్ని లేవనెత్తే అవకాశం ఉన్నందున ఆ అంశాన్ని ముందుగా తామే చేపట్టామని వివరించారు. తెలంగాణలో పార్టీ పరిరక్షణే తప్ప, తమ దీక్షలో ఎలాంటి స్వార్థం లేదని ఎంపీలు సోనియాకి రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు తెలిసింది.
కేసుల ఎత్తివేతకై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల దీక్ష మంత్రుల రాయబారం
diksha 
కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీలు సొంత సర్కార్‌తోనే యుద్ధానికి దిగారు. కిరణ్‌ కుమార్‌ సర్కార్‌తో ఢీ అన్నారు. హెచ్చరించిన విధంగానే ఆందోళన కు దిగారు. గత ఏడాది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్ధులపై బనాయించిన కేసులను ఎత్తివేయాలంటూ సోమవారం నుంచి నిరువధిక నిరాహార దీక్షకు దిగారు. డిసెంబర్‌ 25 లోగా కేసుల ఎత్తివేతపై నిర్ణయం ప్రకటించక పోతే 26 నుంచి ఆందోళనకు దిగుతామంటూ ఈ నెల 20న ఢిల్లీలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విధించిన గడువు దాటడం, ప్రభుత్వం ఎంపీల డిమాండ్‌ను తేలికగ తీసుకోవడంతో కాంగ్రెస్‌ తెలంగాణ ఎంపీలు గాంధేయ మార్గంలో, విద్యార్ధులకు న్యాయం చేకూర్చాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 10 మంది ఎంపీలు సోమవారం దీక్ష ప్రారంభించారు.

వీరి దీక్షకు పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు, సుమారు ఎనిమిది మంది ఎమ్మెల్సీలు, పలువురు పీసీసీ ఆఫీస్‌బేరర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎఐసీసీ, పీసీసీ సభ్యులు, మాజీలు సంఘీభావం తెలియజేసి కాసేపు ఎంపీలతో పాటు దీక్షలో పాల్గొన్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జి.వెంకటస్వామి, విహెచ్‌, ఎమ్మెస్సార్‌, ఎమ్మెల్సీ చుక్కా రామయ్య, ప్రజా కవి గద్దర్‌, విమలక్క, తెలంగాణ పొలిటకల్‌ జెఎసి కన్వీనర్‌ ప్రోఫెసర్‌ కోదండరాం , పలువురు తెలంగాణ న్యాయవాదు లు దీక్షా శిబిరాన్ని సందర్శించి తెలంగాణ ఎంపీలకు సంఘీభావం తెలియజేశారు.

nirasana 

ఆదివారం న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతల సమావేశంలో విద్యార్ధులపై కేసులు ఎత్తివేయక పోతే సోమవారం దీక్షకు దిగుతామని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అలా జరగక పోవడంతో సోమవారం తెలంగాణ నేతలు దీక్షకు ఉపక్రమించారు. ఎంపీలు డాక్టర్‌ కె.కేశవరావు, సర్వే సత్యనారాయణ, జి.వివేక్‌, సిరిసిల్ల రాజయ్య, కొమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మందా జగన్నాథం, పొన్నం ప్రభాకర్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డి, సురేష్‌ షేట్కర్‌, బలరాం నాయక్‌ దీక్ష చేపట్టారు. తొలుత వీరు ఉదయం అసెంబ్లీ ప్రాంగణంలోని సిఎల్పీ కార్యాలయానికి చేరుకున్నారు.

అక్కడి నుంచి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌ వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం, బషీర్‌బాగ్‌లోని బాబు జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాలలు వేశారు. అక్కడి నుంచి గన్‌పార్క్‌కు చేరుకుని తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించి ఉదయం 11 గంటల ప్రాంత నుంచి దీక్ష ప్రారంభించారు. గన్‌పార్క్‌ వద్ద దీక్ష చేపట్టేందుకు అనుమతి లేదంటూ డిసిపీలు అకున్‌స బర్వాల్‌, కమలహాస్‌రెడ్డి చెప్పిన ఎంపీలు వినలేదు. కాసేపు కూర్చొని పోతామని చెప్పి అక్కడ దీక్ష ప్రారంభించారు. మళ్ళీ పోలీసులు జోక్యం చేసుకోవడంతో మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో దీక్షాశిబిరం వేదికను గన్‌పార్క్‌ నుంచి న్యూఎమ్మెల్యే క్వార్టర్స్‌కు మార్చారు. పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, దీక్షా శిబిరానికి వచ్చి ఎంపీలకు మద్దతు ప్రకటించి వెళ్ళారు.

downdown 

ఎమ్మెల్యేలు దామోదర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, భిక్షమయ్యగౌడ్‌, శ్రీధర్‌, ఆరేపల్లి మోహన్‌, సోమారం సత్యనారాయణ, సి.లింగయ్య, కిచ్చన్నగారి లకా్ష్మరెడ్డి, పి.ప్రవీణ్‌రెడ్డి, రాజిరెడ్డి, పి.కిష్టారెడ్డి, ప్రసాద్‌కుమార్‌, సి.ప్రతాప్‌రెడ్డి, బాలు నాయక్‌, ఎమ్మెల్సీలు కె.ఆర్‌.ఆమోస్‌, భాను ప్రసాద్‌, ఇంద్రసేన్‌రెడ్డి, ఎస్‌.జగదీశ్వర్‌రెడ్డి, రాజలిం గం, బి.మోహన్‌రెడ్డి, బి.భూపాల్‌రెడ్డి, పీసీసీ నేతలు నర్సా రెడ్డి, షబ్బీర్‌ అలీ, ఫారుఖ్‌ హుస్సేన్‌, మహ్మద్‌ సిరాజుద్దీన్‌, గూడురు నారాయణరెడ్డి, జి.రత్నాకర్‌రెడ్డి, తదితరులు ఎంపీల దీక్షా శిబిరాన్ని సందర్శించి పూర్తి మద్దత ప్రకటిం చడమే కాకుండా కొంత సేపు అక్కడే వారితో గడిపారు.

మంత్రుల రాయబారం విఫలం
ఎంపీలతో తెలంగాణ మంత్రులు రెండు మార్లు జరిపిన రాయబారం విఫలమైంది. తొలుత ఉదయం దీక్ష ప్రారంభమైన కొద్ది సేపటికే గన్‌పార్క్‌ వద్ద మంత్రులు జానారెడ్డి, బస్వరాజు సారయ్య వచ్చి దీక్ష చేపడుతున్న ఎంపీలకు సంఘీభావం తెలియజేశారు. కేసులు ఎత్తివేసే వరకు దీక్ష విషయంలో ఉపసంహరణ ఉండదని తేల్చి చెప్పడంతో మంత్రులు వెనుతిరిగారు. సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీక్ష శిబిరంలో ఉన్న సీనియర్‌నేత కేశవరావుకు ఫోన్‌ చేసి ప్రస్తుతం 135 కేసులు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నామని, మిగతా కేసులను కూడా త్వరలో దశలవారిగా ఎత్తివేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

విద్యార్ధులపై మొత్తం కేసులు ఎత్తివేసే వరకు దీక్ష విరమించమని సబితకు కేకే తేల్చి చెప్పారు. దీంతో మంత్రులు సిఎం వద్ద డిజిపితో మరో సారి సమావేశమై కేసుల విషయంలో మళ్ళీ చర్చించినట్లు తెలిసింది. ఆ తరువాత రాత్రి ఏడుబావు సమయంలో మంత్రులు రెండవ దఫ రాయబారం నడిపారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కె.జానారెడ్డి, శ్రీధర్‌బాబు, బస్వరాజు సారయ్య ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు చేరుకుని ఎంపీలను దీక్ష విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేసుల ఎత్తివేత విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేశారు.

మంత్రులు కేకేతో మాట్లాడుతున్నప్పుడు మంత్రులు సబితా, జానా, కేకే, ఎంపి సర్వే సత్యనారాయణ, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డిల మద్య స్వల్ప వాగ్వివాదం జరిగింది. మంత్రులు ఎంపీలతో మాట్లాడుతున్నప్పుడు దీక్షా శిబిరం పార్టీ కార్యకర్తలు, తెలంగాణ మద్దతు దారులతో హోరెత్తింది. జై తెలంగాణ, సోనియా నాయకత్వం వర్ధిల్లాలి, తెలంగాణ అమరవీరులకు జోహార్లు, తెలంగాణ ఎంపీల ఐక్యత వర్ధిల్లాలి అని పెద్దపెట్టున నినాదాలివ్వడంతో కాసేపు శిబిరంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

శిబిరంలో హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతుండగా ఏడాది కాలంగా కేసుల విషయం తేల్చకుండా ఏంచేస్తున్నారు? అంటూ ఎంపి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి గట్టిగా నిలదీ శారు. దీంతో ఆమె తన ప్రసంగాన్ని నిలిపివేశారు. కేసులు పూర్తిగా ఎత్తివేసే వరకు తమ దీక్ష ఆగదని కేకే, సర్వేలతో పాటు వివేక్‌, రాజయ్య, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, మందా జగన్నాధం, గుత్తా సుఖేందర్‌రెడ్డి తేల్చి చెప్పడంతో మళ్ళీ ఉదయం వస్తామంటూ మంత్రులు నిరాశతో వెనుతిరిగారు.

నేడు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల భేటీ
ఎంపీలు చేస్తున్న దీక్ష పై భవిష్యత్తు కార్యచరణ రూపొందించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మంగళవారం అత్యవసరంగా సమావేశం కానున్నారు. ఎంపీలకు మద్దతుగా తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరు దీక్షలో పాల్గొనాలా? రాజీనామాలు, డిసెంబర్‌ 31 తరువాత అనుసరించాల్సిన వ్యూహంపై వీరు చర్చించనున్నట్లు తెలిసింది. మరో వైపు ఎంపీల దీక్షకు మద్దతుగా వరంగల్‌, గోదావరిఖనిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులు దీక్షలు ప్రారంభించారు.

Friday, December 17, 2010

ఆకాశం బద్దలుకొట్టయినా... తెలంగాణ సాధిస్తాం

గర్జించిన తెలంగాణ * ధక్కా పక్కాగా కొట్టాలె .. తెలంగాణ తేవాలె
భూకంపం పుట్టించైనా.. ఆకాశం బద్దలుకొట్టైనా తెలంగాణ సాధిద్దాం
రాజకీయ సంక్షోం సృష్టిద్దామంటే కాంగ్రెస్, టీడీపీలు నాటకాలాడాయి
ఆంధ్రా సీఎంలను చూస్తే వారికి లాగులు తడుస్తాయి
బ్రేకులు బద్దలు కొట్టేదే వరంగల్ సభ
కేసీఆర్ వ్యాఖ్యలు
బడ్జెట్ సమావేశాల్లో బిల్లు పెట్టాలి
మహాగర్జన సభ తీర్మానం
 రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని వరంగల్‌లో జరిగిన తెలంగాణ మహాగర్జన సభ కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఈ సభలో మాట్లాడిన టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు.. గతేడాది డిసెంబర్‌లో ప్రకటన చేసినట్లుగా తెలంగాణ ఇవ్వకపోతే భూకంపం సృష్టిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు మలివిడత ఉద్యమాన్ని వచ్చే జనవరి నుంచి గాంధేయ మార్గంలో సత్యాగ్రహంతో మొదలుపెడతామన్నారు.

కేంద్రం దిగిరాకపోతే అది పెను ఆగ్రహంగా, మహోగ్రంగా మారుతుందని ప్రకటించారు. ఇందుకు వరంగల్ గర్జన సభే సంకేతమన్నారు. తెలంగాణకు బ్రేకులు బద్దలు కొట్టేదే వరంగల్ సభని చెప్పారు. వరంగల్ నగరంలోని ప్రకాశ్‌రెరెడ్డిపేటలో గురువారం జరిగిన మహాగర్జనలో కేసీఆర్ మరోసారి కేంద్ర, రాష్ట్ర పాలకులపై తీవ్రస్థాయిలో గర్జించారు. సభకు విచ్చేసిన జనసంద్రాన్ని చూసైనా యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టడానికి వెనుకాడవద్దన్నారు.

ప్రజల ఆకాంక్ష మేరకు నడుచుకోకుంటే వారి ఆగ్రహం చవి చూడాల్సి వస్తుందన్నారు. గత పదేళ్ల కాలంలో అనేక ఆటుపోట్లు ఎదురైనప్పటికీ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ఘనత ప్రజలదేనని కేసీఆర్ ఉద్ఘాటించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తాను చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణలోని ఊర్లన్నీ ఉద్యమాలుగా మారాయని, విద్యాసంస్థలు యుద్ధ భూములయ్యాయని చెప్పారు.

దీంతో దిగివచ్చిన ఢిల్లీ.. తెలంగాణ ఇస్తానని ప్రకటించిందని అన్నారు. తెలంగాణ రాకుండా సీమాంధ్ర నాయకులు అడ్డంకులు సృష్టించారని కేసీఆర్ మండిపడ్డారు.ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణను ఒక్కటి చేయడానికి 54ఏళ్లు పడితే, దీన్ని అడ్డుకోవడానికి సీమాంధ్ర నేతలు గంటలో ఒకటయ్యారని అన్నారు. చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి.. ఆంధ్రా జీవులు ఒక్కటై డబ్బులిచ్చి ఆందోళనలు చేయించారని ఆరోపించారు.

వాళ్లు దద్దమ్మలే

కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. జేఏసీలో చేరిన కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులు.. తమ పదవులకు రాజీనామా చేస్తామని ప్రకటించి, తర్వాత వెనక్కి తగ్గితే దద్దమ్మలు అనక ఏమనాలి? అని ప్రశ్నించారు. "వీరిలో కనీసం 25 మంది రాజీనామా చేసినా ఈ పాటికి ప్రత్యేక తెలంగాణ వచ్చేది. వెన్నెముకలేని, ఈ దద్దమ్మల వల్లనే రాకుండా పోయింది.

1956లో ఉవ్వెత్తున లేచిన ఉద్యమాన్ని ఊడగొట్టింది ఈ కాంగ్రెస్ దద్దమ్మలే. ఇప్పుడు ఉద్యమాన్ని పోగొట్టిందీ వీరే. ఆంధ్రా సీఎంలను చూస్తే వీరికి లాగులు తడుస్తాయి'' అని కేసీఆర్ ధ్వజమెత్తారు. "హైదరాబాద్‌ను ఫ్రీజోన్ అంటే పట్టించుకోరు. ఆంధ్ర ప్రాంతంలో అక్రమంగా ప్రాజెక్టులు కడుతుంటే గుడ్లప్పగించి చూస్తారు. విద్యార్థులపై కేసులు పెడితే పట్టించుకోరు'' అని మండిపడ్డారు.

కేసులు ఎత్తివేయమని తమ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పట్టుబడితే వారినే బయటకు ఎత్తేశారని చెప్పారు. "ఆంధ్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వారి హైకమాండ్‌ను ధిక్కరించి ఇటు కాంగ్రెస్‌లో ఉంటూనే అటు జగన్ వెంట నడుస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాత్రం తెలంగాణ కోసం రాజీనామాలు చేయడానికి భయపడుతున్నారు. వారికిలేని హైకమాండ్ వీరికెందుకు?'' అని కేసీఆర్ నిలదీశారు.

గవర్నర్‌కు అంత వెటకారం తగదు
శ్రీకృష్ణకమిటీ నివేదిక నేపథ్యంగా డిసెంబర్ 31 తర్వాత ఏం జరుగుతుందంటే 'జనవరి 1 వస్తుంది' అని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అపహాస్యం చేయడాన్ని కేసీఆర్ ఖండించారు. వెటకారంగా మాట్లాడటం గవర్నర్ హోదాకు తగదన్నారు. మరోవైపు డీజీపీ అరవిందరావు డిసెంబర్ 31 తర్వాత అదనపు బలగాలు వస్తున్నాయని ప్రకటిస్తున్నారని చెప్పారు.

నిజానికి రావలసింది అదనపు బలగాలు కాదు తెలంగాణ రాష్ట్రమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ప్రజల ఆకాంక్షలను ఇట్లాంటి సభల ద్వారా వ్యక్తం చేసినప్పుడు ఢిల్లీ పెద్దలకు వాస్తవిక నివేదికలు ఫోటోలతో సహా పంపితే తప్పనిసరిగా తెలంగాణ వస్తుందని చెప్పారు. అటువంటి ప్రయత్నాలు వదలిపెట్టి, లాఠీలకు, తూటాలకు డీజీపీ పని చెప్పారని అన్నారు. తూటాలకు, లాఠీలకు భయపడే స్థితిలో కేసీఆర్‌గానీ, తెలంగాణ ప్రజలు గానీ లేరని స్పష్టం చేశారు.

వాళ్లు బిచ్చగాళ్లు
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రభుత్వాలపై ఒత్తిడి తేకుండా మంత్రి పదవుల కోసం చిప్పలు పట్టుకొని బిచ్చగాళ్లలా తిరుగుతున్నారని చంద్రశేఖర్‌రావు ఎద్దేవా చేశారు. ప్రత్యేక తెలంగాణ ఇచ్చే విషయంలో ఈ ప్రాంత ప్రజల ఓపికను, సహనాన్ని ప్రధాని ఇంకా పరీక్షించవద్దన్నారు.

"జరుగుతున్న పరిణామాలను చూసి తెలంగాణ వాదులు కూడా గాలిగాబరా కాకుండా ఔరేక్ ధక్కాను పక్కాగా కొట్టాలే. తెలంగాణ తెచ్చుకోవాలె'' అని పిలుపునిచ్చారు. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కేసీఆర్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని గర్జన సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేయడం ద్వారా కేంద్రానికి కేసీఆర్ మార్చి వరకూ గడువు ఇచ్చినట్లయింది. అంటే.. డిసెంబర్ 31 తర్వాత అనూహ్య పరిస్థితులు ఎదురయ్యే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

సభ విజయవంతం
శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇస్తున్న తరుణంలో టీఆర్ఎస్ నిర్వహించిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో ఓరుగల్లు వేదికగా టీఆర్ఎస్ బల ప్రదర్శన చేసింది. టీఆర్ఎస్ 2003లో ఇక్కడ పెద్ద ఎత్తున సభ జరిపింది. 2004 ఎన్నికలకు ముందు రాజకీయంగా తన సత్తా చాటింది. అనంతరమే టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుని అధికారంలోకి వచ్చింది.

ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు లేనప్పటికీ 2జీ స్పెక్ట్రం కుంభకోణంతో యూపీఏ సర్కారు సతమతమవుతుండడం.. రాష్ట్రంలో జగన్ రగడ వ్యవహారం.. వెరసి మధ్యంతర ఎన్నికలు తప్పవనే ప్రచారం మధ్య టీఆర్ఎస్ నిర్వహించిన వరంగల్ తెలంగాణ మహాగర్జన సభ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన మహాగర్జన సభలోనూ గాంధీ మార్గంవైపే కేసీఆర్ మొగ్గు చూపారు.

అంతే కాకుండా పార్టీ తరపున ప్రత్యేకంగా ఎలాంటి కార్యాచరణనూ ప్రకటించలేదు. ఈ సభకు ఆహ్వానించిన ప్రజా సంఘాలు భాగస్వాములుగా ఉన్న తెలంగాణ జేఏసీ.. ఇకపై చేపట్టబోయే ఉద్యమాన్ని నిర్దేశిస్తుందని చెప్పడం ఇక్కడ గమనార్హం. ఇటీవలి కాలంలో వీలు చిక్కినప్పుడల్లా తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ద్వంద్వ విధనాలు అవలంభిస్తున్నారంటూ నిప్పులు చెరిగిన కేసీఆర్.. వరంగల్ సభలో మాత్రం చంద్రబాబు ప్రస్తావన ఎక్కువగా తీసుకురాలేదు. అదే సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలపై చవటలు, దద్దమ్మలు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
‘హోరు’ గల్లు గర్జన
వరంగల్‌ శ్రీకాంతాచారి ప్రాంగణంలో గురువారం జరిగిన మహాగర్జనలో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు దాదాపు అరగంట సేపు మాట్లాడారు. ఆయన ప్రసంగం ఇలా సాగింది... దేశచరిత్రలోనే కనీవినీ ఎరుగనంతటి అతిపెద్ద సభ ఇది. ఒక సభకు ఇంతమంది జనం రావడాన్ని తన జీవితంలోనే చూడలేదని, ప్రపంచంలోనే ఇది అతిపెద్ద సభ అని స్వామి అగ్నివేశ్‌ చెప్పారు. ఈ జనాన్ని చూస్తే సమ్మక్క -సారలక్క శౌర్యమా, వీరనారి ఝాన్సీలక్ష్మీబాయి సాహసమా అనిపిస్తోంది. ఇంటికొకరు రావాలని నేనిచ్చిన పిలుపునకు స్పందించి ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీకందరికీ నా అభివందనాలు.

wgl
ఇక ఉద్యమం విషయానికి వస్తే 2001 జనవరి, ఫిబ్రవరి, మార్చిలలో ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. ఆ రోజులు ఎలాంటివంటే... హైదరా బాద్‌లో బస్సెక్కితే ఇంటికి చేరేలోగా మనిషి మాయమైపోతున్న రోజులు. అలాంటి పాలకుల పాలన కాలంలో ఈ ఉద్యమం పుట్టింది. కేవలం పిడికెడు మందితో ఈ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఈ పది సంవత్సరాల కాలంలో ఉద్యమం ఎన్నో ఆటుపోట్లను, అటంకాల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని ఎదుర్కొంది. ఉద్యమాన్ని అడ్డుకోడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి.

కానీ ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా, అడ్డుకున్నా కేసీఆర్‌ భయపడలేదు. వెనకడుగు వేయలేదు. మందుకు సాగాడు. ఇది నా గొప్ప కాదు. ఇదంతా మీ ఘనత. నేను నిరాహార దీక్ష చేస్తే మా వాళ్లు - ‘అన్నా! మాకు నీ ప్రాణాలు ముఖ్యం. జాగ్రత్తన్నా’ అని ఆప్యాయంగా భుజం తట్టారు. వద్దని వారించారు. కానీ నేనాడు చెప్పాను...తెలంగాణ వచ్చుడో, కేసీఆర్‌ చచ్చుడో అన్నాను.
కిందటి ఏడాది నవంబర్‌ 9 నుంచి డిసెంబర్‌ 23 వరకు జరిగిందంతా చాలా కీలకం. తెలంగాణపై ఢిల్లీ దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు గురించి పరిశీలిస్తామని పార్లమెంటులో ప్రకటించింది. కేంద్రహోంమంత్రి చిదంబరం తెలంగాణ గురించి ప్రకటన చేశారు. 54 ఏళ్ల తెలంగాణ పోరాట చరిత్రలో ఆ ప్రకటన ముఖ్యమైంది. నిరాహార దీక్షతో సాధించిన విజయమది.

wgl-sabaతెలంగాణా వాళ్లను, నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ వాళ్లను ఒక్కటిగా చేయడానికి ఇక్కడ 54 ఏళ్లు పట్టింది. అదే ఆంధ్రా నాయకులు షేక్‌హ్యాండు లిచ్చుకొని గంటలో ఒక్కటయ్యారు. చిరంజీవి, చిన్నజీవి, పెద్దజీవి, ఆంధ్రా జీవులందరూ డబ్బు సంచులతో వచ్చి ఒక్కటై పోయారు. ఆంధ్ర నాయకులు ఒక్కటై పోయినా, ఆంధ్ర ఉద్యమానికి ఒక్క పాట లేదు. తెలంగాణ ఉద్యమానికి ఎన్ని పాటలొచ్చాయో అందరికీ తెలుసు. కానీ ఆంధ్రావాళ్ల ఉద్యమానికి పాటలేక, సినిమాపాటలేసుకున్నారు. ఇప్పుడు ఈ వరం గల్‌ సభతో తెలంగాణ ఉద్యమానికి ఒక బ్రేక్‌ వచ్చింది.

నిరాహార దీక్ష వల్ల కిందటి సంవత్సరం డిసెంబర్‌ 23 వరకు నా ఆరోగ్యం కుదుట పడలేదు. అయినా సరే అం దరం రాజీనామాలు చేద్దామనుకొని కాంగ్రెస్‌ నాయకుల చేత కూడా చేయిద్దామని వాళ్ల దగ్గరికి వెళ్లాం. కాంగ్రెస్‌ నాయకులకు తెలంగాణ అవసరం గురించి చెప్పాం. టీఆర్‌ఎస్‌ ఎమ్మేల్యేలం రాజీనామాలు చేశామన్నాం. రాజ కీయ సంక్షోభం పుట్టించాం.

kcr-vijaya తెలంగాణకోసం పదవులకు రాజీనామాలు చేయమన్నాం. మొదట 25 మంది రాజీనామా చేస్తామన్నారు. కానీ 12 మందే రాజీనామా చేశారు. రాజీనామా చేయని కాంగ్రెస్‌ చవట దద్దమ్మల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. 1956లో విడిగా ఉన్న తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌లో కలిపే శారు. ఆనాడు ఈ చవట దద్దమ్మలే ఊడగొట్టిండ్రు. ఇప్పుడు తెచ్చుకున్నదాన్ని పొగొట్టారు. ఇది సభ కాదు, సముద్రం. తెలంగాణ కోసం ఇప్పుడు ఊళ్లన్నీ ఉద్యమ వేదికలయ్యాయి. ప్రతి ఊళ్లో తెలంగాణ రావడానికి ఉద్యమిస్తున్నారు.

ఊళ్లో వాళ్లందరూ కథానాయకులవుతున్నారు. వారంతా కలిసి తుపాను తెస్తే తప్ప కాంగ్రెస్‌ వాళ్లు మాట్లాడరు.తెలంగాణకోసం ఉద్యమం చేస్తే విద్యార్థులపై కేసులు పెట్టిండ్రు. ఒకటా, రెండా....ఒక్కొక్క విద్యార్థి మీదా 100 -150 కేసులు పెట్టారు. కేసులు ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు వెడితే గుద్దులు గుద్ది బయటికి నెట్టేశారు. తెలంగాణ వాళ్లు ఏకం కావడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అదే కాంగ్రెస్‌ వాళ్లంతా గంటలో ఏకమయ్యారు. అసలు, ఆంధ్ర కాంగ్రెస్‌ నాయకులకు లేని హైకమాండ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు ఉంటుందా?

olddతెలంగాణ గురించి రాష్ట్ర గవర్నర్‌ వెటకారం చేస్తూ మాట్లాడారు. డిసెంబర్‌ 31న ఏం కాదు. 31 తర్వాత జనవరి 1 వస్తుంది అని గవర్నర్‌ ఎగతాళి చేశా రు. ఆయన మాటల్ని నేను ఖండిస్తున్నాను. ఈ సభపై, తెలంగాణ ఉద్యమంపై ప్రయోగించడానికి అదనపు పారామిలిటరీ దళాల్ని తెప్పిస్తామన్నారు. ఈ సభకు ఎంత భారీగా జనంవచ్చారో ఢిల్లీకి రిపోర్టిచ్చి తెలంగాణ తేవాలి కానీ, అదనపు బలగాలు ఎందుకు? తూటాలకు, తుపాకులకు, లాఠీలకు భయపడేవారు ఇక్కడ లేరు. ఈ సభను, ఇంత బ్రహ్మాండంగా జరిగిన సభను చూసైనా కాంగ్రెస్‌ నాయకులు రాజీనామాలు చేస్తారా? చేయరు. మంత్రి పదవులకోసం బిచ్చగాళ్లలా తిరుగుతున్నారు.

danoraమా సహనానికీ ఒక హద్దుంది. లిమిట్‌ ఉంది. దాన్ని దాటనివ్వద్దు. దాటితే బాగుండదు. తెలంగాణాలో అన్ని సంఘాలవారూ ఈ సమావేశానికి హాజర య్యారు. అన్ని సంఘాలూ వేదికమీద ఉన్నాయి. తెలంగాణకోసం పిడికిలెత్తి ఉన్నారు. వెనకడుగు వేయకుండా ముందుకు సాగాలి. పార్లమెంటులో తెలంగాణ బిల్లు తెచ్చేవరకూ ముందుకే వెళ్లాలి. మొండిగా ఉండాలి. భయపడొద్దు. నామీద ఎన్ని చేశారు? ఎంతగా బెదిరించారు. ఎంతగా భయపెట్టారు? అడ్డుకున్నారు? అయినా నేను భయపడ్డానా? రాజీపడ్డానా? అట్ల ఉండబట్టే ఉద్యమాన్ని నడిపాం. ఉద్యమాన్ని కాపాడుకున్నాం. కీలెరిగి వాత బెట్టాలె. డక్క కొడితే పక్కాగా కొట్టాలి.

పోరుఘల్లు.. !
crowdd

'గులాబీల హోరు'గల్లు
జనసంద్రమైన మహాగర్జన

లక్షలాదిమంది హాజరు

కిక్కిరిసిన వెయ్యి ఎకరాల ప్రాంగణం
సగం మంది రోడ్లమీదే
20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం
వరంగల్ నగరం జనసంద్రమైంది. తెలంగాణ మహా గర్జనకు తెలంగాణ జిల్లాల నుంచి లక్షలాదిగా తరలి వచ్చిన ప్రజలతో హోరెత్తిపోయింది. టీఆర్ఎస్ నేతలు, తెలంగాణవాదులతో లాడ్జీలు, హోటళ్లు కిటకిటలాడాయి. అర్ధరాత్రి వరకు నగరంలో సందడి కనిపించింది. మహాగర్జన బ్యానర్లు, నేతల కటౌట్లతో ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ జంక్షన్, కాళోజీ జంక్షన్, అమరవీరుల స్థూపం జంక్షన్, ఫాతిమానగర్ జంక్షన్‌లు గులాబీమయమయ్యాయి.

మహాగర్జన ప్రాంగణం జనంతో పోటెత్తింది. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. కళాకారుల ఆట, పాటతో కదం తొక్కింది. ట్రాఫిక్ రద్దీ కారణం ఆ సభాస్థలికి చేరుకోలేక సగంమంది రోడ్లపైనే నిలిచిపోయారు. జిల్లా నలుదిక్కుల నుంచి డప్పు చప్పుళ్లు, ర్యాలీలు, ఊరేగింపులతో వస్తున్న జనంతో నగరం కిక్కిరిసిపోయింది. ప్రధాన రహదారులన్నీ జన ప్రవాహాలయ్యాయి. ఎటుచూసినా జనమే.

మధ్యాహ్నం 12 గంటల నుంచే జనం చేరుకోవడం ప్రారంభమైంది. సుమారు వెయ్యి ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన గర్జన సభా ప్రాంగణం నిండిపోయింది. ఒకపక్క సభ జరుగుతున్నా జనం ఇంకా వస్తూనే ఉన్నారు. ట్రాఫిక్ జామ్ కారణంగా హైదరాబాద్-వరంగల్, వరంగల్- ఖమ్మం, వరంగల్- కరీంనగర్ ప్రధాన రహదారులపై వాహనాలన్నీ 20 కిలోమీటర్ల దూరం వరకు నిలిచిపోయాయి.

దీంతో, ప్రజలు కాలినడకన సభాస్థలికి చేరుకున్నారు. గర్జన సభకు దాదాపు 25 లక్షలమంది హాజరయ్యారని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. కళాకారుల పాటలు సభికులను ఊపేశాయి. ఉద్వేగానికి లోనుచేశాయి. సభ వరకు వెళ్లినా అక్కడ నిలబడేందుకు స్థలం లేకపోవడంతో వేలాదిగా వెనుదిరిగారు.

యువకుడి ఆత్మహత్యాయత్నం
మహా గర్జన సభలో ఓ యువకుడు నిప్పంటించుకొని జనంలోంచి పరుగులు తీసిన దృశ్యం కలకలం సృష్టించింది. కేసీఆర్ ప్రసంగం ప్రారంభం కావడానికి కొద్దిసేపటికి ముందు.. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్ మండలం మదనగిరిగూడెం గ్రామానికి చెందిన నందిగామ అంజయ్య (30) తనవెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకొని జనం వైపు పరుగులు తీశాడు. చుట్టుపక్కలవారు దుప్పట్లు కప్పి మంటలను చల్లార్చారు. ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. తెలంగాణ ఏర్పాటులో జాప్యానికి ఆవేదన చెంది తాను ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అంజయ్య చెబుతున్నాడు.
click here
వరంగల్‌ మహా గర్జన ముగిసింది. ఓరుగల్లు జనంతో హోరు మంది. 
తెలంగాణ కళాకారుల ఆట పాటతో ఘల్లు ఘల్లు మంది. మొత్తంగా హోరుఘల్లే అయింది. లక్షలాది తెలంగాణ అభిమానులతో వరంగల్లు పట్టణం కిటకిటలాడింది. వరంగల్లు నుంచి హైదరాబాదు, కరీంనగర్‌ వెళ్లే రోడ్లు, వరంగల్లు-కరీంనగర్‌ రోడ్డు, ఖమ్మం రోడ్డు 15 కిమీ మేర ట్రాఫిక్‌ జామ్‌ అయింది. డిసెంబరు 31 లోగా శ్రీ కృష్ణ కమిటీ నివేదిక రానున్న నేపథ్యంలో కేసీఆర్‌ తెలంగాణా శ్రేణులను సమాయత్తపరిచే వ్యూహంలో భాగంగా ఈ భారీ బహిరంగ సభకు రూపకల్పన చేశారు.

ఆ వ్యూహంలో కేసీఆర్‌ సఫలీకృతులయ్యారు. భారీగా హాజరైన జన సందోహం నుంచి అంతే భారీ స్దాయిలో స్పందనను ఆయన రాబట్టగలిగారు. స్వామి అగ్నివేష్‌ ఈ సభకు ఒక ప్రత్యేక ఆకర్షణ కాగా కేసీఆర్‌ కుమార్తె కవిత వేదిక మీద ప్రత్యక్షం కావడం మరో విశేషం. పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో తెలంగాణా బిల్లు పెట్టాల్సిందిగా కోరుతూ ఏక వాక్య తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా కేంద్రానికి తుది అల్టిమేటం ఇచ్చారు. శ్రీ కృష్ణ కమిటీ నివేదిక వచ్చీరాగానే..దాని రూపు రేఖలు ఎలా ఉంటాయో తెలుసుకోకుండా ఉద్యమ బాటలో ఎటు ఎలా నడవాలో పాలుపోని స్ధితిలో పడకుండా కొంత సమయం తీసుకుని నింపాదిగా ఆలోచించుకునేందుకు కేసీఆర్‌కు, ఆయన పార్టీకి ఈ తీర్మానం వెసులుబాటు కల్పిస్తుంది.

telagnaaf కేసీఆర్‌ ఈ కీలక తరుణంలో ఉద్వేగపూరిత ఉద్యమ వ్యూహాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణా వాదులు భావించారు. ఒక వంక డిసెంబరు 31 తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో అని అందరూ భావిస్తున్న తరుణంలో కేసీఆర్‌ అలాంటి ఉద్వేగభరిత వ్యూహాలకు పోకుండా తెలంగాణా బంతిని కేంద్రం కోర్టులోకి నెట్టి అందరికీ ఊరట నిచ్చారు. అలాగని నివేదిక ఎలా ఉన్నా ఆయన కిమ్మని ఊరుకుంటారని అనుకోనక్కర్లేదు. నివేదిక తెలంగాణాకు ఏమాత్రం అనుకూలంగా లేకపోయినా ఉద్యమాన్ని ఉధృతం చేసే సదవకాశం ఆయనకు ఎప్పుడూ ఉంది.

అందుకే జేఏసీ నాయకుడు కోదండరామ్‌ కార్యాచరణ కార్యక్రమాన్ని ప్రకటిస్తారని కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు. తెలంగాణా కాంగ్రెస్‌ వాదులను, తెలుగుదేశం తెలంగాణా నేతలను తెలంగాణా ద్రోహులుగా జనంలో మరింతగా పాతుకుపోయేలా చేసే ప్రయత్నాన్ని అటు కేసీఆర్‌, ఇటు జయ శంకర్‌ తమ ప్రసంగాల ద్వారా చేశారు. కాంగ్రెస్‌ అధిష్టానం కన్నా తెలంగాణా కాంగ్రెస్‌ వాదుల మీద, తెలంగాణా తెలుగుదేశం నేతలపైనే వారు వాగ్బాణాలు సంధించారు. కేసీఆర్‌ అటు గవర్నరుని, ఇటు డీజీపీని కూడా వదల్లేదు. చంద్రబాబు రాజకీయాన్ని నిశితంగా విమర్శించారు. కేసీఆర్‌ ప్రసంగంలో సహజంగా ఉండే వాడి, వేడి, వ్యంగ్యం, చమత్కారం ఈసారి కొద్దిగా లోపించాయి.

దేశపతి శ్రీనివాస్‌ పాటలు మధ్యలో రసరంజకంగా ప్రేక్షకులను అలరించాయి. జై బోలో తెలంగాణా సినిమాకు కేసీఆర్‌ ఒక పాట రాశారన్న విషయం దేశపతి ద్వారా జనానికి తెలిసింది. ఆ పాటను కూడా ఆయన పాడి వినిపించారు. వేదిక మీద కేసీఆర్‌ పక్కనే విజయశాంతికి చోటు దొరికినా, మాట్లాడేందుకు ఆమెకు అవకాశం లభించలేదు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ ప్రసంగంతో మొదలైన మహా గర్జన రెండున్నర గంటల పాటు సాగింది. ఉదయం నుంచే ఆ ప్రాంతమంతా తెలంగాణా ఆటపాటలతో హోరెత్తింది. ప్రసంగాలు కొనసాగినంతసేపు జనం తెలంగాణా కేరింతలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

శ్రీకాకుళంలో పుట్టినా .. తెలంగాణకు మద్దతు ఇస్తున్నా
wgl-ssnమహాగర్జనకు ఆకర్షణగా నిలిచిన ప్రపంచ ఆర్య సమాజ్‌ వాది, సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌ ప్రసంగం కూడా ప్రజల్లో చైతన్యం నింపడమే కాకుండా ఆలోచింపజేసే విధంగా సాగింది. తానుపుట్టింది శ్రీకా కుళం అని, అయినా న్యాయమైన డిమాండ్‌ కోసం పోరాడుతున్న తెలంగాణ ప్రజల పక్షాన నిలబడ్డానని అన్నారు. తెలంగాణ ప్రాంత ప్రజలకు చీకటి రాత్రులు అంతమయ్యే రోజు లు దగ్గరపడ్డాయని, విజయానికి చేరువగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌, టిడిపి అధినేతలపై దుమ్మెత్తిపోయడమే కాకుండా, అవినీతి అంతమయ్యేలా తెలంగాణ ఏర్పడిన వెంటనే లోకాయుక్తను ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. చాకలివాడి గాడిద కథను ఉదహరిస్తూ ద్వంద విధానాలను అవలంభిస్తున్న టిడిపి అధినేత చంద్రబాబు పై నిప్పులు చెరిగారు.

తెలంగాణ ప్రజలది.. న్యాయ పోరాటం
సీమాంద్రుడినైనా న్యాయం పక్షాన నిలిచా..

శ్రీకృష్ణ నివేదికతో సంబంధం లేదు..
స్వామి అగ్నివేశ్ ఉద్ఘాటన
 యాభై ఏళ్లుగా అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలది న్యాయమైన పోరాటమని ప్రపంచ ఆర్యసమాజం అధ్యక్షుడు, ప్రముఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ స్పష్టం చేశారు. తాను న్యాయం వైపు నిలిచి పోరాడతానని చెప్పారు. గురువారం వరంగల్‌లో టీఆర్ఎస్ మహాగర్జనకు హాజరయ్యేందుకు ఆయన జేఎన్ స్టేడియంలో హెలికాప్టర్‌లో దిగారు.

అక్కడే విలేకరులతోనూ, తరువాత బహిరంగసభలోనూ మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటు గత ఏడాది డిసెంబర్ 9నే జరిగిపోయిందన్నారు. ప్రకటించిన తెలంగాణను పరిరక్షించుకోవడమే తక్షణ కర్తవ్యమని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ మహాగర్జన ద్వారా 25 లక్షల మంది గొంతెత్తి ఢిల్లీకి చాటేందుకు సిద్ధమయ్యారని చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ మావోయిస్టులు చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇవ్వడం సరైంది కాదని చెప్పారు.

తాను మావోయిస్టులతో మాట్లాడానని, ప్రభుత్వ వైఖరి వల్లే తుపాకులు పట్టామని చెప్పారన్నారు. గిరిజనులను ఇబ్బందులు పెట్టకుండా, వారి హక్కులకు భంగం కలిగించకుండా అటవీ ప్రాంతాలను ప్రభుత్వం కాపాడితే సమస్య ఉండదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గనులు, మద్యం మాఫియాల భయముండదని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక న్యాయమైన డిమాండ్ అని.. అందుకే తాను సీమాంధ్రుడినైనా న్యాయం పక్షాన నిలిచానని వెల్లడించారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేదని, తెలంగాణ సాధనే లక్ష్యమన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల నీతి చెల్లబోదన్నారు. డిసెంబర్ 9 ప్రకటన తర్వాత అర్ధరాత్రి పెట్టుబడిదారులు రంగంలోకి దిగి తెలంగాణ ప్రజల కలలను కల్లలు చేశారన్నారు. ఇందులో బాబు ముఖ్య పాత్ర పోషించారని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మైనింగ్, ల్యాండ్ మాఫియా రాజ్యమేలుతోందని, ఈ శక్తులకు తెలంగాణలో చోటివ్వకూడదని సూచించారు. కేంద్ర పాలన పూర్తిగా అవినీతిమయమైందని ఆరోపించారు.

కాంగ్రెస్ నేతలు బిచ్చగాళ్లు: జయశంకర్

తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే వెనక్కు తగ్గిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు డిప్యూటీ సీఎం, మంత్రి పదవుల కోసం బిచ్చగాళ్లయ్యారని ప్రొఫెసర్ జయశంకర్ ధ్వజమెత్తారు. తెలంగాణ వస్తే మీరే రాజ్యమేలవచ్చని కాంగ్రెస్ నేతలకు ఎంత చెప్పినా పదవులపై వ్యామోహంతో ఉద్యమానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. పాలకులుగా ఉండమంటే బానిసలుగా ఉంటామంటున్నారని విరుచుకుపడ్డారు. చంద్రబాబుకు వత్తాసు పలుకుతూ టీడీపీ నేతలు కూడా బిచ్చగాళ్లే అయ్యారన్నారు.

వారు బతికున్న శవాలే: కోదండరాం
డిసెంబర్ తర్వాత చేపట్టే ఉద్యమంలో తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు కలిసి రాకుంటే బతికున్న శవాలుగానే ప్రజలు పరిగణిస్తారని ప్రొఫెసర్ కోదండరాం హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీతో సంబంధం లేదని, జనవరి తొలి వారంలో ఉద్యమ ప్రణాళిక రూపొందిస్తామని చెప్పారు.

కురుక్షేత్రం తప్పదు : పిడమర్తి రవి
డిసెంబర్ 31లోగా తెలంగాణ ప్రకటించకుంటే ఇప్పటి వరకు అనుసరిస్తున్న గాంధీ మార్గాన్ని వీడి, గాడ్సే మార్గాన్ని ఎంచుకుంటామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి స్పష్టం చేశారు. కేసీఆర్‌ది ప్రజాస్వామిక రాజకీయ పోరాటమైతే, విద్యార్థులు రాళ్లతో పోరాడతారన్నారు.

తెలంగాణ బాటలోనే ముస్లింలు: మైనార్టీ నేతలు
ముస్లింలు తెలంగాణకు వ్యతిరేకమని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమ బాటలోనే ముస్లింలు సాగుతారని మైనార్టీ నాయకులు మొహసీన్‌ఖాన్, మహబూబ్ అలం ఖాన్, మౌలానా యూసుఫ్ జాహీద్ స్పష్టం చేశారు.

సహాయ నిరాకరణ : స్వామిగౌడ్

తెలంగాణపై కేంద్రం ప్రకటన చేయకుంటే డిసెంబర్ తర్వాత తెలంగాణలోని 2.5 లక్షల ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తారని టీఎన్జీవోస్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిగౌడ్ హెచ్చరించారు. ఇందుకు ఉద్యోగులు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
click here యాచకుల్లా వ్యవహరిస్తున్న తెలంగాణ మంత్రులు
personపదవుల కోసం ప్రాకులాడకుండా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములై శాసకులుగా బ్రతకాలని తెలంగాణ ప్రాంత మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రొఫెసర్‌ జయశంకర్‌ పిలుపునిచ్చారు. గురువారం వరంగల్‌లో నిర్వహించిన మహాగర్జన సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గత డిసెంబర్‌ 9న కేంద్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తర్వాత ఆంధ్ర కాంగ్రెస్‌, టిడిపి పార్టీ నాయకుల లాబియింగ్‌ వల్ల ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనకకు తీసుకొని శ్రీకృష్ణ కమిటీ వేసింది. తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెస్‌, టిడిపి ప్రజా ప్రతినిధులు అధిష్టానం దగ్గర మంత్రి పదవుల కోసం యాచించకుండా ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పర్చుకొని శాసకులుగా బ్రతకాలని పేర్కొన్నారు.

జనవరి నుంచి సహాయ నిరాకరణ
Kodandaramతెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని గాంధేయ మార్గం ద్వారా సాధించుకుంటామని తెలంగాణ జేఏసీ నాయకులు ప్రోఫెసర్‌ కోదండరాం అన్నారు. గురువారం వరంగల్‌ జిల్లా ప్రకాష్‌రెడ్డి పేటలో మహాగర్జన సభ జరిగింది. అందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్‌ పాలకుల నుండి గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టి భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చారని ఆయన గుర్తు చేశారు. డిసెంబర్‌ 31 వరకు తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోతే జనవరి 1 నుండి సహాయ నిరాకరణ ఉద్యమాన్ని గాంధీ మార్గం ద్వారా చేపడుతామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళికలను అన్ని పార్టీల నాయకులు, విద్యార్థులు, ఉద్యమకారులతో ప్రణాళికలను రూపొదిందిస్తున్నామన్నారు.

పెన్‌డౌన్‌ సమ్మెకు సమ్మెకు ఉద్యోగులు సిద్ధం
మహాగర్జన సభతో కేంద్ర ప్రభుత్వం సత్వరమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని లేనిచో తెలంగాణాలోని రెండు లక్షల 50వేల మంది ఉద్యోగులందరు పెన్‌డౌన్‌ చేయడానికి సిద్ధమేనని తెలంగాణ నాన్‌గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం చైర్మన్‌ స్వామి గౌడ్‌ అన్నారు. సభలో స్వామి గౌడ్‌ హాజరైనారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ తెలంగాణ విముక్తి కోసం కెసిఆర్‌ చేపట్టిన ఆమరణ దీక్ష, అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించడంతో కేంద్రం దిగివచ్చి గత డిసెంబర్‌ 9న అనుకల ప్రకటన చేయడంతో తెలంగాణ ప్రజల్లో అమృతం కురిసిందని, అమృతం కొద్దిరోజులకే విషం చిమ్మిందని సీమాంధ్రులు కుట్రలను ప్రస్తావిస్తూ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

Thursday, December 16, 2010

సంక్షోభం ముందంజ, విభజన వెనుకంజ? * 'నల్లారి' నడక కాదు! * గురివింద సుభాషితాలు

దటీజ్ హైకమాండ్!

రాష్ట్ర ప్రజానీకాన్ని ఆశ్చర్య చకితులను చేస్తూ, బుధ, గురువారా ల్లో, రెండు రోజుల పాటు, గంటకో మార్పుగా, రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలు అనూహ్యంగా మారిపోయాయి. మామూలుగా చూస్తే ఇవి హఠాత్ పరిణామాలుగా కనిపించినప్పటికీ, నిజానికి నెల రోజుల క్రితమే వీటికి సమగ్రమైన స్కెచ్ తయారైంది. సరైన సమయం కోసం వేచి చూస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం అదను చూసి ఆ స్కెచ్‌ను అమలు పరచడమే ఇప్పుడు చేసిన పని.

రాజకీయంగా తమకు అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రంలో, రెండో కంటికి తెలియకుండా, 24 గంటల్లో 'ఆపరేషన్ సీఎం ఛేంజ్' పూర్తి చేసిన హైకమాండ్, అసలు తానేమిటో, వ్యవహారశైలి ఎలా ఉంటుం దో పార్టీ శ్రేణులకు తేల్చిచెప్పింది. సాక్షాత్తు 'ముఖ్యమంత్రి రోశయ్య' కు కూడా, చివరి నిముషం దాకా తనను మారుస్తున్న విషయాన్ని స్పష్టంగా తెలియనివ్వకపోవడం చూస్తే, కాంగ్రెస్ నాయకత్వం ఎంత పకడ్బందీగా ప్లాన్ వేసిందో అర్థం చేసుకోవచ్చు. 'హైకమాండ్ లో సగం'గా భావించే ముఖ్య నేతలు ప్రణబ్ ముఖర్జీ, ఎ.కె.ఆంటోనీ స్వయంగా, ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు రావడం, చిన్నపాటి నిరసన ధ్వనికి కూడా ఆస్కారం ఇవ్వకుండా గంటల్లోనే సాఫీ గా పని పూర్తి చేయడం, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల పట్ల అధిష్ఠానం ఎంత దృఢ చిత్తంతో ఉందో తెలియజెప్పింది.

ఈ మొత్తం ఎపిసోడ్‌లో ముఖ్యమంత్రి పదవి కోల్పోవడం కురువృద్ధుడైన రోశయ్యకు కష్టం, నష్టం కలిగించి ఉంటే ఉండవచ్చు గానీ, ఇందుకు ఆయన ఎవరినో నిందించి ప్రయోజనం లేదు. అయాచితం గా లభించిన అధికార పీఠం నుంచి, ఆకస్మికంగా నిష్క్రమించాల్సి రావడం రోశయ్య స్వయంకృతం. వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత, ఆయన స్థానంలో, రోశయ్య నియామకం ఆపద్ధర్మ (స్టాప్ గ్యాప్) ఏర్పాటేనని అందరికీ తెలుసు.

ఒకరకంగా చూస్తే ఆయన అంచనా కన్నా ఎక్కువ కాలం (14 నెలల 22 రోజులు) పదవిలో ఉన్నారనుకోవచ్చు. నిజానికి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుంచీ రోశయ్యకు అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. ప్రతిపక్షాలే కాదు; సొంత పార్టీ నేతలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలు, చివరికి ప్రకృతి కూడా ఆయనకు సహకరించలేదు. సామాజిక బలహీనత, వయోభారం, పార్టీలో సొంత గ్రూపు లేకపోవడం వంటి ఇతరత్రా సమస్య లు కూడా ఉండనే ఉన్నాయి. అధిష్ఠానం ఆశీస్సులే ఆయన ఏకైక బలం.

దీన్ని ఆసరాగా చేసుకుని, తనకున్న అపార అనుభవాన్ని రంగరించి, క్రియాశీలకంగా వ్యవహరించి ఉంటే రోశయ్య మరికొంత కాలం పదవిలో కొనసాగి ఉండేవారు. అయితే 'అబ్బే. ఈ వయసు లో కత్తి పట్టుకుని యుద్ధం ఏం చేస్తాం' అని బేలతనం ప్రదర్శించడం ద్వారా పదవిలో నిలదొక్కుకునే అవకాశాన్ని ఆయన చేజేతులా చెడగొట్టుకున్నారు.

చరిత్ర సృష్టించే సందర్భాన్ని సద్వినియోగం చేసుకోకుండా, బలహీన ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకుని తెరమరుగయ్యారు. "రోశయ్య వ్యవహార శైలి కారణంగా రాష్ట్రంలో మున్ముందు మరే వైశ్యుడికీ, ప్రాధాన్యమున్న కీలక పదవి దక్కే అవకాశం ఉండకపోవచ్చు'' అని వైశ్య ప్రముఖుడొకరు వ్యాఖ్యానించడం గమనార్హం. గతంలో పి.వి.నరసింహారావు విషయంలో జరిగినట్టే ఇప్పుడు రోశ య్య విషయంలో కూడా, రెడ్డి సామాజిక వర్గం కత్తిగట్టి ఆయనను పదవి నుంచి దించే వరకు విశ్రమించలేదు.

ఇక కొత్త ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి చాలా గుంభనం గా పావులు కదిపారు. అధిష్ఠానం కూడా ఆయనకు యథోచితంగా సహకరించింది. శాసనసభ స్పీకర్‌గా ఉన్న కిరణ్, గత కొన్ని మాసాలుగా తరచూ ఢిల్లీకి పర్యటనలు పెట్టుకున్నారు. అధిష్ఠానం పెద్దల తో, మరీ ముఖ్యంగా హోంమంత్రి చిదంబరంతో సంబంధాలు పెంచుకున్నారు. స్పీకర్ పోస్టులో ఉన్న వారికి ఢిల్లీతో పెద్దగా పని ఉండదు.

అయినా కిరణ్ తరచూ ఢిల్లీ వెళ్లడంపై ఎవరికీ అనుమానం రాకపోవడం విశేషం. ముఖ్యమంత్రి పదవికి అధిష్ఠానం కిరణ్‌ను ఎంపిక చేస్తున్నట్టు నెలక్రితమే చూచాయగా తెలియడంతో, అప్పటిదాకా ఆయనను ప్రోత్సహిస్తూ వస్తున్న సీనియర్ నేత జైపాల్‌రెడ్డి ఒకింత విస్మయానికి గురయ్యారు. రాష్ట్ర రాజకీయాలలో జగన్‌కు నిరోధక శక్తిగా, తనకు సహాయకుడిగా కిరణ్ ఉపయోగపడతారని జైపాల్ భావించారే తప్ప, ఏకంగా తనకే పోటీ వస్తాడని ఊహించలేదు. ఏకాభిప్రాయ అభ్యర్థిగా ముఖ్యమంత్రి పదవిని పరోక్షంగా ఆశిస్తూ వచ్చిన జైపాల్ అందుకే, తెలంగాణ కార్డును ప్రయోగిస్తూ, కిరణ్ అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించారు.

అదే తెలంగాణ కార్డును కె.సి.ఆర్. ప్రయోగించడం వల్లే తనకు సి.ఎం. పదవి దక్కలేదని జైపాల్ వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇక్కడే అధిష్ఠానం తనదైన శైలిలో వ్యవహరించింది. తాను ముఖ్యమంత్రి పదవి చేపట్టాలంటే, కీలకమైన 'తెలంగాణ- జగన్' విషయాల్లో హైకమాండ్ పూర్తి స్పష్టత ఇవ్వాల ని జైపాల్ కోరడంతో, దీన్ని అడ్డుపెట్టుకుని అధిష్ఠానం, కిరణ్‌ను ఎంపిక చేసుకుంది. ఆయా అంశాలపై దృఢ వైఖరి చూపించే విషయంలో జైపాల్, కిరణ్‌తో సరితూగలేకపోయారు.

యువకుడు కావ డం, దూకుడుతనం ఉండడం, ఏది ఎలా వచ్చినా ఎదుర్కొంటానని కిరణ్ భరోసా ఇవ్వడం వల్ల అధిష్ఠానం ఆయనవైపే మొగ్గు చూపిం ది. రోశయ్య రాజీనామా రోజు కూడా ముఖ్యమంత్రి పదవికి జైపాల్ పేరు వినిపించడం, ఆయన చివరి ప్రయత్నాల్లో భాగం కాగా, ప్రణబ్ ముఖర్జీ ఆయన ను పిలిపించుకుని మాట్లాడడం, జైపాల్ మనోభావాలను తాము నిర్లక్ష్యం చేయ డం లేదని తెలంగాణ వాదులకు సూచించే చిన్న డ్రామా మాత్రమే. ముఖ్యమంత్రి అభ్యర్థిపై నెల క్రితమే నిర్ణయం జరగడంతో కాంగ్రెస్ పెద్దల్లో ఎలాంటి టెన్షన్లూ లేవు.

ఉంటే గింటే అసలు సంగతి తెలియని పార్టీ నేతలు, ప్రజలు, మీడియాకే ఆ టెన్షన్! రోశయ్య రాజీనామా, కిరణ్ ఎంపిక విషయంలో సరైన సమాచారాన్ని ముందే పసిగట్టలేకపోయినందుకు తెలుగు మీడియా సిగ్గుపడాలి. చివరికి కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటుకు, అధిష్ఠానం ఆకస్మికంగా- అర్ధరాత్రి ఆదేశాలు జారీచేసినా, అందులోని అంతరార్థాన్ని అవి పట్టుకోలేకపోయాయి.

ఎం.పి. వై.ఎస్. జగన్మోహన్‌రెడ్డిపై చర్య కోసమైతే సి.ఎల్.పి. భేటీ ఎందుకు? అన్న ప్రశ్న ఎవరికీ తట్టలేదు. రాష్ట్రంలో డజనుకు పైగా ఉన్న 'సీరియస్ న్యూస్ చానెళ్లు', అర డజ ను తెలుగు దిన పత్రికల్లో ఏ ఒక్కటీ సి.ఎల్.పి. భేటీకి సరైన భాష్యా న్ని ముందే చెప్పలేకపోవడం, సమాచార సాధనాల్లో లోపిస్తున్న వృత్తి పరమైన పరిణతిని పట్టిచ్చింది.

ఇక కొత్త ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విషయానికి వస్తే, ఆయనకు పరిపాలన అనుభవం లేదనే చెప్పాలి. మంత్రిగా పనిచేయకుండా, నేరుగా ముఖ్యమంత్రి అయిన రెండో నాయకుడు (ఎన్టీఆర్ తర్వాత) కిరణ్‌కుమార్ రెడ్డే. చంద్రబాబు తర్వాత చిన్న వయసులో (సెకండ్ యంగెస్ట్) ముఖ్యమంత్రి అయిన రెండో వ్యక్తి ఆయనే. చంద్రబాబు 45 ఏళ్లకు సీఎం కాగా, ప్రస్తుతం కిరణ్ వయసు 50 ఏళ్లు! దాదాపు రిటైర్‌మెంట్ వయసు వ్యక్తి యువ ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందడం రాజకీయాల్లో కనిపించే వైచిత్రి! ఎవరికైనా తప్పని రోజువారీ పరిపాలనా సమస్యలను పక్కనబెడితే, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా కిరణ్ ముందున్న ప్రధాన సమస్యలు రెండు.

ఒకటి తెలంగాణ, మరోటి జగన్! ఈ రెండింటినీ పరిష్కరించాల్సింది కాంగ్రెస్ అధినాయకత్వమే అయినా, రాష్ట్ర స్థాయిలో వాటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సింది మాత్రం కిరణే. ముఖ్యమంత్రి పదవిని రాయలసీమకు ఇవ్వడం తెలంగాణ ఏర్పాటుకు సంకేతమనే ఒక వాదన వినిపిస్తున్నప్పటికీ, అందులో ఎంతమాత్రం నిజం లేదనే ఎదురు వాదన కూడా బలంగానే ఉంది. "కిరణ్‌కు తెలంగాణ వ్యతిరేకి అన్న ఇమేజ్ ఉంది. ఎంత అవసరమైతే అంత కఠినంగా వ్యవహరించగలడని గట్టిగా నమ్మడం వల్లే ఉద్యమాల ముంగిట్లో అధిష్ఠానం కిరణ్‌ను ఎంచుకుంది.

41 ఎంపీ సీట్లను గెలుచుకుంటామంటూ 2014 ఎన్నికల గురించి మాట్లాడడం, పెట్టుబడుల మజిలీగా మారుస్తామంటూ రాజధాని హైదరాబాద్ గురించి ప్రస్తావించడం, శాంతి భద్రతలపై కఠిన వైఖరి ప్రకటిస్తూ కేంద్ర బలగాలను రప్పిస్తాననడం... ఇవన్నీ కిరణ్ ఎంపిక ఎందుకో చెప్పకనే చెబుతున్నాయి'' అని ఢిల్లీలోని కాంగ్రెస్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. వ్యక్తిత్వం దృష్ట్యా కిరణ్ కొంత అహంభావి. ఒకసారి తేడా వస్తే స్నేహపూర్వకంగా ఉండడం కష్టం.

అయితే పట్టినపట్టు వీడని మొండితనం, అనుకున్నది సాధించడానికి ఏ దశకైనా వెళ్లగల తెగువ ఉన్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుతో కిరణ్ దశాబ్దాల కుటుం బ వైరాన్ని కొనసాగిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. అందువల్ల అధిష్ఠానం ఇతరత్రా కొన్ని ప్రయోజనాలను ఆశించే, అటు ఆంధ్రకు, ఇటు తెలంగాణకు కాకుండా రాయలసీమకు చెందిన కిరణ్‌కు ముఖ్యమంత్రి పీఠం అప్పగించిందని భావించవచ్చు.

వై.ఎస్. కోటరీలో ఒకప్పుడు కీలక పాత్ర పోషించిన కిరణ్, వై.ఎస్. కుమారుడైన జగన్‌తో ఏ మేరకు వైరం పెట్టుకోగలరనే విషయంలో పార్టీలో ఎవరి సందేహాలు వారికి ఉన్నాయి. కిరణ్ వై.ఎస్. కు సన్నిహితుడన్న దానిలో ఎలాంటి అనుమానం లేనప్పటికీ, అదే స్థాయిలో జగన్‌తో సంబంధాలున్నాయని మాత్రం చెప్పలేం. వై.ఎస్. రెండోసారి అధికారంలోకి వచ్చాక, తనకు మంత్రి పదవి రాకపోవడానికి జగనే కారణమన్న అభిప్రాయం కిరణ్‌లో ఉంది.

చిత్తూరు జిల్లా కే చెందిన కిరణ్ ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, జగన్‌కు వ్యాపార భాగస్వామి. పెద్దిరెడ్డికి జగనే మంత్రి పదవి ఇప్పించారని, తనను ఎన్నికల్లో ఓడించడానికి కూడా ప్రయత్నాలు జరిగాయ ని కిరణ్ అనుమానిస్తూ ఉంటారు. కుమారుడి ఒత్తిళ్లకు తలొగ్గి వై.ఎస్. తనకు అన్యాయం చేశారన్న అభిప్రాయం కూడా ఆయనకు ఉంది. మంత్రి పదవి ఇవ్వకుండా, స్పీకర్ పదవి చేపట్టాలని వై.ఎస్. బలవంతపెట్టినపుడు కిరణ్ ఒకింత బాధపడ్డారు.

అయితే కలిసొచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతాడన్నట్టు, ఆ స్పీకర్ పదవే ఇప్పు డు ముఖ్యమంత్రి సీటు అధిరోహించడానికి సోపానమైంది. గత డిసెంబరు సంక్షోభ సమయంలో ఎమ్మెల్యేల మూకుమ్మడి రాజీనామాల వ్యవహారాన్ని సమర్థంగా పరిష్కరించడం, టి.ఆర్.ఎస్. నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై దీటుగా నిర్ణయం తీసుకోవడం కిరణ్‌పై అధిష్ఠానం నమ్మకం పెంచుకోవడానికి ప్రధాన ప్రాతిపదికలు. ఎవరి అదృష్ట రేఖను ఎవరు చెరపగలరు?! అయినా కిరణ్ వ్యవహార శైలి 'తమ్ముడు తమ్ముడే - పేకాట పేకాటే' అన్నట్టు గా ఉంటుందని సన్నిహితులు చెబుతుంటారు.

కిరణ్ స్పీకర్ అయ్యాక, వై.ఎస్. ఆయనను పిలిచి, ప్రజా పద్దుల కమిటీ (పి.ఎ.సి.) చైర్మన్ పోస్టును, తెలుగుదేశం నేత నాగం జనార్దన్‌రెడ్డి చేపట్టకుండా చూడాలని ఆదేశించారట. అయితే అది ప్రధాన ప్రతిపక్షానికి దక్కే పోస్టు అనీ, ఎవరికి ఇచ్చుకోవాలో ఆ పార్టీ ఇష్టమనీ, తానేం చేయలేనని కిరణ్ బదులిచ్చారట. ఈ విషయం ఇరువురి మధ్య వాదులాట కు దారితీసింది. అందువల్లే పావురాలగుట్ట వద్ద ప్రమాదం జరిగిన రోజు వై.ఎస్.తోపాటు హెలికాప్టర్‌లో వెళ్లాల్సిన కిరణ్ తన ప్రయాణా న్ని విరమించుకున్నారట! ఈ నేపథ్యాన్ని గమనిస్తే జగన్‌ను అదుపు చేసే విషయంలో కిరణ్‌కు పెద్దగా అభ్యంతరాలు ఉంటాయనుకోలేం.

ఎవరి రాజకీయ భవిష్యత్తు వారిదే కదా! అధిష్ఠానం ఆదేశా న్ని ధిక్కరించి, జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొన్న బాలినేని శ్రీనివాసరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, తదితరులను కిరణ్ తన కేబినెట్‌లోకి తీసుకుంటారా? మంత్రివర్గ కూర్పులో జగన్ వర్గీయులకు ఎంత ప్రాధాన్యం ఇస్తారు? అన్న వాటి ఆధారంగా జగన్ పట్ల కిరణ్, అధిష్ఠానం వైఖరిని అంచనా వేయవచ్చు. బాలినేని, చంద్రబోస్‌లకు మంత్రి మండలిలో మళ్లీ చోటు కల్పిస్తే, జగన్‌తో రాజీకి అధిష్ఠానం సుముఖంగా ఉందనే సంకేతం వెలువడినట్టే! అయితే, హైకమాండ్ ఆదేశానికి కట్టుబడి ఓదార్పుకు దూరంగా ఉన్న ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న తలెత్తడం ఖాయం.

ప్రస్తుతానికైతే అధిష్ఠానం జగన్ ను ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. సరికదా, పార్టీ శ్రేణులను క్రమంగా ఆయనకు దూరం చేస్తూ, వర్గాన్ని బలహీన పరుస్తున్నది. జగన్ ప్రాంతానికే చెందిన, ఆయన సామాజిక వర్గానికే చెందిన, వై.ఎస్. సన్నిహితుడైన కిరణ్‌ను 'పవర్ సెంటర్'గా మార్చడమే ఇందుకు నిదర్శనం. హైకమాండ్ ఆశించినట్టుగానే ఒకప్పటి వై.ఎస్. వర్గంలోని ముఖ్యులంతా క్రమంగా కిరణ్ పక్కన చేరుతున్నారు.

జగన్ రాజకీయంగా తనంతతాను నిర్వీర్యమయ్యే పరిస్థితిని కల్పిస్తుంది తప్ప, ఆయనకు లాభం కలిగించే రీతిలో, పార్టీ నుంచి బయటకు పంపడం వంటి ఏ చర్యనూ అధిష్ఠానం తీసుకునే అవకాశాలు ఎంతమాత్రం లేవు. దీంతో ఇక ఇప్పుడు జగన్ వైఖరి ఎలా ఉండబోతోంది? తనకు పక్కలో బల్లెంలా మారుతున్న కిరణ్‌ను జగన్ ఏమేర కు సహిస్తాడు? అన్నది ఆసక్తికరం. మారిన సమీకరణాల దృష్ట్యా జగ న్ అప్పుడే తొందరపడకపోవచ్చు. మంత్రివర్గ విస్తరణ తర్వాత ఎమ్మెల్యేల్లో ఏర్పడే అసంతృప్తిని, లేదా శ్రీకృష్ణ కమిటీ నివేదిక తర్వాత చోటుచేసుకునే పరిణామాలను తనకు అనుకూలంగా మలచుకోవడానికి జగన్ పావులు కదపవచ్చు. జగన్ ముందున్నవి రెండే రెండు మార్గాలు.

ఒకటి- గత వైభవాన్ని, ముఖ్యమంత్రి పదవిని మరచిపో యి, అవమానాలను దిగమింగుకుని, గుంపులో గోవిందయ్యలా రాజీపడి కాంగ్రెస్‌లోనే ఉండిపోవడం. రెండు-పార్టీపై తిరుగుబాటు చేసి తన భవిష్యత్తు తాను చూసుకోవడం. కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడం ద్వారా జగన్ ఎత్తుకు అధిష్ఠానం మలి ఎత్తు వేసింది. జగన్ వంటి వ్యక్తులకు ఇతరులెవ్వరూ నష్టం చేయలేరు. ఎందుకంటే వారిని వారే దెబ్బతీసుకుంటారు!  - ఆదిత్య 

'నల్లారి' నడక కాదు!

కాంగ్రెస్ ప్రభుత్వానికి కెప్టెన్‌గా నియమితులైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సవాళ్లను అధిగమించగలరా? ఇందుకు సీనియర్ల సహకారం లభిస్తుందా? అన్నది కాంగ్రెస్ శ్రేణులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న! జగన్‌ను కట్టడి చేయాలంటే పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించవలసిన బాధ్యత కిరణ్‌పై ఉంది. ముఖ్యమంత్రి పదవి సంపాదించుకునే వరకు గోప్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించిన కిరణ్, ఇప్పుడు కూడా అదే బాటలో పయనించడం వల్ల మంత్రిత్వ శాఖల కేటాయింపు జరిగీ జరగక ముందే అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి.

2010 సంవత్సరం వెళుతూ వెళుతూ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పి, రెండు కీలక ఘట్టాలకు నాంది పలికింది. రాష్ట్ర కాంగ్రె స్ రాజకీయాలలో, కేవలం వారం రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు సంఘటనలు, అనూహ్యమైనవి కాకపోయినప్పటికీ, ఇంత త్వరగా చోటు చేసుకుంటాయని మాత్రం ఎవరూ ఊహించలేదు. ఇందులో మొదటిది కడప ఎం.పి. వై.ఎస్.జగన్మోహనరెడ్డి, తన తల్లి ఎం.ఎల్.ఎ. విజయమ్మతో సహా కాంగ్రెస్ పార్టీని విడిచి పెట్టి, సొంత కుంపటి పెట్టుకోవాలని నిర్ణయించుకోవడం.

రెండవది కొణిజేటి రోశ య్య స్థానంలో ముఖ్యమంత్రిగా నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి రావడం. జగన్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి సొంత పార్టీ పెట్టుకుంటారని అంద రూ భావించినదే అయినప్పటికీ, తనపై కాంగ్రెస్ అధిష్ఠానం చర్య తీసుకునే వరకు వేచి ఉండి, ఆ తర్వాత మాత్రమే తిరుగుబాటు జెండా ఎగురవేస్తారని రాజకీయ పరిశీలకులు భావించారు. అయితే ఓర్పుగా వేచి ఉండటం అంటే తెలియని జగన్, కాంగ్రెస్ పార్టీకి ఆ మాత్రం శ్రమ కూడా లేకుండా చేశారు. కాంగ్రెస్ ద్వారా సంక్రమించిన ఎం.పి, ఎం.ఎల్.ఎ. పదవులకు జగన్ - విజయమ్మలు రాజీనా మా చేశారు. మరో రెండు మూడు నెలల్లో సొంత పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్ తన సహచరులకు స్పష్టం చేశారు కూడా! వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి ముఖ్యమంత్రి పీఠం పై ఆశలు పెంచుకున్న జగన్, అది తనకు అందనంత దూరంలో ఉందని గ్రహించారు.

పార్టీలోనే ఉంటూ, తన తండ్రిలాగా 25 సంవత్సరాలపాటు నిరీక్షించి, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించే ఓర్పు-నేర్పు లేని జగన్, కాంగ్రెస్‌లో ఎంతోకాలం ఉండరని ఊహించిందే! తాను ఆశించిన పదవిలోకి రోశయ్య వచ్చిన నాటి నుంచి, జగ న్ కాంగ్రెస్‌తో అంటీముట్టినట్టుగానే వ్యవహరిస్తూ వచ్చారు. నెలల తరబడి ఓదార్పు యాత్ర చేసినా, ఎక్కడా కాంగ్రెస్ గురించి గానీ, సోనియాగాంధీ గురించి గానీ జగన్ ప్రస్తావించిన పాపాన పోలేదు. అంటే సొంత పార్టీ పెట్టుకోవడం ద్వారానే తాను కలలుగంటున్న ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని ఆయన గట్టిగా నమ్ముతూ వచ్చారన్న మాట.

తాను కాంగ్రెస్‌కు నష్టం చేయలేదని జగన్ చెప్పినా, కాంగ్రెస్‌ను వీడి జగన్ సొంత పార్టీ పెట్టుకుంటారని వస్తున్న వార్తలు అభూత కల్పనలని ఆయన అనుచరులు ఎంతగా చెప్పినా, జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఆయన అంతరంగం ఇట్టే తెలిసిపోతుంది. నాలుగు పదుల వయస్సు కూడా లేని జగన్‌కే ఇన్ని తెలివితేటలు ఉంటే, కాకలు తీరిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు ఆ మాత్రం పసిగట్టలేరా? ఈ కారణంగానే జగన్‌ను దీటుగా ఎదుర్కొనే మొండితనం ఉన్న కిరణ్‌కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. సోనియాను విమర్శించిన వారంతా తన శత్రువులేనని ప్రకటించడం ద్వారా జగన్ విషయంలో తన వైఖరి ఎలా ఉండబోతున్నదో ముఖ్యమంత్రి పరోక్షంగా స్పష్టం చేశారు.

రాష్ట్ర కాంగ్రెస్‌లో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఎటు దారి తీయనున్నాయి? సొంత పార్టీ ఏర్పాట్లలో తలమునకలై ఉన్న జగన్, మూడున్నర ఏళ్ల పాటు నిరీక్షించి, సార్వత్రిక ఎన్నికలలో మాత్రమే తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? అంతకాలం వేచి ఉండే సహ నం ఆయనకు ఉందా? ఇప్పటికే పది మందికి పైగా ఎం.ఎల్.ఎ.లు జగన్‌తో చేతులు కలిపిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కిరణ్ సుస్థిర ప్రభుత్వాన్ని అందివ్వగలరా? అసలు ఆయన ప్రభుత్వ మనుగడ ఎంతకాలం? వచ్చే ఎన్నికలలో జగన్ లక్ష్యం నెరవేరుతుందా? జగన్ ఫ్యాక్టర్‌ను అధిగమించి కాంగ్రెస్ పార్టీని విజయతీరాల వైపు నడిపించగల సత్తా కిరణ్‌కు ఉందా? వంటి ప్రశ్నలు సామాన్యుల నుంచి మాన్యుల వరకు అందరిలో తలెత్తుతున్నాయి.

ముందుగా జగన్ విషయం తీసుకుంటే ఆయనది 'వాపా - బలుపా' అన్నది తేలవలసి ఉంది. ఇందుకు మరికొంత కాలం పడుతుంది. స్వతహాగా దుందుడుకు స్వభావం కలిగిన జగన్, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని చెప్పలేం. ఎందుకంటే ఆయన కేవలం తన తండ్రి రాజశేఖరరెడ్డికి ప్రజల్లో ఉన్న పేరునే నమ్ముకుని సొంత పార్టీ పెట్టుకోవాలన్న సాహ సానికి ఒడిగట్టారు. ఈ కారణంగానే తనతో ఎవరు ఉన్నారు? ఏయే జిల్లాలలో ఎవరెవరిని ఆకర్షించాలి? వంటి ఆలోచనలు చేయకుండా, తనతో ఎవరూ రాకపోయినా ముందుకే వెళ్లాలని నిర్ణయించుకున్నా రు. అందువల్లే తన చిన్నాన్న వై.ఎస్.వివేకానందరెడ్డితో కూడా సఖ్యత నెలకొల్పుకోలేకపోయారు.

వాస్తవానికి వివేకానందరెడ్డి తన విధేయతను కాంగ్రెస్ అధినాయకత్వానికి ప్రకటించి, మంత్రివర్గం లో చేరడం జగన్‌కు తొలి దెబ్బ! అయినా ఇవేవీ పట్టించుకునే స్థితిలో జగన్‌లేరు. నిజానికి వివేకాకు పులివెందులలో మంచి పేరే ఉంది. ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్, సహజంగానే పులివెందుల నుంచి పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని భావిస్తారు. దశాబ్దాలుగా తమ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నుంచి గెలవడం, మామూలుగా అయితే ఆయనకు నల్లేరు మీద నడకే! కానీ, వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో దిట్ట అయిన కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలు, పులివెందులలో జగన్‌పై పోటీకి వివేకాను దించే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అదే జరిగితే జగన్ ఓడిపోతారని చెప్పలేం గానీ, గెలుపుకోసం శ్రమించవలసి ఉంటుంది.

ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన తమకు లేదని జగన్ వర్గీయులు ప్రస్తుతం చెబుతున్నప్పటికీ, మూడున్నరేళ్లపాటు కొనసాగడం ద్వారా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బలపడటానికి జగన్ అవకా శం ఇస్తారన్నది నమ్మ శక్యం కాని విషయం. ఇప్పటికే తాను ఆదేశిస్తే 10 మందికి పైగా ఎం.ఎల్.ఎ.లు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్న విషయం ఆయనకు తెలు సు. అయితే ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి దాదాపు 25 మంది బలం ప్రజారాజ్యం- మజ్లిస్ పార్టీలు సిద్ధంగా ఉన్నందున, అంతే సంఖ్యలో కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లను తన వైపు తిప్పుకోవడానికి జగన్ కచ్చితంగా ప్రయత్నిస్తారు. ఈ మేరకు ప్రయత్నాలు కూడా ప్రారంభమైనట్లు వార్తలు వస్తున్నా యి. అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా? లేదా? అన్నది వేరే విష యం.

ఆ దిశగా అడుగులు పడాలంటే, ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం జగన్ుకు కచ్చితంగా ఉంది. కాంగ్రెస్ పార్టీలో చీలికను ప్రోత్సహించడం ద్వారా అస్థిరత సృష్టించడానికి ప్రయత్నిస్తే, రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధింపజేయడం ద్వారా ఎన్నికలను కొంతకాలం పాటు వాయిదా వేయడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నిం చే విషయం ఆయనకు తెలుసు. రాష్ట్రపతి పాలన పేరిట ఏడాది పాటు ఎన్నికలు వాయిదా వేయవచ్చు. ఈ కారణంగానే 'రెండేళ్లలో అధికారం మనదే' అని జగన్ రెండురోజుల క్రితం ప్రకటించారు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవసరమైన బలాన్ని సమీకరించుకోవడానికి కొంతకాలం పడుతుంది. ఈ లెక్కలన్నీ వేసుకున్న మీదటే, 2014 బదులు 2013లోనే ఎన్నికలు జరుగుతాయన్న సంకేతాలను జగన్ ఇస్తున్నారు. అయితే తెలంగాణలో కనీస స్థాయిలో కూడా బలం లేని జగన్ లక్ష్యం నెరవేరుతుం దా? అంటే రాష్ట్రం సమైక్యంగా ఉంటే సాధ్యం కాదు. చర్యకు ప్రతి చర్య ఉన్నట్టుగానే, జగన్ అంచనాలు కాంగ్రెస్ అధిష్ఠానానికి తెలియనివి కావు. అందుకు అనుగుణంగానే రాష్ట్ర విభజన అంశంలోగానీ, మరేఇతర విషయంలోగానీ వారి వ్యూహాలు వారికి ఉంటాయి.

ఇల్లు అలకగానే పండగ కాదు అన్నట్లు కొంతమంది ఎం.ఎల్. ఎ.లు, ప్రజల్లో అంతగా ఆదరణ లేని ద్వితీయ శ్రేణి నాయకులు తన తో ఉన్నంత మాత్రాన, అధికారంలోకి వచ్చేస్తానని జగన్ కలలు కంటే అమాయకత్వమే అవుతుంది. ఇతరుల అభిప్రాయాలకు విలు వ ఇవ్వని జగన్, అన్నీ తనకు తెలుసుననీ, అన్నీ తాను అనుకున్నట్లుగానే జరుగుతాయని గట్టిగా నమ్ముతున్నారు. వాస్తవానికి జగన్ వ్యవహారం కాంగ్రెస్ నాయకులను సంఘటిత పరచడానికి పరోక్షం గా ఉపయోగపడుతున్నది. మంత్రిత్వ శాఖల కేటాయింపుపై అంత లా అసంతృప్తి చెలరేగినా, సాయంత్రానికల్లా చల్లబడిపోవడానికి జగన్ వ్యవహారమే ప్రధాన కారణం. తమ చర్యలు జగన్‌కు లాభించే ప్రమాదం ఉందని గుర్తించి మంత్రులు, ముఖ్యంగా తెలంగాణకు చెందినవారు కొన్ని గంటల్లోనే స్వరం మార్చారు. అసాధారణ రీతి లో సంక్షోభం తలెత్తినా, అది తనకు ఉపయోగపడని విషయాన్ని జగన్ గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.

అంతేకాదు; రాబోయే రోజుల్లో జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పరస్పరం ఢీకొంటూ, ఒకదాన్ని ఒకటి బలహీనపరచుకోవడానికి తీవ్రస్థాయిలో పోరాడుతాయి. ఇప్పటి వరకు తమతో ఉన్న కారణంగా జగన్ వ్యవహారాలను అంత బాహాటంగా వెల్లడించని కార గ్రెస్ నేతలు, ఇకపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఆయననే టార్గెట్ చేస్తారు. జగన్ తన మీడియా ద్వారా ఇప్పటికే కాంగ్రెస్‌ను టార్గెట్ చేశారు. ఎందుకంటే తనకు ముఖ్యమంత్రి పీఠం దక్కాలంటే, కాంగ్రెస్ ఓటు బ్యాంకుపైనే జగన్ ఆధారపడవలసి ఉంటుంది. తెలుగుదేశం, ప్రజారాజ్యం పార్టీల ఓట్లు జగన్‌కు వెళ్లే అవకాశాలు చాలా తక్కువ. ఒకే ఓటు బ్యాంకు కోసం అటు జగన్, ఇటు కాంగ్రెస్ పార్టీ పోరాడవలసి ఉంటుం ది. ఈ క్రమంలో జగన్‌పై ముప్పేట దాడికి కాంగ్రెస్ నాయకులు సిద్ధమవుతున్నారు. రెడ్లు, మైనారిటీలు, దళితులు, క్రైస్తవుల ఓట్లపై జగన్ ఆధారపడి ఉన్నారు. ఈ వర్గాలన్నీ ఆది నుంచి కాంగ్రెస్‌కు అండగా ఉంటున్నాయి. తమ ఓటు బ్యాంకును జగన్ కొల్లగొట్టకుండా కాంగ్రె స్ శ్రేణులు ఏ మేరకు అడ్డుకుంటాయో వేచి చూడాలి.

అటు కేంద్రం లో, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్నందున, రాజశేఖరరెడ్డి హయాంలో జగన్ సాగించిన వ్యవహారాలన్నింటినీ ఇప్పుడు బజారుకీడ్చడం ద్వారా, ప్రజల్లో ఆయనను పలచన చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు ప్రయత్నిస్తాయి. అనుకున్నది సాధించడం కోసం ఎంతకైనా తెగించే జగన్‌ను కాంగ్రెస్ పార్టీ ఆషామాషీగా వదలిపెట్టదు. రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బాగోతాలన్నీ కాంగ్రెస్ పెద్దలకు తెలియనివి కావు. ఇప్పుడు వాటినే అస్త్రాలుగా ప్రయోగిస్తా రు. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. వై.ఎస్.ఆర్. ముఖ్యమంత్రి గా ఉన్నపుడు, రాజ్‌భవన్‌లో ఆగస్టు 15వతేదీ సాయంత్రం గవర్నర్ తేనీటి విందు ఇచ్చారు. ఆ విందుకు రాజశేఖరరెడ్డి దంపతులతో పాటు పలువురు మంత్రులు, సీనియర్ అధికారులు, పుర ప్రముఖు లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వై.ఎస్.ఆర్. సతీమణి విజయ మ్మ తన మనస్సులోని ఆవేదనను ఒక సీనియర్ మంత్రితో పంచుకున్నారు. "తండ్రి, కొడుకుల మధ్య నేను నలిగిపోతున్నాను. బెంగళూరుకు మాత్రమే పరిమితం కావాలని కొడుకు (జగన్)ను ఆయన (వై.ఎస్) ఆదేశించారు. అయినా మా వాడు చీటికీమాటికీ ఇక్కడకు వస్తున్నాడు. వాడిని చూసిన ప్రతిసారీ ఎందుకు రానిస్తున్నావు? అంటూ ఆయన నాపై మండిపడుతున్నారు. కొడుకు ఇంటికి వస్తే రావద్దని తల్లిగా ఎలా చెప్పగలను?''అని విజయమ్మ సదరు మంత్రి వద్ద తన గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సంఘటనను గుర్తుచేస్తూ, "జగన్ తత్వం ఏమిటో, తను ఎలాంటి వాడో, ఏమేమి చేశాడో, మాకు తెలుసు, మా అధికారానికి సవాల్‌గా నిలిచినపుడు మేం ఊరి కే ఉంటామా? అన్నీ బయటపెడతాం'' అని ఆ మంత్రి వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి జగన్ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మున్ముందు పోరు ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు.

కాంగ్రెస్ ప్రభుత్వానికి కెప్టెన్‌గా నియమితులైన కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ సవాళ్లను అధిగమించగలరా? ఇందుకు సీనియర్ల సహకారం లభిస్తుందా? అన్నది కాంగ్రెస్ శ్రేణులను ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న! జగన్ ను కట్టడి చేయాలంటే పార్టీ మొత్తాన్ని ఏకతాటిపై నడిపించవలసిన బాధ్యత కిరణ్‌పై ఉంది. ముఖ్యమంత్రి పదవి సంపాదించుకునే వర కు గోప్యంగా, వ్యూహాత్మకంగా వ్యవహరించిన కిరణ్, ఇప్పుడు కూడా అదే బాటలో పయనించడం వల్ల మంత్రిత్వ శాఖల కేటాయిం పు జరిగీ జరగక ముందే అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. తాను నాయకత్వం వహిస్తున్నది 'మైనారిటీ ప్రభుత్వానికి' అన్న వాస్తవాన్ని కిరణ్ గుర్తించినట్లు లేదు. జగన్ మనుషులు రాజీనామా చేస్తే మైనారిటీ ప్రభుత్వమే అవుతుంది. ఆ పరిస్థితులలో ప్రజారాజ్యం, మజ్లిస్ పార్టీలపై ఆధారపడి, వారి ఒత్తిళ్లకు తలొగ్గుతూ, కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కిరణ్‌కు కత్తి మీద సాము అవుతుంది.

తెలివిగలవాడైతే ఆ పరిస్థితి రాకుండా, కాంగ్రెస్ ఎం.ఎల్.ఎ.లు చేజారిపోకుండా చూసుకోవలసి ఉంటుంది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నైజంగానీ, ఆయన వ్యవహారశైలిగానీ సామాన్య ప్రజలెవ్వరికీ తెలియదు. అయితే ఆలోచనతో చేశారో, అనాలోచితంగా చేశారో తెలియదుగానీ, కీలక శాఖలన్నింటినీ ఒకే వర్గానికి కట్టబెట్టడం ద్వారా, రెడ్డి రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించారన్న అపకీర్తిని ఆయన మూటగట్టుకున్నారు. ఈ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కిర ణ్ నైజం ఏమిటో తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆయనలో కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్, కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి.

మొండితనం, నిజాయితీ, ఒత్తిళ్లకు లొంగకపోవడం వంటి వి ఆయనలోని స్ట్రాంగ్ పాయింట్స్. అదే సమయంలో రెడ్ల పట్ల ప్రత్యేక అభిమా నం చూపడం, ఎవరినీ సంప్రదించకపోవడం, అహంకారి అని భావించేలా కనిపించడం ఆయనలోని వీక్ పాయింట్స్. నాలుగు పర్యాయాలు శాసనసభకు ఎన్నికైనా, ఇప్పటిదాకా ఆయన నిర్వహించిన పదవులు ప్రభుత్వ చీఫ్ విప్ -శాసనసభ స్పీకర్ మాత్రమే. ఈ పదవులు వేరు, ముఖ్యమంత్రి పదవి వేరు. ఇప్పుడు ఆయన రాష్ట్రానికి నాయకుడు, కొందరివాడుగా కాకుండా, అందరివాడు అనిపించుకోవలసిన బాధ్యత ముఖ్యమంత్రి కిరణ్‌పై ఉంది.

జగన్‌వైపు ఆకర్షితులవుతున్న రెడ్లను, తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లించడానికి చేసే ప్రయత్నం లో భాగంగా, ఆ వర్గానికి ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రయత్నించి ఉండవచ్చు. లేదా, తనకు న్న కులాభిమానం వల్ల అలా చేసి ఉండవచ్చు. అయితే మాంసం తింటున్నామని ఎముకలు మెడలో వేసుకుని తిరుగరు కదా! తన చర్యల వల్ల ఇతర వర్గాల వారు మనస్సు కష్టపెట్టుకోకుండా జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది. అదే సమయంలో అన్ని విషయాలను కాకపోయినా, కనీ సం కొన్ని విషయాలలోనైనా పార్టీలోని ముఖ్యులను భాగస్వాముల ను చేయవలసిన అవసరం ఉంది. ఇందుకు భిన్నంగా ఒంటెత్తు పోకడలు పోతే, ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా నష్టపోతుంది.

జగన్‌ను కట్టడి చేసే విషయం అటుంచి, ఆయనకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వ్యవహారశైలి ఉందని కాంగ్రెస్ ముఖ్యులే వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని సందర్భాలలో ఒకే ఫార్ములా పని చేయదన్న వాస్తవాన్ని కిరణ్ తెలుసుకోవడం అవసరం. శాఖల కేటాయింపుపై అసంతృప్తి వ్యక్తం చేయడం అర్థం లేనిదని ఆయన భావిస్తూ ఉండవచ్చు. ఏ శాఖలు కేటాయించారన్నది కాదు, తమలో కొందరినైనా కనీసం సంప్రదించకుండా ఒక్కడే కూర్చుని శాఖలు కేటాయించిన తీరు పట్ల పలువురు మంత్రులు మనస్సు కష్టపెట్టుకున్నారు. దీన్ని మరో రూపంలో వెల్లడించారు. శాఖల కేటాయింపుపై తలెత్తి సమసిపోయి న సంక్షోభాన్ని ఒక అనుభవంగా ముఖ్యమంత్రి స్వీకరించి, భవిష్యత్తులో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తే నాలుక కరుచుకునే పరిస్థితి రాకపోవచ్చు.        - ఆదిత్య 

గురివింద సుభాషితాలు

ఎట్టకేలకు స్వంత పార్టీ పెట్టుకుంటున్నట్లు కడప మాజీ ఎం.పి. వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ ప్రకటనతో పాటు ఆయన తన లక్ష్యాలను, ఏ కారణంగా స్వంత పార్టీ పెట్టుకుంటున్న దీ వివరించారు. ఈ సందర్భంగా జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశాలు అయ్యాయి. ఇందులో మొదటిది ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడానికే పార్టీ పెడుతున్నట్లు ప్రకటించడం.

ప్రస్తుత రాజకీయాలలో విలువలు లేవనీ, తాను ఏర్పాటు చేసే పార్టీ 2014లో అధికారంలోకి వచ్చి 30 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పాలిస్తుందని మిగతా లక్ష్యాలుగా చెప్పుకున్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్యుల నుంచి అప్పుడే ప్రతిస్పందన కూడా ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీలో విలువలు లేవనీ, కుట్రలు, కుయుక్తులు రాజ్యమేలుతున్నాయని చెబుతున్న జగన్, ముందుగా ఆ విషయాన్ని ఎప్పు డు గుర్తించారో స్పష్టం చేయవలసి ఉంది.

తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, ప్రతిపక్షాలకు చెందిన శాసన సభ్యులను ప్రలోభపెట్టి ఆయా పార్టీలను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించినపుడు, ఈ విలువలు జగన్‌కు ఎందుకు గుర్తుకు రాలే దో తెలియవలసి ఉంది. తన కుటుంబాన్ని చీల్చే నీచత్వానికి కాంగ్రె స్ అధినేత్రి సోనియాగాంధీ పాల్పడ్డారని విమర్శించిన జగన్‌కు, రాజకీయాలలో ఇలాంటివి సర్వసాధారణం అన్న విషయం తెలియకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

తన తండ్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి.... కాంగ్రెస్ పార్టీకి బద్ధ వ్యతిరేకి అయిన ఎన్.టి.రామారావు కుటుంబాన్ని చీల్చి పురందేశ్వరిని తమవైపు తిప్పుకోవడం, ఇతర పార్టీలను చీల్చడం తప్పు కానప్పుడు, కాంగ్రెస్ తన కుటుంబాన్ని చీల్చడం తప్పు ఎలా అవుతుందో జగనే వివరించాలి. తన ఇంటిపైన, తన మీడియా కార్యాలయాలపైనా దాడులు చేశారని విమర్శిస్తున్న జగ న్, ఒక్కసారి గతాన్ని గుర్తుచేసుకోవడం అవసరం.

రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు 'ఆంధ్రజ్యోతి'పై దాడులను పరోక్షంగా ప్రోత్సహించిన విషయం మరచిపోయారా? మార్గదర్శి ఫైనాన్స్ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని 'ఈనాడు' గ్రూపు అధినేత రామోజీరావు కార్యాలయాలపై దాడులు చేయించిన విషయం గుర్తుకు రాలే దా? ఆనాడు తన తండ్రి చేసిన చర్యలను ఖండించని జగన్‌కు, ఇపు డు ప్రభుత్వ చర్యలను తప్పుపట్టే నైతికత ఉందా? ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారన్న సామెత ఉండనే ఉంది.

తాను, తన తండ్రి కలిసి ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టడానికి అనుసరించిన వినూ త్న పోకడల్నే, ఇప్పుడు తన విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్నద ని గుర్తించకపోతే ఎలా? నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా! అని కాంగ్రె స్ ప్రభుత్వం జగన్ విషయంలో మున్ముందు వ్యవహరించనుంది. ఈ విషయంలో ధర్మాధర్మాల గురించి వాపోయే అర్హత జగన్‌కు ఉందా? జగన్ వ్యాఖ్యలలో అన్నింటికంటే కీలకమైనది 'ఆత్మ గౌరవం'! ఆత్మ గౌరవం నినాదంతోనే ఆయన భవిష్యత్‌లో కాంగ్రెస్ పార్టీని ఢీకొనబోతున్నారని దీనితో స్పష్టం అవుతున్నది.

అయితే ఈ ఆత్మ గౌరవ నినాదాన్ని ఇచ్చే అర్హత జగన్‌కు ఉందా? అన్నది ప్రశ్న! రాష్ట్ర రాజకీయాలలో, ఆత్మ గౌరవం నినాదంతో అధికారంలోకి వచ్చిన ఏకైక నాయకుడు ఎన్.టి.రామారావు. ఆనాటి పరిస్థితులలో ఎన్.టి.ఆర్. ఇచ్చిన ఈ నినాదానికి ప్రజల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. ఆనాడు ఇందుకు దారితీసిన పరిస్థితులను ఒకసారి మన నం చేసుకుందాం. 1978-83 మధ్య కాలంలో, ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌పార్టీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రులను చీటికి మాటి కి మారుస్తూ వచ్చింది.

అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనలతో తమ ఆత్మ గౌరవానికి భంగం కలుగుతున్నదని తెలుగు ప్రజలు భావించారు. ఆరణాల కూలీగా జీవితాన్ని ప్రారంభించిన అంజయ్య విషయంలో ప్రజల్లో సానుభూతి ఉండేది. ఆనా డు ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా ఉన్న రాజీవ్‌గాంధీ, బేగంపేట విమానాశ్రయంలో తనకు స్వాగతం చెప్పడానికి వచ్చిన ముఖ్యమంత్రి అంజయ్యను ఈసడించుకున్నారు. ఈ సంఘటన తెలుగు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపింది.

అంజయ్యకు బోలెడు సానుభూతి లభించింది. ఆ తర్వాత ఎ.ఐ.సి.సి పరిశీలకుడు జి.కె.మూపనార్ రాష్ట్రానికి వచ్చి, అధికారం నుంచి తప్పుకోవలసిందిగా తనను ఆదేశించడంతో అంజయ్య కన్నీళ్ళు పెట్టుకున్నారు. మూపనార్ రాష్ట్రాలకు వెళుతున్నారంటే కాంగ్రెస్ ముఖ్యమంత్రులకు మూడినట్టేనన్న భావన అప్పట్లో ఉండేది. ఈ రెండు సంఘటనల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్.టి.ఆర్ 'ఆం«ద్రుల ఆత్మ గౌరవం' నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి ఏమి భంగం కలిగిందని ఆ నినాదాన్ని అందిపుచ్చుకుంటున్నారో జగన్ చెప్పవలసి ఉంది.

తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, రాష్ట్రంలో ప్రారంభించిన పతి పథకానికి, కార్యక్రమానికి రాజీవ్‌గాంధీ-ఇందిరాగాంధీ పేర్లు పెట్టినపుడు ఆంధ్రుల ఆత్మ గౌరవం జగన్‌కు ఎందుకు గుర్తుకురాలేదో! విమానాశ్రయానికి అప్పటికే ఉన్న ఎన్.టి.ఆర్ పేరును తొలగించి, రాజీవ్‌గాంధీ పేరు పెట్టినపుడు జగన్ ఎందుకు అభ్యంతరపెట్టలేదో తెలియవలసి ఉంది.

పొరుగున ఉన్న తమిళనాడు, మహారాష్ట్ర తమ విమానాశ్రయాలకు తమ తమ రాష్ట్రాలకు చెందిన మహనీయుల పేర్లనే పెట్టుకున్నాయి. పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇదేవిధంగా వ్యవహరించా యి. ఒక్క మన రాష్ట్రంలోనే రాజశేఖరరెడ్డి హయాంలో రాజీవ్‌గాంధీ నామ స్మరణ మారుమోగింది. బడుగు వర్గాలకు చెందిన అంజయ్యను అవమానించిన రాజీవ్‌గాంధీ పేరును ప్రతి దానికి పెట్టడం వల్ల ఆం«ద్రుల ఆత్మ గౌరవం దెబ్బతింటుందని జగన్ ఎందుకు గుర్తించలేక పోయారో స్పష్టంచేయవలసి ఉంది.

తాను టార్గెట్‌గా పెట్టుకున్న ముఖ్యమంత్రి పదవిని కాంగ్రెస్ అధిష్ఠానం ఇవ్వకపోవడం వల్ల తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి కలిగిన నష్టం ఏమిటో తెలియడం లేదు. నిండా ఒకటిన్నర సంవత్సరం రాజకీయ అనుభవం కూడా లేని జగన్‌కే అన్ని ఆశలు ఉంటే, కాంగ్రెస్ పార్టీనే ఎప్పటి నుంచో నమ్ముకుని ఉన్న సీనియర్ నాయకులకు ఎన్ని ఆశలు ఉండాలి! అయినా తాము ఆశించిన పదవులు దక్కని సందర్భాల లో, ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లిందని చెప్పడానికి సాహసించలేదు.

రాచరికపు వాసన లు నిండా ముప్పరిగొని ఉన్న జగన్ మాత్రమే తండ్రి వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి దక్కాలని కోరుకోగలరు! ఆశించినది దక్కకపోవడంతో ఆయన ఆశాభంగం చెందడంలో తప్పులేదు. కానీ తన తరఫున, రాష్ట్ర ప్రజలందరూ తమ ఆత్మ గౌరవానికి భంగం కలిగిందం టూ శోకించాలని కోరుకోవడం మాత్రం అత్యాశే అవుతుంది.

ఆయన అత్యాశాపరుడు కనుక అలాగే ఆలోచిస్తారు మరి! మూడేళ్లపాటు కష్టాలు తప్పవనీ, 2014లో అధికారం తమదేనని చేసిన వ్యాఖ్యలోని అంతరార్థం ఏమిటో తెలుసుకోవలసి ఉంది. అధికారం కోసం 2014 వరకు వేచి చూసే ఓపిక ఉండే పక్షంలో కాంగ్రెస్‌లోనే కొనసాగి, అధిష్ఠానానికి విధేయుడుగా ఉండి ఉంటే ముఖ్యమంత్రి పీఠం దక్కే అవకాశం ఉంది కదా? అని సామాన్యులకు సందే హం కలుగుతున్నది.

వాస్తవానికి 2014 వరకు వేచి ఉండే ఓపిక జగన్‌కు లేదని కచ్చితంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రిగా రోశయ్యను తప్పించి కిరణ్‌కుమార్‌రెడ్డిని నియమించడంతోనే జగన్‌లో అసహ నం కట్టలు తెంచుకుంది. ఆ కారణంగానే కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి సూచన మేరకు, ముఖ్యమంత్రి కిరణ్ ఫోన్ చేసినా జగన్ కట్ చేశారు. తనకు దక్కాల్సిన పదవిని కిరణ్ తన్నుకుపోయారన్నది ఆయన కోపానికి కారణం.

తనను తప్ప మరో వ్యక్తిని ముఖ్యమంత్రి గా అంగీకరించడానికే ఇష్టపడని జగన్, మూడేళ్ళపాటు ఓర్పుగా వేచి ఉంటారంటే నమ్మడం కష్టమే! అయినా ఆ ప్రకటన ఎందుకు చేశారో, దాని వెనుక మర్మం ఏమిటో శోధించవలసి ఉంది. నిజానికి ప్రభుత్వాన్ని వీలైనంత తొందరగా కూల్చివేసి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠాంచాలన్న ఆత్రుత జగన్‌కు ఉంది. అయితే ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైనంత బలం తనకు ఉందా? అన్న విషయం లో ఆయనకే సందేహాలు ఉన్నాయి.

తాను ఆదేశిస్తే ఎంతమంది ఎం.ఎల్.ఎ.లు రాజీనామాలు చేస్తారో ఆయనకే తెలియదు. రాజకీయాల్లో విశ్వాసానికి తావు ఉండదు. తన విషయంలో, తన తండ్రి వల్ల లబ్ధి పొందిన వాళ్ళు విశ్వాసం చూపించడం లేదని వాపోయే జగన్, అదే ఫార్ములా కాంగ్రెస్ పార్టీ విషయంలో తనకు కూడా వర్తిస్తుందని గుర్తించకపోవడమే విడ్డూరం. కాంగ్రెస్ పార్టీ కారణంగానే తన తండ్రి గానీ, తాను గానీ ఈ స్థానానికి వచ్చామ న్న విషయాన్ని విస్మరించి, తమ వల్లే కాంగ్రెస్ పార్టీ ఈ స్థానానికి వచ్చిందని భావించడం ఆయనలోని అహంకారానికి నిదర్శనం.

పైకి 2014 వరకు వేచి ఉంటానని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వాన్ని కూల్చడానికి అవసరమైన బలం సమకూరినపుడు జగన్ కచ్చితంగా ఆ పని చేస్తారు. అటువంటి ఆలోచనే లేకపోతే ఆయన కాంగ్రెస్‌లోనే కొనసాగి ఉండవచ్చు. అలా చేసి ఉంటే ఇవ్వాళ కాకపోయినా, రేపు అయినా ముఖ్యమంత్రి పదవి దక్కేది. అయినా ముఖ్యమంత్రి కావడానికి తనకున్న అర్హతలు ఏమిటో ఆయనే చెబితే మంచిది.

తండ్రి దుర్మరణం చెందిన ప్రమాద స్థలికి వెళ్ళి, భౌతిక కాయాన్ని తీసుకురావడానికి కూడా ప్రయత్నించకుండా, తదుపరి ముఖ్యమంత్రి కావడానికి ఎం.ఎల్.ఎ.ల సంతకాల సేకరణకు ప్రేరేపించిన జగన్‌ను, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారో లేదో కానీ, కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం బాగా అర్థం చేసుకుంది. శ్రీమతి ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్‌గాంధీని ప్రధానమంత్రిగా నియమించలేదా? అని ప్రశ్నిస్తున్న జగన్ వర్గం ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి.

రాజీవ్‌గాంధీ అప్పటికే ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యదర్శిగా నాలుగైదు ఏళ్లపాటు పార్టీలో కీలక పాత్ర పోషించారు. అదే సమయంలో రాజీవ్‌గాంధీ హత్యానంతరం సోనియాగాంధీ గానీ, పిన్న వయస్కులైన ప్రియాంక, రాహుల్‌గాంధీలు గానీ ప్రధానమంత్రి కాలేదే! జగన్ అనుచరులలో ఇంత వివేచన ఉంటుందనుకోవడం అత్యాశే అవుతుం ది. 2014లో అధికారంలోకి వచ్చినట్లే అని భావిస్తున్న జగన్, ఆ తర్వాత 30 సంవత్సరాలపాటు రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి పాలన అందిస్తాననీ, వందేళ్లకు సరిపడా అభివృద్ధి చేస్తానని చెప్పుకొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా, విజన్ 2020 అంటూ తానే ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రినని కలలుగన్నారు. కానీ 2004లో ఏమైంది? ఆ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయన, ఇంకా పూర్తిగా కోలుకోలేకపోతున్నారు. ఈ దేశంలో సుదీర్ఘకాలం (23 ఏళ్ల) పాటు ముఖ్యమంత్రిగా ఒక్క జ్యోతిబసు (పశ్చిమ బెంగాల్) మాత్ర మే ఉండగలిగారు. కలలు కనడంలో తప్పు లేదు. ప్రజలు ఆదరిస్తే 30 ఏళ్ళు కాదు, నాలుగైదు దశాబ్దాల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉండవచ్చు.

ఎవరు మాత్రం కాదనగలరు? 2014 నాటికి జగన్‌కు 40 ఏళ్ళు దాటుతాయి. అంటే తాను 70 సంవత్సరాల వరకు జీవిస్తానని భావించి 30ఏళ్ళపాటు అధికారంలో ఉంటానని ఆయన చెప్పుకొని ఉండవచ్చు. అంటే జీవిత కాలం ముఖ్యమంత్రిగా ఆయన తన ను తాను ఊహించుకుంటున్నారన్న మాట! రాజకీయాలలో ఉండే వాళ్లు, అనుచరులను, కార్యకర్తలను ఉత్తేజ పరచడానికి కొంత అతిశయోక్తిగా మాట్లాడడం సహజం.

జగన్ వ్యాఖ్యలను కూడా అలాగే అర్థం చేసుకోవలసి ఉంటుంది. కాకపోతే ఆయన మాటల్లో అతిశయోక్తితో పాటు అత్యాశ కనపడుతూ ఉంటుంది. ఇల్లు అలకగానే పండుగ కాదన్నట్లు ఇప్పటి వరకు రాజశేఖరరెడ్డి కుమారుడుగా గుర్తింపు పొందుతూ వచ్చిన జగన్, ఇకపై ఒక పార్టీ అధినేతగా ఆయా అంశాలపై తన వైఖరి స్పష్టం చేయవలసి ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, మాల- మాదిగల వర్గీకరణ వంటి అంశాలపై ఆయన తన పార్టీ వైఖరి స్పష్టం చేయవలసి ఉంటుంది.

ఇలాంటి సందర్భాలలోనే ఒకరికి మోదం కలిగితే మరొకరికి ఖేదం కలుగుతుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎదురయ్యే విమర్శనాస్త్రాలకు దీటుగా స్పందించవలసి ఉంటుంది. జగన్‌ను అత్యంత అవినీతిపరుడుగా, దురాశాపరుడుగా చిత్రించడానికి కాంగ్రెస్ పార్టీ, అందుబాటులో ఉన్న అన్ని ఆయుధాలను ప్రయోగిస్తుంది. తాను అవినీతిపరుడిని కాదంటే, కేవలం అయిదేళ్లలో తనకు అంత సంపద చట్టబద్ధంగా ఎలా సమకూరిందో ప్రజలకు వివరించవలసిన బాధ్యత జగన్‌పై ఉంటుంది.

తనను ఆత్మ రక్షణలోకి నెట్టడానికి ప్రత్యర్థులు ప్రయత్నిస్తారు కనుక, దాని నుంచి బయటపడటానికి జగన్ ప్రయత్నించవలసి వస్తుంది. తన తల్లి విజయమ్మను వెంటబెట్టుకుని తిరుగుతూ, వైఎస్ పేరును మరువకుండా చూసుకుంటూ, ప్రజల సానుభూతి సంపాదించడానికి ఆయన కచ్చితంగా ప్రయత్నిస్తారు.

అయితే కాంగ్రెస్ నుంచి ఎదురయ్యే దాడి ఏ రూపంలో ఉండనుంది? దానిని ఎలా అధిగమిస్తాడు? అన్న దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యమైనది... కడప ఎం.పి. స్థానానికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల ఫలితాలు జగన్ విషయంలో కీలకం కానున్నాయి. కడప వంటి ఫ్యాక్షన్ ప్రభావిత జిల్లాలలో, ఓటర్లు కచ్చితమైన విభజనతో ఉంటారు. రిగ్గిం గ్ వంటి అక్రమాల వల్ల మెజారిటీలు తగ్గడం-పెరగడం జరుగుతూ ఉంటాయి.

పోలీసుల సహకారం లేకపోతే ఈ జిల్లాలో ఉప ఎన్నికల్లో గెలుపు నల్లేరు మీద నడక కాదు. 1996లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో, కడప ఎం.పి. స్థానానికి పోటీ చేసిన రాజశేఖరరెడ్డిని, అప్పటి ఎస్.పి. ఉమేష్‌చంద్ర అష్ట దిగ్బంధనం చేయడంతో, అతి కష్టం మీద అయిదు వేల పైచిలుకు మెజారిటీతో గెలిచాననిపించుకున్నారు. దీన్నిబట్టి జగన్ భవిష్యత్‌ను ముందుగా ఈ రెండు ఎన్నికలే నిర్దేశించనున్నాయి.       - ఆదిత్య