Saturday, January 16, 2010

ఆదర్శ ఆంధ్రప్రదేశ్ - ఒకటిగా ఉంటేనే అగ్రస్థానం - ఇందిరా చూపిన తోవ



Friday, January 15, 2010

సమైఖ్య "ఆంధ్ర " - ఓ తెలంగాణావాది కోణంలో

ఒక్క రోజులో రాష్ట్రంలో రెండు ఊహించని పరిణామాలు! స్వప్రయోజనాలే పరమావధిగా కొందరు స్వార్ధపరులాడిన నికృష్ట రాజకీయ కేళి తన మనుగడనే ప్రశ్నార్ధకం చేయనుందని తెలిసి తెలుగుతల్లి గుండె పగిలి తల్లడిల్లింది. ‘బాధపడకు, మేమున్నాం నీకండగా’ అంటూ ఏళ్ల మౌనం వదిలి సమైక్యవాదులు పిడికిళ్లు బిగించి దిక్కులు పిక్కటిల్లేలా చేసిన సింహనాదానికి గల్లీ నుండి ఢిల్లీ దాకా దద్దరిల్లింది. ఆంధ్రుల దెబ్బకి అసెంబ్లీ అబ్బా అనింది. అన్నదమ్ముల మధ్య తాము పెట్టిన లొల్లి ఆఖరి అంకానికి చేరిందని చంకలు గుద్దుకుంటూ సంబరాలు చేసుకోబోయిన వేర్పాటోన్మాదుల గొంతులో ముద్ద తిరిగి నోట్లోకొచ్చింది. తోలుబొమ్మలాటలో తన ప్రతిభ ఆంధ్రుల ముందు ప్రదర్శించబోయిన అధిష్టానం అధినేత్రి మెదడు మొద్దుబారేలా తెలుగువాడి తడాఖా తెలిసింది. ఎనిమిదేళ్లుగా లాగీ పీకీ గోరంత తెలంగాణ సెంటిమెంటుని భూతద్దంలో కొండంతగా చూపి తిమ్మిని బమ్మిని చేసి తిండీ తిప్పలూ మానుకున్నట్లు నటించి ఎట్టకేలకు తెచ్చుకోబోయిన ఈనాముకి ఊహించని రీతిలో పురిట్లోనే సంధి కొట్టి, ఉవ్వెత్తున ఎగసిన సమైక్యాంధ్ర సెంటిమెంటు దెబ్బకి గాలికెగిరిపోయే సూచనలు కనిపిస్తుంటే బిత్తరపోవటం షరాబీబాబు వంతయ్యింది. విధ్వంసం సాగించి రాష్ట్రాన్ని చీల్చాలనే ఉన్మాదపుటెత్తుగడ ఫలించినట్లే అగుపించి ఆఖరి క్షణంలో అనుకోని రీతిలో చిత్తయ్యింది. సందట్లో సడేమియాగా – ఉత్తుత్తి దీక్షలకే కాళ్లబేరానికొచ్చే కేంద్రాన్ని తామూ ఓ చూపు చూస్తామంటూ, దేశాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసే దిశలో మరో పదకొండు ప్రత్యేక రాష్ట్రోద్యమాలు ఉన్న పళాన కొత్త ఊపిర్లూదుకుంటూ నిద్ర లేచాయి.

సినిమా పరిభాషలో ఇది తెలంగాణ తంతుకీ, తంపుకీ ఓ ఊహాతీత ట్విస్ట్ ఎండింగ్‌తో కూడిన యాంటీ క్లైమాక్స్. కిందపడ్డా గెలిచినట్లు బుకాయించే ప్రయత్నాలెన్ని చేసినా, అతికి పోయిన ప్రత్యేకవాదులు వాళ్లకి వాళ్లే కట్టుకున్న గోరీ ఇది. ఎదుటి వారి మౌనాన్ని అలుసుగా తీసుకుని అడ్డూ ఆపూ లేకుండా పెట్రేగిపోతే చివరికి జరిగేదేంటో, ఏ విషయాన్నైనా తెగేదాకా లాగితే ఒరిగేదేంటో రాబోయే కొన్ని తరాలపాటు చెప్పుకోటానికిదో గొప్ప ఉదాహరణ. మందుబాబొక్కడు అలిగి అన్నం మానతానని బెదిరిస్తేనూ, అతనికి మద్దతుగా కొన్ని వందలమంది పదుల సంఖ్యలో బండ్లనీ అంగళ్లనీ బుగ్గి చేస్తేనూ బెదిరిపోయి దిగొచ్చే దుర్భల ప్రభుత్వాలు వందల మంది ప్రజా ప్రతినిధుల మూకుమ్మడి నిరసనోద్యమాన్ని ఎలా తట్టుకుంటాయో మరి.

‘అన్నదమ్ముల్లా విడిపోదాం’ అనేది వేర్పాటువాదులు విరివిగా వాడుకలోకి తెచ్చిన ప్రయోగం. ఆ చిలక పలుకుల అర్ధమేంటో తెలీక తికమక పడేవాళ్లు కోకొల్లలు. ఎందుకంటే, అనాదిగా ఆంధ్రులెరిగిన వాడుక ‘అన్నదమ్ముల్లా కలకాలం కలిసి మెలసి ఉండండి’ అనేదే. వంకర రాజకీయవేత్తల విపరీతపు బుద్ధుల్లోంచి పుట్టేవే అన్నదమ్ముల్ని విడదీయాలనే వికృతాలోచనలు. ఇంతకీ తెలంగాణ-ఆంధ్ర ప్రజల్లో అన్నలెవరో, తమ్ములెవరో అని బుర్ర బద్దలు కొట్టుకునేవాడినిన్నాళ్లూ. ఇప్పుడర్ధమయింది ఎవరెవరో. చెడు సావాసగాళ్ల ప్రభావంతో పెడదారి పట్టిన తమ్ముడి మీద అవ్యాజానురాగంతో ఏదోనాటికి దారికి రాకపోతాడా అనుకుంటూ మౌనంగా ఓపిక పట్టీ పట్టీ, చివరికి మైకం ముదిరి సొంతింటికే నిప్పంటించబోయిన తోడబుట్టినవాణ్ని లాగి పెట్టి లెంపకాయ కొట్టి మత్తు వదలగొట్టిన అన్నలు ఆంధ్రా, సీమ ప్రజలు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సమర్ధనగా వేర్పాటువాదులు చెప్పేవి చీకిపోయిన చరిత్ర కథలు, చేసేది సంస్కృతి పేరిట స్వీయ భుజాల చరుపులు, వేసేవి దోపిడీదార్లంటూ తోటి తెలుగువారిపై నిందలు. ఎవరికి మాత్రం లేదు ఘన చరిత్ర? ఎవరికి లేవు సంస్కృతీ సంప్రదాయాల భుజకీర్తులు? ఎవడు దోపిడీదారు – అవసరం మేరా వాడుకుని అది తీరాక తూనాబొడ్డని తీసిపారేసేవాడా, లేక ఉమ్మడి రాజధానికి తమ శ్రమఫలాలన్నీ దోచి పెట్టేవాడా? ఎవరి వెనకబాటుదనానికి ఎవరు కారణం? అయినా వెనకబాటుతనం తెలంగాణకే సొంతమా - రాష్ట్రంలో ఇంకెక్కడా లేదా? నాలుగొందలేళ్ల నత్తనడక చరిత్రలో ప్రజల్ని బానిసలు చేసి నిజాములూ దేశ్‌ముఖ్‌లూ పోగేసుకున్న సంపద చూపించి యాభయ్యేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు సాధించిన ప్రగతిని పూచికపుల్లలా తీసిపారేయటంలో ఔచిత్యమెంత? రజాకార్ల గొడవల్లో తమకే అవసరం లేకపోయినా తలదూర్చి భుజం భుజం కలిపి పోరు సాగించిన పొరుగు ప్రాంతం వారిని అవసరం తీరిపోయాక తీరిగ్గా కూర్చుని దొంగలుగా చిత్రీకరించటంలో నీతి ఎంత? ’ఆంధ్రప్రదేశ్’గా ఆకట్టుకున్న పెట్టుబడుల్నీ, తెచ్చుకున్న నిధుల్నీ రాజధాని అభివృద్ధికి వాడేసుకున్నాక తీరా ఇప్పుడు ‘ఇదంతా నాదే, నీ ఖర్మకి నువ్వుపో’ అనటంలో నిజాయితీ ఎంత?

ఇవేవీ సమాధానం లేని ప్రశ్నలు కావు – వేర్పాటువాదులందరూ సమాధానం దాటేసే ప్రశ్నలు. అది గ్రహించలేనివారు కారు తెలంగాణ ప్రజలు. అందుకే సమైక్యతకి సమర్ధనగా ఆంధ్రా/సీమ జిల్లాల్లో ఒక్క రోజులో ఒక్కుమ్మడిగా వెల్లడైన విస్తృత జనాభిప్రాయం ఇన్నేళ్ల తర్వాతా వేర్పాటుకి అనుకూలంగా తెలంగాణలో సాధ్యం కాకపోవటం. దానికి సాక్ష్యమే, వేర్పాటే ఏకైక లక్ష్యంగా ఏర్పాటైన పార్టీ ఏ ఎన్నికల్లోనూ తిరుగులేని విజయాలు సాధించకపోగా నానాటికీ తీసికట్టుగా తయారవటం. నలభయ్యేళ్ల పేరు గొప్ప చరిత్రలో ఒక్క నిఖార్సైన నాయకుడినీ పుట్టించలేని ఉద్యమం ఓ ఉద్యమం. ఉన్న పది జిల్లాల్లోనూ సగం జిల్లాల్లో ఉనికే లేని పార్టీ ఆ ఉద్యమానికి ఏకైక దిక్కు. సాక్షాత్తూ రాజధాని ఎన్నికల్లో పోటీ చేసే దమ్ములేని పక్షం తెలంగాణ గుండె చప్పుడుకి ప్రతినిధి – హతవిధీ!

ఆంధ్రా, సీమల్లో వెల్లువెత్తిన రాజీనామాల పరంపర రేపో మాపో నిమ్మళించొచ్చుగాక – రాష్ట్ర ప్రజానీకం అసలు గుండె చప్పుడు వినబడటం మాత్రం ఇప్పుడిప్పుడే మొదలయింది. సమైక్యాంధ్ర ఉద్యమానికి ఇదే నాంది. త్వరలో ఇది తెలంగాణకీ పాకుతుంది. ఇల్లన్నా అలక్కుండానే పండగ చేసుకోబోయిన వేర్పాటువాదులకి ముసళ్ల పండగే ముందుంది.

బాధేస్తోంది. గుండెల్ని పిండేస్తుంది. కాని ఏం చెయ్యాలో, ఏం చెయ్యగలమో తెలియట్లేదు. మన రాష్ట్రాన్ని ముక్కలు చేసి బర్త్ డే గిఫ్ట్ గా ఇవ్వడానికి వాళ్ళెవరుఎవడబ్బ సొత్తని. మీడియా కూడా అవసరానికి మించిన కవరేజి ఇచ్చి కెసిఆర్ ని హీరో చేసేసింది. వాళ్ళకి ఒరిగేది ఏంటో దీని వాళ్ళ నాకర్థం కావట్లేదు.బస్సు లు తగలబెడితే, ౪ రోజులు అన్నం మాని సెలయిన్ ఎక్కించుకుని దీక్ష చేస్తే రాష్ట్రం ఇచ్చేడట్టైతే, వందల సంఖ్యలో సమైఖ్యాంద్ర కోసం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.

తెలంగాణా లోనే తెలంగాణాని వ్యతిరేకించే వాళ్ళు కోకొల్లలు. ఎవరిని సంతోష పెట్టడానికి ఇది. anilroyal.wordpress.com నుండి గ్రహించబడినది.

సమైఖ్య "ఆంధ్ర " ఉద్యమం చేసే వారు కొంచెం చరిత్ర తెలుసుకుని ఉద్యమించండి. మీరు సమైఖ్య ఆంధ్ర ఉద్యమంచేయడమే పక్ష పాతంగా చేస్తున్నారు. ఇంకా ఆంధ్ర అనే మాట్లాడుతున్నారు. అదే దో తెలుగువారి ఐక్యత ఉద్యమం అనిఎందుకు పెట్టారు? అయినా ఇప్పుడు అదంతా పనికి రాణి ముచ్చట గాని మీరు చేసే ఉద్యమ ఒక్క హైదరాబద్ గురించే అనితెలుసు.ఇన్నాళ్ళు ఇక్కడ (హైదరాబాద్) లో ఉండగలిగిన మీరు ఇక ముందు ఉండలేమని ఎందుకు భయపడుతున్నారు? ఒక విషయం అందరికి తెలిసింది ఏమంటే ఆంధ్ర నుండి తెలంగాణా జిల్లాలకి వచ్చే వారే ఎక్కువ ,దానికికారణం ఏమిటో మరి ఆంధ్రులకే తెలియాలి.మీకు తెలంగాణా వస్తే భవిష్యతు ఉండదేమో నని భయ పడుతున్నారుకాని,మాకు భూత కాల,.వర్తమాన,భవిష్యత్తు లో కూడా అంధ కారమే .మాకు జరగాల్సిన న్యాయం కోసం మేము ఉద్యమంచేస్తుంటే మీరు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు.

మీ ఉద్యమం ఏమి సాధించటానికి చేస్తున్నారు?కలిసి ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో ఎవరికీ న్యాయం జరగలేదని తెలంగాణావారు,సీమ వారు,ఉత్తరాంధ్ర వారు అందరు అంటున్నారు.మరి అలాంటప్పుడు కలిసి ఉండటం ఎందుకు? తెలంగాణాఉద్యమం మొదల్లయ్యాక అన్యాయాలు జరుగుతున్న కలిసే ఉండాలని అంటున్నారు సీమంధ్రులు ఎందుకు?చరిత్రతెలుసుకుని ఉద్యమం చేశ్తే బాగుంటుంది సీమంధ్రులు .మాకు జరగాల్సిన న్యాయం కోసం మేము ఉద్యమం చేస్తున్నాం.
మాకు కావాల్సింది మాకు దక్కాలని చేస్తున్నాం పోరాటం. మా జీవితం మాకు కాకుండా పోతుందని అర్పిస్తున్నంప్రాణాలు. ఇప్పుడు మీరు హైదరాబాద్ మీద కన్నేసి వదలకుడదని కుటిల బుద్ధి తో చేస్తున్నారు ఉద్యమం.1956 లో మీతోకలవక ముందు అధికారికంగా నిజాం వద్ద బానిసలం. 1956 తర్వాత అనధికారంగా ఇప్పటి వరకు మాకు బానిసత్వంకొనసాగుతూనే ఉంది .
1947- భారత దేశ స్వాతంత్ర్యం
1948- తెలంగాణా స్వాతంత్ర్యం
1953- ఆంధ్ర రాస్త్త్ర ఏర్పాటు (హైదరాబాద్ లేకుండా)
1956- ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు బలవంతపు చర్యల వాళ్ళ హైదరాబాద్ తో సహా
1947 లో భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా ,తెలంగాణకి రాలేదు అంటే మాకన్నా ముందు గానే మీకు స్వేచ్చవాయువులు పీల్చే అదృష్టం కలిగింది .1948 లో తెలంగాణాకి పేరుకి స్వాతంత్ర్యం వచ్చిన భూస్వాముల ,దొరల పాలనలోమా బ్రతుకులు అల్లానే ఉంది పోయాయి. 1956 దాక మాతో కలవని మీరు ,మా దగ్గరికి ఎందుకు వచ్చారో అందరికితెలుసు.1956 వరకు మీ రాజధాని కర్నూల్. కాని అంతకు ముందే ఇక్కడ రాజధానికి కావాల్సిన అన్ని సదుపాయాలుఉన్న రాజధాని,సహజ సంపద మీద కన్ను పడి ఇక్కడికి ఆంధ్ర ప్రదేశ్ అనే కొత్త సూత్రం తో వచ్చారు. బ్రిటిష్ వారు ఎలావచ్చారో అల.వ్యాపారం పేరుతో వచ్చి ఇక్కడి సంపదని కొల్ల గొట్టారు.జనాన్ని హింసించారు.
నిజానికి ఇప్పుడు మీరు అభివృద్ధి చేసాం అంటున్న హైదరాబాద్ మా చెమటతో ఎప్పుడో అభివృద్ధి చెంది ఉన్నది కనుకే మీరుమా దగ్గరికి వచ్చారు.ఇప్పుడున్న ప్రతి ఒక కట్టడానికి నిజాం ప్రభువు మా దగ్గర వాసులు చేసిన కప్పం తో కట్టినవే.
ఇప్పుడున్న విశాలాంధ్ర, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అభివృద్ధి చేసామని బీరాలు పలుకుతున్న వారు మీఋ దేన్నీ చూసిఅభివృద్ధి అంటున్నారో ,అభివృద్ధి కి చిహ్నాలుగా వేటిని భావిస్తున్నారో తెలియ పరచాలి.ఒక మీరు చేసింది అభివృద్దే అయితే అభివృద్ధి లో మాది కూడా వాటా ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు మీము కూడా కట్టాము కదా పన్నులు .మీకంటేఎక్కువగా .మా కరెంటు బిల్లులతోనే సగం ఆదాయం వస్తుంది ఖజానకి .ఇక్కడ భూమిని ఆక్రమించి ,మీరు నిర్మించినానిర్మాణాలు నిజంగా హైదరాబాద్ అభివ్రుద్దిక ,లేక వారి సొంత అభివ్రుద్దిక తెలుసుకోవాలి.
ఎవరికీ కోపం వచ్చినా ఒకటి మాత్రం నిజం.ఒకప్పుడు పరదేశిలు భారత దేశానికి ఎందుకు వచ్చారో మీరు అందుకేవచ్చరు.వారు అప్పుడు ఏమి చేసారో మీరు ఇప్పుడు అదే చేస్తున్నారు.కాకా పోతే ఒకటే తేడా అప్పుడు మన దేశం వారుకాదు.ఇప్పుడు మన దేశం లోనే మన దేశీయులే. లెక్కన చూస్తే అర్థం కావట్లేదా తెలంగాణకి ఇంకా స్వాతంత్ర్యంరాలేదని.అందుకే తెలంగాణాలో పోరాటం సాగుతుంది.అది తెలుసు కొని మసలుకోక ,కాళ్ళకి సంకెళ్ళు వేసి మందినిముంచే తెలివి తో ఇంకా సమైఖ్య ఆంధ్ర అంటున్నారు ఎందుకు? తెలంగాణా అవసరం ఏమిటని అడిగితే దానికి వచ్చేసమాధానలు మా బ్రతుకు పోరాటాన్ని ,మా మనుగడకు సంభందించే ఉంటాయి.కాని మీ సమాధానాలు ఎప్పుడో అభివృద్ధిచెంది ఉన్న హైదరాబాద్ కి ముడి పడి ఉంటాయి .లేకుంటే తెలుగు వారం కాబట్టి అందరం కలిసి ఉండాలి అంటారు. దేవేలోపే చేయడానికి హైదరాబాద్ ఒక్కటే ఉందా? సీమ లో ,ఆంధ్ర లో,తెలంగాణాలో అందరు వెనుక పడి ఉన్నాంఅంటున్న వారే కదా.మరి సొంత ప్రాంతాలు సమైఖ్యంగా ఉన్నప్పుడు అభివృద్ధి కన్నప్పుడు కలిసి ఉండడం ఎందుకు ? సీమఆంధ్ర వాళ్ళు నాయకులూ సొంత ప్రాంతాలని అభివృద్ధి చేసుకోలేదు కాని హైదరాబాద్ ని మేము దేవేలోపే చేసాం అంటారుఎందుకు ?మీకున్న మామూలు తెలివితో ఆలోచిస్తే అర్థం అవుద్ది. కాని మందిని ముంచే తెలివితో ఆలోచిస్తే అది ఇంతకుఅర్థం కాదు.విశాల ద్రుఖ్పడం ఉందనుకుంటున్న సీమంద్రులార అదే విశాల ద్రిఖ్పడం తో మా రాష్ట్రాన్ని సాధించుకునే వీలుకల్పించండి.
,
ram perfect's బ్లాగ్స్ నుండి