ఏపీపీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో ఎవరు ఉత్తీ ర్ణులు అయినా, కాకపోయినా ముగ్గురు మాత్రం ఫలితాలు వెలువడక ముందే పాస్ అయ్యారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశ య్య, హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ అరవిందరావు తాము చెప్పినట్టు చేసి పరీక్షలో ఉత్తీర్ణత పొందారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరకు తెలంగాణ ప్రాంత మంత్రులు, ఇతర పార్టీల నేతలు, జేఏసీలు...ఇలా ఎందరు చెప్పినా, విన్నపా లు చేసుకున్నా ముఖ్యమంత్రి తాను అను కున్నట్టే చేశారు. ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతి పత్తిని దృష్టిలో ఉంచుకుని, ఈ వివాదంలో తాను తల దూర్చబోనని మంత్రుల బృందం తో చెప్పేసిన ఆయన, చెదురుమదురు ఘటనలు మినహా పరీక్ష తెలంగాణ వ్యాప్తంగా ప్రశాంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారన్న పేరు సంపాదించుకున్నారు.
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సైతం ఏది ఎలా ఉన్నా ఈ పరీక్షలో రోశయ్య పాస్ అయ్యారంటూ వ్యాఖ్యానించటం విశేషం. వాస్తవానికి శనివారం నాటి సాయంత్రమే రోశయ్య తనను కలసిన మీడియాతో మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ విషయంలో ఎలాంటి గందర గోళమూ లేదన్న వ్యాఖ్య చేసినప్పుడే అసలు విషయం తేలిపోయింది. ఎలాగైనా సరే పరీక్షను నిర్వహించి తీరుతామన్న ధోరణి ముఖ్యమంత్రి వ్యాఖ్య వెనుక కనిపించింది.
అలాగే అంతకు ముందు ఏపీపీఎస్సీ చైర్మన్ వెంకట్రామిరెడ్డితో టెలిఫోన్‌లో మాట్లాడి పరీక్షను వాయిదా వేయాలని చెప్పిన హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆతర్వాత తెలంగాణ మంత్రుల బృందం ముఖ్య మంత్రిని కలిసేందుకు వెళ్ళినప్పుడు అక్కడ లేరు. ఆమె వేరే సమావేశానికి హాజ రయ్యారు. దానితోనే ముఖ్యమంత్రి ఈ విషయంలో జోక్యం చేసుకోదలచలేదని, ఏపీపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిని దృష్టిలో ఉంచుకుని వివాదాస్పదుడు కాదలచలేదని తేలిపోయింది. పరీక్ష విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ప్రాంతీయ పక్షపాత ముద్ర పడిపోతుందన్న ఉద్దేశంతోనే రోశయ్య ఈ విషయంలో తటస్థంగా ఉన్నట్టు చెబుతున్నారు.

సబిత...అంతా వ్యూహాత్మకం...
ఇక హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ వ్యవహారంలో మొదటినుంచీ వ్యూహాత్మకం గానే వ్యవహరించారు. పరీక్షను వాయిదా వేయాలని లేకపోతే భూకంపాలు సృష్టిస్తా మని టీఆర్‌ఎస్, జేఏసీ నేతలు ఒకవైపు బెదిరింపులకు దిగినప్పటికీ, మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోయారు. ఇంటిలిజెన్స్ వర్గాల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూ నూతన డీజీపీ అరవిందరావుతో నిరంతర సంప్రదింపులు జరుపుతూ ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. శనివారం మధ్యాహ్నం మీడియా కలసినప్పుడు పరీక్షను వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ చైర్మన్‌ను తాను కోరానని మాత్రమే చెప్పారు తప్ప అటువైపు నుంచి స్పందన ఏమిటన్నది బహిర్గతం చేయలేదు.

ఆ విషయాన్ని ముఖ్యమంత్రికి మాత్రమే చెబుతానన్నారు. ఈ వ్యవహారంలో సబిత మొదటినుంచీ వ్యూహాత్మకంగానే వ్యవ హరిస్తూ వచ్చారు. శనివారం ఉదయం సహచర మంత్రులు డి.శ్రీధరబాబు, డి.కె.అరుణ, సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పరీక్షను వాయిదా వేయకపోతే ఆందోళనకర పరిస్థితులు ఏర్పడతాయని చెప్పినప్పుడు సబిత ఆ విషయంలో మౌనం వహించారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి, డీజీపీతో తప్ప మిగిలిన వారితో మాట్లాడరాదని నిర్ణయించుకున్న ఆమె అదే వ్యూహాన్ని అనుసరించి అనుకున్న రీతిలో పరీక్ష జరిగేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షను వాయిదా వేయాలంటూ ఏపీపీఎస్సీ చైర్మన్‌కు ఫోన్ చేసి మాట్లాడటం ద్వారా తాను తెలంగాణ ప్రాంతం వారికి అనుకూలంగా ఉన్నానని, ఆ తర్వాత పరీక్షను నిర్వహింపజేయటం ద్వారా రాష్ట్రం మొత్తానికీ తాను మంత్రిననీ ఆమె నిరూపించుకున్నారు.
అరవింద...తొలి షాట్ సక్సెస్...
ఇక డీజీపీ అరవిందరావు తన తొలి ప్రయత్నంలోనే పెద్ద కార్యక్రమాన్ని అంతగా అవాంతరాలు లేకుండా పూర్తి చేశారన్న పేరు సంపాదించుకున్నారు. కొద్ది రోజుల క్రితమే పోలీస్ బాస్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు ఏపీపీఎస్సీ పరీక్షల నిర్వహణకు బందోబస్తు ఏర్పాటు చేయటం పెను సవాల్‌గా మారింది. దాన్ని అరవిందరావు సమర్థంగా ఎదు ర్కున్నారన్న పేరు సంపాదించారు. ఉస్మా నియా వర్శిటీ బీఈడీ కాలేజీ కేంద్రం వద్ద కొద్దిపాటి ఘర్షణ, విద్యార్థులను చెదర గొట్టేందుకు లాఠీచార్జి, బాష్పవాయు ప్రయోగం మినహా కాల్పుల దాకా పరిస్థితి వెళ్ళకుండా జాగ్రత్త వహించారు.
విద్యార్థులతో వ్యవహారం కాబట్టి పూర్తి సంయమనం పాటించాలన్న ఆదేశాలు ముందుగానే జారీ చేయటంతో ఉస్మా నియాలో గతంలో జరిగిన ఘటనలలాంటివి పునరావృతం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 445 పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయటం, మూడంచెల భద్రతా వ్యవస్థకు ఆదేశాలు జారీ చేయటం, ఎప్పటికప్పడు జంట నగరాలు, జిల్లా స్థాయి అధికారులతో సంప్రదింపులు జరుపుతూ మార్గ నిర్దేశనం చేయటంతో తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థులు, రాజకీయ పార్టీల నేతల నుంచి కాస్తంత ప్రతిఘటన మినహా చెప్పుకోదగ్గ ఘటనలు జరగకుండా జాగ్రత్త వహించారన్న పేరును అరవిందరావు సంపాదించు కోగలిగారు.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి తీవ్ర ఉత్కంఠకు దారితీస్తోంది. అన్ని ప్రాంతాల్లోని అన్ని వర్గాలూ డిసెంబర్‌లో, ఆ తర్వాత రాష్ట్రంలో ఏర్పడ బోయే పరిణామాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తు న్నారు. ప్రధానంగా.. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయం కోసం రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు ఉత్కంఠ తో ఊపిరిబిగపట్టి ఫలితం కోసం ఎదురుచూస్తు న్నారు. డిసెంబర్ తర్వాత రాష్ట్రంలో ఏం జరగబో తోందన్న అంశం రాజకీయ పార్టీల భవితవ్యాన్నీ తేల్చనుంది. అన్నింటికన్నా.. రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు, విస్తరణ వ్యవహారం కూడా డిసెంబర్‌తోనే ముడిపడి ఉండటం మరో ఆసక్తికర అంశం.
రాష్ట్ర రాజకీయాలు ఇంత అనిశ్చితికి గురయ్యేందుకు ప్రధాన కారణమైన కాంగ్రెస్ పార్టీ చివరకు తాను తవ్వుకున్న గోతిలో తానే పడనుంది. రెండు ప్రాంతాల్లోని పార్టీ నేత లకు స్వేచ్ఛ ఇచ్చి, వ్యూహాత్మకంగా వాదాలను రగిలించిన కాంగ్రెస్ నాయకత్వం ఇప్పుడు రాష్ట్రంపై నిర్దిష్ట నిర్ణయం తీసుకోలేకపోతోంది. ముఖ్యంగా.. తనను ధిక్కరించి వ్యవహరి స్తోన్న జగన్ సంగతి తేలేవరకూ రాష్ట్ర విభ జనపై ఎలాంటి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపించడంలేదు. జగన్ పార్టీ నుంచి తనంతట తాను వెళ్లిపోతాడా? లేక పార్టీ నుంచి తానే పంపించాలా? జగన్ వెళితే పార్టీ చీలుతుందా? ప్రభుత్వం కూలుతుందా? ఒకవేళ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ సాయం తీసుకుంటే ఆ పార్టీ నుంచి జగన్ వైపు వెళ్లేది ఎంతమంది? తెలంగాణకు అనుకూల నిర్ణయం తీసుకుంటే సీమాంధ్రలో పార్టీ భవిష్యత్తు ఏమిటి? అనే ప్రశ్నలతో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ సతమత మవుతోంది. గతంలో ఇలాంటి అనుభవాలు ఎప్పుడూ ఎదురుకాక పోవడం వల్లే ఆ పార్టీ రాష్ట్ర భవిష్యత్తుపై తర్జన భర్జన పడుతోంది.